Nindu Noorella Saavasam 27th Episode : అమర్ మాటలు విని భయంతో వణికిపోతున్న మనోహరి.. తండ్రి దగ్గర కన్నీళ్లు పెట్టిన మిస్సమ్మ!
Nindu Noorella Saavasam November 27th Episode: అమరేంద్రలో అనుమానం మొదలైంది అని తెలుసుకున్న మనోహరి భయంతో వణికిపోతూ ఉండటంతో కథలో కీలక మలుపులు చోటుచేసుకున్నాయి.
Nindu Noorella Saavasam November 27th Episode : ఇంటికి వచ్చిన భర్త సీరియస్ గా ఇంట్లోకి వెళ్ళటం చూసిన అరుంధతి మా ఆయన ఎందుకలా ఉన్నారు అని చిత్రగుప్తుడిని అడుగుతుంది. అతని ఏమీ మాట్లాడకపోవటంతో నేనే కనుక్కుంటాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
చిత్రగుప్తుడు: బాలిక నీవు కట్టుకున్న అబద్ధాల మేడ పునాదులు కూలిపోవు సమయం ఆసన్నమైంది అనుకుంటాడు.
మనోహరి: అమర్ రావడం చూసి వేడివేడిగా కాఫీ పెట్టుకుని వెళ్లి ఇస్తే కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకోవచ్చు అనుకుంటూ కాఫీ తీసుకురావడానికి వెళ్తుంది.
తన గదిలోకి వెళ్లిన అమరేంద్ర సీరియస్ గా రాథోడ్ ని పిలుస్తాడు. లోపలికి వచ్చిన రాథోడ్ తో..
అమర్ : నేను చెప్పిన సంగతి ఏం చేశావు.
రాథోడ్: అన్ని వివరాలు తెలుసుకుంటున్నాను సార్, అయినా మీరు ఈ విషయం చెప్పిన దగ్గర నుంచి నా మనసు కి చాలా బాధగా ఉంది.
అక్కడే ఉన్న అరుంధతికి వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం అవ్వక కన్ఫ్యూజ్ అవుతుంది. ఇంట్లో వాళ్లకి ఏమైనా జరిగిందేమో అని కంగారు పడుతుంది.
అమర్: ఇది నా అనుమానం మాత్రమే, ఆ లారి నెంబర్ ప్లేటు, రిజిస్ట్రేషన్ రెండూ ఫేకే. అలా ఎవరు చేయించారో తెలిస్తే మాత్రం వాళ్లని విడిచి పెట్టేది లేదు.
అప్పుడే అక్కడికి కాఫీ తీసుకువచ్చిన మనోహర్ ఎవరిని విడిచి పెట్టకూడదు అంటున్నావు అని అడుగుతుంది.
అమర్: రాథోడ్ ని తెలుగు వేసేయమని చెప్పి అరుంధతి ఆక్సిడెంట్ విషయం చెప్తాడు.
ఆ మాటలకి భయంతో వణికి పోతుంది మనోహరి, చేతిలో కాఫీ కప్ ఎత్తేస్తుంది. అరుంధతి కూడా ఒక్కసారిగా షాక్ అవుతుంది.
మనోహరి: భయంతో వణుకుతూనే ఏం మాట్లాడుతున్నావ్ అమర్ అని అంటుంది.
అమర్: లారీ నెంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ రెండు ఫేక్, కొడైకెనాల్ వెళ్ళటానికి వారం రోజులు ముందు నుంచి జరిగిన ప్రతి ఇన్సిడెంట్ గా ఉంది అందుకే నేను పర్సనల్గా ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను అంటూనే భయంతో వణికిపోతున్న మనోహర్ని చూసి నువ్వు ఎందుకు అలా అయిపోతున్నావు అని అడుగుతాడు.
మనోహరి : అలాంటిదేమీ లేదు నువ్వు చెప్పిన మాటలకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు అయినా అరుంధతిని ఎవరు చంపాలి అనుకుంటారు నేను కొడైకెనాల్ వెళ్లి తెలుసుకుంటాను.
