అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today July 15th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అరుంధతి ఆత్మ ఇంట్లోనే తిరుగుతుందన్న పంతులు – పంతులు నిజం చెప్తాడేమోనని టెన్షన్ పడిన అమర్

Nindu Noorella Saavasam Today Episode: కొడైకెనాల్ నుంచి వచ్చిన పంతులు అమర్ ఇంట్లో అరుంధతి ఆత్మ తిరుగుతుందని చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode:  ఆరు అస్థికలు ఘోరకు ఇస్తానన్న  మనోహరి.. శివరాం, నిర్మల దగ్గరకు వెళ్లి ఇంట్లో ఏవేవో అశుభాలు జరుగుతున్నాయని ఆరు ఆస్థికలు గంగలో కలపలేదు కాబట్టే ఇలా జరుగుతున్నాయేమోనని చెప్తుంది. దీంతో నిజమేనన్న శివరాం, నిర్మల వెనక నుంచి వస్తున్న మిస్సమ్మను నువ్వేమంటావని అడుగుతారు. వెనక నుంచి వస్తున్న మిస్సమ్మను చూసి కంగారు పడుతుంది మనోహరి. మిస్సమ్మ, అమర్‌ ను అడిగి ఆయన ఏది చెబితే అది చేద్దాం అని చెప్తుంది. కిటికీలోంచి అంతా గమనిస్తున్న ఆరు బాధపడుతుంది.

మిస్సమ్మ: మనోహరి గారు నీలో ఇంత మంచి బుద్ది. నీ నోట్లో నుంచి ఇంత మంచి మాటలు, నీ బుర్రలోంచి ఇంత మంచి ఆలోచనలు వచ్చాయంటే నాకు ఎందుకో నమ్మబుద్ది కావడం లేదు. నువ్వేదో ప్లాన్‌ వేస్తున్నావనిపిస్తుంది.

మనోహరి: ప్లానా? ప్లానేంటి? అయినా అస్తికలతో నేనేం ప్లాన్‌ చేస్తాను. ఏదో మాట సాయం చేద్దామని చెప్పానంతే నచ్చితే చేయండి లేదంటే లేదు.

మిస్సమ్మ: ఆ సాయం అన్నావు చూడు అక్కడే నాకు తేడా కొట్టేస్తుంది. ఎందుకంటే నీది శాడిస్టు క్యారెక్టర్‌ మను. సాయం చేసే క్యారెక్టర్‌ కాదు.

   అని మిస్సమ్మ నిలదీయగానే దీనికి అనుమానం వచ్చినట్టు ఉంది. ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి అని మనసులో అనుకుని మిస్సమ్మకు ఊరడిపంపు మాటలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత కొడైకెనాల్ నుంచి గుడి పూజారి శర్మ అమర్‌ ఇంటికి వస్తాడు. అమర్‌కు ఫోన్‌ చేస్తాడు. అమర్‌ తాను ఆఫీసులో ఉన్నానని మీరు ఇంటి లోపలికి వెళ్లండి అని చెప్తాడు. తర్వాత పంతులు ఇంట్లోకి వెళ్తుంటే ఆరు ఆయనతో మాట్లాడుతుంది. కానీ ఆయన వినబడి వినబడనట్లు లోపలికి వెళ్లిపోతాడు.

శివరాం: నమస్కారం పంతులు గారు.. ఎలా ఉన్నారు.? ఎప్పుడొచ్చారు. ఏమైంది పంతులు గారు అలా చూస్తున్నారు.

పంతులు: అరుంధతికి సంబంధించి అన్ని కార్యక్రమాలు జరిపించారా?

శివరాం: జరిపించేశాం పంతులు గారు.

నిర్మల: పాలు పోయడం, పెద్ద కర్మ అన్ని శాస్త్ర  బద్దంగానే జరిపించాం పంతులు గారు.

పంతులు: మరి అస్థికలను పుణ్యనదుల్లో కలిపించారా?

నిర్మల: లేదు పంతులు గారు ఇంకా కలపలేదు.

శివరాం: మీరు ఇలా ఎందుకు అడిగారో తెలుసుకోవచ్చా?

పంతులు: అరుంధతి ఇక్కడే ఉంది. ప్రాణం విడిచినా పై లోకానికి వెళ్లకుండా మీ చుట్టే తిరుగుతున్నట్లు అనిపిస్తుంది.

నిర్మల: ఏంటి పంతులు గారు మీరు చెప్పేది.

పంతులు: నిజమమ్మా తన ఉనికి నాకు తెలుస్తుంది. తన కల నిజమైందని నా మాట అబద్దమైందని అడిగినట్లు అనిపించింది. కాదు కాదు నిలదీసినట్లు అనిపించింది.

