Naga Panchami Serial Today February 8th: 'నాగ పంచమి' సీరియల్: కలవరపెడుతున్న నాగలోక సమస్య.. పిల్లలు పుట్టేయోగం లేదని చెప్పేసిన పంచమి!
Naga Panchami Serial Today Episode తనకు పిల్లలు పుట్టరని అందరి ముందు పంచమి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Naga Panchami Today Episode పంచమితో మాట్లాడటానికి మోక్ష వస్తాడు. పంచమి అంటే తనకు చాలా ఇష్టమని మర్చిపోవడం ఈ జన్మకి జరగదు అంటాడు. పెళ్లి అయితే అన్నీ మర్చిపోతావ్ అని పంచమి అంటుంది. దానికి మోక్ష నువ్వు కూడా నన్ను మర్చిపోలేవు పంచమి అంటాడు. ఇద్దరం కాలి బూడిద అయితేనే మర్చిపోవడం జరుగుతుంది అంటాడు.
మోక్ష: నిన్ను అంతగా నా జీవితంతో ముడి వేసుకున్నాను. ఆ భగవంతుడు కూడా ఆ ముడిని విప్పి మనల్ని వేరు చేయలేడు.
పంచమి: నేను నాగలోకం వెళ్లడానికి నిర్ణయించుకున్నాను మోక్షాబాబు. ఈ లోకంతో నాకు ఉన్న బంధం ముగిసిపోయింది. ఇక నేను ఈ భూమ్మీద ఉండే అవకాశం లేదు. కచ్చితంగా నాగలోకం వెళ్లాల్సిన అవసరం వచ్చింది. మీరు పెళ్లి చేసుకుంటే కనీసం మీరు అయినా సంతోషంగా ఉంటారు అన్న తృప్తితో అయినా నేను నాగలోకం వెళ్లిపోతాను.
మోక్ష: అది నిజం కాదు పంచమి. నా మీద నాకు నమ్మకం ఉంది. నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. ఏ క్షణం అయినా నువ్వు ఈ పెళ్లి ఆపి మనం కలిసి ఉందాం అని చెప్తావ్.. ఇది మన ప్రేమకు పరీక్ష పంచమి. నువ్వు ఈ పెళ్లి ఆపితే నా నమ్మకం గెలుస్తుంది. ఆపకపోతే మన ప్రేమ అబద్ధం అని తేలుతుంది. నువ్వు ప్రేమను గెలిపిస్తే మనం ఒకటి అవుతాం. ఓడిస్తే ఈ భూమ్మీద నేను అనేవాడిని ఉండలేను.
నాగదేవత: నాగలోకం గురించి నాకు చాలా కలవరంగా ఉంది ఫణేంద్ర. ఇలాంటి సందిగ్ధస్థితి నాగలోకానికి ఎప్పుడూ రాలేదు. నాగలోకం ఎన్నో కష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంది కానీ ఇప్పుడు వచ్చిన ఈ పరిస్థితి నేను కనీవినీ ఎరుగలేదు.
ఫణేంద్ర: అంత పెద్ద సమస్య ఏంటి మాతా.
నాగదేవత: యువరాణి సమస్యే ఫణేంద్ర. పుష్కరపూజకు చాలా వేగంగా సమయం ఆసన్నమైపోతుంది. మరోవారసురాలు లేకపోవడం వల్లే ఇలాంటి సంకట స్థితి ఏర్పడింది. నాగమణికి ఆ పూజ జరిపించాలి అంటే రాణి వంశస్థలు తప్పక కావాలి. ఆ పూజ జరిపించకపోతే నాగమణి తన పూర్వ వైభవం కోల్పోతుంది.
ఫణేంద్ర: మాతా యువరాణి అక్కడ లేని పోని బంధాలు కలిపించుకొని కొత్త కష్టాలు తెచ్చుకుంటుంది.
నాగదేవత: అయితే ఇక్కడ మన పరిస్థితి ఏంటి ఫణేంద్ర. ఆ పూజ లేకపోతే యువరాణిని ఇక్కడికి అత్యవసరంగా తీసుకురావాల్సిన పరిస్థితే లేదు.
