అన్వేషించండి

Meghasandesham Serial Today  September 21st: ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమిని చంపమన్న అపూర్వ – నక్షత్రను ఎత్తుకెళ్లిన రౌడీలు

Meghasandesham Today Episode: తమ కారులో వస్తున్న అమ్మాయిని చంపమని అపూర్వ రౌడీలకు ఫోన్‌ చేసి చెప్తుంది. కారులో నక్షత్ర వెళ్లడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesham Serial Today Episode:  తన పర్సనల్‌ అసిస్టెంట్‌ ఇంటర్వూ కి వచ్చిన అమ్మాయి గగన్‌ చూసి రొమాంటిక్‌గా ఫీలవుతూ మాట్లాడుతుంటే గగన్‌ కోపంగా తిట్టి అక్కడి నుంచి పంపించి వేస్తాడు. అమ్మాయి వెళ్తుంటే చెర్రి ఎదురుగా వస్తాడు. అమ్మాయి డాష్‌ ఇవ్వగానే సారీ సిస్టర్‌ అంటాడు. గగన్‌ విచిత్రంగా చూస్తుంటాడు.

చెర్రి: సోదర ఈరోజు మన ఇంట్లో పసుపు దంచడంతో ఇందు పెళ్లి పనులు మొదలైనట్టే.. నువ్వు వచ్చి ఉంటే చాలా బాగుండేది.

గగన్‌: నేను రాకపోతేనే ఆ పెళ్లి హ్యాపీగా జరుగుతుందిరా.. నేను వచ్చి అందరి ఆనందాలను పాడు చేయడం ఎందుకులే కానీ నువ్వేంట్రా కొత్తగా కనిపిస్తున్నావు.

చెర్రి: నేనా కొత్తగానా? ఏం లేదే..? అదే పాత టీషర్ట్‌ అదే పాత ప్యాంటూ అందులోనూ మళ్లీ పాత నేను .

గగన్‌: వాటి గురించి కాదు ఫస్ట్‌ టైం నువ్వు ఒక అమ్మాయిని సిస్టర్‌ అనడం విన్నాను.

చెర్రి: అది ఒక అమ్మాయి మార్చింది.

గగన్‌: నిన్ను ఇంతలా మార్చిందంటే ఇంతకీ  ఆ అమ్మాయి ఎవరో చాలా గ్రేట్‌ రా.

చెర్రి: ఆ అమ్మాయి ఎవరో నీకు కూడా తెలుసు.

గగన్‌: నీతో చాలా మంది అమ్మాయిలను చూశాను వాళ్లలో ఎవర్రా..?

అని గగన్‌ అడగ్గానే ఇప్పుడు కాదులో తర్వాత చెప్తాను ముందు నీకే చూపించి నీ ఆశీర్వాదం తీసుకుని పెళ్లి చేసుకుంటాను అంటాడు. దీంతో గగన్‌, చెర్రీని విచిత్రంగా చూస్తుంటాడు. తర్వాత భూమి ఇంట్లో వాళ్లందరికీ డాన్స్‌ నేర్పిస్తుంది.

భూమి: మీరు చేయండి.

ప్రసాద్‌: అంటే భూమి నువ్వు చేసినట్టుగా మమ్మల్ని చేయమంటే ఎలా కుదురుతుందమ్మా..

భూమి: ట్రై చేస్తే ఏదైనా కుదురుతుంది అంకుల్‌.

మీరా: భూమి ఈ డాన్స్‌ నావల్ల కాదు.

భూమి: అంకుల్‌ చేస్తే ఆటోమేటిక్‌ గా మీరు చేస్తారు.

 అని చెప్పి డాన్స్‌ నేర్పిస్తుంది భూమి. దూరం నుంచి నక్షత్ర, ఇందు చూస్తూ ఇరిటేటింగ్‌ గా ఫీలవుతుంటారు.  

ఇందు: ఇంట్లో అందరితో డాన్స్‌ చేయిస్తుంది. నీతో కూడా చేయిస్తుందేమో..

నక్షత్ర: నాకు రాకపోతే కదా అది నాకు నేర్పించడానికి. ఈ పెళ్లిలో అందరిలో స్పెషల్‌ అట్రాక్షన్‌ నేనే అవుతాను చూడు.

ఇందు: పెళ్లిలో నువ్వు అవ్వడం తర్వాత. అక్కడ చూడు ఇంట్లో అందరి దగ్గర ఆ భూమి మార్కులు కొట్టేస్తుంది.

నక్షత్ర: మార్కులు కొట్టేయడం కాదు. మంచాన పడేటట్లు చేస్తాను చూడు.

 అంటూ నక్షత్ర అరటిపండు తిని భూమి డాన్స్‌ చేసే దగ్గర అరటి తొక్క వేస్తుంది. అప్పుడే అటుగా వచ్చిన అపూర్వ అరటితొక్క మీద కాలు వేసి కింద పడిపోతుంది. అందరూ డాన్స్‌ ఆపి షాక్‌ అవుతారు. అరటి తొక్కను చూసిన అపూర్వ దీనంతటికీ ఇదే కారణం అని మనసులో అనుకుంటుంది.