 అని పంతులు చెప్పగానే అరుంధతి, శివరాం, నిర్మల షాక్‌ అవుతారు. పంతుల ఇదే నిజమని అరుంధతి ఇక్కడే ఉందని చెప్తాడు. దీంతో శివరాం, నిర్మల బాధపడతారు. పంతులు వారిని ఓదారుస్తాడు. అరుంధతి కూడా బాధపడుతుంది. మరోవైపు మనోహరి కోపంగా ఘోర దగ్గరకు వస్తుంది.

మనోహరి: చెప్పాను కదా ఘోర అస్థికలు తీసుకొస్తానని మళ్లీ ఎందుకు కలవాలని ఫోన్‌ చేశావు.

ఘోర: ఇది ఇవ్వడానికే పిలిచాను. ఇది తీసుకెళ్లి మీ ఇంటి గుమ్మానికి కట్టు.

మనోహరి: ఏంటిది ఇంటి గుమ్మానికి ఎందుకు కట్టమంటున్నావు. కడితే ఏమౌతుంది.

ఘోర: ఆ ఆత్మను బంధించడానికి ఆ ఆస్థికలు నీ చేతికి రావాలన్నా నువ్వు అనుకున్నది జరగాలన్నా.. నేను చేయాలనుకున్నది చేయాలన్నా ఇది మీ ఇంటి గుమ్మానికి ఉండాలి.

మనోహరి: ఇంతకు ముందులా పిచ్చి పిచ్చి పనులు చేయలేదు కదా?

ఘోర: లేదు మనోహరి ఇది కేవలం ఆ ఆత్మ మన పనికి అడ్డు రాకుండా ఉండటానికి చేసిందే..

 అని ఘోర చెప్పగానే  మనోహరి సరేనని ఆ తాయెత్తును తీసుకుని వెళ్తుంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లోకి తీసుకెళ్లకూడదు. గుమ్మానికి బయట కట్టి లోపలికి వెళ్లు. ఒకవేల లోపలికి తీసుకెళ్తే జరిగే పరిణామాలను ఎవరూ ఆపలేరు అని జాగ్రత్తలు చెప్పి పంపిస్తాడు. మరోవైపు పంతులు లోపలికి వెళ్లి కూర్చోగానే శివరాం మిస్సమ్మను టీ తీసుకురమ్మని చెప్తాడు. దీంతో అరుంధతి ఇప్పుడు పంతులు గారు మిస్సమ్మకు నిజం చెప్తే ఏం జరుగుతుందో అని కంగారుపడుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: శరత్ కుమార్ బర్త్ డే సర్‌ప్రైజ్ - నాథనాధుడి లుక్‌ రివీల్ చేసిన ‘కన్నప్ప‘ టీమ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telugu Politics: సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
Amaravati: రూ.11,467 కోట్లతో అమరావతి అభివృద్ధి పనులు - సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు
రూ.11,467 కోట్లతో అమరావతి అభివృద్ధి పనులు - సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు
PV Sindhu Wedding: పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే..?
పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే..?
Pushpa 2 Ticket Rates: ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

#UITheMovie Warner  Decode | Upendra సినిమా తీస్తే మరి అంత సింపుల్ గా ఉండదుగా.! | ABP DesamUnstoppable With NBK Season 4 Ep 6 Promo |  Sreeleela తో నవీన్ పోలిశెట్టి ఫుల్ కామెడీ | ABP Desamజగన్ కేసుల్లో పురోగతి! సుప్రీం  కీలక ఆదేశాలుఆసిఫాబాద్ జిల్లాలో పులుల దాడిపై ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telugu Politics: సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
Amaravati: రూ.11,467 కోట్లతో అమరావతి అభివృద్ధి పనులు - సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు
రూ.11,467 కోట్లతో అమరావతి అభివృద్ధి పనులు - సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు
PV Sindhu Wedding: పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే..?
పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే..?
Pushpa 2 Ticket Rates: ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
Metro Rail In Vizag and Vijayawada: విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
2024 Layoffs: డేంజర్ బెల్స్- ఆ ఉద్యోగులకు మాత్రం పీడకలగా మారిన 2024
డేంజర్ బెల్స్- ఆ ఉద్యోగులకు మాత్రం పీడకలగా మారిన 2024
Kickboxing: తెలంగాణలో కిక్‌ బాక్సింగ్‌కు గుర్తింపు లేదు, సహకారం కోసం లేదని ప్లేయర్స్ ఆవేదన
తెలంగాణలో కిక్‌ బాక్సింగ్‌కు గుర్తింపు లేదు, సహకారం కోసం లేదని ప్లేయర్స్ ఆవేదన
Tiruvannamalai Landslide: ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
Embed widget