అన్వేషించండి

Meghasandesham Serial Today  October 3rd: ‘మేఘసందేశం’ సీరియల్‌: గగన్‌ కు ముద్దు పెట్టిన భూమి – నక్షత్ర చెంప పగులగొట్టిన అపూర్వ

Meghasandesham Today Episode: తప్పు చేశాడని తెలిసినా కూడా గగన్  వెళ్లి వంశీకి సారీ చెప్పాడంటే నిజంగా  గగన్‌ గ్రేట్‌ అంటూ మెచ్చుకుంటుంది నక్షత్ర. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌  చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesham Serial Today Episode:  చీకట్లో గగన్‌ ను చూసి శారద అనుకుంటుంది భూమి. వెనక నుంచి హగ్‌ చేసుకుని మీరు ఎంతో అదృష్టవంతులు ఆంటీ ఎంత మంచి కొడుకుకు మీరు జన్మనిచ్చారు అని చెప్తుంది. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని ముద్దు పెట్టుకుంటుంది. ఇదేంటి ఏదో గరుకుగా తగులుతుంది అంటూ తిరిగి చూస్తుంది. ఇంతలో కరెంట్‌ వస్తుంది. గగన్‌ ను చూసిన భూమి సిగ్గుతో భయపడుతూ దూరంగా వెళ్తుంది. ఇంతలో శారద వచ్చి ఏమైందమ్మా అని అడుగుతుంది. గగన్‌ నిజం చెప్పబోతుంటే చెప్పొద్దని గగన్‌ కే సైగ చేస్తుంది భూమి. శారదను తీసుకుని  లోపలికి వెళ్తుంది. తర్వాత కారులో వెళ్తున్న గగన్‌కు అడ్డుగా చెర్రి వస్తాడు.

గగన్‌: అరేయ్‌ ఉరుములు  లేని మెరుపులా సడెన్‌ గ వచ్చావేంట్రా..

చెర్రి: సోదరా.. ఆనందం సోదరా.. ఇంట్లో వాళ్ల ఆనందాన్ని నీ ముందు కుమ్మరిద్దామని వచ్చాను.

గగన్‌: ఆ ఇంటి ఆనందాలతో నాకేం పని ఉంది.

చెర్రి: దానికి కారణమే నువ్వు కదా సోదరా..?

గగన్‌: నేను చేసే పనులకు వాళ్లు ఆనందం పడటం కూడానా?

చెర్రి: మామూలు ఆనందం కాదు సోదరా. వరద పొంగినట్టు.. సునామీ తీరం ఎగిసిపడినట్టు పొంగి పోతున్నారు అందరూ. అసలు ఆ వంశీ చేసిన పనికి నువ్వు క్షమాపణ చెప్తావని నేను అసలు ఊహించలేదు సోదర.

 ఇంతలో కారులోంచి బయటకు వచ్చిన ప్రసాద్‌ ను చూస్తాడు గగన్‌. కోపంగా ఏదో అనబోతుంటే గగన్‌ డైలాగ్‌, ప్రసాద్‌ డైలాగ్‌ అన్నీ చెర్రి చెప్తాడు. దీంతో గగన్‌  కోపంగా ప్రసాద్‌ ను తిడతాడు. నేను క్షమాపణ చెప్పింది మా అమ్మకోసం చెప్పాను.. ఇలా ప్రతిదీ అవకాశంగా చేసుకుని వద్దన్నా నా చుట్టు తిరగడం చేయోద్దు అని వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతాడు.

చెర్రి: సారీ నాన్నా అలా అంటేనన్నా సోదరుడి మనసు మారుతుందేమోనని నేను అనేశాను. అయినా ఆ కోపం నీ మీద కాదు నాన్నా.. నా మీద.

ప్రసాద్‌: అయినా వాడు అనడానికి నేను వినడానికి అలవాటు పడిపోయానురా. వాడి ప్రేమను చంపేసి ఆ కోపానికి ప్రాణం పోసింది నేనేరా..? పడాల్సి అవసరం నాకు ఉంది. నన్ను వాడు ఎన్ని మాటలు అన్నా నా పిల్లలు ఇద్దరు కలిసి ఉన్నారు. ఆ ఆనందం చాలు నాకు.

