Meghasandesham Serial Today October 4th: ‘మేఘసందేశం’ సీరియల్: గగన్ కు అన్నం తినిపించిన భూమి – ఫ్రెండ్స్ తో గగన్ దగ్గరకు వెళ్లిన నక్షత్ర
Meghasandesham Today Episode: భూమి స్వయంగా వంట చేసుకుని గగన్ క క్యారియర్ తీసుకెళ్లి అన్నం తినిపించడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesham Serial Today Episode: ఇందు హల్దీ ఫంక్షన్ గ్రాండ్ గా జరుగుతుంది. ఫంక్షన్‌లో గగన్ ను వెనకేసుకొస్తుంది నక్షత్ర. తప్పు చేశాడని కొట్టాడు. తర్వాత పెళ్లి ఆగిపోకూడదని సారీ చెప్పాడు. గగన్ హీరోలకే హీరో కదా అంటుంది. దీంతో శరత్, అపూర్వ షాక్ అవుతారు. అపూర్వ కోపంతో నక్షత్రను కొడుతుంది. ఎవడే నీకు హీరో ఎలా చెప్తున్నావే అంటూ మందలిస్తుంది. వాడే పెళ్లి ఆపాలని చూశాడు. వాడి వల్లే పెళ్లి ఆగిపోతుందని నలుగురు అంటుంటే జనం ఎక్కడ చీ కొడతారోనని వెళ్లి సారీ చెప్పి వచ్చాడు. అదే వాడి హీరోయిజం. ఇంకొక్కసారి వాడి గురించి ఇంట్లో ఎవరైనా మాట్లాడారా మర్యాద ఉండదు అని వార్నింగ్ ఇస్తుంది అపూర్వ. మరోవైపు గగన్ కు క్యారియర్ తీసుకుని సైట్ దగ్గరకు వెళ్తుంది భూమి.
గగన్: ఏంటది..?
భూమి: భోజనం తెచ్చాను.
గగన్: అందరికా..?
భూమి: అందరికీ ఎందుకు తెస్తాను. మీకు ఒక్కరికే
గగన్: ఒక్కడికా..? బకాసురుడి బ్రదర్ అనుకున్నావా…?
భూమి: తినగలిగినంత తినండి.
గగన్: అసలు నిన్ను ఎవరు తెమ్మన్నారు. ఆర్డర్ చేసుకుంటాను కదా?
భూమి: ఆర్డర్ చేసుకుంటారు. హాస్పిటల్ కు వెళ్తారు.
గగన్: ఏయ్ ఎక్కువ మాట్లాడకు. నేను తీసుకురమ్మని చెప్పలేదే..?
భూమి: మీరు చెప్పరు కదా అందుకే తెచ్చాను.
గగన్: నువ్వు తెచ్చావా?
భూమి: అంటే అది ఆంటీ పంపించారు.
గగన్: సరేలే అక్కడ పెట్టు..
భూమి: ఆహా.. టైం ఒంటిగంట అయింది. తినిపించి తీసుకురమ్మన్నారు ఆంటీ.
గగన్: సరే వస్తున్నాను పదా..
అని గగన్ చెప్పగానే భూమి క్యారియర్ తీసుకెళ్లి భోజనానికి రెడీ చేస్తుంది. గగన్ ఇంకా రావడం లేదని అటూ ఇటూ చూస్తూ ఇప్పుడు వస్తే ఆయన చేత్తో ఆయన తింటారు. కానీ నా చేత్తే నేను తినిపించేలా చేయాలని పక్కనే ఉన్న ఆయిల్ గగన్ చేతుల మీద పోయాలని అనుకుంటుంది. గగన్ రాగానే చేతులు కడుక్కోమని ఆయిల్ ఇస్తుంది. దీంతో గగన్ చేతులు కడుక్కుని అయ్యో చేతులు దీంతో కడుక్కున్నాను అంటాడు. ఇంతలో భూమి కోపం ఎందుకులే నేను తినిపిస్తాను అంటుంది. గగన్ సరే అంటాడు. దీంతో భూమి అన్నం కలిపి గగన్‌కు తినిపిస్తుంది. ఇంతలో అక్కడికిక నక్షత్ర తన ఫ్రెండ్స్ తో వస్తుంది.
నక్షత్ర: ఏంటి నువ్వా..?
భూమి: నువ్వేంటి ఇక్కడ..?
నక్షత్ర: మా బావ కోసం వచ్చాను.
భూమి: బావ ఎవరు బావ. ఇంటికి వచ్చినప్పుడు నానా మాటలు అంటారు. ఇక్కడికి వచ్చి బావా అంటున్నావా..?
గగన్: ఏయ్ నువ్వు ఉండు… నీకేంటి పని ఇక్కడ..?
నక్షత్ర: కోట్ తెస్తానని చెప్పాను కదా?
భూమి: మరి కోటేది..?
నక్షత్ర: టేపు తెచ్చాను.
గగన్: టేపు ఎందుకు?
నక్షత్ర: కోటు కోసం వెళితే సైజులు తెలియలేదు. కొలతలు తీసుకుందామని
గగన్: ఇప్పుడు అవసరమా?
నక్షత్ర: నాకు అవసరమే.. తెస్తానని మాటిచ్చాను కదా… నువ్వు చూస్తావేంటి.. టేపు ఇవ్వు.
అని టేపు తీసుకుని గగన్ కొలుస్తుంది నక్షత్ర. భూమి ఇరిటేటింగ్ పీలవుతుంది. కింద కొలుస్తుంటే కిందేంటి పని అని భూమి అరుస్తుంది. మీ గోల ఆపండి నాకు పని ఉంది నువ్వు వెళ్లు ఇక అంటాడు. తింటున్నట్టు ఉన్నావు నేను తినిపించనా? బావ అని అడుగుతుంది నక్షత్ర. తినిపించడానికి నేనున్నాను ఇక్కడ అని భూమి తిడుతుంది. దీంతో నక్షత్ర వెళ్లిపోతుంది. తర్వాత భూమి కోపంగా కొలతలు తీసుకుంటుంటే ఏమీ అనరేంటి అని తిడుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఈ రాశిలో జన్మించినవారు ఆత్మలతో మాట్లాడతారా! వీరికి అతీంద్రీయ శక్తులు సైతం
Before You Go
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
ట్రెండింగ్ వార్తలు






















