Nuvvunte Naa Jathaga Serial Today April 4th: నువ్వుంటే నా జతగా సీరియల్: తప్పతాగి తండ్రికి దొరికిపోయిన అన్నదమ్ములు.. అంతా నా ఖర్మ అని బాధపడ్డ దేవా!
Nuvvunte Naa Jathaga Today Episode అన్నకు బుద్ధి చెప్తానని దేవా తీసుకెళ్లడం ముగ్గురు అన్నదమ్ములు తప్పతాగి ఇంటికి వచ్చి తండ్రికి దొరికిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా రెడీ అవుతుంటే మిధున వచ్చి చేసేది రౌడీ పని కానీ బుద్ధిగా జాబ్‌కి వెళ్లేవాడిలా ఎంత చక్కగా రెడీ అవుతున్నావో.. పైగా స్టైల్ అని వెక్కిరిస్తుంది. ఏంటి వెటకారం చేస్తున్నావ్ అని దేవా అడుగుతాడు. లేకపోతే ఏంటి అని అంటే బాగా ఓవర్ చేస్తున్నావ్ రౌడీ అనే భయం లేదు పైగా ఈ మధ్య నా మీద చేయి కూడా చేసుకున్నావ్ తెలుసా అని దేవా అంటాడు. ఉండాలి ఆ మాత్రం భయం ఉండాలి అని మిధున అంటుంది.
ఇందుకే నిన్ను అంటా..
నా మానాన నేను రెడీ అవుతుంటే ఏంటి నీ ఓవర్ అని దేవా అంటాడు. దానికి మిధున ఇందుకే నిన్ను అంటాను. ఆ దిక్కుమాలిన రౌడీయిజం మీద పెట్టిన శ్రద్ధ ఈ ఇంటి మీద ఇంటి మనుషుల మీద పెట్టి ఉంటే ఈ పాటికి ఇళ్లు ఎప్పుడో బాగుపడే వాళ్లని అంటుంది. మా వాళ్లు బాగున్నారు కదా అంటాడు. ఏంటి బాగుండేది ప్రమోదిని అక్క ఎంత బాధ పడుతుందో తెలుసా బావగారిని ఎంత బతిమాలుతుందో తెలుసా అంటుంది.
ప్లాన్ ప్రకారం చేద్దాం సరేనా..
మీ అన్నయ్య జాబ్‌కి వెళ్లే ఐడియా నా దగ్గర ఉంది. మనం ప్లాన్ ప్రకారం చేస్తే మీ అన్నయ్య జాబ్‌కి వెళ్తారు సరేనా అని మిధున అడుగుతుంది. దేవా ఏం మాట్లాడకుండా మనసులో బాగా చదువుకుంది తెలివైనది పైగా సైకాలజీ చేసింది. ఈవిడ చెప్పినట్లు చేస్తే ఫలితం ఉంటుంది కానీ ఈవిడ చెప్తే మనం లోకువ అయిపోతాం కదా.. ఇప్పుడే నాతో ఆడుకుంటుంది ఇప్పుడు చెప్పినట్లు చేస్తే ఇంకా లోకువ అయిపోతా అనుకొని మిధునతో నీ సలహా నాకు అవసరం లేదు అనేస్తాడు. నా మైండ్‌లో కూడా మంచి ఐడియా ఉంది అదే పనిలో వెళ్తున్నా మా అన్నయ్యని మార్చేసి వాడే జాబ్‌కి వెళ్తా అని వాడి నోటితో వాడు అనేలా చేస్తా అని మిధునతో చెప్తాడు. మిధున ఎంత చెప్పినా దేవా వినకుండా వెళ్లిపోతాడు..
అన్నయ్యా నీతో సీరియస్‌గా మాట్లాడాలి..
రాత్రి దేవా ఆనంద్‌ని తీసుకొని తాను ముందు తాగే ప్లేస్‌కి తీసుకొస్తాడు. నీతో సీరియస్‌గా మాట్లాడాలి అన్నయ్య అంటాడు. ఇంతలో శ్రీరంగం వచ్చి దుర్మార్గులారా నన్ను వదిలేసి మీ ఇద్దరే తాగడానికి వచ్చేస్తారా అని అడుగుతాడు. మేం తాగడానికి రాలేదురా ఇక విషయం గురించి అన్నయ్యతో మాట్లాడటానికి వచ్చాం అని దేవా చెప్తాడు. నా చెవిలో బీర్ బాటిల్స్ కనిపిస్తున్నాయారా అని రంగం దేవాని అడుగుతాడు. కబుర్లు ఆపరా అని రంగం మందు తీసుకురమ్మని చెప్తాడు.
అక్క మన భర్తలెక్కడ..
సూర్యకాంతం ప్రమోదిని దగ్గరకు వెళ్లి అక్క ముగ్గురు అన్నదమ్ముళ్లు కనిపించడం లేదు. ముగ్గురు త్రిమూర్తుల్లా ఉన్నా ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు.. ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడుకోరు అలాంటిది ఈ రోజు మాట్లాడటానికి వెళ్లారు అంటే ఏదో గూడుపుటాని చేస్తున్నారని మిధున తన భర్తని రెచ్చగొట్టి పంపుంటుందని అంటుంది. ప్రమోదిని కాంతాన్ని తిట్టి మిధున అలాంటిది కాదని అంటుంది.
అన్నదమ్ముల సిట్టింగ్..
రంగం ముగ్గురికి మందు పోస్తాడు. ఆనంత్ తనకు అలవాటు లేదు అన్నా తాగమని చెప్తాడు. దేవా అన్నయ్యతో ఉద్యోగానికి వెళ్లారా వదిన బాధ పడుతుంది అని చెప్తాడు. దానికి ఆనంద్ నాకు వెళ్లాలి అనే ఉందిరా కానీ డస్ట్ అలర్జీ, ఎక్కువ సేపు నిల్చొంటే కాళ్ల నొప్పులు, కూర్చొంటే నడుం నొప్పి మరి ఉద్యోగం ఎలా చేయాలిరా అంటాడు. కుంటి సాకులు ఇంకా ఎంత కాలం చెప్తావురా అని దేవా అడుగుతాడు. బద్ధకం వదిలిపెట్టరా అంటాడు. ఇంకా మారవారా అని అడుగుతాడు. నువ్వు మారావారా అని ఆనంద్ అడుగుతాడు. అందరూ మనల్నే చూస్తున్నారు ఈ విషయం వదిలేయండిరా అని రంగం అంటాడు.
ముగ్గురు తాగుబోతులు..
ప్రమోదిని, కాంతం, మిధున భర్తల కోసం అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు. ముగ్గురూ ఫుల్లుగా తాగేపి దేవా బండి మీద వస్తారు. ముగ్గురు భర్తల్ని అలా చూసిన భార్యలు షాక్ అయిపోతాడు. లేడీస్ బ్యాచ్ అంతా ఇక్కడే ఉంది డౌట్ రాకుండా దిగండి అని దేవా అంటాడు. ఇద్దరూ తూగుతూ ఉంటే దేవా ఓరేయ్ మ్యానేజ్ చేయండిరా అంటాడు. మనం మందు తాగామని తెలిస్తే నాన్నకి లీక్ చేస్తారని రంగం అంటాడు. హిట్లర్ నాన్నకి తెలిస్తే ఈ రోజు తాగిందే కాదు చిన్నప్పుడు ఉగ్గు పాలు కూడా కక్కించేస్తారు అని ఆనంద్ అంటాడు. ఫుల్లుగా తాగేసి వచ్చారని రంగం ప్రమోదినితో చెప్తుంది.
ఎప్పుడూ లేనిది మీరేంటి ఇలా..
ఎవరి భార్యల దగ్గరకు వాళ్లు వెళ్తారు. ఎప్పుడూ లేనిది ఇలా ఏంటి అండీ అని ప్రమోదిని ఆనంద్‌ని అడుగుతుంది. ఏంటి అలా చూస్తున్నావ్ అని దేవా మిధునని అడిగితే సర్కస్ చేస్తున్నావ్ కదా చూస్తున్నా అంటుంది. ఎప్పుడూ లేనిది మీ ముగ్గురు అన్నదమ్ములు కలిసి వచ్చారేంటి అని అడుగుతారు. మిధున దేవాని ప్రశ్నిస్తే మా నాన్నే ఏం అడగడు నువ్వేంటే అని తిట్టి లోపలికి వెళ్లబోతాడు. ఇంతలో సత్యమూర్తి సీరియస్‌గా నిల్చొంటారు.
అమ్మో నాన్నా..
ముగ్గురు కొడుకులు తండ్రిని చూసి అమ్మో నాన్న అనుకొని షాక్ అయిపోతారు. సత్యమూర్తి దేవా వచ్చి శభాష్‌రా ఇన్నాళ్లు మిమల్ని ఎందుకు పనికి రానివాళ్లు అనుకున్నా కానీ తాగి ధైర్యంగా ఇంటికి వచ్చేంత ప్రయోజకులు అయ్యారన్నమాట అని అంటాడు. అందరూ తల దించుకుంటారు. ఆనంద్, శ్రీరంగం ఇద్దరూ దేవా బలవంతంగా తాగించాడని చెప్తారు. దాంతో సత్యమూర్తి దేవా మీద ఫుల్ ఫైర్ అవుతాడు. నువ్వు పోయిందే కాకుండా వీళ్లని కూడా చెడగొడతావా అని అంటాడు. మేం తాగడం తప్పే నాన్న కానీ దాని వెనక కారణం నా మనసాక్షికి తెలుసు. నేనేం చేసినా తప్పే ఏం చెప్పినా అర్థం చేసుకోరు అంతా నా ఖర్మ అని దేవా అంటాడు. దానికి పెద్దాయన నీ ఖర్మ కాదురా నిన్ను కనడం నేను చేసుకున్న ఖర్మ అనేసి వెళ్లిపోతాడు. ఒకటి అనుకుంటే ఇంకొకటి అయిందని దేవా అంటాడు. మీ అన్నయ్య మారాలి అంటే నువ్వు చెప్పే స్థాయిలో ఉండాలి అని అంటుంది. నీ జీవితం వాళ్లకి ఆదర్శంగా ఉండాలి. కానీ నువ్వే తాగి చెప్తే ఏం అర్థం చేసుకోవాలి అని అడుగుతుంది. నేను పిచ్చి బీపీలో ఉన్నాను మాటలతో మంట పెట్టి నాకు ఇంకా పిచ్చెక్కించకు అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: మాధవి కొడుకుని కిడ్నాప్ చేసిన రాజు.. సీఎం మీద మాధవి అత్యాచార నింద వేస్తుందా!





