భూమి: ఈరోజుకు నేను నేర్పించిన స్టెప్స్‌ ప్రాక్టీస్‌ చేయండి నేను రేపు వస్తాను.

శరత్‌: అప్పుడే వెళ్లిపోతున్నావేంటమ్మా..

మీరా: అదేంటి అందరికీ డాన్స్‌ నేర్పించి మా అన్నయ్య, వదినకు డాన్స్‌ నేర్పించవా..?

శరత్‌: మీరందరూ చేస్తున్నారు కదా? నేనెందుకులే అమ్మా..

మీరా: అదేం కుదరదు మీరు చేయాలి అన్నయ్యా..

శరత్‌: సరే నువ్వు అంతలా అడిగితే కాదంటానా?

అపూర్వ: ఆహా నాకు కుదరదు. నాకు అసలే నడుం నొప్పిగా ఉంది.

శరత్‌: సరేలే అమ్మా  ఆంటీకి బాగా లేదంటుంది కదా రేపు చూద్దాం లే..

 అని ఎలా వెళ్తున్నావు అని అడిగి కారులో వెళ్లు అని చెప్తాడు. సరే అని భూమి వెళ్లిపోతుంది. నువ్వు వెళ్లేది ఇంటికి కాదే స్మశానానికి. నీకోసం నీ చావు ఎదురుచూస్తుంది అని మనసులో అనుకుంటుంది. రౌడీలకు ఫోన్‌ చేసి భూమిని  చంపమని చెప్తుంది. భూమిని కారులో వెళ్లనీయకుండా నక్షత్ర కారులో వెళ్తుంది. ఒక దగ్గర రౌడీలు ప్లాన్‌ ప్రకారం నక్షత్రను కిడ్నాప్‌ చేస్తారు. అపూర్వ ఫోన్‌ చేసి దాని దగ్గర ఉన్న ఫోన్‌ లాక్కుని చంపేయండి అని చెప్తుంది. రౌడీలు సరే అని ఫోన్‌ కట్‌ చేస్తారు. పాడుబడిన క్వారీ దగ్గరకు నక్షత్రను తీసుకెళ్తారు. మరోవైపు అపూర్వ డాక్టర్‌ దగ్గరకు వెళ్దామని కారు ఎక్కగానే భూమి వచ్చి కారు ఎక్కుతుంది. భూమిని చూసిన అపూర్వ షాక్‌ అవుతుంది. నువ్వు ఆ కారులో పోలేదా? అంటూ అడగ్గానే ఆ కారులో నీ కూతురే పోయింది అని చెప్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.

ALSO READ: అదృష్టాన్ని తీసుకొచ్చే పుట్టుమచ్చలు, శరీరంపై ఎక్కడ ఉంటే ఏం ప్రయోజనమో తెలుసా?

 

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today July 29th: నిండు మనసులు: సిద్ధూ గురించి గణ చెప్పిన మాటలకు ఎమ్మెల్యే షాక్! ప్రేరణ, ఐశ్వర్యలపై రంజిత్ ఫైర్!
నిండు మనసులు: సిద్ధూ గురించి గణ చెప్పిన మాటలకు ఎమ్మెల్యే షాక్! ప్రేరణ, ఐశ్వర్యలపై రంజిత్ ఫైర్!
Karthika Deepam 2 Serial Today July 29th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న కుటుంబాన్ని కుదిపేసిన మాలిని ఉంగరం! ఇంటి ద్రోహిని పట్టించిన సూరజ్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న కుటుంబాన్ని కుదిపేసిన మాలిని ఉంగరం! ఇంటి ద్రోహిని పట్టించిన సూరజ్!
Nuvvu leka Neanu Lenu Serial Today July 28th: బయటపడిన దొంగ చిట్టి నాటకాల బండారం...ఆ గండం నుంచి సుందరి ఎలా తప్పించుకుంది
నువ్వులేక నేను లేను: బయటపడిన దొంగ చిట్టి నాటకాల బండారం...ఆ గండం నుంచి సుందరి ఎలా తప్పించుకుంది
Podarillu Serial Today July 29th: శైలూ పెళ్లిచూపులు చెడగొట్టబోయి బొక్కబోర్లాపడిన చక్రి...పెళ్లికొడుకుని బెదరగొట్టి పంపిన శైలు
పొదరిల్లు: శైలూ పెళ్లిచూపులు చెడగొట్టబోయి బొక్కబోర్లాపడిన చక్రి...పెళ్లికొడుకుని బెదరగొట్టి పంపిన శైలు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
స్పీడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్‌.. కొత్త 2027 కవాసాకి నింజా 300 వచ్చేసింది, అప్పుడే డెలివరీలు కూడా ప్రారంభం
2027 కవాసాకి నింజా 300 ఎంట్రీ.. యూత్‌ కోసం స్మూత్‌ థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, పవర్‌లో తగ్గేదేలే!
Fridge Water : వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Embed widget