అన్వేషించండి

Nindu Noorella Saavasam December 5th Episode: 'నిండు నూరేళ్లు సావాసం' సీరియల్: ఆరుని చంపిన లారీ డ్రైవర్ గురించి తెలుసుకున్న అమర్ - రౌడీలను హెచ్చరించిన మనోహరి!

Nindu Noorella Saavasam Today Episode: మీరు హైదరాబాద్ కి వచ్చారని పోలీసులకు తెలిసింది. అర్జెంటుగా అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోండని రౌడీలను మనోహరి హెచ్చరించడంతో కథ మరో మలుపుకి తిరుగుతుంది.

Nindu Noorella Saavasam Today Episode: అంజు అన్నం తిన్నదో లేదో అని చూడటానికి వస్తుంది అరుంధతి. అక్కడ కబుర్లు చెబుతూ అంజుకి భోజనం తినిపించడానికి ప్రయత్నిస్తున్న మిస్సమ్మను చూసి ఆనందపడుతుంది మనసులోనే ఆమెకి థాంక్స్ చెప్పుకుంటుంది. 

మిస్సమ్మ : కొంచెం తిను అంజు, లేదంటే ఆకలికి మరి నీరసం వస్తుంది.

అంజు : తినాలని లేదు మిస్సమ్మ ఎంత చదివినా ఏమీ గుర్తుండటం లేదు రేపు ఎగ్జామ్ రాయలేనేమో అని భయంగా ఉంది.

మిస్సమ్మ : రాయలేనేమో అని భయంతో కాదు రాయగలను అని నమ్మకంతో రాయు.. నువ్వు బాగా రాస్తావు నాకు తెలుసు అని ధైర్యం చెప్తుంది. అయినప్పటికీ అంజు అన్నం తినకపోతే ఇది అమ్మ ముద్ద అని తినిపిస్తుంది. వెంటనే ఆ ముద్దని నోట్లో పెట్టుకుంటుంది అంజు.

మిస్సమ్మ: అమ్మ అంటే ఏమీ ఆలోచించవా అంటుంది.

అంజు: అమ్మ అంటే ఇంకా ఆలోచించటం ఎందుకు అంటుంది.

మీ అమ్మ అదృష్టవంతురాలో దురదృష్టవంతురాలో అర్థం కావటం లేదు అని అంజలిని పట్టుకొని ఎమోషనల్ అవుతుంది మిస్సమ్మ. అంతలోనే పాప భోజనం చేసిందా అనుకుంటూ అక్కడికి వస్తాడు అమర్.

అమర్: జ్వరం తగ్గిందా

మిస్సమ్మ : లేదు సర్ నీరసం కూడా కొంచెం ఎక్కువ అయింది. రేపు పొద్దున్న కూడా ఇలాగే ఉంటే హాస్పిటల్ కి తీసుకువెళ్లాలి అని అమర్ కి చెప్తూ అంజు భోజనం కూడా చేయలేదు అని చెప్తుంది.

అమర్: మిస్సమ్మ చేతిలోంచి ప్లేట్ తీసుకొని అమ్మ ముద్దు తిన్నావు మరి నాన్న ముద్ద తినవా అని కూతురికి భోజనం తినిపిస్తాడు.

మా ఆయనకి ఈ టాలెంట్ కూడా ఉందా అని బయట నుంచి చూస్తున్న అరుంధతి మురిసిపోతుంది.

అమర్: ఇది మిస్సమ్మ ముద్ద తినకపోతే తను ఫీల్ అవుతుంది అనడంతో ఆ ముద్ద కూడా తింటుంది అంజు.

పొసెసివ్ గా ఫీల్ అవుతుంది అరుంధతి. కానీ కూతురికి భర్త భోజనం తినిపించినందుకు ఆనందపడుతుంది.

కూతురికి భోజనం తినిపించిన తర్వాత చేయి కడుక్కోవడానికి వెళ్లి అక్కడే ఉన్న మిస్సమ్మ చున్నితో చెయ్యి తుడిచేసుకుంటాడు అమర్.

అక్కడికి వచ్చిన మిస్సమ్మ అది నా చున్నీ అని అంటుంది. అప్పుడే గతంలోకి వెళ్తాడు  అమర్.