అమర్: వద్దు, ఇప్పటివరకు నిజాం బయటపడలేదని వాళ్ళు రిలాక్స్ అవుతూ ఉంటారు వాళ్ళని అలాగే ఉండని వాళ్ల సంగతి నేను చూసుకుంటాను నువ్వు మాత్రం ఇంట్లో ఎవరికీ ఈ విషయం చెప్పకు.
మనోహరి : ఇక అక్కడ ఉండలేక కాఫీ కప్ క్లీన్ చేయించడానికి నేలని పంపిస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
బయటికి వచ్చిన తర్వాత అమర్ లో అనుమానం మొదలైంది, ఆ హత్య చేయించింది నేనే అని తెలిస్తే అమర్ నన్ను వదిలిపెట్టడు అంటూ భయంతో వణికిపోతూ ఉంటుంది.
మరోవైపు ఆనందంగా ఇంటికి వచ్చిన భర్తని ఏంటి అంతా ఆనందంగా ఉన్నావు అని అడుగుతుంది మంగళ.
మిస్సమ్మ తండ్రి: రేపు మన వల్ల ఇంటికి వెళ్ళబోతున్నాను అని నోరు జారుతాడు.
మంగళ ఆమె తమ్ముడు ఏం మాట్లాడుతున్నావు అంటూ నిలదీసేసరికి మాట మార్చేస్తాడు మిస్సమ్మ తండ్రి. పొద్దున్న బండిమీద మీ ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు.
మంగళ: కంగారుపడుతూ ఏదో పనిమీద వెళుతున్నాము అన్నీ నీకు చెప్పాలా ఏంటి అని తమ్ముని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
అప్పుడే అక్కడికి వచ్చిన భాగమతి తండ్రిని కుశల ప్రశ్నలు వేసిన తర్వాత మీరు ఆనందంగా ఉన్నారు కారణమేంటి అని అడుగుతుంది.
మిస్సమ్మ తండ్రి : కొందరి పరిచయం నన్ను ఇలా చేసింది.
మిస్సమ్మ: మీకు ఇంత ఆనందాన్నిచ్చినా వాళ్ళని నాకు కూడా పరిచయం చేయండి.
ఈ పరిచయం చేయలేను చేస్తే నేను వాచ్మెన్ గా చేసిన సంగతి నీకు తెలిసిపోతుంది అనుకుంటాడు ఆమె తండ్రి.
మిస్సమ్మ : వార్డెన్ సంగతి ఏమైనా తెలిసిందా అని తండ్రిని అడుగుతుంది.
మిస్సమ్మ తండ్రి : లేదు.
మిస్సమ్మ : అక్క ఖచ్చితంగా దొరుకుతుంది అప్పుడు తనతో నేను గోరుముద్దలు తినిపించుకుంటాను అంటూ బాగా ఎమోషనల్ అవుతూ తండ్రిని పట్టుకుని ఏడుస్తుంది.
మిస్సమ్మ తండ్రి: అన్ని నువ్వు అనుకున్నట్లే జరుగుతాయి ఏమీ బాధపడకు అని ధైర్యం చెప్తాడు.
ఆ తర్వాత ఇంటికి లేటుగా వచ్చి అమరేంద్ర కి కనిపించకుండా ఉండటం కోసం నక్కినక్కి వెళ్తూ ఉంటుంది మిస్సమ్మ. కానీ అమరేంద్ర కంట్లో పడిపోతుంది.
అమర్: ఇంత లేటుగా ఇంటికి వచ్చావు ఇంకా నువ్వు పిల్లల్ని ఏం చూసుకుంటావు.
మిస్సమ్మ : కొంచెం పని ఉండి వెళ్ళవలసి వచ్చింది కానీ అక్కడ లేట్ అయిపోయింది.
అమర్: నీకు ఏం కావాలన్నా నన్ను నిరభ్యంతరంగా అడగవచ్చు నా పిల్లల బాధ్యత నువ్వు చూసుకుంటున్నావు కాబట్టి నీ బాధ్యత నేను చూస్తాను ఏమైనా హెల్ప్ కావాలా అని అడుగుతాడు.