Naga Panchami Serial Today April 16th: 'నాగ పంచమి' సీరియల్: పుత్రభిక్ష పెట్టమని తల్లి కాలిమీద పడ్డ మోక్ష ఫొటోకు దండ.. చనిపోయాడా.. అసలేం జరిగింది!
Naga Panchami Serial Today Episode పంచమి కడుపులో బిడ్డను చంపేయొద్దని మోక్ష తల్లి వైదేహి కాళ్ల మీద పడి వేడుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
![Naga Panchami Serial Today April 16th: 'నాగ పంచమి' సీరియల్: పుత్రభిక్ష పెట్టమని తల్లి కాలిమీద పడ్డ మోక్ష ఫొటోకు దండ.. చనిపోయాడా.. అసలేం జరిగింది! naga panchami serial today april 16th episode written update in telugu Naga Panchami Serial Today April 16th: 'నాగ పంచమి' సీరియల్: పుత్రభిక్ష పెట్టమని తల్లి కాలిమీద పడ్డ మోక్ష ఫొటోకు దండ.. చనిపోయాడా.. అసలేం జరిగింది!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/16/2ea6431f103b9e06b3a1e0a4c546842e1713250840185882_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Naga Panchami Today Episode మోక్ష ఎంత నచ్చచెప్పినా పంచమికి అబార్షన్ చేయించి తీరుతాననని వైదేహి చెప్తుంది. పంచమి కడుపు తీయించడం వల్లనే సమస్యలు పరిష్కారం అవుతాయని అంటుంది. దీంతో మోక్ష నాలో ప్రాణం ఉన్నంత వరకు అది జరగదని.. పంచమి బిడ్డను కంటుందని అదే తన నిర్ణయం అని తెగేసి చెప్తాడు.
వైదేహి: ఏంటి అత్తయ్య గారు చూస్తూ నిలబడ్డారు. మీరే కదా మన గురువు గారు కరెక్ట్‌గా చెప్తారు అని తీసుకెళ్లారు కదా. ఇప్పుడు మీరే మీ మనవడికి నచ్చచెప్పి ఒప్పించండి.
మోక్ష: చెప్పాను కదమ్మ ఈ విషయంలో దేవుడు వచ్చి చెప్పినా విననని.
వైదేహి: పంచమి నువ్వు అయినా చెప్పు ప్రమాదం నీ భర్తకే కదా. నీకు నీ బిడ్డ ముఖ్యమో నీ భర్త ముఖ్యమో చెప్పు.
పంచమి: అత్తయ్య గారు మోక్షాబాబుకి కానీ నా బిడ్డకు కానీ ఏం జరగకుండా కాపాడుకునే బాధ్యత నాది.
శబరి: అమ్మా వైదేహి మన గురువుగారు చెప్పిన విషయంలో నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఆయన మొదట చెప్పిన మాటలకు తర్వాత మాటలకు చాలా వ్యత్యాసం ఉంది.
మీనాక్షి: ఆ అనుమానం నాలోనూ ఉంది అమ్మ. కానీ అడగలేకపోయాను.
శబరి: ఈ విషయంలో నా అనుమానం తీరే వరకు వాదనలు అనవసరం.
మీనాక్షి: అమ్మా పద మనం మళ్లీ వెళ్లి అడిగి వద్దా ఇదేం చిన్న విషయం కాదు. పదమ్మా...
రఘురాం: ఈ విషయంలో తొందర పడకు వైదేహి.
పంచమి ఏడుస్తుంది. మోక్ష ఓదార్చుతాడు. తన తల్లి ఇక తమ బిడ్డ జోలికి రాదు అని వచ్చినా తాను ఊరుకోను అని అంటాడు. ఇక పంచమి తన వల్ల తల్లీ కొడుకుల మధ్య గొడవలు జరుగుతున్నాయని పంచమి ఏడుస్తుంది.
మోక్ష: మా అమ్మ మంచిది పంచమి కానీ ఆమె మూఢ నమ్మకాలే ఇప్పుడు మనకు శత్రువు. ఎలా అయినా మా అమ్మలో మూఢ నమ్మకం తొలగిస్తాను.
పంచమి: మీ అమ్మది ఏం తప్పులేదు మోక్షాబాబు. ఒకరు కాదు ఇద్దరు మన బిడ్డ వల్ల మీకు ప్రమాదం అని చెప్పారు. అందుకే అత్తయ్యగారు భయపడిపోతున్నారు. అందులోనూ ఆ మాటలు కూడా నన్ను పట్టి పీడిస్తున్నాయి. ఎందుకైనా మంచిది ఎవరైనా స్వామీజిని కలుద్దాం. పరిష్కారం ఏమైనా చూపిస్తారు.
మోక్ష: ఏం అవసరం లేదు పంచమి. నువ్వు బాధ పడితే ఆ ఎఫెక్ట్ మన బిడ్డ మీద పడుతుంది. మన బిడ్డ జోలికి ఇక ఎవరూ రారు వస్తే నేను ఊరుకోను అని వాళ్లకి అర్థమైపోయిందిలే. ప్రశాంతంగా ఉండు. ఏమీ మనసులో పెట్టుకోకు.
మరోవైపు స్వామీజీ తన వల్ల బిడ్డకు ఎలాంటి అన్యాయం జరగకూడదు అని నిజం చెప్పాలి అని బయల్దేరుతారు. ఇంతలో కరాళి స్వామీజీని ఆపుతుంది. తానో మంత్ర గత్తె అని పరిచయం చేసుకుంటుంది. తనని ఆవహించి అబద్ధం చెప్పించింది తానే అని చెప్తుంది. స్వామీజీ షాక్ అయిపోతారు.
కరాళి: ఆ కుటుంబం సర్వానాశనం కావాలి. అందుకే నేను వేచి ఉన్నా. నువ్వు అడ్డురాకు.
స్వామీజీ: నేను ఆ వంశం కుల గురువుని. ఆ కుటుంబానికి ఆపద వస్తే నేను చూస్తూ ఊరుకోను నీ అంతు చూస్తాను.
కరాళి: నీకు అంత శక్తి లేదు. చెప్పాను కదా నాకు అడ్డు వస్తే నీ ప్రాణాలు తీసేస్తా.
స్వామీజీ: పక్కకు తప్పుకో. నేను వెళ్లివాళ్లకి నిజం చెప్పాలి. నీ కారణంగా జరిగిన తప్పును సరిదిద్దాలి.
కరాళి: అది జరగని పని. నువ్వు వాళ్లని కలవకూడదు. పంచమి బిడ్డ కనకూడదు. నువ్వు వెనక్కి వెళ్లిపో..
స్వామీజీ: వెళ్లను..
కరాళి: ఒక పండితుడిని చంపే పాపం నాకు అంటగట్టకు.
స్వామీజీ: నా కంఠంలో ప్రాణం పోయినా సరే నా కారణంగా మరొకరికి అన్యాయం జరగనివ్వను. అని స్వామీజీ మంత్రం చెప్పి కరాళి మీదకు కళ్లతో పవర్ పంపించగా కరాళి కూడా తన శక్తితో తిప్పి కొడుతుంది. ఇక చెట్టు నుంచి ఊడలు వచ్చి స్వామీజీని కదలకుండా కట్టేస్తాయి. దీంతో స్వామీజీ స్ఫృహ కోల్పోతారు.
మరోవైపు వైదేహి సోదమ్మ వేషంలో కరాళి, కులగురువు చెప్పిన మాటలు తలచు కొని బాధ పడుతుంది. మోక్ష చనిపోయి ఫొటోకు దండ వేసినట్లు ఊహించుకొని గట్టిగా ఏడుస్తుంది. తన బిడ్డకు అలా జరగకూడదు. మోక్షకు ఏం కాకూడదు అని ఏడుస్తుంది. ఇంతలో మోక్ష అక్కడికి రావడంతో హత్తుకొని ఏడుస్తుంది.
మోక్ష: అమ్మ ఎవరి మాటలో వింటావు కానీ నా మాట వినవా.. ఎవరు ఎన్ని చెప్పినా నేను నా బిడ్డను కోల్పోనమ్మా.
వైదేహి: నేను అదే చెప్తున్నా నాన్న.
మోక్ష: నేను పోయినా నీకు మరొ కొడుకు ఉంటాడమ్మా.
వైదేహి: అలా మాట్లాడకు మోక్ష. నువ్వు లేని ఊహే నేను ఊహించలేను.
మోక్ష: నాకు పంచమికి మరో అవకాశం లేదమ్మ. అవునమ్మా. పంచమికి మరో బిడ్డను కనే అవకాశం లేదు. ఈ బిడ్డను చంపుకుంటే నాన్న అని పిలిపించుకునే అవకాశం మరి నాకు ఉండదు. నేను చెప్పేది నిజం అమ్మ పంచమికి ఇదే మొదటి, చివరి అవకాశం కూడా. ఇక ఎప్పటికీ తల్లి కాలేదు. గర్భసంచి వీక్‌గా ఉండటం వల్ల మరో బిడ్డను పంచమి కనలేదు అని డాక్టర్ చెప్పిన విషయం చెప్తాడు మోక్ష. దాంతో వైదేహి కూలబడిపోతుంది. ఇప్పుడు చెప్పమ్మా నన్ను ఏం చేయమంటావ్. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదమ్మ. ఎవరో చెప్పిన మాటల కోసం నేను పంచమి మా బిడ్డను పోగొట్టుకోలేం.
వైదేహి: కానీ నా బాధ నేను ఎవరికి చెప్పుకోవాలి నాన్న. చెట్టంత కొడుకును పొగొట్టుకోవాలా.
మోక్ష: అలా జరగదు అమ్మ.
వైదేహి: జరిగితే..
మోక్ష: తల్లి కాళ్లు పట్టుకొని.. అమ్మ అర్థం చేసుకో.. నన్ను పంచమిని అమ్మానాన్న అనే పిలుపునకు దూరం చేయొద్దు దయచేసి మా బాధ అర్థం చేసుకోమ్మా.. పుత్ర భిక్ష పెట్టమ్మా.. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: సత్యభామ సీరియల్: రుద్రకి ఎదురు తిరిగిన సత్య, తండ్రిని చూసి ఎమోషనల్.. ఇదేం తలనొప్పిరా అంటున్న క్రిష్!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)