అమర్ : భోజనం తర్వాత తన పైటకొంగుని తుడుచుకోవటానికి ఇస్తుంది అరుంధతి. చీరల మీద చిన్న మరక పెడితే ఊరుకోరు కానీ భర్తలకి తుడుచుకోవటానికి కొంగులు ఇచ్చేస్తారు ఎలా అని నవ్వుతాడు.

అరుంధతి: మా ఆడవాళ్ళ ప్రపంచం మీరు, పిల్లలే అలాంటి మీ కోసం కాకపోతే మరి ఎవరికి ఇస్తాం.

ఆలోచనలో ఉన్న అమర్ ని పిలుస్తుంది మిస్సమ్మ. మిస్సమ్మ చున్ని ఆమె చేతికిచ్చి చున్నీ ఒంటి మీద ఉండాలి కానీ ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు అని కోప్పడి వెళ్ళిపోతాడు.

మిస్సమ్మ: చున్నీ పక్కన పెట్టడం కూడా అంత నేరమా? నాకు తెలియదు అని అయోమయంగా అనుకుంటుంది.

మరోవైపు అమర్ కి వచ్చిన ఫోన్ లిఫ్ట్ చేస్తుంది మనోహరి. ఆమెతో కొడైకెనాల్ పోలీస్ మాట్లాడుతాడు.

పోలీస్: సార్ లేరా మేడం.

మనోహరి: లేరు.. ఏంటి విషయం నాకు చెప్పండి.

పోలీస్: అదే మేడం, హత్య చేసిన వాడి వివరాలు దొరికాయి అని చెప్పటంతో మనోహరికి కి చెమటలు పట్టేస్తాయి.

అప్పుడే అక్కడికి వచ్చిన అమర్ కి ఫోన్ ఇస్తుంది మనోహరి. అమర్ కి కూడా  హంతకుడు హైదరాబాదులోనే ఉన్నాడని, అతని ఫోటో అటు హైదరాబాద్ పోలీసులకి ఇటు కొడైకెనాల్ పోలీసులకి పంపించానని చెప్తాడు.

అమర్: ఆ ఫోటో నాకు కూడా పంపించండి. చంపింది నా భార్యని కాబట్టి నా చేతులతోనే వాడిని పట్టుకొని శిక్షపడేలా చేస్తాను అనటంతో అతనికి ఫోటో పంపిస్తాడు పోలీస్.

ఆ ఫోటోని అమర్ తో పాటు మనోహరి కూడా చూస్తుంది.  డీల్ మాట్లాడిన వాడు వీడే. అమర్ నిజానికి చాలా దగ్గరకి వచ్చేసాడు. అరుంధతిని చంపింది నేనే అని తెలిస్తే నన్ను చంపేస్తాడు అని భయపడుతూ అక్కడ నుంచి వెళ్తుంటే అమర్ ఇంకెప్పుడూ నా ఫోన్ తీయ్యొద్దు అని మనోహరిని  హేచ్చరిస్తాడు.

మనోహరి: తన గదిలోకి వెళ్ళిన తర్వాత భయపడుతూ రౌడీలకు ఫోన్ చేసి హెచ్చరిస్తుంది. ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను త్వరగా ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది.

ఫోన్ పెట్టేసిన తర్వాత రౌడీ అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటే పక్కనే ఉన్న మరొక రౌడీ అతనికి సలహా ఇస్తాడు. నువ్వు ఎందుకు పారిపోవటం.. అవసరం ఆమెది.. ఆమె ఇప్పుడు బంగారు బాతు. ఆమె దగ్గర నుంచి కావాల్సినంత వసూలు చేసి అండర్ గ్రౌండ్ లో ఉండు అని సలహా ఇస్తాడు.

మరోవైపు చిత్రగుప్తుడిని నీ భాష ఏమిటి అలా ఉంటుంది అసలు నీది ఏ ఊరు అని అడుగుతాడు రాథోడ్.

