అన్వేషించండి

Meghasandesham Serial Today  September 24th: ‘మేఘసందేశం’ సీరియల్‌: చెర్రీ, నక్షత్రకు పెళ్లి – గగన్‌ షర్ట్‌ వేసుకున్న భూమి

Meghasandesham Today Episode: ఇందు పెళ్లి బట్టలు తీసుకుంటూ నెక్ట్స్ చెర్రి, నక్షత్రకు పెళ్లి చేద్దాం అంటుంది మీరా దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesham Serial Today Episode:  ఇంటికి వచ్చిన నక్షత్ర, గగన్‌ ను గుర్తు చేసుకుంటూ లవ్‌ లో పడుతుంది. గగన్‌ చేసిన ఫైట్‌ ను గుర్తు చేసుకుంటూ వాడు మగాడు మమ్మీ.. ఇన్ని రోజులు వాడి పౌరుషాన్ని తక్కువ అంచనా వేశాను అనుకుంటుంది. మరోవైపు భూమి కూడా గగన్‌ ను గుర్తు చేసుకుంటుంది. గగన్‌ షర్ట్‌ తీసుకుని హత్తుకుని గగన్‌ ను హత్తుకున్నట్లుగా  ఫీలవుతుంది. గగన్‌ వచ్చి తనను హగ్‌ చేసుకున్నట్టు కలగంటుంది. ఇంతలో గగన్‌ వస్తాడు.

గగన్‌: ఏం చేస్తున్నావు.. నా షర్ట్‌ నువ్వు ఎందుకు వేసుకున్నావు. పైగా డాన్స్‌ కూడా చేస్తున్నావు.

భూమి: అదీ.. అదీ.. అదీ..

గగన్‌: ఓ మొన్నేమో చంద్రముఖి డ్రెస్‌ తో డాన్స్‌ చేశావు. ఇప్పుడు నా షర్టుతో డాన్స్‌ చేస్తున్నావా? ఈ డ్రెస్సుల పిచ్చి ఏంటి నీకు.

భూమి: ఓ ఈయనకు అలా అర్థం అయిందా? ( మనసులో అనుకుంటుంది.)

గగన్‌: ఏంటి ఇంకా అలా చూస్తున్నావు. నా షర్టు నాకు ఇచ్చేయ్‌.

భూమి: అమ్మా అర్థం అవుద్ది. చెల్లెలు అర్థం అవుద్ది. ఆఫీసులో జనం అర్థం అవుతారు. నా మనసు మాత్రం అర్థం కాదు.

గగన్‌: ఏయ్‌ తైతక్కా ఏంటి గులుగుతున్నావు.

భూమి: ఏం లేదు తలతిక్క గారు

గగన్‌: ముందు షర్టు ఇలా ఇవ్వు.

 అని షర్టు తీసుకుని గగన్‌ వెళ్ళిపోతాడు. భూమి ఆ షర్టు నేను వేసుకున్నాను తర్వాత అదే షర్టు ఆయన వేసుకుంటారుగా అని హ్యాపీగా ఫీలవుతుంది. మరోవైపు ఇందు పెళ్లి కోసం అందరూ బట్టల సెలెక్షన్‌ చేస్తుంటారు.

మీరా: వదిన ఈ చీర నీకు బాగుంటుంది చూడు.

బిందు: అమ్మా ఈ చీర చూడు ఈ రంగు నీకు భలే ఉంటుంది.

శాంతమ్మ: ముందు పెళ్లి కూతురిని చీరలు తీసుకోమనండి.

శరత్‌: కావాలంటే అన్ని చీరలు తననే తీసుకోమనండి.

ఇందు: నాకు చీరలైనా నగలైనా అత్తయ్య బాగున్నాయి అన్నవే తీసుకుంటాను.

అపూర్వ: చాలా బాగుంది కదా? ఇదైతే ఇంకా బాగుంది. ఇది పక్కన పెట్టు.. ఇది తీసుకుందాం.

ఇందు: చాలా బాగుంది అత్తయ్యా..

అపూర్వ: మీరా నీకు నచ్చినవి తీసుకో..

ప్రసాద్‌: మీరా నీకు నేను కొంటాను కానీ ముందు ఇందుకు ఏం కావాలో చూడు.

మీరా: అలాగే

ఇందు: నాకు అత్తయ్యా సెలెక్ట్‌ చేసినవి చాలు.

