అన్వేషించండి

'నాగ పంచమి' సీరియల్: జ్వాల వర్సస్ పంచమి, ఉగ్రరూపం చూపించి వణికించిన పంచమిని చంపేయనున్న జ్వాల రౌడీలు!

Naga Panchami Serial Today Episode ఇద్దరు గర్భిణులు ఒక్క చోట ఉండొద్దని పంచమిని వైదేహి నాగులావరం పంపగా జ్వాల పంచమిని చంపించడానికి రౌడీలను పురమాయించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Naga Panchami Today Episode జ్వాలలోకి గరుడ శక్తి ప్రవేశిస్తుంది. దీంతో బయటకు వచ్చి పంచమిని ఆపి ఎక్కడికి వెళ్తున్నావ్ అని సీరియస్‌గా అడుగుతుంది. పంచమి కడుపులోని నాగశక్తి, జ్వాల కడుపులోని గరుడ శక్తి రియాక్ట్ అవుతాయి. దీంతో పంచమి కూడా జ్వాల వైపు సీరియస్‌గా చూస్తుంది. ఇంట్లో వాళ్లు అందరూ అక్కడికి వస్తారు. మరోవైపు కరాళి కూడా ఇదంతా చూస్తుంటుంది. 

జ్వాల: సిద్ధుడు చెప్పింది విన్నావ్ కదా ఇంకా ఈ ఇంట్లో ఉన్నావ్ ఏంటి. ఈ ఇంట్లో మన ఇద్దరిలో ఒక్కరే ఉండాలి. ముందుగా ఈ ఇంట్లో నేను కాలిపెట్టిన దాన్ని. నువ్వు నిన్న కాక మొన్న వచ్చావ్.
పంచమి: ఎప్పుడు వచ్చినా నేను ఈ ఇంటి కోడలినే. నీకు ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. 
జ్వాల: నా సంగతి నీకు  తెలీదు. నాతో పోటీ పడితే నిన్ను ప్రాణాలతో ఉంచను.
వరుణ్: జ్వాల.. జ్వాల ఏం మాట్లాడుతున్నావ్. 
పంచమి: నువ్వు నన్ను ఏం చేయలేవు. నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే నువ్వే ఈ ఇంటి నుంచి వెళ్లు. 
జ్వాల: ఏంటే నన్నే బెదిరిస్తున్నావ్.
పంచమి: నా జోలికి వస్తే ఎవరినీ వదిలిపెట్టను.

జ్వాల పంచమిని కొట్టడానికి చేయి ఎత్తితే పంచమి అడ్డుకుంటుంది. కోపంతో పంచమి జ్వాలని లాగిపెట్టి ఒక్కటిస్తుంది. పంచమి ఆవేశం చూసి అందరూ షాక్ అయిపోతారు. జ్వాల కోపంతో రగిలిపోతుంది. వైదేహి పంచమిని పిలిస్తే పంచమి నన్ను ఎవరూ ఆపకండి ఈ రోజు దీని అంతు చూస్తా అంటుంది. దీంతో జ్వాల నువ్వేంటే నా అంతు చూసేదని పంచమి గొంతు పట్టుకుంటుంది. దీంతో పంచమి కూడా జ్వాల గొంతు పట్టుకుంటుంది. అందరూ ఎంత ఆపినా ఇద్దరూ తగ్గరు. దీంతో రఘురాం గట్టిగా అరిచి కోడళ్లను కంట్రోల్ చేస్తాడు. 