ఫణేంద్ర: మొన్నటి వరకు మోక్ష బతికితే వస్తాను అన్న యువరాణి ఇప్పుడు మోక్షకు పెళ్లి అయితే వస్తాను అంటుంది. మరో పక్షం రోజుల్లో ఆ పెళ్లి జరుగుతుంది మాతా.
నాగదేవత: ఆ పని పూర్తి చేసుకొని యువరాణిని తీసుకొని వచ్చేయ్. ఈ పూజకు తన రాక అత్యవసరం అని యువరాణికి తెలియనవసరం లేదు.
శబరి: ఎందుకు అమ్మా ఇంట కఠిన నిర్ణయం తీసుకున్నావ్.
మీనాక్షి: నీకు మోక్షకు మధ్య ఏమైనా సమస్య ఉంటే మేం పరిష్కరిస్తాం.
పంచమి: అలాంటిది ఏం లేదు అమ్మా. మేం మాట్లాడుకునే విడిపోతున్నాం.
శబరి: నీమీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాం తల్లీ వాటిని చంపేయకు అమ్మా.
పంచమి: నేను కోటి ఆశతలో పెళ్లి చేసుకున్నాను. కానీ సతకోటి కష్టాలు వచ్చాయి. అందుకే బందాన్ని తెంచుకుంటున్నాను.
మేఘన: నా మెడలో మూడు ముళ్లు పడే చివరి నిమిషంలో అయినా మీరు మనసు మార్చుకుంటే సంతోషంగా నేను పక్కకు తప్పుకుంటాను.
పంచమి: నాకు సంతానయోగం లేదు.. అందరూ షాక్ అయిపోతారు. నాకు పిల్లలు పుట్టే అవకాశమే లేదు. అందుకే విడిపోవాలి అని నిర్ణయం తీసుకున్నారు.
మోక్ష: మనసులో.. నా సంతోషం కోసం నువ్వు నిందలు వేసుకుంటున్నావా పంచమి.
మీనాక్షి: ఈ సమస్యకు విడిపోవాల్సిన అవసరం లేదు పంచమి ఎవర్నైనా దత్తత తీసుకోవచ్చు.
మోక్ష: దత్తత తీసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు. అసలు పిల్లలే లేకపోయినా వచ్చిన నష్టం లేదు.
వైదేహి: నువ్వు నోరుముయ్ మోక్ష.. పిల్లా పీచు లేకుండా దీంతో జీవితాంతం కాపురం చేస్తావా.. నా కోడలికి పుట్టాలి అంతే..
జ్వాల: నాకు పిల్లలు లేరు అని వేలెత్తి చూపకండి మాకు పుట్టక కాదు ఇప్పుడే వద్దు అనుకుంటున్నాం.
పంచమి: మేం విడిపోదాం అనుకుంటున్నాం. ఈ సమయంలో నా గురించి ఆలోచనలు అనవసరం. పెళ్లి చేసుకొని మీరిద్దరూ సంతోషంగా ఉండండి.
పంచమి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వస్తుంది. తన భర్తని కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. మీలో ఐక్యం అయిపోడానికి సిద్ధమైయ్యాను అని అనుకుంటుంది. ఇంతలో అక్కడ సుబ్బుని చూస్తుంది. సుబ్బు దగ్గరకు వెళ్లి చాలా సంతోషపడుతుంది. తన భర్త ప్రాణాలు దక్కాయి అని నాగగండం తగ్గిపోయింది అని సుబ్బుతో చెప్తుంది. మోక్షాబాబు మరో పెళ్లి చేసుకోవాలి అని కోరుకుంటున్నాను అని చెప్తుంది. దీంతో సుబ్బు పెళ్లి అంటే జీవితాంతం కలిసి ఉండాలని చేసుకుంటారు. నువ్వేంటి మధ్యలో వదిలేస్తున్నావ్ అని అడుగుతాడు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: యాత్ర 2: 'యాత్ర 2' థియేటర్‌లో పవన్, జగన్ ఫ్యాన్స్ మధ్య గొడవ - తర్వాత ఏం జరిగిందంటే?