Nindu Noorella Saavasam Serial Today October 15th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: మనుకు వార్నింగ్ ఇచ్చిన భాగీ – ఆరును హెచ్చరించిన గుప్త
Nindu Noorella Saavasam Today Episode: అంజు కోసం ఆరు స్వయంగా చేసిన గిఫ్ట్ ఇవ్వబోతుంటే గుప్త అడ్డుపడతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Nindu Noorella Saavasam Serial Today Episode: పిన్ను కోసం మనోహరి రూంలోకి వచ్చిన అమ్ముకు మనోహరి స్వీట్ వార్నింగ్ ఇస్తుంది. ఇంకోసారి రూంలోకి వచ్చిన్నప్పుడు పర్మిషన్ తీసుకుని రావాలని చెప్తుంది. ఘోర కనకబడకుండా తాను చాటుగా ఉండి అమ్మును బయటకు పంపిస్తుంది మనోహరి. సరే ఆంటీ అని అమ్ము ఆలోచిస్తూ వెళ్లిపోతుంది.
మనోహరి: ఏంటి ఘోర ఇది అమ్ము ఏంటి అలా అంది. నువ్వు ఉన్నావని అనుమానం వచిందా ఏంటి?
ఘోర: అనుమానం రాలేదు కానీ మనసుకు అర్థం అయింది. నేను తనను వశపరుచుకున్నాను కదా? అందుకే ఈ మంత్రించిన పొడి దగ్గరకు రాగానే తనకు అలా అనిపించింది.
మనోహరి: అరుంధతిని చంపడానికి కూడా నేను ఇంత కష్టపడలేదు ఘోర. దీన్ని బంధించే సరికి నా ప్రాణం పోయేలా ఉంది.
అని మాట్లాడుకుంటుంటారు. మనోహరి రూంలోంచి బయటకు వచ్చిన అమ్ము స్టెప్స్ దగ్గర కూర్చుని ఆలోచిస్తుంది. ఇంతలో భాగీ వస్తుంది. పిన్ను తీసుకురమ్మంటే ఇక్కడ కూర్చున్నావేంటి అని అడుగుతుంది. మనోహరి రూంలో జరిగింది చెప్తుంది అమ్ము. సరే అంజును రెడీ చేశాక అడుగుతానని చెప్తుంది భాగీ. మరోవైపు గార్డెన్ లో కూర్చున్న ఆరు రణవీర్ రావడం చూసి కోప్పడుతుంది.
ఆరు: విధి చూశారా? గుప్త గారు ఎన్ని నాటకాలు ఆడుతుందో.. దూరం చేసిన వాళ్లను ఒక్కచోటకు చేరుస్తుంది. ఒకటి చేయాలని చూస్తున్నట్టుంది.
గిఫ్ట్ బాక్సుతో లోపలికి వెళ్లిన రణవీర్‌ను చూసి అమర్ పలకరిస్తాడు. అమర్ చేతిలోని అంజు లాకెట్‌ను చూపిస్తుంటే నిర్మల వచ్చి చైన్ తీసుకుని వెళ్లిపోతుంది. మరోవైపు గుప్త, ఆరును తిడుతుంటాడు.
గుప్త: బాలిక నా మాటను పెడచెవిన పెట్టి ఏమి చేయుచున్నావు.
ఆరు: చెప్పాను కద గుప్త గారు అంజు పాపకు గిఫ్ట్ ఇవ్వడానికి అని
గుప్త: నువ్వు ఎటువంటి పనులు చేయకు అంటున్నాను.
ఆరు: గుప్త గారు పోయిన జన్మలో మీరేమైనా హాస్టల్ వార్డెన్ గా పుట్టారా ఏంటి. ఎందుకు ఎప్పుడు అది చేయకు ఇది చేయకు అంటుంటారు.
గుప్త: బాలిక నువ్వు నన్ను ఏమి అనుకున్నా పర్వాలేదు. నీకు ఎటువంటి ప్రమాదం ఉందో నీకు తెలియడం లేదు.
అని గుప్త హెచ్చిరస్తుంటే నీకు తల్లి ప్రేమ తెలియడం లేదు అంటుంది. ఇంతలో గుప్త బాధతో నా భయం నీకు అర్థం కావడం లేదు అని గుప్త ఎంత చెప్పినా ఆరు వినదు. గిఫ్ట్ తీసుకుని వెళ్తాను అని చెప్తుంది. మరోవైపు ఘోర మంత్రించిన పొడిని మనోహరికి ఇస్తాడు.
ఘోర: ఆ ఆత్మతో ఈ పొడిని ముట్టుకునేలా చేస్తే.. ఆ ఆత్మ బంధీగా అయిపోతుంది. నేను వెంటనే ఆత్మను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోతాను.
మనోహరి: ఆత్మ ఈ పొడిని ముట్టుకునేలా చేస్తాను. నువ్వు బయట ఉండి బంధించలేవా?
ఘోర: అది ఎంత ప్రమాదమో చెప్పాను కదా మనోహరి. అసలే ఆత్మకు స్పర్శ శక్తి కూడా వచ్చింది.
మనోహరి: ఆత్మతో ఎలా అయినా ఉండొచ్చు. కానీ అమర్‌కు తెలిస్తే మనల్ని ఇక్కడే చంపేస్తాడు.
అని మనోహరి భయపడటంతో ఘోర ధైర్యం చెప్తాడు. దీంతో సరే నేను బయట లాక్ చేసుకుని వెళ్తాను నువ్వు ఇక్కడే ఉండు అని బయటకు వెళ్లి డోర్ లాక్ చేస్తుంది. వెనక నుంచి భాగీ చూస్తూ ఇంట్లో ఏం దాస్తున్నావు మనోహరి అని అడుగుతుంది. దీంతో మనోహరి షాక్ అవుతుంది. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. మనోహరి వెళ్లిపోతుంది. బర్తుడే పార్టీ అయిన వెంటనే మనోహరి సంగతి చూడాలని అనుకుంటుంది భాగీ. మరోవైపు ప్యారెట్ బొమ్మ తయారు చేసిన ఆరు గత సంవత్సరం జరిగిన బర్తుడే వేడుకలను గుర్తు చేసుకుంటుంది. తర్వాత గిఫ్ట్ ఇవ్వడానికి ఆరు వెళ్తుంటే గుప్త అడ్డుపడతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.