వైదేహి: అసలు ఇది ఇళ్లు అనుకుంటున్నారా ఇంకేమైనా అనుకుంటున్నారా. 
జ్వాల: ఆ మాట దానికి చెప్పు.
పంచమి: మర్యాదగా మాట్లాడు. అది ఇది అంటే నాలుక కోస్తాను. 
జ్వాల: నువ్వెలా బిడ్డను కంటావో నేను చూస్తాను. 
పంచమి: నీ జేజమ్మే వచ్చినా నా బిడ్డని తాకలేరు. నా బిడ్డను ఏదైనా జరిగితే ఎవర్నీ ప్రాణాలతో ఉంచను.
రఘురాం: మీరు ఇద్దరూ ఏం మాట్లాడకండి. అసలు ఎందుకు గొడవ పడుతున్నారో నాకు అర్థం కావడం లేదు.
జ్వాల: మామయ్య ఈ ఇంట్లో నేనో అదో ఎవరో ఒక్కరే ఉండాలి. నేను ఈ ఇంట్లో నుంచి కాలు బయట పెట్టడం జరిగితే మళ్లీ తిరిగిరాను.
వైదేహి: ఆ స్వామిజీ చెప్పింది మన ఇంట్లో అక్షరాల మన కళ్లముందు జరుగుతుంది. మీ ఇద్దరిని ఒక చోట ఉంచడం వల్లే ఇది జరుగుతుంది. 
పంచమి: నా బిడ్డ కోసం నేను ఏ త్యాగానికైనా సిద్ధమే. నాకు నా బిడ్డే ముఖ్యం. 
శబరి: అమ్మా పంచమి నా మాట విని నీకు కాన్పు అయ్యే వరకు నీ పుట్టింటిలో ఉండటం మంచిదని అనిపిస్తుంది. ఈ గుంపులో నువ్వు ఉండొద్దమ్మ నీ బిడ్డ క్షేమం కోరి చెప్తున్నా.
పంచమి: నా బిడ్డ కోసం మా పుట్టింటికి వెళ్లడానికైనా నేను సిద్ధమే. 
వైదేహి: ఆ పని చేయమ్మ ఇప్పుడే కారు ఏర్పాటు చేస్తా. మీరు లోపలికి వెళ్లండి. 
శబరి: అమ్మా నన్ను క్షమించమ్మా ఆ జ్వాల వాలకం చూసి నాకు భయం వేసింది అందుకే మీ అమ్మగారి ఇంటికి వెళ్లమని చెప్పాను. మీ పుట్టింటి దగ్గర నువ్వు పండంటి బిడ్డను కనాలి. 

మరోవైపు జ్వాల ఆలోచిస్తూ ఉంటే అక్కడికి చిత్ర వస్తుంది. పంచమని అలాగే వదిలేయకూడదని అంటుంది. దీంతో జ్వాల ఆ పంచమి నన్నే చంపేస్తా అంది అంటే నేను దాన్ని చంపే తీరాలి అని అంటుంది. దీంతో చిత్ర అక్క కడుపు పొగొట్టడం వరకు అయితే ఓకే కానీ చంపొద్దని అంటుంది. కానీ జ్వాల ఒప్పుకోదు. పంచమి, దాని బిడ్డ ఇద్దరూ ఉండకూడదు అని అంటుంది. ఇక జ్వాల రౌడీకి కాల్ చేసి పంచమిని చంపేసి శవాన్ని లోయలో పడేసి ఆనవాళ్లు లేకుండా చేయమని చెప్తుంది. 

అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని పంచమి ఊరు బయల్దేరుతుంది. వైదేహి, రఘురాం, శబరిలు పంచమికి జాగ్రత్తలు చెప్తారు. కన్నీరు పెట్టుకుంటూ పంచమి బయల్దేరు తుంది. శబరి కూడా ఏడుస్తుంది. జ్వాల, చిత్రలు పంచమి పని అయిపోయిందని అనుకుంటారు. పంచమి మోక్షని తలచుకొని బాధపడుతుంది. ఇంతలో జ్వాల చెప్పిన రౌడీలు పంచమి కోసం దారిలో కాచుకొని ఉంటారు. కారుకి అడ్డంగా రాళ్లు పెట్టి ఆపుతారు. డ్రైవర్‌ని బెదిరించి పంపేస్తారు. పంచమిని చంపడానికి వెంట పడతారు. దీంతో పంచమి పరుగులు పెడుతుంది. తనని ఏం చేయొద్దని పంచమి వేడుకుంటుంది. దీంతో ఇవాళ్లి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: బ్రహ్మముడి సీరియల్ లో రుద్రాణిగా నటిస్తోన్న షర్మిత గౌడ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా!

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today October 21: కాచీ జుట్టు కాల్చేసి పార్టీ ఆపడానికి ఆదిలక్ష్మీ ప్రయత్నం వృథా...దివ్యాంకకు గట్టిగా బుద్ది చెప్పిన ధాత్రి
జగద్ధాత్రి సీరియల్: కాచీ జుట్టు కాల్చేసి పార్టీ ఆపడానికి ఆదిలక్ష్మీ ప్రయత్నం వృథా...దివ్యాంకకు గట్టిగా బుద్ది చెప్పిన ధాత్రి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 21st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: క్రిష్ బ్యాగ్‌లో సహస్ర గాజులు! బంటీ దొంగతనం బయట పెట్టిన సిరి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: క్రిష్ బ్యాగ్‌లో సహస్ర గాజులు! బంటీ దొంగతనం బయట పెట్టిన సిరి!
Nindu Manasulu Serial Today October 21st: నిండు మనసులు: సిద్ధూకి సేవలు చేయడానికి అసహ్యించుకున్న ప్రేరణ! గణ కనిపెట్టేసిన నిజం!
నిండు మనసులు: సిద్ధూకి సేవలు చేయడానికి అసహ్యించుకున్న ప్రేరణ! గణ కనిపెట్టేసిన నిజం!
Godavari Serial Today October 21st: 'గోదావరి' సీరియల్: జాను రిసెప్షన్‌లో సూర్య! ఫ్యామిలీని చూసి ఎమోషనల్ అయిన జాను!
'గోదావరి' సీరియల్: జాను రిసెప్షన్‌లో సూర్య! ఫ్యామిలీని చూసి ఎమోషనల్ అయిన జాను!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
Sharmila: విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్లిన వైఎస్ షర్మిల.. కుమార్తె వివాహానికి ఆహ్వానం
విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్లిన వైఎస్ షర్మిల.. కుమార్తె వివాహానికి ఆహ్వానం
Indian Railways Special Trains: పండుగల సీజన్‌లో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు
పండుగల సీజన్‌లో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు
AP MPTC ZPTC Elections: పల్నాడు, కడప, అన్నమయ్య జిల్లాల్లో మళ్లీ ఉద్రిక్తత.. పలుచోట్ల టీడీపీ, వైసీపీ రాళ్ల దాడులు
పల్నాడు, కడప, అన్నమయ్య జిల్లాల్లో మళ్లీ ఉద్రిక్తత.. పలుచోట్ల టీడీపీ, వైసీపీ రాళ్ల దాడులు
Graduate MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. మిత్రపక్షాల అసంతృప్తిని చల్లార్చే పనిలో పీసీసీ చీఫ్
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. మిత్రపక్షాల అసంతృప్తిని చల్లార్చే పనిలో పీసీసీ చీఫ్
700 కి.మీ రేంజ్‌తో Mercedes కొత్త ఎలక్ట్రిక్ SUV కారు.. 2.5 సెకన్లలో 100 కి.మీ వేగం
700 కి.మీ రేంజ్‌తో Mercedes కొత్త ఎలక్ట్రిక్ SUV కారు.. 2.5 సెకన్లలో 100 కి.మీ వేగం
CM Revanth Reddy: 5 వేల పోలీస్ పోస్టులు భర్తీ, హోంగార్డులకు ఎక్స్‌గ్రేషియా రెట్టింపు: సీఎం రేవంత్ రెడ్డి
5 వేల పోలీస్ పోస్టులు భర్తీ, హోంగార్డులకు ఎక్స్‌గ్రేషియా రెట్టింపు: సీఎం రేవంత్ రెడ్డి
Jio Platforms Ipo: కేవలం 2 గంటల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్, మెగా ఐపీఓల్లో సరికొత్త రికార్డు
కేవలం 2 గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిన Jio Platforms Ipo, ఐపీఓల్లో సరికొత్త రికార్డు
Embed widget