చిత్రగుప్తుడు : యమపురి అని చెప్పడంతో షాకవుతాడు రాథోడ్. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: ‘బహ్మముడి’ సీరియల్: దుగ్గిరాల ఇంట్లో తిష్టవేసిన కనకం - అరుణ్‌ను పట్టుకోవడానికి కావ్య కొత్త ప్లాన్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road: ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంపై ముఖ్యమైన అప్‌డేట్- జాతీయ, రాష్ట్ర రహదారులను కలిసే 11 ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మాణం
ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంపై ముఖ్యమైన అప్‌డేట్- జాతీయ, రాష్ట్ర రహదారులను కలిసే 11 ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మాణం
AP Liquor Policy: మద్యం షాపు యజమానులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, గీత కులాలకు 10 శాతం షాపులు కేటాయింపు
మద్యం షాపు యజమానులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, గీత కులాలకు 10 శాతం షాపులు కేటాయింపు
KTR Quash Petition: కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై  తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
Happy New Year 2025: అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ - ఈ ఫన్నీ మీమ్స్, ఫన్నీ మెసెజెస్ ట్రై చేశారా?
అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ - ఈ ఫన్నీ మీమ్స్, ఫన్నీ మెసెజెస్ ట్రై చేశారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Fishing in Yanam | చేపలు పట్టడంలో ఇదో కొత్త పంథాLorry Rushed in to Xerox Shop | విశాఖలో ప్రమాదం..జిరాక్సు షాపులోకి దూసుకెళ్లిన లారీ | ABP DesamVizag Dolphin Pool Cricket Ground | విశాఖలో డాల్ఫిన్ పూల్ క్రికెట్ గ్రౌండ్ తెలుసా.? | ABP DesamADR Report on Chief Ministers Assets | దేశంలోనే నిరుపేద ముఖ్యమంత్రి ఈమె

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road: ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంపై ముఖ్యమైన అప్‌డేట్- జాతీయ, రాష్ట్ర రహదారులను కలిసే 11 ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మాణం
ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంపై ముఖ్యమైన అప్‌డేట్- జాతీయ, రాష్ట్ర రహదారులను కలిసే 11 ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మాణం
AP Liquor Policy: మద్యం షాపు యజమానులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, గీత కులాలకు 10 శాతం షాపులు కేటాయింపు
మద్యం షాపు యజమానులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, గీత కులాలకు 10 శాతం షాపులు కేటాయింపు
KTR Quash Petition: కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై  తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
Happy New Year 2025: అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ - ఈ ఫన్నీ మీమ్స్, ఫన్నీ మెసెజెస్ ట్రై చేశారా?
అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ - ఈ ఫన్నీ మీమ్స్, ఫన్నీ మెసెజెస్ ట్రై చేశారా?
DCP Vineet With ABP Desam: న్యూఇయర్ వేళ మందుబాబులూ బీకేర్ ఫుల్ - డ్రగ్స్ తీసుకుంటే 15 నిమిషాల్లోనే అరెస్ట్, ఏబీపీ దేశంతో డీసీపీ వినీత్
న్యూఇయర్ వేళ మందుబాబులూ బీకేర్ ఫుల్ - డ్రగ్స్ తీసుకుంటే 15 నిమిషాల్లోనే అరెస్ట్, ఏబీపీ దేశంతో డీసీపీ వినీత్
ICC Champions Trophy: ప్రమాదంలో రోహిత్, కోహ్లీ వన్డే కెరీర్.. ఇంగ్లాండ్ తో సిరీస్ కు వీరిద్దరిని తప్పించే చాన్స్.. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత మనుగడ కష్టమే..! 
ప్రమాదంలో రోహిత్, కోహ్లీ వన్డే కెరీర్.. ఇంగ్లాండ్ తో సిరీస్ కు వీరిద్దరిని తప్పించే చాన్స్.. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత మనుగడ కష్టమే..! 
Mahakumbh 2025 : రైల్లో కుంభమేళాకు వెళ్తున్నారా - ఎంట్రీ, ఎగ్జిట్ రూట్స్‌పై ప్రయాగ్‌రాజ్ రైల్వే డివిజన్ కీలక ప్రకటన
రైల్లో కుంభమేళాకు వెళ్తున్నారా - ఎంట్రీ, ఎగ్జిట్ రూట్స్‌పై ప్రయాగ్‌రాజ్ రైల్వే డివిజన్ కీలక ప్రకటన
SCR: 'రత్నాచల్' ఎక్స్ ప్రెస్ టైమింగ్ మారింది తెలుసా! - జనవరి 1 నుంచి ఈ రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు, ద.మ రైల్వే కీలక ప్రకటన
'రత్నాచల్' ఎక్స్ ప్రెస్ టైమింగ్ మారింది తెలుసా! - జనవరి 1 నుంచి ఈ రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు, ద.మ రైల్వే కీలక ప్రకటన
Embed widget