Nindu Noorella Saavasam December 15th Episode: 'నిండు నూరేళ్లు సావాసం' సీరియల్: అరుంధతిని ఘోర నుంచి కాపాడిన మిస్సమ్మ, ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయిన అంజు!
Nindu Noorella Saavasam Today Episode: మనోహరి అమ్మగారి గతం తెలుసుకోవాలని ఉంది అని నీలా అన్నప్పుడు సమయం వస్తే అదే తెలుస్తుంది అని చిత్రగుప్తుడు అంటాడు. దీంతో మనోహరి వెనక కథ ఏమిటనే ఉత్కంఠ నెలకొంది.
Nindu Noorella Saavasam Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో అరుంధతిని చూసి కంగారు ఏమిటి, ఎందుకు చెమటలు పడుతున్నాయి అని అడుగుతుంది మిస్సమ్మ.
అరుంధతి: ఏమీ లేదు అని భయపడుతూనే వెనక్కి చూస్తుంది. మిస్సమ్మ కూడా అటువైపు చూస్తుంది అక్కడ ఉన్న బొమ్మను చూసి ఘోర గీసిన గీత దాటి లోపలికి వచ్చి బొమ్మని పట్టుకుంటుంది. అది చూసి ఆశ్చర్య పోతుంది అరుంధతి. వెంటనే తను కూడా గీత దాటి బయటికి వచ్చేస్తుంది.
మిస్సమ్మ: అయినా మీరేంటి ఇక్కడ ఉన్నారు, పిల్లల్ని వదిలి ఉండలేకపోతున్నారా అంటుంది.
నిజం తెలిసిపోయిందేమో అని అనుకుంటుంది అరుంధతి.
అరుంధతి: నీకు నిజం తెలిసిపోయిందా? ఎలా తెలుసు అని కంగారుగా అడుగుతుంది.
మిస్సమ్మ : మీ పిల్లలు కూడా ఇక్కడే చదువుతున్నారు అని తెలుసుకోవడం పెద్ద విషయం ఏమీ కాదు అంటుంది.
నిజం తెలియనందుకు సంతోషిస్తుంది అరుంధతి. సరే పిల్లల దగ్గరికి వెళ్దాం అని మిస్సమ్మ అనడంతో నాకు పని ఉంది అని అక్కడి నుంచి పారిపోతుంది అరుంధతి.
మరోవైపు దిగులుగా ఉన్న నీలపై నీళ్లు చల్లుతాడు చిత్రగుప్తుడు.
నీల : బయట మీ పనే బాగుంది లోపల నాకు వాచిపోతుంది. నాకు తెలిసిన విషయం పదిమందికి చెప్పకపోతే నాకు కడుపు పొంగిపోతుంది. అదేం కర్మో ఇంట్లో సీక్రెట్ లన్ని నాకే తెలుస్తాయి అంటుంది.
చిత్రగుప్తుడు : ఆమెకి పెళ్లయింది అన్న విషయమేనా అంటాడు.
అది మాత్రమే కాదు ఆమెకి బిడ్డ కూడా ఉందని నా అనుమానం అంటూ జరిగిందంతా చెప్తుంది నీల. ఆమె గతం కూడా తెలుసుకోవాలని ఉంది అంటుంది.
చిత్రగుప్తుడు : సమయం వచ్చినప్పుడు అన్ని అవే తెలుస్తాయి అని అంటూ ఉండగానే పరిగెత్తుకుంటూ వస్తున్న అరుంధతిని చూసి కంగారుగా ఆమె దగ్గరికి వెళ్తాడు.
చిత్రగుప్తుడు: ఏమైంది పిల్ల పిచ్చుక పరీక్ష బాగా రాసినదా అని అడుగుతాడు.
అరుంధతి: కంగారుపడుతూ ఘోర సంగతి చెప్తుంది.
చిత్రగుప్తుడు: కంగారు పడిపోతూ అక్కడికి కూడా వచ్చాడా దుర్మార్గుడు అంటాడు.
వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటే అయోమయంగా చూస్తుంది నీల.
నీల: నేను ఇక్కడ ఉంటే నువ్వు అక్కడ ఎవరితో మాట్లాడుతున్నావు అని గట్టిగా ప్రశ్నిస్తుంది. ఇంతలో అమరేంద్ర కార్ రావటంతో ఎక్కడి వాళ్ళు అక్కడ కామ్ అయిపోతారు.
అమర్ కూతుర్ని తీసుకొని లోపలికి వెళ్తే మిస్సమ్మ మాత్రం చెట్టు చాటున ఉన్న అరుంధతిని చూస్తుంది.
మిస్సమ్మ: అరుంధతి దగ్గరికి వెళ్లి పాప ఎగ్జామ్ పాస్ అయింది రేపే వచ్చి స్కూల్లో జాయిన్ అవ్వమన్నారు అని చెప్తుంది.
ఆనందపడుతుంది అరుంధతి. మిస్సమ్మ ఎవరితో మాట్లాడుతుందో అర్థం కాక మరింత కన్ఫ్యూజ్ అవుతుంది నీల. ఇక్కడ ఏదో జరుగుతుంది అని కంగారుగా లోపలికి వెళ్ళిపోతుంది.
మిస్సమ్మ: మీరు ఇక్కడే ఉండండి నేను స్వీట్స్ తీసుకుని వస్తాను అని చెప్పి ఇంటి లోపలికి వస్తూ ఉంటుంది.
అదే సమయంలో దిష్టి తీసి మరీ అంజూని ఇంట్లోకి తీసుకు వెళ్తుంది ఆమె నానమ్మ.
నానమ్మ : చూసావా శ్రద్ధగా చదివితే ఎంత బాగా రాసావో, ఇలాగే బాగా చదువుకొని మీ నాన్నకి మంచి పేరు తీసుకురా.
తాతయ్య: అమ్మ పేరు చెప్పు ఇంకా బాగా చదువుతుంది అని భార్యతో అంటాడు. అంజుతో మాట్లాడుతూ నీకు అమ్మ అంటే ఇష్టం కదా అందుకే అమ్మ ఫోటో తెచ్చాను ఆశీర్వచనం తీసుకో అని ఫోటో టేబుల్ పై పెడతాడు.
ఫోటోను చూసిన అంజు బాగా ఎమోషనల్ అవుతుంది.
అంజు: మీకు మాటిచ్చినట్లే నేను ఎగ్జామ్ పాస్ అయ్యాను.. అడ్మిషన్ తెచ్చుకున్నాను. నువ్వుంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యే దానివి. ఐ మిస్ యు అని ఎమోషనల్ అవుతూ ఫోటో పట్టుకొని ఏడుస్తుంటే అమర్ నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి ఆమెని ఎత్తుకొని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడే ఇంట్లోకి వస్తుంది మిస్సమ్మ. ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్లిపోవడంతో ఏం జరిగిందో తెలియక మళ్ళీ అరుంధతి వాళ్ళ దగ్గరికి వెళుతుంది. అంజలిని ప్రిన్సిపాల్ ఎలా మెచ్చుకున్నది ఆనందంగా చెప్తూ ఉంటుంది.
చిత్రగుప్తుడు: పిల్ల పిచ్చుక పరీక్ష బాగా రాసినందుకు కన్నతల్లి కన్నా ఎక్కువగా ఆనంద పడుతున్నావు అంటాడు.
మిస్సమ్మ: నాకు అదే అర్థం కావడం లేదు.. పాప నాకు ఏమీ బ్లడ్ రిలేషన్ కాదు అయినా ఈ ఆనందం ఎందుకో అర్థం కావడం లేదు అని అంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.