అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today June 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అరుంధతి ఆత్మ ఇంట్లోనే ఉందన్న నిజం తెలుసుకున్న మనోహరి - మిస్సమ్మను అర్థం చేసుకున్న అమ్ము

Nindu Noorella Saavasam Today Episode: అమర్ ఇంటికి వచ్చిన మంగళ, మనోహరికి ఈ ఇంట్లో అరుంధతి ఆత్మ తిరుగుతుందని చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరుగుతుంది.

Nindu Noorella Saavasam Serial Today Episode:  మిస్సమ్మ వాళ్ల నాన్న, మంగళ ఊరు నుంచి వస్తారు. మిస్సమ్మ హ్యాపీగా ఫీలవుతుంది. ఇప్పుడే మీ గురించి అక్కతో చెప్తున్నాను అంతలోనే మీరొచ్చారని అంటుంది మిస్సమ్మ. దీంతో అక్క ఎవరని అడగ్గానే పక్కింటి అక్క అని మీకు ఇప్పుడే పరిచయం చేస్తాను అని మిస్సమ్మ పక్కకు చూడగానే అరుంధతి కనిపించదు. ఎప్పుడూ చూసినా ఎవరికైనా పరిచయం చేద్దామంటే కనబడకుండా వెళ్లిపోతుందేంటి? అనుకుంటుంది మిస్సమ్మ. ఇంతలో మిస్సమ్మ ఫాథర్స్‌ డే శుభాకాంక్షలు చెప్పి లోపలికి వెళ్తుంది. ఇంతలో అరుంధతి వచ్చి పాథర్స్‌ డే శుభాకాంక్షలు చెప్తుంది. ఇక లోపలికి వెళ్లగానే పిల్లలందరూ తాతయ్యా అంటూ వెళ్లి హ్యపీగా ఫీలవుతారు.

శివరాం: ఏంటి బావగారు ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది.

మిస్సమ్మ ఫాథర్‌: బాగుంది బాబుగారు.

శివరాం: భలే టైంకు వచ్చారు బావగారు. ఇవాళ పాథర్స్‌ డే అందరం జరుపుకుంటున్నాం. మిస్సమ్మకు మీరు తోడు లేరని అనుకుంటున్నాం. ఇంతలో మీరు వచ్చారు.

మిస్సమ్మ ఫాథర్‌: ఇందాకే చెప్పింది బాబుగారు.

అమర్: అమ్మా నాకు కొంచెం వర్క్‌ ఉంది నేను వెళ్లేసి వస్తాను.

మంగళ: ఒక్క నిమిషం బాబు..

మిస్సమ్మ: ఏమైంది నాన్నా ఆయనతో ఏమైనా చెప్పాలా?

మిస్సమ్మ ఫాథర్‌: ఏమీ లేదమ్మా అదంతా ముఖ్యమైన విషయం ఏం కాదులే..

మంగళ: చల్లకొచ్చి ముంత దాచినట్టు.. మాట్లాడటానికి వచ్చి ఇప్పుడు కాదంటున్నావు.

మిస్సమ్మ: ఏమైంది నాన్నా ఏమైనా సమస్యా

అని మిస్సమ్మ అడగ్గానే మేం బతకడానికి మేం కష్టపడక తప్పదు కదా బాబు ఈయన మళ్లీ స్కూల్‌లో వాచ్‌మెన్‌గా చేరాలని అనుకుంటున్నాడు. కాకపోతే మీ పిల్లలు చదివే స్కూల్‌ కదా అందుకనే అడగడానికి వచ్చాము బాబు. అని మంగళ చెప్తుంది. దీంతో మిస్సమ్మ వద్దని చెప్తుంది. నిర్మల, శివరాం కూడా వద్దని మేము చూసుకుంటామని చెప్తారు. దీంతో మిస్సమ్మ ఫాథర్‌ వద్దని చెప్తాడు. ఇప్పుడు నా ఆరోగ్యం బాగుందని ఏదో ఒక పని చేసుకుంటేనే మాకు ఆనందంగా ఉంటుందని చెప్తాడు.

మిస్సమ్మ: ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నారు. పెళ్లి చేసుకుంటే కూతురు అమ్మానాన్నల బాధ్యత చూసుకోకూడదా?

మిస్సమ్మ ఫాథర్‌: ఇప్పుడు నీ పని నన్ను చూసుకోవడం కాదమ్మా ఈ ఇంటిని ఈ ఇంట్లో వాళ్లను చూసుకోవడం. వీళ్ల తర్వాతే నీకు ఎవరైనా.. ఆఖరికి నేనైనా..

అమర్‌: నేను మిమ్మల్ని చూసుకుంటానండి. ఈ మాట నేను మీ కూతురు మెడలో తాళి కట్టినందుకు చెప్పడం లేదండి. నేను అభిమానించే వ్యక్తిగా చెప్తున్నాను. నా భార్యకు నాన్నను అని మీరనుకున్నందుకు చెప్తున్నాను.

