అన్వేషించండి

Meghasandesam Serial Today September 1st: ‘మేఘసందేశం’ సీరియల్‌: బొమ్మ కోసం గగన్‌ ఇంటికి వెళ్లిన భూమి – బయటకు గెంటేసిన గగన్‌

Meghasandesam serial today episode September 1st: తన ఇంటికి వచ్చిన భూమిని బయటకు గెంటేస్తాడు గగన్‌. భూమి ఎంత చెప్పినా వినడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.    

Meghasandesam Serial Today Episode: నక్షత్ర రూంలో కూర్చుని మందు తాగుతూ ఉంటుంది. ఇంతలో చెర్రి వస్తాడు. మందు తాగడం చూసి షాక్‌ అవుతాడు. ఇంట్లో అందరూ ఉన్నా కూడా మందు తాగుతున్నావా..? అని అడుగుతాడు.

నక్షత్ర: బాధరా బాధ

చెర్రి: దేనికి నీకు బాధ

నక్షత్ర: నచ్చిన గగన్‌ బావను చేసుకుని నాకు నచ్చినట్టు నేను బతకాలి అనుకుంటే మధ్యలో నువ్వొచ్చి తాళి కట్టి నా లైఫ్‌ను స్పాయిల్‌ చేశావు.

చెర్రి: చేశాను. మరి నువ్వు చేసింది ఏంటి..? భూమి లైఫ్‌ను స్పాయిల్‌ చేయాలనుకోలేదు. మొన్న ఒకసారి మా అన్నయ్య ఇంటికి వెళ్లి మందు తాగి గొడవ చేశావు. ఈరోజు ఇంట్లోనే కూర్చుని తాగుతున్నావు. ఇలా కాదు ఇప్పుడే మామయ్యను పిలిచి నీ నిజస్వరూరం ఏంటో ఆయనకు చూపించేస్తాను.

నక్షత్ర: ఓరేయ్‌ చెర్రి నీది ఇంకా నైంటీ స్పీడురా..? నాది ట్వంటీ ట్వంటీ స్పీడు ఎలా ఉంటుందో శాంపుల్  చూపించనా..? ఇదిగో ఈ గ్లాస్‌ పట్టుకో..

అంటూ చెర్రి గ్లాస్‌ పట్టుకున్నాక అందులో కాస్త మందు పోసి చెర్రి మీద చల్లుతుంది. చెర్రి ఇరిటేటింగ్‌ గా నక్షత్ర ఏం చేస్తున్నావు అంటాడు.

నక్షత్ర: ఇప్పుడు మా నాన్నను పిలిచి నిన్ను తిట్టించమంటావా..?

చెర్రి: తాగింది నువ్వైతే నన్నెందుకు తిడతారు.

నక్షత్ర: ఈ నక్షత్ర అనుకుంటే  ఏదైనా అవుతుంది. కావాలంటే నీకు ప్రాక్టికల్‌ గా చూపిస్తాను చూడు..

అంటూ తనను తాను కొట్టుకుంటూ ఏడుస్తూ.. డాడీ చెర్రి తాగేసి నన్ను కొట్టేస్తున్నాడు నన్ను కాపాడు డాడీ అంటూ అరుస్తుంది. ఇంతలో శరత్‌ చంద్ర, భూమి రూంలోకి పరుగెత్తుకుని వస్తారు.

శరత్‌: ఏమైందమ్మా.. ఎందుకు ఏడుస్తున్నావు..

నక్షత్ర: చూడు డాడీ పట్టపగలు చెర్రి ఇంట్లో మందు తాగుతున్నాడు. వద్దన్నందుకు నన్ను కొడుతున్నాడు. నేను ఈ ఇంటి అల్లుడిని నాకు అన్ని హక్కులు ఉన్నాయి. కాదని చెప్పడానికి నువ్వెవరు అంటున్నాడు డాడీ.

శరత్: నీకేమీ చేతకాదు. నువ్వు దేనికీ పనికిరావని తెలిసినా కూడా మేనల్లుడివి అని ఒకే ఒక్క కారణంతో నేను ఇన్నాళ్లు భరిస్తున్నాను. నా కూతురు మెడలో తాళి కట్టినా నా కళ్ల ముందే ఉంటారని ఊరుకున్నాను. అయినా నువ్వు రెచ్చిపోయి నా ఇంట్లోనే తాగుతూ.. నా కూతురు మీదే చేయి చేసుకుంటావా.? ఇక నిన్ను క్షమించనురా..?

