Nuvvunte Naa Jathaga Serial Today February 17th: "నువ్వుంటే నా జతగా" సీరియల్: కన్నతల్లి చావుకి కారణం కావొద్దమ్మా.. దయచేసి ఇంటి నుంచి వెళ్లిపో.. దేవా తల్లి ఆరాటం
Nuvvunte Naa Jathaga Today Episode దేవాని తన ఇంటిని వదిలేసి వెళ్లిపోమని శారద మిధునకు రెండు చేతులు జోడించి దండం పెట్టి బతిమాలడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode మల్లేశం ఇచ్చిన గడువు అయిపోవడంతో సత్యమూర్తి ఇంటి గుమ్మం దగ్గర కూర్చొని భార్యతో తన బాధ చెప్పుకొని కుమిలి పోతాడు. సొంత ఇంటిని వదులుకోవాల్సి వస్తుందని ప్రాణం పోవడం కంటే నరకంగా ఉందని ఏడుస్తాడు. భర్త కన్నీటిని చూసి శారద కూడా ఏడుస్తుంది. కొడుకులు, కోడళ్లు అక్కడే ఉంటారు.
సూర్యకాంతం: అదేంటి మామయ్య అలా అంటారు. అప్పు చేసింది మీరు. ఇళ్లు తాకట్టు పెట్టింది మీరు. మీరే ఏదో ఒకటి చేసి అప్పు తీర్చాలి అంతే కానీ ఇప్పుడు మమల్ని కూడా రోడ్డుకి ఈడుస్తారా ఏంటి.
సత్యమూర్తి: తప్పు చేశానమ్మా. నా కొడుకులు నా కష్టం అర్థం చేసుకుంటారు నాకు అండగా ఉంటారని అనుకున్నాను. ఆ రోజు నా భార్యని బతికించుకోవాలని అప్పు చేశాను.
ప్రమోదిని: పాప పేరు మీద ఉన్న పొలం అమ్మేసి డబ్బు తీసుకొస్తాను దయచేసి ఒప్పుకోండి మామయ్య.
సత్యమూర్తి: అమ్మా నీ భర్తకి ఉద్యోగం లేకపోయినా సత్యమూర్తి మాస్టారి కొడుకు అనే ఒకే ఒక కారణంతో నిన్ను ఇచ్చి పెళ్లి చేశారు. ఆ గౌరవం అలాగే ఉండనీమ్మా.
త్రిపుర వడ్డీల మల్లేశం దగ్గరకు వెళ్తుంది. జడ్జి హరివర్ధన్ కోడలిని అని చెప్పగానే మల్లేశం వణికిపోతాడు. సత్యమూర్తి అప్పు గురించి అడుగుతుంది. డాక్యుమెంట్స్ గురించి అడుగుతుంది. మల్లేశం భయపడి ఇప్పుడే వాళ్లకి డాక్యుమెంట్స్ ఇచ్చేస్తానని అంటే దానికి త్రిపుర వద్దని ఏం చేయాలో మల్లేశానికి చెప్తుంది. సరే అని మల్లేశం చెప్తాడు. మరోవైపు సత్యమూర్తితో పెద్ద కొడుకు ఆనంద్ ఇళ్లు పోయే పరిస్థితి వచ్చిందని డబ్బు దేవా దగ్గర తీసుకోమని అంటాడు. ఇంతలో దేవా వస్తాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు డబ్బు ఇస్తా అని చెప్తాడు. దాంతో రక్తపు డబ్బు వద్దని నీ దగ్గర డబ్బు తీసుకుంటే నీ రౌడీయిజాన్ని ప్రోత్సహించినట్లే అని అవసరం లేదని చెప్తాడు. ప్రాణం పోయినా పర్లేదు కానీ నీ డబ్బు వద్దని అంటాడు. ఇంతలో మల్లేశం వస్తాడు.
దేవా: అదిగో వచ్చాడు.. నా దగ్గర డబ్బు తీసుకోరు కానీ వాడికి ఇళ్లు ఇచ్చేసి రోడ్డు మీద అందరిని నిలబెట్టండి. అప్పుడు అందరూ సన్మానం చేస్తారు.
మల్లేశం: మాస్టారు మీకు ఇచ్చిన గడువు అయిపోయింది. అప్పు తీర్చితే సరే లేకపోతే కోర్టు ద్వారా నోటీసు ఇచ్చి ఇళ్లు జప్తు చేయిస్తా.
దేవా: ఇళ్లు జప్తు చేయిస్తావా ఇంటి మీద చేయి వేస్తే ఈ రౌడీ చేతిలో చస్తావ్ ఈ దేవా అంటే ఏంటో నీకు చూపిస్తా.
సత్యమూర్తి: శారద నా ఇంటి విషయాల్లో వాడిని కలుగజేసుకోవద్దని చెప్పు.
దేవా: నేను ఎందుకు కలగజేసుకోవద్దు. ఇది నా తండ్రి కష్టపడి కట్టిన ఇళ్లు. ఇది నా తండ్రి సమస్య. ఈ ఇళ్లు పోతే మా నాన్న తట్టుకోలేడు.
సత్యమూర్తి: నువ్వు నన్ను తండ్రి అనుకున్నా నేను నిన్ను అనుకోవడం లేదు. నిన్ను ఎప్పుడో వదిలేశాను.
దేవా: కానీ నేను నిన్ను వదల్లేదు. రేయ్.. ఏంట్రా నీ పది లక్షల కోసం ఇళ్లు నీకు రాసివ్వాలా.
సత్యమూర్తి: ఓరేయ్ అతని మీద నువ్వు చేయి వేస్తే నేను చచ్చినంత ఒట్టు.