శాంతమ్మ: మొత్తానికి ఈ ఇంట్లో మొదటి పెళ్లి ఇందుది జరగబోతుంది.

మీరా: తర్వాతది చెర్రి, నక్షత్రదే కదా?

శాంతమ్మ: వాళ్లిద్దరికా..?

మీరా: అవును అత్తయ్య గారు. మా అన్నయ్య కూతురు ఉండగా నాకు ఎవరో కోడలుగా రావడం ఎందుకు.

 అనగానే శరత్‌ చంద్ర వాళ్లిద్దరికీ ఇష్టమైతే నాకేం అభ్యంతరం లేదు అంటాడు. దీంతో మీరా నక్షత్రను  అడుగుతానని.. బిందు చెర్రీని  అడుగుతానని వెళ్లి అడగి మీరిద్దరు మాట్లాడుకుని చెప్పండని వెళ్లిపోతారు. ఇద్దరూ ఒకరికొకరు ఇష్టం లేదని చెప్పుకుంటారు. ఇద్దరూ కిందకు వచ్చి తమకు ఇష్టం లేదని చెప్తారు. తర్వాత ఇందును పెళ్లి చేసుకునే వంశీ ఇందును తీసుకుని హోటల్‌ కు వెళ్తాడు. అక్కడే గగన్‌ ఆఫీసు మీటింగ్‌ లో ఉంటాడు. ఇందు, వంశీలను చూస్తాడు. ఇద్దరూ హోటల్‌ రూంలోకి వెళ్తారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.

ALSO READ: పొరపాటున కూడా ఇప్పుడు ఉప్పు, బట్టలు లాంటి వస్తువులు కొనద్దట! 

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today July 27th: 'గోదావరి' సీరియల్: రేయ్ సింహాద్రి తోట వదిలే ప్రసక్తే లేదు..! సూర్యకి షాక్‌ ఇచ్చిన భువన, సింహాద్రి! ఇంట్లో వాళ్లకి జాను చెప్పిన నిజమేంటి?
'గోదావరి' సీరియల్: రేయ్ సింహాద్రి తోట వదిలే ప్రసక్తే లేదు..! సూర్యకి షాక్‌ ఇచ్చిన భువన, సింహాద్రి! ఇంట్లో వాళ్లకి జాను చెప్పిన నిజమేంటి?
Nindu Manasulu Serial Today July 27th: నిండు మనసులు: సిద్ధూ వర్సెస్ ఎమ్మెల్యే కొడుకు! చేయి విరిచేసిన సిద్ధూ.. గణ మర్యాదకి కారణమేంటి?
నిండు మనసులు: సిద్ధూ వర్సెస్ ఎమ్మెల్యే కొడుకు! చేయి విరిచేసిన సిద్ధూ.. గణ మర్యాదకి కారణమేంటి?
Meghasandesam Serial Today July 27th: ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమి గదిలో ఆకాష్‌ను చూసిన అపూర్వ – అపూర్వ చెంప పగులగొట్టిన శరత్‌ చంద్ర
‘మేఘసందేశం’ సీరియల్‌: భూమి గదిలో ఆకాష్‌ను చూసిన అపూర్వ – అపూర్వ చెంప పగులగొట్టిన శరత్‌ చంద్ర
Karthika Deepam 2 Serial Today July 27th: కార్తీకదీపం 2 సీరియల్: దీప దశరథ్ కూతురని శ్రీధర్‌కి తెలిసిపోయిందా! సూరజ్ చేతిలో అదిరిపోయే స్వీట్ మెమోరీస్!
కార్తీకదీపం 2 సీరియల్: దీప దశరథ్ కూతురని శ్రీధర్‌కి తెలిసిపోయిందా! సూరజ్ చేతిలో అదిరిపోయే స్వీట్ మెమోరీస్!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో కలిసి భోజనం చేసిన విద్యార్థిని ఆత్మహత్య.. అంతలోనే ఏం జరిగింది?
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో కలిసి భోజనం చేసిన విద్యార్థిని ఆత్మహత్య.. అంతలోనే ఏం జరిగింది?
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Polimera 3 : పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
హైవే మీద, నగరంలోనూ అదరహో! MG Windsor EV 15,000 15,000km లాంగ్ టర్మ్ రివ్యూ
లాంగ్‌టర్మ్‌లో MG Windsor EV ఎలా ఉంది? 15,000km సుదీర్ఘ ప్రయాణంలో బయటపడిన నిజాలు
Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
Embed widget