అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today May 5th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరే తన భార్య అన్న రణవీర్‌ - షాక్‌లో అమరేంద్ర

Nindu Noorella Saavasam serial Today Episode May 5th: మనోహరి గురంచి నిజం తెలుసుకున్న అమర్‌ రణవీర్‌కు కాల్‌ చేయడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: బాబ్జీ యాక్సిడెంట్‌ విషయంలో అమర్‌ను కలిసిన ఎస్సై అమర్‌కు నిజం చెప్తాడు. అరుంధతి యాక్సిడెంట్‌ లో చనిపోలేదని.. కావాలనే మర్డర్ చేయించారని ఆ మర్డర్‌ చేయించిన వ్యక్తి ఎవరో కాదు మనోహరేనని ఆ నిజం మీకు చెప్పడానికి వస్తే భాగీ వద్దని పంపించేశారని చెప్తాడు. అమర్‌ షాక్‌ అవుతాడు. పై నుంచి చూస్తున్న గుప్త హ్యాపీగా ఫీలవుతాడు.

అమర్: ( మనసులో) ఎంత పని చేశావు భాగీ నా కోసం మీ అక్కను చంపిన హంతకురాలిని క్షమించేశావా..? నీకు నిజం తెలిసి కూడా ఆ మనోహరిని ఇన్నాళ్లు భరిస్తున్నావా..?

గుప్త:  ఎట్టకేలకు అమరేంద్రకు నిజం తెలిసినది మహర్షి. ఆ దుష్టబాలికి గురించి సమస్తము అవగతం అయినది

నారదుడు:  ఏంటి విచిత్రగుప్త అమరేంద్రుడి కంటే నీవే ఎక్కువ సంతోషిస్తున్నావు

గుప్త: ఈ క్షణం వరకు మేము ఎన్నో దినములుగా వేచి ఉన్నాము మహర్షి. ఆ దుష్ట బాలిక చేసిన దురాగతములు అన్నియు ఇన్నియు కాదు. మా ప్రభువుల చేతిలో యమపాశము మా చేతిల్లో పాపుల శిక్షాసృతి ఉన్ననూ మేము నిస్సహాయులమై ఈ దుష్ట బాలిక ఘోర కృత్యములను వీక్షించవలసి వచ్చినది

నారదుడు: విధి రాతను మీరు మాత్రము ఏం చేయగలరు గుప్త..

గుప్త: మహర్షి ఇప్పుడు ఈ అమరేంద్రుడు ఏమి  చేయును. ఆ దుష్ట బాలికకు బుద్ది వచ్చేలా చేయునా..? అటులైనచో నరకము కంటే మునుపే ఆ దుష్ట బాలికకు శిక్ష పడును.. అరుంధతి ఆత్మ సంతోషించును

నారదుడు నవ్వుతాడు.

గుప్త: ఎందులకు మహర్షి నవ్వుతున్నారు

నారదుడు: నువ్వు ఎంత అల్ప సంతోషివి గుప్త. పాపుల పాపములను లెక్కించి శిక్షలు వేయించే నువ్వు ఒక పాపికి ఈ భూలోకములోనే శిక్ష పడాలని తొందరపడుతున్నావు..

గుప్త: ఆ దుర్మార్గులు చేసిన పాపములు, ఘోర కృత్యములు అటువంటివి మహర్షి. అమరేంద్రకు నిజం తెలిసినది కాబట్టి ఆ బాలికకు శిక్ష తప్పదు

నారదుడు: ప్రకృతి ధర్మం తెలిసి కూడా మైమరచి మాట్లాడుతున్నావు విచిత్రగుప్త. నేరానికి శిక్షకు మధ్య వ్యవధి ఉండును

గుప్త: అయినచో అమరేంద్రకు నిజం తెలిసినచో ఆ మనోహరిని శిక్షించడా మహర్షి

నారదుడు: వాస్తవానికి అటులనే జరగవలెను కానీ విధి సంకల్పం వేరులా ఉన్నది.. అందుకే మరోలా జరగనున్నది

గుప్త: మరోలా అనినా..? ఏమి జరుగును మహర్షి

నారదుడు: దుష్టులకు శిక్ష పడవలెనని మనం ఎంతగా కోరుకుంటామో ఆ శిక్ష నుంచి తప్పించుకోవాలని ఆ దుష్టులు కోరుకుంటారు విచిత్రగుప్త

గుప్త: అనినా ఆ మనోహరి తప్పించుకోబోతున్నదా..?