దేవా: నువ్వు మారవా మారవా.
సత్యమూర్తి: మారాల్సింది నువ్వురా. మల్లేశం గారు ఆ డాక్యుమెంట్స్ ఇవ్వండి ఈ ఇంటిని నీ పేరు మీద రాసిస్తాను.
మిధున: ఒక్క నిమిషం మామయ్య. మీ పది లక్షలు వడ్డీతో సహా ఉన్నాయి ఇవి తీసుకొని బయల్దేరండి.
సత్యమూర్తి: ఏమ్మా నువ్వు ఎందుకు డబ్బు ఇస్తున్నావ్. ఇది మా ఇంటి సమస్య. డబ్బు ఇవ్వడానికి నువ్వు ఎవరు.
మిధున: ఈ ఇంటి కోడలిని ఇది నా ఇంటి సమస్య కూడా మామయ్య. మరి నా ఇంటికి సమస్య వస్తే నాకు బాధ్యత లేకుండా ఎలా ఉంటుంది మామయ్య.
సత్యమూర్తి: చూడమ్మా మా వరకు నువ్వు ఓ ముక్కూ ముఖం తెలియని అమ్మాయివి. మా ఇంటికి నీకు ఏం సంబంధం లేదు. ఈ డబ్బు తీసుకొని పక్కకు వెళ్లు.
మిధున: దేవా భార్యగా ఈ ఇంటికి సంబంధించిన ప్రతీ సమస్య నా సమస్యే.
సత్యమూర్తి: కాదు నువ్వు పరాయిదానివే. ఎందుకంటే వాడే నిన్ను భార్యగా చూడటం లేదు. మరి మేం ఎలా కోడలిగా చూస్తాం.
మిధున: ఈయన చూడకపోయినా మీరు చూడకపోయినా నా మెడలో ఉన్న ఈ తాళినే ఈ ఇంటిని నా సొంతం చేసింది. నా కుటుంబం రోడ్డున పడితే నేను ఊరుకోను. మల్లేశం గారు మీరు డబ్బు తీసుకొని వెళ్లండి.
సత్యమూర్తి: ఏమ్మా చెప్తే నీకు అర్థం కావడం లేదా.
మిధున: మామయ్య ఏమైనా మనం చూసుకుందాం.
మల్లేశం: మాస్టారూ మీరు సూపర్ సార్ అందరూ అనుకున్న మాట మీరు నిజం చేశారు. బాగా డబ్బున్న జడ్జి గారి అమ్మాయిని పెళ్లి చేసుకోమని మీరే కదా ట్రైనింగ్ ఇచ్చారు.
దేవా: మా నాన్నని ఎంత మాట అంటావురా.
సత్యమూర్తి: ఆపరా నీ వల్లే ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చింది. నీ వల్లే నా పరువు పోయింది. నాకు మనస్శాంతి లేకుండా పోయింది. రేయ్ నేను నీకు డబ్బున్న అమ్మాయిని ట్రాప్ చేయమని చెప్పానంటర్రా. నాకు ఇంత కంటే అవమానం మరేముంటుందిరా. ఈ అవమానాలు భరిస్తూ బతకడం కంటే చచ్చిపోవడం మంచిదనిపిస్తుంది.
శారద: మామ మాటలు తలచుకొని మిధున బాధపడుతుంటుంది. అక్కడికి మిధున అత్త శారద వస్తుంది. రెండు చేతులు జోడించి దండం పెట్టి మిధునని వెళ్లిపోమని అంటుంది. మేం సంతోషంగా ఉండాలి అన్నా నా పిల్లలతో కలిసి ఉండాలన్నా నువ్వు వెళ్లిపో తల్లి అని ఏడుస్తుంది. బాగా చదువుకున్నవాడు బంగారం లాంటి కొడుకు రౌడీ అయిపోయాడని ఇప్పుడు నీ మెడలో తాళి కట్టి నీ జీవితం నాశనం చేశాడని దేవా మీద వాళ్ల నాన్న అసహ్యం పెంచుకుంటున్నారు. ఆయన కోపం పెరిగి దేవాని ఇంట్లో నుంచి గెంటేస్తారు. నా కొడుకు లేకపోతే నేను బతకలేను నువ్వు వెళ్లిపో తల్లి. వాడు తప్పు చేశాడు కానీ వాడి మీద కోపంతో నిన్ను నువ్వు శిక్షించుకొని వాడిని శిక్షించకు. నీ వల్ల ఈ ఇళ్లు ఎలా అయిపోయిందో చూశావా. ఇంతకుముందు మేం తిన్నా తినకపోయినా సంతోషంగా ఉండేవాళ్లం కలిసి తినేవాళ్లం నువ్వు వచ్చాక అన్నీ మారిపోయాయి. నీ కారణంగా ఇళ్లు మూడు ముక్కలు అయ్యేలా ఉంది. ఏదో ఒక రోజు రౌడీ నుంచి మంచి వాడిగా మారుతాడనే ఆశతో బతుకుతున్నాను. వాడిని ఇంట్లో నుంచి గెంటేసే పరిస్థితి చేయకమ్మా. నా కొడుకు నాకు దూరం అయితే నేను బతకలేను అమ్మా. నా బాధ అర్థం చేసుకొని ఇంటి నుంచి వెళ్లిపో. లేదు నాకు నా పంతమే ముఖ్యమే అనుకుంటే ఇలాగే ఉండిపో. అమ్మా దయచేసి ఓ కన్న తల్లి చావుకి కారణం అవ్వకమ్మా. ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం.. భర్తకి అండగా దీప.. సమస్యల ఊబిలో జ్యోత్స్న!





















