Nindu Noorella Saavasam Serial Today April 1st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: తన శక్తులతో పిల్లల క్యాంపును ఆపేసిన అరుంధతి – అయోమయంలో పడిపోయిన మనోహరి
Nindu Noorella Saavasam Today Episode: అరుంధతి తన శక్తులతో సమ్మర్ క్యాంపును క్యాన్సిల్ చేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది.
Nindu Noorella Saavasam Serial Today Episode: పిల్లలు ఏడుస్తూ.. వెళ్లే ముందు ఒకసారి అమ్మ ఫోటోకు దండం పెట్టుకుని వెళ్తామని చెప్పి రూంలోకి వెళ్తారు. మిస్సమ్మ కూడా మేడం ఫోటో ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడైనా చూద్దామని లోపలికి వెళ్లబోతుంటే మనోహరి ఆపేస్తుంది. అమర్ ఏదో చెప్పబోతుంటే అమర్ ఈ విషయంలో నువ్వు రావొద్దు అని చెప్తుంది. దీంతో అమర్ ఏమీ అనడు. ఇంతలో పిల్లలు కిందకు వచ్చి ఏడుస్తూ మిస్సమ్మకు బాయ్ చెప్పి వెళ్లిపోతారు. మనోహరి దగ్గరుండి పిల్లలను కారు ఎక్కించబోతుంటే.. మిస్సమ్మ లోపలి నుంచి వచ్చి..
మిస్సమ్మ: పిల్లలు మనోహరి గారు మీకు ఇష్టమని చేసిన స్నాక్స్ మర్చిపోతున్నారు ఉండండి తెస్తున్నాను.
మనోహరి: ఏం వద్దు మీరు పదండి..
మిస్సమ్మ పరుగెత్తుకొస్తూ కిందపడిపోతుంది. కాలుకు దెబ్బతగిలి బ్లడ్ వస్తుంది. అందరూ పరుగెత్తుకొచ్చి చూస్తారు. రాథోడ్ ఫస్ట్ ఎయిడ్ తీసుకొస్తాడు.
అమర్: మిస్సమ్మ ఇప్పుడు ఓకేనా?
మిస్సమ్మ: అయ్యో పిల్లలు శుభమా అని క్యాంపుకు వెళ్తుంటే ఇలా జరిగిందేంటి? నా వల్ల ఇంత అశుభం జరుగుతుందనుకోలేదు.
అరుంధతి: పిల్లల్ని క్యాంపుకు వెళ్లకుండా ఉండటానికి ఎంత పని చేశావు మిస్సమ్మ.
మనోహరి: పిల్లల్ని నా నుంచి దూరం చేయడానికి నువ్వు ఎంత దూరం అయినా వెళ్తావని తెలుసు కానీ ఇంతదూరం వెళ్తావని అనుకోలేదు మిస్సమ్మ. (అని మనసులో అనుకుంటుంది. )
మిస్సమ్మ: ఇప్పుడు పిల్లలు నా వల్ల క్యాంపుకు వెళ్లలేరుగా..
మనోహరి: ఎందుకు వెళ్లలేరు.
నిర్మల: అదేంటమ్మా అలా అంటావు. అసలే పిల్లలు మొదటిసారి అన్ని రోజులు బయట ఉండబోతున్నారు. వాళ్లు గడప దాటేటప్పుడే ఇలా జరిగిందంటే ఎంత అశుభం.
శివరాం: మీ అమ్మ చెప్పేది కూడా నిజమే అమర్. ఇంత జరిగాక కూడా పిల్లల్ని క్యాంపుకు పంపించడం నాకు ఇష్టం లేదు.
అనగానే మనోహరి బలవంతంగా పిల్లల్ని తీసుకుని కారు దగ్గరకు తీసుకెళ్తుంది. అమర్ చూస్తుండిపోతాడు. అరుంధతి బాధపడుతుంది. ఆకాశం వైపు చూస్తూ నువ్వే కనుక ఉన్నట్లయితే నా పిల్లలు ఆ గేటు కూడా దాటకూడదు అంటుంది. దీంతో మాయ చేసినట్లుగా పిల్లలు వెళ్తున్న కారు ఆగిపోతుంది. వెంటనే వెనక్కి వస్తుంది.
ప్రిన్సిపాల్: కారు దిగండి..
అమర్: ఏమైంది మేడం.. ఎందుకు రిటర్న్ తీసుకొచ్చారు.
ప్రిన్సిపాల్: క్యాంపు ఆగిపోయింది సార్ ఇప్పుడే మెసెజ్ వచ్చింది.
మనోహరి: క్యాంపు క్యాన్సిల్ అవ్వడం ఏంటి మేడం ఒకసారి సరిగ్గా కనుక్కోండి.
ప్రిన్సిపాల్: నేను స్కూల్ ప్రిన్సిపాల్ ని క్యాన్సిల్ అయితే నాకు తెలియదా? మళ్లీ క్యాంపు ఉన్నప్పుడు ఇన్‌ఫాం చేస్తాను సార్.
అంటూ ప్రిన్సిపాల్ వెళ్లిపోతుంది. పిల్లలు హ్యాపీగా ఫీలవుతారు. ఆనందంతో మిస్సమ్మ దగ్గరకు పరుగెత్తుకొస్తారు. మిస్సమ్మ నువ్వు మా కోసమే కదా దెబ్బ తగిలించుకున్నావు అని పిల్లలు అడిగితే నా బంగారాల కోసం ఏమైనా చేస్తాను అంటుంది మిస్సమ్మ. తర్వాత మూర్తి, రాథోడ్, మిస్సమ్మ కలిసి అమర్, మనోహరిల పెళ్లి ఎలాగైనా ఆపేయాలని ప్లాన్ చేస్తారు. మరోవైపు అరుంధతి నేను కోరుకోగానే ఆ కారు ఎలా ఆగిపోయింది ఒకవేళ నాకు పౌర్ణమికి నేను ఏది కోరుకుంటే అది జరిగే శక్తులు వస్తాయా? అని డౌట్‌గా అయితే ఇప్పుడు వర్షం రావాలని కోరుకుంటుంది. కానీ వర్షం రాదు. దీంతో గుప్త నవ్వుతుంటే వెళ్లి గుప్తను తిడుతుంది అరుంధతి. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: అందరి ముందు ఆ నిర్మాత నాపై అరిచాడు, ఆరోజు భోజనం చేయబుద్ధి కాలేదు - చిరంజీవి