అన్వేషించండి

Naga Panchami Serial Today June 3rd: 'నాగ పంచమి' సీరియల్: పిల్లలను చదివించనని ఇంట్లో చెప్పేసిన మోక్ష.. పాము కోసం ఘనా వేట!

Naga Panchami Serial Today Episode : పంచమి పిల్లల వెనక ఏదో మిస్టరీ ఉందని దాన్ని కనిపెట్టాలి అని చిత్ర, జ్వాలలు చేతులు కలపడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Naga Panchami Today Episode : వైశాలి రూపంలో ఉన్న తన తల్లికి నాగశక్తులు వస్తే అన్నీ తెలిసిపోతాయి అని అప్పుడు తాను తన తల్లిని బతిమిలాడి నాగలోకం వెళ్లకుండా ఆపాలి అని తన మాట తన తల్లి వింటుందని పంచమి మోక్షతో చెప్తుంది. వైశాలి గురించి ఎవరికీ తెలీకుండా చూసుకోవాలి అని మోక్ష అంటాడు. 

పంచమి: ప్రస్తుతానికి వైశాలిని బయట తిరగకుండా చూసుకోవాలి. నాగలక్షణాలు కనిపించకుండా ఏమైనా చేయొచ్చేమో తెలుసుకోవాలి. 

మోక్ష: నాగసాధువుని సంప్రదిస్తే.. తనకి మన గురించి పూర్తిగా తెలుసు కాబట్టి ఈ రహస్యం ఎవరికీ చెప్పరు. ఎలా అయినా వైశాలిని కాపాడుకొని తీరాలి. 

వైశాలి: అమ్మ పాలు కావాలి.

ఫాల్గుణి: ఇందాకే కదా పాలు తాగావు. నీకు ఎందుకు పాలు అంటే అంత ఇష్టం. 

పంచమి: సరే నేను వెళ్లి తీసుకొస్తాను.

ఫాల్గుణి: నాకు వద్దమ్మ.

వైశాలి: అయితే తన పాలు కూడా నాకే ఇచ్చేయ్ నేనే తాగేస్తాను. పంచమి, మోక్ష ఇద్దరు పిల్లల్ని దగ్గరకు తీసుకుంటారు.

వరుణ్ వచ్చి మోక్ష, జ్వాలలను పిలిచి స్కూల్ అడ్మిషన్లు తీసుకొచ్చాను అని అంటాడు. జ్వాల తన పిల్లాడిని ఆ స్కూల్‌లో చదివించనని అంటుంది. వరుణ్ టాప్ ర్యాంక్ స్కూల్ ఆడ్మిషన్లు తెచ్చాను అంతకు మించి టాప్ స్కూల్ దొరకదని అంటాడు. జ్వాల మాత్రం ముగ్గురు పిల్లలు ఒకే స్కూల్‌లో చదివించను అని అంటుంది. వైదేహి అంత మొండితనం పనికిరాదు అని చెప్తుంది. తన కొడుకుకు చదువు రాకపోయినా పర్లేదు కానీ పంచమి పిల్లలు చదివే స్కూల్‌లో చదివించను అని అంటుంది.

వరుణ్: జ్వాల నువ్వు మన ఘనాని చెడగొడుతున్నావు. నేను ఎంత కష్టపడి ఆ స్కూల్‌లో అడ్మిషన్ తీసుకొచ్చానో నీకు తెలీదు.

జ్వాల: అయితే వాళ్ల పిల్లల్ని వేరే స్కూల్‌లో వేయమని చెప్పండి.  

మోక్ష: అసలు మా పిల్లల్ని మేం స్కూల్‌లోనే చేర్పించం. అన్నయ్య నువ్వు అప్లికేషన్ తెచ్చినందుకు థ్యాంక్స్. ఆ స్కూల్‌లో ఘనాని చేర్పించు. మా పిల్లల్ని మేం ఇంట్లో ఉంచుకొనే చదివించుకుంటాం. 

వైదేహి: అదేంటి మోక్ష పిల్లల్ని స్కూల్‌లో వేయకపోతే ఎలా. నువ్వు బాగా చదువుకున్నవాడివి పిల్లల్ని ఇంకా బాగా చదివించుకోవాలి. అసలు స్కూల్‌కే పంపను అంటే ఎలా. 

చిత్ర: పిల్లలకు ఏదైనా లోపం ఉంటేనే స్కూల్‌లో చేర్పిస్తున్నారు అలాంటిది మీరు చదివించము అంటున్నారు అంటే మా దగ్గర ఏదో దాస్తున్నారు అని అర్థం. 

జ్వాల: పిల్లలకు రాక్షసులు కనిపిస్తున్నప్పుడే మాకు అనుమానం వచ్చింది. వాళ్లకి పాముల లక్షణాలు కనిపిస్తాయి అనా..

మోక్ష: వదినా. మీ అందరికీ మరోసారి చెప్తున్నా మీరు నా భార్యని ఎన్నిసార్లు అవమానించినా ఇద్దరం తట్టుకున్నాం. కానీ మా పిల్లల జోలికి వస్తే మాత్రం ఊరుకోను. దయచేసి పిల్లల మనసు గాయపరచకండి ప్లీజ్. 

జ్వాల దగ్గరకు చిత్ర వస్తుంది. జ్వాలను మంచిగా మాట్లాడి తన దారిలోకి తెచ్చుకోవాలి అనుకుంటుంది. ఇక జ్వాల మాత్రం తన కొడుకుదే ఆస్తి మొత్తం అని మీకు ఇవ్వను అని చిత్రను అంటుంది. పంచమికి ఆస్తి దక్కకుండా చేసి మనం సర్దుకుందామని అంటుంది. జ్వాల ఇవ్వను అని అంటుంది. పంచమి పిల్లల విషయంలో అనుమానాలు గురించి మాట్లాడుకుంటారు. పంచమి పిల్లల రహస్యాన్ని తెలుసుకోవాలి అని అనుకుంటారు.  

రాత్రి గదిలో ఘన కనిపించడు. జ్వాల, వరుణ్‌లు వెతుకుతారు. ఇక బయట ఘన బయటకు రా బయటకు రా అని అంటుంటాడు. చిత్ర వచ్చి ఏంటి ఘనా అని అడిగితే పాముని పిలుస్తున్నా అని అంటాడు. చిత్ర నోరెళ్ల బెడుతుంది. వరుణ్, జ్వాల కూడా బయటకు వస్తారు. పాముని ఎలా అయినా చంపేస్తా అని అంటాడు. దాన్ని చంపేవరకు లోపలికి రాను అని వాడిని చూసి పాము దాక్కుందని అంటాడు. ముగ్గురు ఘన ప్రవర్తనకు తల పట్టుకుంటారు. వరుణ్ బలవంతంగా ఘనాని లోపలికి తీసుకెళ్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: రామ్‌కి గుండెపోటు.. పోటీల్లో విజయం సాధించిన సీత.. మధు పీడ పోయినట్లేనా!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Nicolas Maduro Guerra Warning:చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
Embed widget