అన్వేషించండి

Meghasandesam Serial Today October 22nd: ‘మేఘసందేశం’ సీరియల్‌: ఇంట్లో ఫోటోలు పగులగొట్టిన గగన్‌ - నవ్వుతూ ఆట పట్టించిన భూమి

Meghasandesam serial today episode October 22nd:  గోడకు తగిలించిన పెళ్లి ఫోటోలు గగన్ చూసి కింద పడేస్తాడు. అవి పగలవు దీంతో భూమి నవ్వుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: తమ పెళ్లి ఫోటోలు ప్రేమ్‌ కట్టించి హాల్లో గోడకు తగిలిస్తుంది భూమి. అప్పుడే పై నుంచి వచ్చిన గగన్‌ ఆ ఫోటోలు చూసి షాక్‌ అవుతాడు. కోపంగా ఎవరు తగిలించారు ఇక్కడ.. అనుకంటూ గట్టిగా శారద వాళ్లను పిలుస్తాడు. శారద, పూర్ణి, శివ వస్తారు.

గగన్‌: అమ్మా ఏంటిది ఎవరు పెట్టించారు ఇక్కడ.. అసలు ఇది ఇల్లనుకున్నారా..? ఫోటో ఎగ్జిబిషన్‌ అనుకున్నారా..? అయినా ఈ ఫోటోలు ఎలా వచ్చాయి ఇక్కడికి

శారద: నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు నాన్న.. అసలు ఏం జరిగింది.

గగన్‌: అమ్మా ఆ గోడకు చూడమ్మా.. ఫోటోలు ఆ ఫోటోల గురించే నేను చెప్పేది

అని గగన్‌ చెప్పగానే.. శారద ఫోటోలు చూస్తుంది. షాక్‌ అవుతుంది.

శారద: అవును ఈ ఫోటోలు ఇక్కడకు ఎలా వచ్చాయి. అసలు మేమంతా ఇంట్లోనే ఉన్నాం ఇంతలో ఈ ఫోటోలు ఇక్కడ ఎవరు పెట్టారు..? ఈ ఫోటోలు ఇక్కడ ఎవరు పెట్టారో నిజంగా నాకు తెలియదు నాన్న..

గగన్‌: అమ్మా నీకు తెలియకుండా ఇంట్లో ఫోటోలు ఎవరు పెడతారమ్మా..? ఏయ్‌ పూర్ణి నువ్వైనా చెప్పు.. ఎవరు పెట్టారు. ఏయ్‌ శివ చెప్పు ఎవరు పెట్టారు.. చెప్పండి.. అసలు ఎవరు పెట్టారు… ముందు ఈ ఫోటోలను తీసిపారేయాలి.

అంటూ గగన్‌ కోపంగా ఊగిపోతుంటే.. చాలా కూల్‌గా భూమి పైనుంచి వస్తుంది.

భూమి: బావ ఆగు.. ఎందుకు అంత ఆవేశపడతావు.. ఆ ఫోటోలు నేనే అక్కడ పెట్టించాను.. తీసేయెద్దు బావ ఉండని..

అనుకుంటూ భూమి కిందకు వస్తుంది. భూమిని చూసిన గగన్‌ కోపంతో ఊగిపోతుంటాడు. దగ్గరకు రాగానే కొట్టేంత  పని చేస్తాడు. భూమి మాత్రం నవ్వుతూనే ఉంటుంది.

గగన్‌: ఏయ్‌ తైతక్క ఎందుకు పెట్టించావు.. ఎలా పెట్టించావు.. ఎప్పుడు మనిద్దరం ఇలా పెళ్లి బట్టలు కట్టుకని అలా బాసికాలు కట్టుకుని.. నుదుటిన బొట్టు పెట్టుకుని ఎప్పుడు పెళ్లి చేసుకున్నాం.. ఎప్పుడు ఈ ఫోటోకు అంత కూల్‌గా ఫోజులిచ్చాం.. చెప్పు.. . అసలు ఇదంతా ఎందుకు చేయించావు.. అంతా గ్రాఫిక్స్‌ ఫోటోలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి షో చేయాలనుకుంటున్నావా..? చెప్పు ఎందుకు పెట్టావు.. అసలు..