చెర్రి: నాన్నా ఏంటి నాన్నా ఆ మాటలు.

ప్రసాద్‌: రేయ్‌  అంత తొందరగా ఏమీ పోనులేరా? చేసిన  పాపాలకు  అనుభవించాలిగా..

 అంటూ ఇద్దరూ కలిసి అక్కడి నుంచి వెళ్లిపోతారు. మరోవైపు శారద వంట చేస్తుంటే పూరి వచ్చి కూరగాయలు అంత లావుగా కాదు అమ్మా సన్నగా తరుగు అని చెప్తుంది. దీంతో వంట చేయడం రాదు కానీ నాకే చెప్తున్నావా? అంటుంది. ఇంతలో భూమి వచ్చి వంట చేస్తున్నారా?అంటూ అడుగుతుంది. అవునని పూరికి ఇష్టమని కూరలు చేస్తున్నాను అని చెప్తుంది. అయితే మీ అబ్బాయికి ఇష్టమైనవి చేయరా? అని అడుగుతుంది భూమి. గగన్‌ కు ఇష్టమైన వంటలు కనుక్కుని వంట నేను చేస్తాను మీరు వెళ్లండి ఆంటీ అని భూమి వంట చేస్తుంది. తర్వాత గగన్‌ కు క్యారియర్‌ పంపిస్తుంది. మరోవైపు ఇందు హల్దీ ఫంక్షన్‌ గ్రాండ్‌ గా జరుగుతుంది. ఫంక్షన్‌లో గగన్‌ ను వెనకేసుకొస్తుంది నక్షత్ర. దీంతో శరత్‌, అపూర్వ షాక్‌ అవుతారు. అపూర్వ కోపంతో నక్షత్రను కొడుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.

ALSO READ: ఈ రాశిలో జన్మించినవారు ఆత్మలతో మాట్లాడతారా! వీరికి అతీంద్రీయ శక్తులు సైతం

 

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today October 15th: 'గోదావరి' సీరియల్: జాను, సూర్యల లవ్ మేటర్ శేషుకి చెప్పేసిన సింహాద్రి! నందుకి డబ్బు ఇచ్చిన మురళీ!
'గోదావరి' సీరియల్: జాను, సూర్యల లవ్ మేటర్ శేషుకి చెప్పేసిన సింహాద్రి! నందుకి డబ్బు ఇచ్చిన మురళీ!
Nindu Manasulu Serial Today October 15th: నిండు మనసులు: ప్రేరణ ఇంటికి లగేజ్‌తో వచ్చేసిన సిద్ధూ! టాస్ గెలిచిన ప్రేరణ! సంతోషంలో రాజశేఖరం!
నిండు మనసులు: ప్రేరణ ఇంటికి లగేజ్‌తో వచ్చేసిన సిద్ధూ! టాస్ గెలిచిన ప్రేరణ! సంతోషంలో రాజశేఖరం!
Nuvvu leka Neanu Lenu Serial Today Oct 15: విక్కీని మెడపట్టి బయటకు గెంటేసిన రాధమ్మ..అత్తగారింట్లోనే ఉండిపోవాలని అల్లుడి నిర్ణయం
నువ్వులేక నేను లేను: విక్కీని మెడపట్టి బయటకు గెంటేసిన రాధమ్మ..అత్తగారింట్లోనే ఉండిపోవాలని అల్లుడి నిర్ణయం
Karthika Deepam 2 Serial Today October 9th: కార్తీకదీపం 2 సీరియల్: నాన్న నువ్వు ఇంకా బతికే ఉన్నావా.. కుప్పకూలిపోయిన దక్షిణామూర్తి! రివేంజ్ తీర్చుకున్న మాలిని!
కార్తీకదీపం 2 సీరియల్: నాన్న నువ్వు ఇంకా బతికే ఉన్నావా.. కుప్పకూలిపోయిన దక్షిణామూర్తి! రివేంజ్ తీర్చుకున్న మాలిని!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
Chandrababu Vijay River Interlinking: చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
Embed widget