Nindu Noorella Saavasam Serial Today September 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: ఐసీయూలో అంజలి – కండీషన్ సీరియస్ అన్న డాక్టర్లు
Nindu Noorella Saavasam serial Today Episode September 10th: బుల్లెట్ గాయాలతో ఐసీయూలో ఉన్న అంజలి కండీషన్ సీరియస్‌గానే ఉందని డాక్టర్లు చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: ఉగ్రవాదులు అమర్ ను కాల్చబోతే అంజు అడ్డుగా వస్తుంది. దీంతో అంజుకు బుల్లెట్స్ తగులుతాయి. అప్పుడే అక్కడకు వచ్చిన మిలటరీ వాళ్లు ఉగ్రవాదులను పట్టుకుని వెళ్తుంటారు.
ఉగ్రవాది: అమరేంద్ర తప్పించుకున్నానని సంతోష పడకు నీ ఫ్యామిలీకి ఇంకా థ్రెట్ ఉంది. నీ ఫ్యామిలీని చంపమని ఒక లేడీ మాకు ఫోన్ చేసి చెప్పింది మా నుంచి తప్పించుకున్నా ఆ లేడీ నుంచి మా ఫ్యామిలీ తప్పించుకోలేదు. మీ ఫ్యామిలీని మొత్తం ఆ లేడీ చంపేస్తుంది
అని చెప్తుండగానే మిలటరీ వాళ్లు వాణ్ని బయటక తీసుకెళ్తారు. అమర్ అంజును ఎత్తుకుని కిందకు పరెగెడతాడు. రాథోడ్ కారు తీసుకుని వస్తాడు. అందరూ అంజును తీసుకుని హాస్పిటల్‌కు వెళ్తారు. మరోవైపు యమలోకంలో ఉన్న విచిత్రగుప్తుడు ఆరును గుర్తు చేసుకుని ఎలా ఉందో చూడాలని మాయా దర్పణం ఓపెన్ చేస్తాడు. అందులో ఆరును చంభా హింసించింది. గణపతి వచ్చి కాపాడింది తర్వాత అంజుకు బుల్లెట్ తగిలింది చూస్తాడు. ఇంతలో యముడు వచ్చి గుప్తను తిట్టి వెంటనే భూలోకం వెళ్లు అని చెప్తాడు. ఎందుకు అని గుప్త అడగ్గానే అక్కడకు వెళ్లగానే.. నీ కర్తవ్యం నీకు తెలుస్తుంది అని చెప్తాడు. మరోవైపు మనోహరి దగ్గరకు రణవీర్ వెళ్తాడు.
రణవీర్: మొత్తానికి మనం సాధించాం మనోహరి
మను: మనం అని నిన్ను కూడా కలుపుకుంటావేంటి..? సాధించింది నేను గెలిచింది నేను
రణవీర్: మనం ఒక్కటి కాదా..? మనోహరి.. నీ గెలుపు నా గెలుపు కాదా..?
మను: నేను భాగీని టార్గెట్ చేస్తే అంజలి బలైంది. భాగీకి తగలాల్సిన బుల్లెట్ అంజలికి తగిలింది.
రణవీర్: అది కూడా మన మంచికే కదా మనోహరి. ఈరోజు ఆ పిల్ల చస్తే రేపు కోర్టులో దాని డెత్ సర్టిఫికెట్ సబ్మిట్ చేసి నా ఆస్తిని నేను దక్కించుకుంటాను.
మను: అరుంధతి చిన్న కూతురు నీకు ఈ రకంగా ఉపయోగపడుతుంది అన్నమాట. పాపం తన ముద్దుల కూతురు చావబోతుందని తెలిసి అరుంధతి ఆత్మ ఎంతలా ఏడుస్తుందో
రణవీర్: ఏడుపు ఎందుకు చచ్చాక ఎలాగూ తల్లీ కూతుళ్లు ఒకే దగ్గర ఉంటారు కదా
మను: కరెక్టే రణవీర్ ఒక రకంగా తల్లీ కూతుళ్లను కలిపి నేను పుణ్యం చేస్తున్నాను. తల్లినీ నేనే చంపాను.. పిల్ల చావుకు నేనే కారణం అవుతున్నాను.
రణవీర్: అవును ఆ తల్లీ కూతుళ్లు మళ్ళీ పుట్టే వరకు నిన్నే తలుచుకుంటారు.
మను: వెటకారంగా అంటున్నావా..?
రణవీర్: ఏం లేదు తల్లీకూతుళ్లను కలిపిన పుణ్యం దక్కుతుందని నువ్వన్న మాటే నీకు చెప్తున్నాను.. నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మరి నీ అడ్డు ఎలా తొలగించుకోబోతున్నావు..
మను: ఏముంది ఆ పిల్ల చావగానే.. దాని చావుకు కారణం భాగీనే అని చెప్తాను. ఆ అపార్ట్‌మెంట్‌కు భాగీనే తీసుకెళ్లిందని చెప్పి అమర్‌ను రెచ్చగొడతాను దీంతో అమరే, భాగీని తన్ని తరిమేస్తాడు..
అంటూ మను హ్యాపీగా ఫీలవుతుంది. మరోవైపు అమర్ వాళ్లు ఐసీయూ దగ్గర నిలబడి ఉంటారు. ఇంతలో డాక్టర్ బయటకు వస్తాడు.
అమర్: డాక్టర్ పాప కండీషన్ ఎలా ఉంది.
డాక్టర్: పాప కండీషన్ చాలా క్రిటికల్ గానే ఉంది. (అందరూ షాక్ అవుతారు.) బుల్లెట్ హార్ట్ పక్కన ఉంది. ఇమ్మిడియేట్‌గా సర్జరీ చేసి బుల్లెట్ రిమూవ్ చేయాలి. సర్జరీ చేయాలంటే బ్లడ్ కావాలి
అమర్: మీ హాస్పిటల్ లో ఆ బ్లడ్ గ్రూప్ లేదా డాక్టర్
డాక్టర్: పాప బ్లడ్ గ్రూప్ ఏబీ నెగెటివ్.. అది చాలా రేర్ గ్రూప్ వందలో ఒక్కరికి మాత్రమే ఉంటుంది. 24 గంటల్లోపు పాపకు సర్జరీ చేయాలి లేదంటే పరిస్థితి మా చేయి దాటిపోతుంది.
అంటూ డాక్టర్ చెప్పి వెళ్లిపోతాడు. డాక్టర్ మాటలకు అందరూ బాధపడుతుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