అని అమర్‌ చెప్పగానే అందరూ హ్యాపీగా ఫీలవుతారు. మరోవైపు మనోహరి సీరియస్‌గా ఆలోచిస్తుంది. ఇంతలో మనోహరి రూంలోకి మంగళ వస్తుంది. మనోహరి, మంగళను తిడుతుంది. రెండు పడవల మీద కాలు పెడితే నీకే ప్రమాదం అంటూ హెచ్చిరిస్తుంది. దీంతో నేనెప్పుడూ నీ పడవలోనే ఉన్నాను అని చెప్తుంది మంగళ.

మంగళ: అది సరే కానీ నేను మొన్న ఫోన్‌లో చెప్పిన విషయం ఏమైంది.

మనోహరి: ఏ విషయం?

మంగళ: అదే ఆరుంధతి ఆత్మ ఇక్కడ తిరగడం గురించి.. కచ్చితంగా ఆత్మ ఇక్కడే ఉంది మనోహరి. ఇందాక కూడా ఆ భాగి ఆత్మతోనే మాట్లాడిందేమో అనిపించింది.

మనోహరి: అరుంధతి ఇక్కడే ఉంటే నేను చేసినవన్నీ చేసేటివన్నీ ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది. మరి అలాంటప్పుడు ఎందుకు నన్నేం చేయడం లేదు. నిజంగా అది ఇక్కడే ఉందా లేదా?

అని మనోహరి అనగానే మంగళ ఆత్మకు మనిషిని ఏమైనా చేసే శక్తి ఉంటుందా? అని అడగ్గానే వెంటనే మనోహరికి మిస్సమ్మ, అమ్ము మాట్లాడిన మాటలు గుర్తుకు వస్తాయి దీంతో మనం వెంటనే ఘోరాను కలవాలని అంటుంది. మరోవైపు కిచెన్‌లో మిస్సమ్మ వంట చేస్తుంటే అమ్ము వస్తుంది. ఏదైనా కావాలా అమ్ము అని మిస్సమ్మ అడగ్గానే అమ్ము మిస్సమ్మను తిడుతుంది. అయితే పెళ్లి రోజు ఏం జరిగిందో నాకు గుర్తు లేదు అనగానే అమ్ము అయితే ఆరోజు ఏం జరిగిందో నీకు గుర్తు లేదు. నిన్న ఏం జరిగిందో నాకు గుర్తు లేదు అనగానే మిస్సమ్మ షాక్‌ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది. 

ALSO READ: అమలా పాల్ డెలివరీకి అంతా రెడీ - బంప్ వీడియోకి బ్యాడ్ కామెంట్స్, నెటిజనులకు అది తెలియదా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Sandesara brothers: వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
Viraansh Bhanushali: ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
Tarique Rahman: బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!

వీడియోలు

రికార్డులు సృష్టిస్తున్నా ఐపీఎల్ ఛాన్స్ రాని బ్యాటర్ సకిబుల్ గని
బుమ్రా, పంత్ తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారన్న బవుమా
విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల మోత.. ఒక్క రోజే 22 సెంచరీలు
సీసీటీవీల్లో రికార్డ్ చేశారా? బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్
Rohit Sharma Century Mumbai vs Sikkim | Vijay Hazare Trophy 2025 తొలి మ్యాచ్ లో ముంబై ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Sandesara brothers: వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
Viraansh Bhanushali: ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
Tarique Rahman: బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
New Kia Seltos: అనంతపురం కేంద్రంగా కొత్త కియా సెల్టోస్ ఉత్పత్తి ప్రారంభం! కొత్త సంవత్సరంలో విడుదల! దాని స్పెషాలిటీ తెలుసుకోండి!
అనంతపురం కేంద్రంగా కొత్త కియా సెల్టోస్ ఉత్పత్తి ప్రారంభం! కొత్త సంవత్సరంలో విడుదల! దాని స్పెషాలిటీ తెలుసుకోండి!
మోదీ, చంద్రబాబు కలిస్తే 2 కాదు.. 11 వీళ్లిద్దరూ అడుగేస్తే ఇక ఆపేదెవడు?
మోదీ, చంద్రబాబు కలిస్తే 2 కాదు.. 11 వీళ్లిద్దరూ అడుగేస్తే ఇక ఆపేదెవడు?
Dhandoraa OTT : ఆ ఓటీటీలోకి శివాజీ 'దండోరా' - ఎందులో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఆ ఓటీటీలోకి శివాజీ 'దండోరా' - ఎందులో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Unbreakable Cricket Records : క్రికెట్ చరిత్రలో ఈ 11 రికార్డులు బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యం! ఆ జాబితా ఇక్కడ చూడండి!
క్రికెట్ చరిత్రలో ఈ 11 రికార్డులు బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యం! ఆ జాబితా ఇక్కడ చూడండి!
Embed widget