అన్వేషించండి

Naga Panchami Serial Today March 22nd: 'నాగ పంచమి' సీరియల్: కడుపులో బిడ్డతో ముచ్చట్లు పెట్టిన మోక్ష, పంచమి - చేతులు కలిపిన కరాళి, ఫణేంద్ర!

Naga Panchami Serial Today Episode పంచమి గురించి జ్వాల, చిత్ర, తమ భర్తలు నెగిటివ్‌గా మాట్లాడుకోవడంతో నాగేశ్వరి పాము వాళ్లని భయపెడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Naga Panchami Today Episode పంచమి, మోక్షలు ప్రేమగా మాట్లాడుకుంటారు. పంచమి తమ బిడ్డ వల్ల మనకు కష్టాలు వస్తాయి అని అంటుంది. దీంతో మోక్ష ఇంట్లో వాళ్లకు నువ్వు భయపడుతున్నావని భయపడొద్దు అని చెప్తాడు. పంచమి, మోక్షల మాటలను నాగేశ్వరి పాము వింటుంది. 

పంచమి: ఇంట్లో వాళ్లు ఎన్ని మాటలు అన్నా నేను మన బిడ్డకోసం భరిస్తాను. మీ కోసం మన సంతోషం కోసం బిడ్డను కని ఇవ్వడానికి ఎన్ని నొప్పులు అయినా భరిస్తాను. అవసరం అయితే బిడ్డను మీ చేతిలో పెట్టే నేను కన్నుమూస్తాను.
మోక్ష: నువ్వు అలా మాట్లాడకు పంచమి నీ మాటలు వింటుంటే నాకు భయం వేస్తుంది.
పంచమి: అది భరించరాని నిజం అయినా సరే మనిద్దరం నిజం మాట్లాడుకోవాలి. ఇది దాస్తే దాగేది కాదు. నేను విషకన్యను కాబట్టి మన కలయిక మీ ప్రాణాల మీదకు తెచ్చింది. ఇప్పుడు పుట్టుబోయే మన బిడ్డ విషపూరితంగా పుడితే..
మోక్ష: ఆపు పంచమి. అలా జరగదు.. జరగడానికి వీల్లేదు. 
పంచమి: జరిగే అవకాశాలే ఎక్కువ మోక్షాబాబు. అలాంటి బిడ్డకు జన్మనివ్వడం న్యాయమేనా.. ఆలోచించండి మోక్షాబాబు. నేను అనుభవించిన బాధ నా బిడ్డ అనుభవించకూడదు. 
మోక్ష: లేదు పంచమి మన బిడ్డకు అలాంటి పరిస్థితి రానివ్వను. ఎంత ఖర్చు పెట్టి అయినా సరే బాగు చేయించుకుంటాను నువ్వు ధైర్యంగా ఉండు. దేవుడు ఇచ్చిన బిడ్డను మనం దూరం చేసుకోవద్దు.
పంచమి: మన బిడ్డ మీద నాకు కూడా ఆశలు కోరికలు ఉన్నాయి.
మోక్ష: ఇన్ని కష్టాలు ఎదుర్కొన్నాం ఇప్పుడు కూడా ఎదుర్కొందాం. 
పంచమి: అన్ని విషయాల్లో భగవంతుడు మనకు సాయం చేస్తున్నాడు. కానీ శత్రువులు మనల్ని విడిచిపెట్టడం లేదు. ఒక్క కరాళి విషయంలో మాత్రం మనం జాగ్రత్తగా ఉండాలి. తన విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 
మోక్ష: నువ్వు ఇంక ఎవరి గురించి ఆలోచించకు పంచమి నీ ఆందోళన మన బిడ్డ మీద పడుతుంది. నువ్వు రెస్ట్ తీసుకో నేను అన్నీ చూసుకుంటా. 
నాగేశ్వరి: పాపం పంచమి, మోక్షలు ఎన్నో ఆశలు పెంచుకుంటున్నారు. తమ బిడ్డ నాగలోక మహారాణి.. పుట్టగానే వెళ్లిపోతుంది అని తెలిస్తే తట్టుకోలేరు. కానీ నేను మహారాణి కోరిక తీర్చక తప్పదు. నాగలోకానికి రాణి లోటు ఉండకూడదు. బిడ్డ పుట్టగానే తీసుకొని వెళ్లిపోవాలి. ఇక నాగేశ్వరి జ్వాల వాళ్ల దగ్గరకు వెళ్తుంది.
 జ్వాల: పంచమి ప్రెగ్నెంట్ అని నమ్మితే మనకంటే పెద్ద ఫూల్ ఎవరూ ఉండరు. ఇది పెద్ద అబద్ధం. 
భార్గవ్: నాకూ డౌటే.. కానీ అది అబద్ధం అయితే బామ్మ ఎందుకు సపోర్ట్ చేస్తుంది.
చిత్ర: బామ్మది మూఢనమ్మకం. పంచమిని ఎవరో కనేసి గుడిలో పడేసి పోయారు. అప్పటి నుంచి దాన్ని శివయ్య పుత్రిక అని బామ్మ ఫుల్లుగా ఫిక్స్ అయిపోయింది.
వరుణ్: కానీ మోక్ష బతకడం మాత్రం మిరాకిల్.
జ్వాల: అంటే అదంతా పంచమి మహిమ అని నువ్వు నమ్ముతున్నావా..
చిత్ర: అదంతా పంచమి ప్లానే. పర్మినెంట్‌గా ఇంట్లో ఉండటం కోసం పెద్ద ప్లానే వేసింది. పంచమి ఎవర్ని అయినా నమ్మించగలదు. అది మనిషి రూంలో ఉన్న పాము. మేం ఎంత చెప్పినా మీరు నమ్మరు. ఈ ప్రెగ్నెంసీ విషయంలో అయినా మీరు అది ఫేక్ అని మాతో కలిసి నమ్మిస్తే ఒక్కో నిజం బయట పడుతుంది. 
జ్వాల: పంచమికి టెస్ట్ చేయించమని మేం మాట్లాడుతాం. మీరు మాకు సపోర్ట్ చేయండి చాలు.
నాగేశ్వరి: పంచమికి ఈ ఇంట్లో కూడా శత్రువులు ఉన్నారు. వీళ్లని పంచమి జోలికి రాకుండా చేయాలి. అని బెడ్ మీద కూర్చొన్న చిత్ర పక్కనకు వెళ్లి నాగేశ్వరి పాముగా మారి కూర్చుంటుంది. నలుగురు అరచి గోల గోల చేస్తారు. అందరూ అక్కడికి చేరుకుంటారు. 
శబరి: అమ్మా.. పంచమి వీళ్లు నీ గురించి తప్పుగా ఆలోచించి ఉంటారు. అందుకే ఆ శివయ్యకు కోపం వచ్చి పాముని పంపించినట్లున్నారు. వాళ్లని క్షమించి నువ్వే కాపాడు తల్లి. 
పంచమి: పంచమి మోకాలి మీద కూర్చొని.. శివయ్య మా కుటుంబంలోని వాళ్లు ఎవరైనా తప్పు చేసి ఉంటే క్షమించు. అని మొక్కుకోగానే నాగేశ్వరి పాము అక్కడి నుంచి వెళ్లిపోతుంది. 
శబరి: ఇప్పటికైనా బుద్ది తెచ్చుకొని పంచమి శక్తి ఏంటో అర్థం చేసుకోండి. 
జ్వాల: మాకు బాగా అర్థమైంది. పంచమి ఒక పాము అని మీరే తెలుసుకోలేకపోతున్నారు. 
 శబరి: అందరూ అన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారు. పంచమి లేకపోతే మన మోక్ష లేడు. ఈ నాగ గండం నుంచి ఈ వంశంలో ఎవరూ తప్పించుకున్న దాఖలాలు లేవు. చివరకు నా భర్తతో సహా. ఏదో మన అదృష్టం బాగుండి మన మోక్షని కాపాడటానికి ఆ భగవంతుడు పంచమి రూపంలో ఓ దేవతని పంపాడు. అది తెలుసుకోలేక మీరు పంచమి గురించి చులకనగా మాట్లాడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఇకనైనా జాగ్రత్తగా ఉండండి.
మీనాక్షి: పంచమి మీద కుట్రలు చేయకుండా ఉండండి. మీ జోలికి ఏ పాములు రావు.
జ్వాల: పంచమిని పంపిస్తే చాలు పాము అనేది ఈ ఇంట్లో కనిపించదు. 