నారదుడు: కాదు తప్పు చేయబోతున్నది..

గుప్త: మరలా తప్పు చేయబోతున్నదా..? ఏంటా తప్పు మహర్షి

నారదుడు: అవును ఆ తప్పు ఆ అమరేంద్రకు ముప్పు తీసుకురాబోతున్నది

గుప్త భయపడుతుంటాడు. ఎస్సై నిజం చెప్పగానే.. అమర్‌, మనోహరి ఇంట్లో తిరిగిన విషయాలు, మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటూ అరుందతి చనిపోయిన ప్లేస్‌కు వెళ్తుంటాడు. అంతా చెట్టుచాటు నుంచి గమనించిన మనోహరి భయపడుతుంది. అప్పుడే అమర్‌ ఎస్సైకి కాల్ చేసి రణవీర్‌కు ఇవ్వమంటాడు.

రణవీర్‌: చెప్పు అమరేంద్ర నా వైఫ్‌ ఎవరో కనిపెట్టావా..?

అమర్‌: మనోహరే కదా నీ భార్య

రణవీర్‌, మనోహరి షాక్‌

రణవీర్‌: నువ్వు చాలా స్మార్ట్‌ అమరేంద్ర.. చిన్న క్లూ ఇవ్వగానే.. మొత్తం కనిపెట్టావు. ఆ మనోహరే నా భార్య.. సారీ నా ఎక్స్‌ వైఫ్‌ ఇన్నాళ్లు నీ పక్కన ఉండి నన్ను కాపాడింది. తనను తాను కాపాడుకుంది.

అమర్‌: నాకో విషయం తెలియాలి. మనోహరి ఎందుకు ఇదంతా చేసింది.

రణవీర్‌: సింపుల్‌ మనోహరికి నువ్వుంటే ఇష్టం. కానీ నువ్వు అరుంధతిని పెళ్లి చేసుకున్నావు అప్పుడు మొదలైంది తన పగ.

అని రణవీర్‌ చెప్పగానే.. అమర్‌ షాక్‌ అవుతాడు. మనోహరిని తిట్టుకుంటుంటే.. మనోహరి అంతా విని ఇక అమర్‌ను చంపేయాలని డిసైడ్‌ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today July 18th: నిండు మనసులు: కలిసిపోదాం గణ.. అర్థం చేసుకో.. ప్రేరణ ప్రపోజల్‌ని గణ ఒప్పుకుంటాడా!
నిండు మనసులు: కలిసిపోదాం గణ.. అర్థం చేసుకో.. ప్రేరణ ప్రపోజల్‌ని గణ ఒప్పుకుంటాడా!
Karthika Deepam 2 Serial Today July 18th: కార్తీకదీపం 2 సీరియల్: అత్తని ఓడించడానికి పోటీకి దిగిన అక్కాచెల్లెళ్లు! దీప, జ్యోత్స్న ఒకటిగా వంటలు చేస్తారా!
కార్తీకదీపం 2 సీరియల్: అత్తని ఓడించడానికి పోటీకి దిగిన అక్కాచెల్లెళ్లు! దీప, జ్యోత్స్న ఒకటిగా వంటలు చేస్తారా!
Nindu Noorella Saavasam Serial Today July 18th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చేయడానికి వచ్చిన స్వామిజీ – స్వామిజీని చూసి భయపడ్డ మనోహరి
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చేయడానికి వచ్చిన స్వామిజీ – స్వామిజీని చూసి భయపడ్డ మనోహరి
Nuvvu leka Neanu Lenu Serial Today July 18th:రాధపై దాడి చేసిన వారిని కనిపెడతానని విక్కీ శపథం...మేనల్లుడికి మాటలకు అదిరిపడిన దమయంతి
నువ్వులేక నేను లేను: రాధపై దాడి చేసిన వారిని కనిపెడతానని విక్కీ శపథం...మేనల్లుడికి మాటలకు అదిరిపడిన దమయంతి
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sonam Wangchuk:సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
US Iran War Updates 2026: ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Prashant Kadiyam: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
What Is Stair Test For Heart Blockage: మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసమా? సాధారణ అలసట అనుకుంటే ప్రమాదమే!
మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసమా? సాధారణ అలసట అనుకుంటే ప్రమాదమే!
YS Jagan Digital Politics: డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
Embed widget