Naga Panchami Serial Today February 20th: 'నాగ పంచమి' సీరియల్: కరాళి చేతిలో ఓడిపోతానని సుబ్బు ముందు ఏడ్చిన పంచమి.. మేఘన, ఫణేంద్రలను పంపేయమన్న మోక్ష!
Naga Panchami Serial Today Episode పంచమిని తీసుకొని ఫారిన్ వెళ్లిపోతానని మోక్ష ఇంట్లో వాళ్లకి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Naga Panchami Today Episode పంచమి చుట్టూ సుబ్రహ్మణ్యస్వామి త్రిశూలాన్ని వలయంలా ఏర్పాటు చేస్తారు. పంచమి కళ్లు తిరిగి పడిపోతుంది. దీంతో నక్కలు పడిపోతాయి. ఇక ఆ త్రిశూలం నాలుగు త్రిశూలాల్లా మారి నాలుగు నక్కల్ని చంపేస్తాయి. పంచమి లేచి చూసే సరికి ఏం ఉండవు. ఇక కరాళి నిరాశపడుతుంది. పంచమి సుబ్రహ్మణ్య స్వామిని దండం పెట్టుకుంటుంది.
మోక్ష: ఏంటమ్మా ఈ పంచాయితీలు..
వైదేహి: ఆ విషయం నేను అడగాలి. దీని అంతటికి కారణం నువ్వే అంతగా నువ్వు తనని ఎందుకు వెనకేసుకొని వస్తున్నావో అర్థం కావడం లేదు. మొన్నటి వరకు దాని ముక్క మొఖం కూడా తెలీదు. ఒక్క సంవత్సరానికి నీకు మా కంటే అదే ఎక్కువ అయిందా..
శబరి: నువ్వు నా కొడుకు రఘురామ్‌ని పెళ్లి చేసుకునే నాటికి మీ ఇద్దరికీ ఏమైనా పరిచయం ఉందా వైదేహి. ఒక్క తాళి బొట్టు రెండు జీవితాలను కలుపుతుంది.
వైదేహి: అత్తయ్య గారు ఇది నాకు నా కొడుకుకు మధ్య పంచాయితీ. మిమల్ని అడిగితే సలహా చెప్పండి.
శబరి: నేను నా మనవడికి చెప్తున్నాను. ఓరేయ్ మనవడా.. నీకు పంచమి భార్యనే కాదు మన ఇంటికి వచ్చిన దేవతరా. మన వంశం రాతని తిరగరాసింది. మీ తాతయ్యని ఏ శక్తి కాపాడలేకపోయింది. కానీ నిన్ను కాపాడింది మాత్రం పంచమినే అది మాత్రం మర్చిపోకు.
వైదేహి: మీరు చెప్పాల్సినదంతా మీరు చెప్పేశాక నేను ఇంకేంటి వాడితో మాట్లాడేది.
మోక్ష: సరే నువ్వేం చెప్పాలి అనుకుంటున్నావో సూటిగా చెప్పమ్మ.
వైదేహి: నువ్వు పంచమిని వదిలేయాలిరా. అది నీకు కరెక్ట్ కాదు.
మోక్ష: నాకు తను కరెక్టో కాదో నిర్ణయించుకోవాల్సింది నేను.
చిత్ర: ఇంట్లో అందరూ ఉన్నప్పుడు అందరికీ నచ్చాలి.
మోక్ష: నువ్వు నాకు నచ్చలేదు చిత్ర వదినా. వెళ్లిపో.. డివోర్స్ పేపర్స్ మీ ఇంటికి పంపిస్తాం.
భార్గవ్: అది కాదు మోక్ష పంచమి వల్లే మన ఇంట్లో అన్ని సమస్యలు వస్తున్నాయి.
మోక్ష: పంచమి చేస్తుందా మీరు చేస్తున్నారా. శబరి నవ్వుతుంది.
మీనాక్షి: మోక్ష అడిగింది కరెక్టే కదా వదినా..
వైదేహి: మీకు ఏమైనా కళ్లు మూసుకుపోయాయా.. నన్నే ఎదురించింది మీరు చూడలేదా.. ఈ ఇంట్లో ఎవరైనా నన్ను ఎదురించడం మీరు చూశారా.
శబరి: ఒక అత్తగా నేను ఇప్పుడు నీకు ఈ ఇంటి నుంచి వెళ్లిపోమని అంటాను. గొడవ చేయకుండా వెళ్లిపోతావా..
వైదేహి: ఈ ఇంట్లో నేను తనూ ఒకటేనా.. తప్పంతా మీ దగ్గర పెట్టుకొని నేను దాన్ని అంటే ఏం లాభం.
మోక్ష: అమ్మ మీనాక్షి అత్తయ్యని కానీ బామ్మని కానీ అనే హక్కు నీకు లేదు అమ్మ. మన అందరి కంటే ముందు ఈ ఇళ్లు వంశం వాళ్లది. నువ్వు మేము అంతా కొత్తగా వచ్చిన వాళ్లం. నీకు ఏమైనా కోపం ఉంటే నన్ను అను అమ్మ అత్తయ్యని, బామ్మని ఏమైనా అంటే నేను ఊరుకోను.
వైదేహి: నువ్వు వినాల్సింది నా మాట. నీ మేలు కోరు చెప్తున్నా. పంచమిని వదిలేయ్ మోక్ష.
జ్వాల: మోక్ష కావాలనే టైం వేస్ట్ చేస్తున్నాడు. పంచమి మీద మనందరికీ అనుమానాలు ఉన్నాయని డైరెక్ట్‌గా అడగండి.
మోక్ష: మీ అందరికీ ముందే చెప్తేన్నా మీ అనుమానాలకు ఆధారాలు ఉంటేనే మాట్లాడండి. మీకు ఎవరికైనా నష్టం జరిగితే చెప్పండి పంచమిని నేను కచ్చితంగా నిలదీసి అడుగుతా. తప్పు చేసి ఉంటే పంచమి క్షమాపణ కూడా చెప్తుంది. మీకు పంచమి అంటే ఇష్టం లేదా ఇంట్లో ఉండటం ఇష్టం లేదా..
జ్వాల: పంచమి అంటే ఇష్టమో లేదో నువ్వు తేల్చుకో మోక్ష. పంచమి ఈ ఇంట్లో ఉండటం మాకు ఇష్టం లేదు.
మోక్ష: సింపుల్ దానికి ఎందుకు ఇంత పంచాయతీ. నేను పంచమి ఫారిన్ వెళ్లిపోతాం.
వైదేహి: నేను ఒప్పుకోను. అదెవర్తి కోసమో నేను నా కొడుకును దూరం చేసుకోవాలా.. నువ్వు ఈ గడప దాటడానికి వీళ్లేదు.
మోక్ష: అది కుదరదు నేను ఉన్న చోటే పంచమి ఉంటుంది. జరగని విషయాలు గురించి మరోసారి ఇలాంటి మీటింగ్స్ పెట్టకండి.
చిత్ర: అత్తయ్య మోక్ష మా మాట వినడు అని మాకు అర్థమైపోయింది. ఇక మా దారి మేం చూసుకుంటాం.
వైదేహి: అంటే ఏంటి మీ ఉద్దేశం.
జ్వాల: సింపుల్ విడిపోవడమే. ఎవరి వాటాలు వాళ్లకు పంచేస్తే బెటర్ అంటోంది చిత్ర.
వైదేహి: చూశారారా వీళ్లు ఎలా మాట్లాడుతున్నారో.
వరుణ్: అమ్మ మోక్ష భార్య మాటలకు కట్టుబడి ఉన్నప్పుడు మాకు మాత్రం తప్పుతుందా.
భార్గవ్: పెద్దమ్మ కలిసి గొడవలు పడటం కంటే విడిపోయి దగ్గరగా ఉండటమే బెటర్.
వైదేహి: నా గొంతులో ప్రాణం ఉండగా అలా జరగనివ్వను. ఆ ఒక్క దాని కోసం అందరం విడిపోవడమా. ఎలా అయినా సరే దాన్ని పంపించేస్తాను. మరొక్క సారి ఇలాంటి ప్రస్తావన నా దగ్గర తీసుకురాకండి.
జ్వాల: దాన్ని పంపించకపోతే మాత్రం మా దారి మేం చూసుకుంటాం.
శబరి: ఇప్పుడే చూసుకోండి. మీరు అడిగినట్లు మీ వాటా మీకు పంచినా మీకు పైసా రాదు. మొత్తం ఆస్తికి వారసులం నేను నా కొడుకులు నా కూతురు మీనాక్షి మా తదనాంతరమే మీకు. అంత వరకు వెళ్లి మీ బతుకులు మీరు బతకండి. మీ బెదిరింపులకు ఎవరూ ఇక్కడ భయపడే వారు లేరు. వెళ్లిపోండి. రా మీనాక్షి.
వైదేహి: నేను చూసుకుంటాను అని చెప్పాను కదా ఇక వెళ్లండి.
పంచమి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కూర్చొని కరాళి మాటలు తలచుకొని ఏడుస్తుంటుంది. ఇంతలో సుబ్బు అక్కడికి వస్తాడు. పంచమి కనీళ్లు తుడుస్తాడు.
సుబ్బు: రాటు తేలాలి అంటే ఎంతో కష్టపడాలి. సమస్య మీద సమస్య వస్తూ ఉంది అంటే ముందు ముందు పెద్ద యుద్ధమే రాబోతుంది అని అర్థం.
పంచమి: ప్రతీ క్షణం నాకు పోరాటం గానే ఉంది సుబ్బు విరామం అనేదే లేదు సుబ్బు. శత్రువులు పెరుగుతున్నారే కానీ తరగడం లేదు. ఓడిపోతాను ఏమో అని భయంగా ఉంది.
సుబ్బు: విజయమో వీర స్వర్గమో నిర్ణయించేది ధైర్యమే పంచమి. పిరికితనం కృంగదీస్తుంది. గుండె ధైర్యం ఉన్న వాళ్లు మాత్రమే గట్టిగా పట్టి విజయం సాధిస్తారు.
పంచమి: నాకు ధైర్యం ఉంది సుబ్బు కానీ ఆ కరాళి మోక్షని వదిలేలా లేదు.
సుబ్బు: నువ్వు దిగులు పడితే మోక్షని నువ్వే శత్రువులకు అప్పగించినట్లు. నాగ కన్యవి అయి ఉండి భూలోకంలో పుట్టావు అంటేనే అర్థం చేసుకోవాలి పంచమి. ఏదో సాధించడానికే నువ్వు ఇక్కడ పుట్టుంటావు. అదే సృష్టి రహస్యం. నీకు ఇంటా బయట నీ చుట్టూ శత్రువులే కనిపిస్తున్నప్పుడు ప్రతీ క్షణం నువ్వు అప్రమత్తంగా ఉండి వాళ్లకి ధైర్యంగా కనిపించాలి. మోక్షకి నువ్వు రక్షణ గోడవి పంచమి నువ్వు పక్కన ఉంటేనే మోక్ష క్షేమంగా సంతోషంగా ఉంటాడు. నువ్వు ఎప్పుడూ మోక్షతో ఉండి తీరాల్సిందే.
పంచమి: ఎలా అయినా కరాళీని ఓడించి మోక్షబాబుకి మేఘనకి పెళ్లి జరిపిస్తాను సుబ్బు. అప్పుడే నా బాధ్యత తీరిపోతుంది.
సుబ్బు: వాళ్లకు తెలీకుండా శత్రువులు కూడా సాయం చేస్తుంటారు పంచమి. కనిపించని శత్రువులు ఉన్నంత వరకు నువ్వు మోక్షని వదిలి వెళ్లలేవు.
పంచమి: మోక్షాబాబుకి ఒక్క కరాళినే పెద్ద శత్రువు.
సుబ్బు: ఏ రూపంలో ఉన్నా ఆ శత్రువు ఒక్కరు చాలు పంచమి.
కరాళి పంచమి మాటలు తలచుకొని రగిలిపోతుంది. కంత్రి, తంత్రీలను పిలిచి పూజకు ఏర్పాట్లు చేయమని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: దీపికా పదుకొణె: తల్లికాబోతున్న దీపికా పదుకొనె? - బేబీ బంప్ ఫొటో వైరల్!