మోక్ష: పంచమి ఏం ఆలోచిస్తున్నావ్.. 
పంచమి: ఏం ఆలోచించడం లేదండి. నిద్ర పట్టడం లేదు.
మోక్ష: నువ్వు ఇలా చేస్తే బాగోదు పంచమి.  నీ కడుపులో ఉన్న మన బిడ్డ గురించి ఆలోచించు. అది కాదు పంచమి నువ్వు మేల్కొని ఉంటే మన బిడ్డ కూడా పడుకోదు.
పంచమి: కడుపులోకి వెళ్లి మీరు చూసి వచ్చారా. 
మోక్ష: అది కాదు పంచమి నాకు మాటలు వినిపిస్తున్నాయి. మమ్మీ త్వరగా నిద్రపోవడం లేదు చెప్ప డాడీ అని నాకు చెప్తుంది.
పంచమి: ఆహా.. పుట్టకముందే ఇద్దరూ ఒకటి అయ్యారు అన్నమాట. నువ్వు పుట్టిన తర్వాత నీ సంగతి చెప్తాను. నీకు పాలు ఇవ్వకుండా పస్తులు పెడతాను.
మోక్ష: నువ్వు బయపడకు కన్నా మీ అమ్మకి అస్సలు కోపం రాదు. ఊరికే భయపెడుతుంది అంతే. 
పంచమి: అలా చెప్పి తల్లి అంటే భయం లేకుండా చేస్తారా. అయినా నా మీద ప్రేమ అంతా మీకు మన బిడ్డ మీద మల్లినట్లు ఉంది. రేపు బిడ్డ పుట్టిన తర్వాత నన్ను అస్సలు పట్టించుకోరేమో.
మోక్ష: నువ్వు నాలో ఒక భాగం పంచమి నువ్వు వేరు నేను వేరు కాదు.

కరాళి: నీ ఉనికినే భరించలేని నేను నువ్వు తల్లివి కాబోతున్నావు అంటే తట్టుకోగలనా పంచమి. నా అన్న నంబూద్రీ చావుకి కారణం అయిన నిన్ను అంత సులభంగా బతకనివ్వను. చావనివ్వను. నరకయాతన అనుభవించేలా చేస్తాను. నీ జీవితం విలవిల్లాడిపోవాలి పంచమి. ఇక నీకు అన్నీ చీకటి రోజులే. మరోవైపు కరాళి దగ్గరకు ఫణేంద్ర రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: నాగచైతన్య అక్కినేని: యంగ్ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాగచైతన్య?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget