అన్వేషించండి

Meghasandesam Serial Today October 23rd: ‘మేఘసందేశం’ సీరియల్‌:  శరత్‌ కాల్చడంతో చనిపోయిన కేపీ -  దుఃఖసాగరంలో గగన్‌

Meghasandesam serial today episode October 23rd: అపూర్వను చంపడానికి వెళ్లిన కేపీని శరత్‌ చంద్ర కాల్చేయడంతో కేపీ చనిపోతాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.   

Meghasandesam Serial Today Episode: అపూర్వను బయటకు పిలిచిన కేపీ కత్తితో అపూర్వను చంపేయబోతాడు. దీంతో అపూర్వ తప్పించుకుని అక్కడి నుంచి పారిపోతుంది. విషయం తెలుసుకున్న శరత్‌ చంద్ర గన్‌ తీసుకుని అపూర్వను ఫాలో అవుతాడు. కేపీ కత్తితో అపూర్వను చంపడానికి ప్రయత్నిస్తుంటే శరత్‌ చంద్ర చూసి గన్‌ తో బెదిరిస్తాడు. అయినా కేపీ వినకపోవడంతో శరత్‌ చంద్ర నిజంగానే కాలుస్తాడు. బుల్లెట్‌ తగలడంతో కేపీ అక్కడికక్కడే కింద పడిపోతాడు. హాస్పిటల్‌కు తీసుకెళ్లినా బతకడు. దీంతో కేపీ వాళ్ల అమ్మ శారదకు ఫోన్‌ చేస్తుంది.

శారద: అత్తయ్య ఏంటి ఈ టైంలో ఫోన్‌ చేస్తుంది. అయినా ఎప్పుడూ లేనిది అత్తయ్య ఫోన్‌ చేయడం ఏంటి..?

అనుకుంటూ కాల్ లిఫ్ట్‌ చేస్తుంది శారద. వాళ్ల అత్తయ్య ఏడుస్తూ ఫోన్‌ మాట్లాడుతుంది.  

శారద: ఏంటి అత్తయ్య ఏమైంది.. ? ఎప్పుడూ లేనిది మీరు ఫోన్‌ చేశారేంటి.? ఎందుకు ఏడుస్తున్నారు చెప్పండి అత్తయ్య..

అత్తయ్య: నీకెలా చెప్పాలి శారద.. ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదమ్మా..?

శారద: ఏంటి అత్తయ్యా అలా మాట్లాడుతున్నారు.. ఏమైంది అత్తయ్యా చెప్పండి..

అత్తయ్య: నా కొడుకు మనల్ని అందరినీ వదిలేసి వెళ్లిపోయాడు అమ్మా..

శారద: ఏం మాట్లాడుతున్నారు అత్తయ్యా..? అసలు ఏం జరిగింది….?

అత్తయ్య: అవునమ్మ శారద.. కేపీ మనకు ఇక లేడమ్మా..?

అంటూ ఏడుస్తుంటే.. శారద కూడా ఏడుస్తూ కూలబడిపోతుంది. శారద ఏడుపు సౌండ్‌ విని భూమి పరుగెత్తుకుంటూ వస్తుంది. శారద బోరున ఏడ్వడం చూసి షాక్‌ అవుతుంది. ఇంతలో పూర్ణి, శివ పరుగెత్తుకు వస్తారు.

భూమి: అత్తయ్యా ఎందుకు ఏడుస్తున్నారు..? ఏమైంది అత్తయ్యా చెప్పండి..?

శారద: ఏం చెప్పాలి భూమి… నా నోటితో నేను ఏమని చెప్పను భూమి..

భూమి: అత్తయ్యా ఏం జరిగిందో చెప్పండి అత్తయ్యా..

శారద: మీ మామయ్య మనల్ని అందరినీ వదిలేసి వెళ్లిపోయారు భూమి..

భూమి: అత్తయ్యా ఏం జరిగింది అత్తయ్యా మీరు అలా మాట్లాడకండి

అంటూ భూమి చెప్తుంటే.. లేదమ్మా భూమి ఇప్పుడే అత్తయ్యా ఫోన్‌ చేశారు అంటూ ఆమె ఫోన్‌ చేసి చెప్పిన విషయం శారద, భూమికి చెప్తుంది. వెంటనే భూమి కూడా ఉన్న చోటనే కూలబడిపోతుంది. మరోవైపు శరత్‌ చంద్ర ఇంట్లో కేపీ శవం ఉంటుంది. శవం దగ్గర మీరా, చెర్రి, బిందు ఏడుస్తుంటారు. అపూర్వ, శరత్‌ చంద్ర నిలబడి చూస్తుంటారు. ఇంతలో శరత్‌ చంద్ర తాను కేపీని కాల్చింది గుర్తు చేసుకుని ఎమోషనల్‌ అవుతాడు. మరోవైపు ఇంట్లో శారద ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి గగన్‌ వస్తాడు. శారద ఏడుస్తూ ఉండటం చూసి కంగారు పడతాడు.

గగన్: అమ్మ ఏమైంది అమ్మా.. ఎందుకు ఏడుస్తున్నావు.. చెప్పమ్మా..? ( శారద ఏడుస్తూనే ఉంటుంది. పక్కనే కూర్చున్న భూమి ఏడుస్తూనే ఉంటుంది.) ఏయ్‌ భూమి ఏమైంది ఎందుకు ఇద్దరూ కలిసి ఏడుస్తున్నారు.. చెప్పండి..

అంటూ గగన్‌ అడిగినా ఏం చెప్పాలో తెలియక ఎలా చెప్పాలో తెలియక భూమి, శారద ఏడుస్తుంటారు. ఇక లాభం లేదనుకుని గగన్‌ గట్టిగా అడిగేస్తాడు.

శారద: మీ నాన్న చచ్చిపోయారురా..? ఆయనిక మనకు లేరు నాన్న గగన్‌..

అంటూ శారద చెప్పగానే గగన్‌ షాక్ అవుతాడు. ఏం మాట్లాడాలో అర్థం కాక ఎమోషనల్‌ అవుతుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Gundeninda Gudigantalu August 17th:ప్రభావతిని ఆడుకున్న మీనా,బాలు...పార్లరమ్మకు శృతి చేసిన మేలు ఏంటి..?
గుండెనిండా గుడిగంటలు: ప్రభావతిని ఆడుకున్న మీనా,బాలు..! పార్లరమ్మకు శృతి చేసిన మేలు ఏంటి..?
Podarillu Serial Today August 17th:మాధవ్‌ కోసం అమ్మవారికి మొక్కు చెల్లించిన మహాలక్ష్మీ...కేశవ్‌ లేడని తెలిసి శైలూకు బలవంతంగా పెళ్లి
పొదరిల్లు సీరియల్: మాధవ్‌ కోసం అమ్మవారికి మొక్కు చెల్లించిన మహాలక్ష్మీ..! కేశవ్‌ లేడని తెలిసి శైలూకు బలవంతంగా పెళ్లి
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 17th: నువ్వులేక నేను లేను: వ్రతం సమయానికి ఇంటికి చేరుకున్న రాధ..! సుందరి, దమయంతికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌!
నువ్వులేక నేను లేను: వ్రతం సమయానికి ఇంటికి చేరుకున్న రాధ..! సుందరి, దమయంతికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌!
Godavari Serial Today August 17th: 'గోదావరి' సీరియల్: తమ్ముడిని రెచ్చగొట్టిన నిత్య! సూర్య కోసం అందంగా ముస్తాబైన జానుకి నిశ్చితార్థం గురించి తెలుస్తుందా!
'గోదావరి' సీరియల్: తమ్ముడిని రెచ్చగొట్టిన నిత్య! సూర్య కోసం అందంగా ముస్తాబైన జానుకి నిశ్చితార్థం గురించి తెలుస్తుందా!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget