అన్వేషించండి

Meghasandesham Serial Today  September 28th: ‘మేఘసందేశం’ సీరియల్‌: గగన్‌ సారీ చెప్పమన్న ప్రసాద్‌ – తగ్గేదే లేదన్న  గగన్‌

Meghasandesham Today Episode: వంశీకి సారీ చెప్తేనే ఇందును పెళ్లి చేసుకంటాడని ప్రసాద్‌ చెప్పగానే సారీ చెప్పను అని గగన్‌ చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesham Serial Today Episode:  నక్షత్ర వచ్చి గగన్‌ను సపోర్టు చేసి మాట్లాడుతుంది. అపూర్వ కోపంగా కొత్తగా వాణ్ని సపోర్టు చేసి మట్లాడుతున్నావు ఏంటి అని అడుగుతుంది. దీంతో సపోర్టు చేయడం కాదు మమ్మీ. అలా చేయడం గగన్‌ తప్పు కాదు కదా అంటుంది. దీంతో ఏం చేయాలో నాకు తెలుసు నువ్వు వెళ్లు అంటూ తిడుతుంది. నక్షత్ర వెళ్లిపోతుంది. మరోవైపు కృష్ణప్రసాద్‌ ఉదయం జరిగిన సంఘటన గురించి ఆలోచిస్తుంటాడు. ఇంతలో చెర్రి వస్తాడు.

చెర్రి: ఏంటి నాన్నా కూల్ డ్రింక్‌ తాగుతున్నాడా?

ప్రసాద్‌: మరేం చేయనురా? నా ముఖం కూడా ఇష్టపడని వాడితో నేను ఏం చేయాలిరా? తప్పు చేయని వాడితో సారీ చెప్పమని ఎలా అడగాలి.

చెర్రి: ఇలాంటి విషయాలు ఆలోచించాలి అంటే తాగాల్సింది ఇది కాదు నాన్నా ఇంకోటి తాగాలి. అది నీకు రాదు.

 అంటూ కూల్‌ డ్రింక్‌ తాగి బయటకు ఉమ్మేస్తాడు.

చెర్రి: ఏంటి నాన్నా ఏం కలిపావు ఇందులో..

ప్రసాద్‌: అది కొంచెం ధైర్యం కోసం మందు కలిపానురా? వాడు తప్పు చేయడని చెప్తుంటే ఈ ఇంట్లో ఎవ్వరూ నా మాట వినరురా? అందుకే వాణ్నే బతిమాలుకుంటే సరిపోతుంది. నువ్వే వాడి దగ్గరకు వెళ్లి కన్వీన్స్‌ చేయ్‌.

అని ప్రసాద్‌ చెప్పగానే చెర్రి నేను వెళ్లను అంటాడు. నువ్వు పెద్దవాడివి నిన్ను నాలుగు మాటలు అని వదిలేస్తాడు. నన్నైతే ఏకంగా కొట్టేస్తాడు.  అంటాడు. ప్రసాద్‌ బలవంతంగా చెర్రిని గగన్‌ దగ్గరకు పంపిస్తాడు.

చెర్రి: సోదరా.. అది ఇందును పెళ్లి చేసుకోబోయేవాడిని కొట్టావట కదా?

గగన్‌: తప్పు చేశాడు కొట్టాను. అయితే

చెర్రి: నువ్వు వచ్చి సారీ చెప్తే కానీ పెళ్లి చేసుకోను అంటున్నాడు. అది సారీ చెప్పకపోతే పెళ్లి ఆగిపోయేలా ఉందని అందరూ బాధపడుతున్నారు.

గగన్‌: సరే సారీ చెప్తే పెళ్లి చేసుకుంటాడా?

చెర్రి: అంతే కదా మరి.. అంతే సోదరా..!

గగన్‌: సరే చెప్పేద్దాం.. దానికి నువ్వు ఇంతలా బయపడాలా?

అంటూ చెర్రిని కొడతాడు. వాడికి నేను సారీ చెప్పాలన్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఇది అంటాడు. ఇదంతా చెర్రి కలగంటాడు. రానంటూనే ప్రసాద్‌ చెర్రిని కారు దగ్గరకు తీసుకెళ్తాడు. కారు ఎక్కిన తర్వాత చెర్రి కారులోంచి ఎస్కేప్‌ అవుతాడు. ప్రసాద్‌ ఒక్కడే గగన్‌ ఇంటికి వెళ్తాడు.  

గగన్‌: ఏమైంది అమ్మా.. ఎందుకు వచ్చాడంట..

పూరి: ఏమో అన్నయ్యా..

గగన్‌: మనతో ఈ ఇంటితో అవసరం లేనివాళ్లు దారి తప్పి వచ్చినట్లున్నారు. మనకెందుకు పద అమ్మా..

ప్రసాద్‌: గగన్‌.. నాముఖం చూడటమే కాదు. నేను ఇక్కడికి రావడం కూడా నీకు ఇష్టం లేదని నాకు తెలుసు. నీ కోపం నామీదే కానీ పిల్లల మీద కాదని నాకు తెలుసు. అయినా నీతో మాట్లాడుదామని ఇక్కడికి వచ్చాను. ఇందుకు మంచి సంబంధం వచ్చింది పెళ్లి ఘనంగా జరగబోతుంది అని అందరూ సంతోషపడుతుంటే నువ్వు వాణ్ని కొట్టావు. వాళ్లిప్పుడు పెళ్లి జరగదు అంటున్నారు. పెళ్లి జరగాలి అంటే నువ్వు క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు.

గగన్‌: ఏంటి క్షమాపణ చెప్పాలా? నేను వాడికి క్షమాపణ చెప్పాలా? అసలు వాడు ఏం చేశాడో తెలుసా? ఇందును రూంకి తీసుకెళ్లి తన జీవితం నాశనం చేయాలని చూశాడు. అందుకే కొట్టాను.

ప్రసాద్‌: అంటే వాడికి కాబోయే భార్య కదా?

గగన్‌: కాబోయే భార్యనే ఇంకా కాలేదు కదా? పెళ్లి కాకముందే అలా బయటికి పంపించడమే తప్పు. అలాంటిది వాడు అమ్మాయితో తప్పుగా ప్రవర్తిస్తుంటే వాణ్ని తన్నకుండా నన్నొచ్చి సారీ చెప్పమంటున్నావా?

ప్రసాద్‌: ఓరేయ్‌ నువ్వు క్షమాపణ చెప్పకుంటే ఇప్పుడు ఆ పెళ్లి జరగదురా?

గగన్‌: తండ్రివేనా నువ్వు.. కన్నకూతురు జీవితం నాశనం చేయబోయాడు అని తెలిశాక. పెళ్లి వద్దు అని నువ్వు చెప్పాలి కానీ వచ్చి క్షమాపణ చెప్పమని నన్ను అడుగుతున్నావా?

ప్రసాద్‌: అందరికీ ఆ సంబందం నచ్చింది నీ వల్లే ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోతుంది అంటున్నారురా?

 అనగానే గగన్‌ కోపంగా నేను సారీ చెప్పడం జరగదు అని చెప్పి లోపలికి వెళ్లిపోతాడు. ప్రసాద్‌ బాధగా చూస్తుండిపోతాడు. భూమి వచ్చి ఓదారుస్తుంది. కానీ ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదమ్మా అంటాడు. తర్వాత గగన్‌కు జ్యూస్‌ తీసుకెళ్లిన భూమి అతన్ని కొట్టడం తప్పేం కాదు కానీ ఆ ఇంట్లో వాళ్ల బాధ పడలేక వచ్చి అంకుల్‌ అడిగినట్లు ఉంది అంటుంది. అమ్మాయి కష్టంలో ఉంటే వెళ్లి కాపాడారు చూడండి అందుకే మీరంటే నాకు ఇష్టం అంటుంది భూమి. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.

ALSO READ:  డార్జిలింగ్ వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఈ టైం అస్సలు మిస్ అవ్వద్దు

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Avanthi Srinivas Resign To YSRCP: వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా..!
వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా..!
Manchu Mohan Babu Attack News: మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
Ponguleti Srinivas Reddy: ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
India Alliance YSRCP: మమతా బెనర్జీ నేతృత్వంలోకి ఇండియా కూటమి - చేరేందుకు వైఎస్ఆర్‌సీపీ సిద్దమని  సంకేతాలు ?
మమతా బెనర్జీ నేతృత్వంలోకి ఇండియా కూటమి - చేరేందుకు వైఎస్ఆర్‌సీపీ సిద్దమని సంకేతాలు ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sana Satish Babu TDP Rajyasabha | టీడీపీ రాజ్యసభకు పంపిస్తున్న ఈ వివాదాస్పద వ్యక్తి ఎవరంటే..? | ABP Desamగూగుల్‌ సెర్చ్‌లో టాప్‌ ప్లేస్‌లో పవన్ కల్యాణ్కొడుకుతో గొడవ తరవాత హాస్పిటల్‌లో చేరిన మోహన్ బాబుతమిళనాడులో ఘోర ప్రమాదం, బస్‌ని ఢీకొట్టిన ట్రక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Avanthi Srinivas Resign To YSRCP: వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా..!
వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా..!
Manchu Mohan Babu Attack News: మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
Ponguleti Srinivas Reddy: ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
India Alliance YSRCP: మమతా బెనర్జీ నేతృత్వంలోకి ఇండియా కూటమి - చేరేందుకు వైఎస్ఆర్‌సీపీ సిద్దమని  సంకేతాలు ?
మమతా బెనర్జీ నేతృత్వంలోకి ఇండియా కూటమి - చేరేందుకు వైఎస్ఆర్‌సీపీ సిద్దమని సంకేతాలు ?
Tiger Attack In Kakinada District: కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో పెద్దపులి సంచారం- వణికిపోతున్న ప్రజలు
కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో పెద్దపులి సంచారం- వణికిపోతున్న ప్రజలు
Year Ender 2024: ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిన 2024 - కొత్త స్టార్‌ పవన్ కల్యాణ్ - జగన్ బిగ్గెస్ట్ లూజర్  !
ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిన 2024 - కొత్త స్టార్‌ పవన్ కల్యాణ్ - జగన్ బిగ్గెస్ట్ లూజర్ !
Odisha Minor Rape Case: రేప్‌ చేశాడు, జైలుకెళ్లాడు, బెయిల్‌పై వచ్చి బాధితురాలని చంపేశాడు- శిక్షణ నుంచి తప్పించుకునేందుకు ఘాతుకం
రేప్‌ చేశాడు, జైలుకెళ్లాడు, బెయిల్‌పై వచ్చి బాధితురాలని చంపేశాడు- శిక్షణ నుంచి తప్పించుకునేందుకు ఘాతుకం
Weather Updates Today: బలపడిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు - తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్
బలపడిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు - తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్
Embed widget