అంటూ చెర్రిని కొడుతుంటాడు. భూమి వద్దు నాన్నా అంటూ అడ్డు పడుతుంది. శరత్‌ చంద్ర కోపంగా భూమిని తిట్టి చెర్రికి వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతాడు. తర్వాత శివ తీసుకొచ్చిన బొమ్మ కోసం గగన్‌ ఇంటికి భూమి వెళ్తుంది. ఇంట్లో అంతా వెతుకుతుంది. గగన్‌ వాళ్లు తింటుంటారు. రత్న భూమిని చూస్తుంది.

రత్న: మేడం ఈ అమ్మాయి ఎవరు మేడం.. ఇల్లంతా వెతుకుతుంది.

 గగన్‌: ఆగు.. నీ సొంతింట్లో తిరిగినట్టు తెగ తిరిగేస్తున్నావు..

భూమి: బొమ్మ కోసం వెతుకుతున్నాను.. ఆ బొమ్మ ఎక్కడుంది. ఈ అబ్బాయి తీసుకొచ్చాడు కదా ఆ బొమ్మ కావాలి నాకు. అది నాకు చాలా ముఖ్యం..

భూమి బొమ్మ గురించి అడగ్గానే రత్న షాక్‌ అవుతుంది.

గగన్‌: బొమ్మ లేదు గిమ్మ లేదు ముందు మా ఇంట్లోంచి వెళ్లు.. వెళ్లిపో..

అంటూ గగన్‌ కోపంగా భూమి చేయి పట్టుకుని బయటకు లాగేస్తాడు. వచ్చి మళ్లీ భోజనం చేస్తుంటాడు. శారద, పూర్ణి బాధగా చూస్తుంటారు. ఇంతలో భూమి పరుగెత్తుకుంటూ పైకి వెళ్లి గగన్‌ రూంలో ఉన్న బొమ్మను చూస్తుంది. బొమ్మను తీసుకుని హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 13th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: క్రిష్‌కి అమ్మవారు! కనికరం లేకుండా బయటకు గెంటేసిన పద్మాక్షి, సహస్ర!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: క్రిష్‌కి అమ్మవారు! కనికరం లేకుండా బయటకు గెంటేసిన పద్మాక్షి, సహస్ర!
Godavari Serial Today November 13th: 'గోదావరి' సీరియల్: సంజయ్‌ని వణికించేసిన జాను! మురళీ ముఖాన చీర విసిరి కొట్టిన నందు!
'గోదావరి' సీరియల్: సంజయ్‌ని వణికించేసిన జాను! మురళీ ముఖాన చీర విసిరి కొట్టిన నందు!
Nindu Manasulu Serial Today November 13th: నిండు మనసులు: కుమిలి కుమిలి ఏడుస్తున్న ప్రేరణ! వదిలేసి వెళ్లిపోయిన సిద్ధూ!
నిండు మనసులు: కుమిలి కుమిలి ఏడుస్తున్న ప్రేరణ! వదిలేసి వెళ్లిపోయిన సిద్ధూ!
Illu Illalu Pillalu Serial Today November 13th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ట్రావెల్ ఏజెన్సీకి రామరాజు పేరు! వల్లీ రాకతో మండిపోయిన చందు!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ట్రావెల్ ఏజెన్సీకి రామరాజు పేరు! వల్లీ రాకతో మండిపోయిన చందు!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
Vizag CII Summit: రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
AP Panchayat Elections: ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
Matt Henry Sixer: కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
Ravi Babu Scary Picture : బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
Telangana Congress: భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
KFC and Dominos Outlets: ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. హైదరాబాద్‌లో కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్‌లెట్స్ క్లోజ్ చేయాలని ఆదేశాలు
ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. హైదరాబాద్‌లో కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్‌లెట్స్ క్లోజ్ చేయాలని ఆదేశాలు
Bigg Boss Season 10 Today Nov 13th Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: యూకీ మా.. వచ్చేసిందోచ్.. త్రిగుణ్‌ ఆనందం.. నీతూ మాస్టర్ కన్నీరు!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: యూకీ మా.. వచ్చేసిందోచ్.. త్రిగుణ్‌ ఆనందం.. నీతూ మాస్టర్ కన్నీరు!
Embed widget