Nindu Noorella Saavasam Serial Today February 15th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: హైదరాబాద్ వచ్చిన అనామిక – కేర్ టేకర్ ను పెట్టుకుందామన్న అమర్
Nindu Noorella Saavasam Today Episode: అనామిక హైదరాబాద్ వస్తుంది. జాబ్ చూసుకోవాలనుకుంటుంది. అదే టైంలో అమర్ పిల్లల కోసం కేర్ టేకర్‌ను చూడాలనుకుంటాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: కాళీ భోజనం చేసిన తర్వాత తాను సరస్వతి మేడంను చూడాలని ఆమెకు సారీ చెప్పాలని ఎక్కడ ఉన్నారని అడుగుతాడు. ఆమె హాస్పిటల్‌లో ఉందని వెళ్లి చూడమని చెప్తాడు అమర్
భాగీ: మనోహరి గారు మీకు అక్కకు అన్నం పెట్టిన దేవత సరస్వతి గారు హాస్పిటల్‌లో ఉంటే ఒక్కసారైన వెళ్లి చూసి రావాలని అనిపించలేదా మీకు.
మనోహరి: ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నారు ఇప్పుడే ఏం చెప్పాలి (అని మనసులో అనుకుని) ఎందుకు కలిసి రాలేదు. వీలు కుదిరినప్పుడల్లా వెళ్లి కలిసి చూసి వస్తున్నాను. అయినా నువ్వేంటి అంతా చూసిన దానిలా మాట్లాడుతున్నావు.
భాగీ: అది కాదు మనోహరి గారు. మీరు వార్డెన్ గారిని కలిసి ఉంటే ఆరు అక్క జీవితానికి ఒక దారి చూపించినట్టు.. మీకు మంచి దారి చూపించేది కదా..? అర్థం కాలేదా…? నీ పెళ్లి గురించి
కాళీ సిగ్గు పడుతుంటాడు.
మనోహరి: ఏయ్ ఇప్పుడు నా పెళ్లి టాపిక్ ఎందుకు నేను నిన్ను అడిగానా..? నాకు పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పు
శివరాం: అదేంటమ్మా మనోహరి పెళ్లి చేసుకోకుండా ఎంతకాలం ఈ ఇంట్లో ఉంటావు.. నీకు ఓ జీవితం కావాలి కదా
నిర్మల: అవునమ్మా మనోహరి ఆరు నీకు ఎంత ఫ్రెండ్ అయినా ఎంతకాలం అని నువ్వు ఒంటరిగా ఈ ఇంట్లో ఉంటావు. నీకు కూడా ఒక తోడు కావాలి కదా
మనోహరి: అది కాదు ఆంటీ….
అమర్: మనోహరి అమ్మవాళ్లు చెప్పింది నిజమే. నీ పెళ్లి గురించి నీ భవిష్యత్తు గురించి నేను కూడా ఆలోచించడం మానేశాను. మిస్సమ్మ నువ్వు నా కర్తవ్యాన్ని గుర్తు చేశావు థాంక్యూ..
భాగీ: ఏవండి మనోహరి గారికి ఒక కుటుంబాన్ని ఇవ్వడం మన బాధ్యత కదండి. తనకు ఓ మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేద్దాం
మనోహరి: అమర్ నాకు మీరందరూ ఉన్నారు నాకు ఇక పెళ్లి ఎందుకు ఏమీ వద్దు
అని చెప్తుంది. కాళీ మాత్రం మనోహరిని చూస్తూ సిగ్గుపడుతుంటాడు. మరోవైపు అనామిక హైదరాబాద్‌లోని తన అన్నయ్య ఇంటికి వస్తుంది. వదిన ప్రేమ ఉన్నట్టు నటిస్తూనే దాన్ని ఇక్కడి నుంచి వెళ్లగొట్టండి అని అన్నకు చెప్తుంది. అంతా గమనించిన అనామిక జాబ్ చూసుకుని రెండు రోజుల్లో వెళ్లిపోతానని చెప్తుంది. మరోవైపు కాళీ ఇంటికి వెళ్తుంటే మనోహరి కారుతో అడ్డం వెళ్తుంది.
కాళీ: ఎవర్రా నువ్వు.. అరే మన లేడీసూ..
మనోహరి: రేయ్ నువ్వు రణవీర్‌ను చంపేస్తే పెళ్లి చేసుకుంటానని చెప్పాను కదా..? మళ్లీ ఇంటికి వచ్చి బెదిరించడం ఏంట్రా.. ఓవర్ చేస్తే తాట తీస్తా..
కాళీ: నేనేం నీ కోసం రాలే నేను మా భాగీ కోసం వచ్చిన
మనోహరి: మరి నా పెళ్లి గురించి ఎందుకు అడిగావు.. నీ పెళ్లి గురించి ఎందుకు చెప్పావు. తగ్గాను కదా అని నన్ను బెదిరించాలనుకుంటున్నావా..?
కాళీ: నేను బెదిరించలేదు. నువ్వు బెదురుకోలేదు. ఎప్పటికైనా మన పెళ్లి గురించి తెలియాలి కదా అని తమాషా చేసిన
మనోహరి: రణవీర్ ను చంపాక మన పెళ్లి గురించి మాట్లాడమని చెప్పాను కదా
కాళీ: నీ మాజీ మొగుడి చావుకు ఇవాళ ముహూర్తం పెట్టిన కదా..?
మనోహరి: ఏంటి నిజమా..?
కాళీ: అవును ఇప్పుడు వాడి దగ్గరకే వెళ్తున్నా.. నీ ఫోన్ ఆన్‌లో పెట్టుకో.. నేను ఫోన్ చేస్తాను..
అంటూ కాళీ వెళ్లిపోతాడు. మనోహరి హ్యాపీగా ఫీలవుతుంది. మరోవైపు భాగీని పిలిచిన అమర్ పిల్లలను చూసుకోవడానికి ఒక కేర్ టేకర్‌ను పెడదాం అంటాడు. దీంతో భాగీ షాక్ అవుతుంది. ఇవాళ ఉదయం పక్కింటి అక్క కూడా ఇదే విషయం చెప్పారు అంటుంది. కేర్ టేకర్ కోసం పేపర్‌లో యాడ్ ఇద్దామని డిసైడ్ అవుతారు. మరోవైపు అనామిక జాబ్ కోసం పేపర్ లో యాడ్ చూస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















