Nindu Noorella Saavasam November 29th Episode: చిత్రగుప్తుడి మాటలకు కంటతడి పెట్టుకున్న అరుంధతి.. మనోహరికి చీవాట్లు పెట్టిన అమరేంద్ర!
Nindu Noorella Savasam November 29th Episode: చిత్రగుప్తుడు అరుంధతితో తనకి అంగుళీకం ఇస్తేనే సమస్యకి పరిష్కారం దొరుకుతుందని చెప్పటంతో కథలో కీలక మలుపులు చోటు చేసుకుంటాయి.
Nindu Noorella Savasam November 29th Episode: ఎప్పుడు మార్కులు మిస్సమ్మే కొట్టేస్తుంది ఈసారి తనకి ఆ ఛాన్స్ ఇవ్వను అనుకొని పిల్లలు మీకు ఏమీ భయం లేదు మీ పక్కన నేను పడుకుంటాను అంటుంది మనోహరి.
అమర్: ఇప్పుడు వాళ్లకి నేనున్నాను అనే ధైర్యం కావాలి వాళ్ళ పక్కన నేను పడుకుంటాను అని చెప్పటంతో అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు.
పిల్లలందరూ పడుకున్న తరువాత అమర్ కూర్చొనే పడుకుంటాడు. అయితే భయానికి అరుంధతి ఆత్మ కూడా అమర్ ఒడిలోనే పడుకుంటుంది కానీ అతనికి ఆ విషయం తెలియదు.
మరుసటి రోజు పొద్దున్న జరిగిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది అరుంధతి.
చిత్రగుప్తుడు: ఏం ఆలోచిస్తున్నావు బాలిక.
అరుంధతి: రాత్రి జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నాను, అంజలి అరవడంతో అందరూ లేచారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఈపాటికి నేను ఏమైపోయే దాన్ని అసలు వాడు ఎందుకు ఈ ఇంటిని పట్టుకొని పీడిస్తున్నాడు వాడికి ఏం కావాలి అంటుంది.
చిత్రగుప్తుడు: వాడికి నువ్వే కావాలి, ఆత్మను బంధించి పూజలు చేస్తే వాడికి శక్తులు వస్తాయి.
అరుంధతి: ఏడుస్తూ వాడినుంచి తప్పించుకోవటానికి మార్గం లేదా మీరు ఏమి చేయలేరా అని అడుగుతుంది.
చిత్రగుప్తుడు: ఏమి చేయలేము నేనే కాదు అలాంటి వాళ్ళని ఎవరు కూడా ఏమీ చేయలేరు. వాళ్లు అనుకున్నది సాధించటం కోసం ఎంతవరకైనా వెళ్తారు.
అరుంధతి: వేరే మార్గం లేదా
చిత్రగుప్తుడు : ఉంది నా అంగుళీకము నాకు ఇస్తే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. వాడు ఇక్కడికి వస్తున్నది నీకోసమే నువ్వే లేకపోతే వాడు ఈ ఇంటి ఛాయలకి కూడా రాడు.
అరుంధతి: ఆ ఉంగరం నా దగ్గర లేదు.
చిత్రగుప్తుడు :ఉంది, అంగుళీకము నీ దగ్గరే ఉన్నదని నీకు తెలుసు, నాకు తెలుసు. నీ పిల్లలకి నీ వల్లే ప్రమాదం మీ కుటుంబాన్ని నువ్వే ప్రమాదంలోకి నెట్టేస్తున్నావు తర్వాత నీ ఇష్టం. హెచ్చరించలేదని మాత్రం అనుకోవద్దు అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
నేనే నా కుటుంబానికి ఇబ్బందిగా మారానా అని కన్నీరు పెట్టుకుంటుంది అరుంధతి.
మరోవైపు పేపర్ చదువుతున్న తండ్రి దగ్గరికి పిల్లలు వచ్చి అంజలికి జ్వరంగా ఉంది అని చెప్పటంతో అందరూ కంగారుగా పిల్లల రూమ్ కి వెళ్తారు. అప్పటికే మిస్సమ్మ అంజు తలపై తడిబట్టతో తుడుస్తూ ఉంటుంది.
అమర్: ఏం జరిగింది.
మనోహరి : జ్వరంతో ఒళ్లంతా కాలిపోతుంది ఇప్పుడే టాబ్లెట్ వేసాను.
అమర్ తల్లిదండ్రులు : రాత్రి జరిగిన దానికి జడుచుకున్నట్లుగా ఉంది.
పిల్లలు: అంతేకాదు రెండు రోజుల నుంచి కష్టపడి చదువుతుంది తిండి కూడా సరిగ్గా తినలేదు.
మనోహరి : అయితే ఇదంతా కావాలని తెచ్చుకున్న జ్వరమే. ఎగ్జామ్ ఎగ్గొట్టడానికి ఇదొక సాకు.
మిస్సమ్మ : ఏం మాట్లాడుతున్నారండి, అలా ఎలా మాట్లాడగలుగుతున్నారు తను కష్టపడి చదివింది అనటానికి నేనే సాక్ష్యం.
మనోహరి : మా అంజు గురించి మీకు తెలియదు అంటూ ఏదో మాట్లాడబోతుంటే అమర్ కేక వేస్తాడు.
అమర్: తను అంత నీరసంగా కనిపిస్తుంది, అయినా అలా ఎలా అనగలుగుతున్నావు అంటూ చివాట్లు పెడతాడు. అందరూ ఒకే గదిలో ఉంటే అంజుకి ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి అందరిని అక్కడ నుంచి వెళ్లిపోమంటాడు.
అమర్ తల్లిదండ్రులు పాపని హాస్పిటల్ కి తీసుకువెళ్దామంటే వద్దు టాబ్లెట్ వేసాను హాస్పిటల్ కి అంటే మళ్ళీ భయపడుతుంది అని మిస్సమ్మ చెప్పడంతో డ్రాప్ అయిపోతారు.
అమర్: నేను ఇంట్లోనే ఉంటాను ఏమైనా అవసరమైతే పిలువు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.
అంజు జ్వరంతో పడి ఉండడాన్ని చూసి భరించలేకపోతుంది అరుంధతి. అందరూ వెళ్లిపోయిన తర్వాత ధైర్యం చేసి లోపలికి వెళ్ళిపోతుంది.
అరుంధతి: పాపకి ఏమైంది?
మిస్సమ్మ: తనకి జ్వరం వచ్చింది అంటుంది. మళ్లీ తనే అంజుకి పాలు తాగించాలి అనడంతో నేను ఇక్కడే ఉంటాను నువ్వు వెళ్లి పాలు తీసుకుని రా అంటుంది అరుంధతి.
పాలు తీసుకురావడానికి వెళ్తుంది మిస్సమ్మ. అరుంధతి అంజుకి కనిపించకపోవడంతో మిస్సమ్మ ఎవరితో మాట్లాడుతుంది అనుకుంటుంది. అరుంధతి కూతుర్ని చూసుకుంటూ ఏమి చేయలేక నిస్సహాయంగా ఏడుస్తూ ఉంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.