భూమి: కూల్‌ కూల్ బావ ఎందుకు అంత ఆవేశపడతావు.. మనిద్దరం కలిసి దిగిన ఫోటోనే అది.. అప్పుడే మర్చిపోయావా బావ.. అయినా నీకు ఈ మధ్య ఆవేశం పెరిగిపోతుంది. తీపి జ్ఞాపకాలు మర్చిపోతున్నావు బావ..

గగన్‌: ఏయ్‌ ఎక్కువ మాట్లాడకు.. అసలు మనిద్దరం ఎప్పుడు ఇలా ఫోటో దిగామో చెప్పు ముందు.. నీ తైతక్క వేషాలు నా ముందు వేయోద్దు..

భూమి: ఆగు బావ ఎందుకు కరుస్తావు.. మొన్న మన ఆగిపోయిన పెళ్లిలో ఇలా కొత్త బట్టలు కట్టుకుని బాసింగాలు కట్టుకుని బొట్టు పెట్టుకున్నాము కదా బావ. అప్పుడు దిగిందే ఈ ఫోటో.. అప్పుడే మర్చిపోతే ఎలా చెప్పు బావ.

గగన్‌: ఆగిపోయిన పెళ్లిలో దిగిన ఫోటోలు ఇప్పుడు ఇంట్లో పెట్టాల్సిన అవసరం లేదు.. ముందు అవి తీసి బయట పడేయ్‌  

భూమి: ఆహా నేను తీయను బావ.. నేను ఎంతో ఇష్టంగా ఫ్రేమ్ కట్టించి పెట్టుకున్న ఫోటోలు అవి.. నా చేతులతో నేను మళ్లీ తీసేయలేను..

అంటూ భూమి చెప్పగానే.. గగన్‌ కోపంగా ఫోటోలు తీసేయడానికి గోడ దగ్గరకు వెళ్తాడు. భూమి బావ వద్దు అంటుంది. ఇంతలో గగన్‌ ఫోటోలు తీసి కింద పడేస్తాడు. అవి పగిలిపోవు.. దీంతో భూమి నువ్విలా ఏదో ఒకటి చేస్తావని ఆ ఫోటోలకు అద్దం వేయించలేదు.. కేవలం లామినేషన్‌ మాత్రమే చేయించాను అని చెప్తుంది. గగన్‌ ఇరిటేటింగ్‌ గా ఫీలవుతుంటాడు. శారద, పూర్ణి, శివ నవ్వుకుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Brahmamudi Serial Today August 5th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజుకు బిర్యానీ వడ్డించిన అపర్ణ – ఇందుకు వార్నింగ్‌ ఇచ్చిన ఐషు  
‘బ్రహ్మముడి’ సీరియల్: రాజుకు బిర్యానీ వడ్డించిన అపర్ణ – ఇందుకు వార్నింగ్‌ ఇచ్చిన ఐషు  
Illu Illalu Pillalu Serial Today August 5th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: తప్పతాగి రచ్చ రచ్చ చేసిన ధీరజ్! ధీమా విడిపోవడానికే వల్లీనే కారణమని తెలుసుకున్న నర్మద ఏం చేయనుంది?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: తప్పతాగి రచ్చ రచ్చ చేసిన ధీరజ్! ధీమా విడిపోవడానికే వల్లీనే కారణమని తెలుసుకున్న నర్మద ఏం చేయనుంది?
Pradeep Rawat Passes Away: ప్రముఖ నటుడు ప్రదీప్‌ రావత్‌ కన్నుమూత.. తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో గుర్తింపు
ప్రముఖ నటుడు ప్రదీప్‌ రావత్‌ కన్నుమూత.. తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో గుర్తింపు
Jagadhatri Serial Today August 4th: మర్డర్‌ కేసులో మినిస్టర్‌ కొడుకుని అరెస్ట్ చేయడానికి వచ్చిన జేడీ...పోలీసులపై అనుచరుల దాడి
జగద్ధాత్రి సీరియల్: మర్డర్‌ కేసులో మినిస్టర్‌ కొడుకుని అరెస్ట్ చేయడానికి వచ్చిన జేడీ...పోలీసులపై అనుచరుల దాడి

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
The Story of Vizag Old Airport : విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ -
విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ - "INS డేగ" ఇక జ్ఞాపకమేనా !!
Supreme Court On Vehicle Insurance:బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
Embed widget