అన్వేషించండి

Meghasandesam Serial Today October 15th: ‘మేఘసందేశం’ సీరియల్‌: కేపీని చూసి బోరున విలపించిన శారద, మీరా – విషయం తెలిసి సీరియస్‌ అయిన గగన్‌

Meghasandesam serial today episode October 15th: కేపీని పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలుసుకుని స్టేషన్‌కు వెళ్తారు శారద, మీరా. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode:  కేపీని స్టేషన్‌ తీసుకెళ్లగానే.. మీరా ఏడుస్తుంది. ఎలాగైనా కేపీని చూడాలని అనుకుంటుంది. వెంటనే పోలీస్‌ స్టేసన్‌కు బయలుదేరుతుంది. మరోవైపు శారద కూడా విషయం తెలుసుకుంటుంది. ఆగలేక వెంటనే శారద కూడా పోలీస్‌ స్టేసన్‌కు బయలుదేరుతుంది. దీంతో ఇద్దరూ శారద, మీరా ఒకరికి తెలియకుండా ఒకరు స్టేషన్‌కు వెళ్తారు. ఒకరిని ఒకరు చూసుకుంటారు. శారదను చూసిన మీరా కోపంగా లోపలికి వెళ్తుంది.

మీరా: సార్‌ మా ఆయనను ఇక్కడికి తీసుకొచ్చారు..? ఎక్కడున్నారు..?

కానిస్టేబుల్‌: మీ ఆయన అంటే ఎవరు మేడం..

మీరా: అదే శరత్‌ చంద్ర ఇంటి దగ్గర నుంచి ఏసీపీ సూర్య గారు తీసుకొచ్చారు కదా ఆయన..

కానిస్టేబుల్‌: ఏసీపీ సూర్య సార్‌ చాలా మందిని తీసుకొస్తుంటారు మేడం ఆయన అంటే ఎవరు ఆయన పేరు చెప్పండి మేడం..

ఇంతలో శారద లోపలికి వస్తుంది.

శారద: ఆయన పేరు కృష్ణ ప్రసాద్‌..

అంటూ చెప్పగానే..

కానిస్టేబుల్‌: ఓ ఆయనా అదే ఆ మర్డర్‌ కేసులో ఉన్న వ్యక్తి కదా మా ఎస్సై గారిని దారుణంగా చంపిన వ్యక్తి కదా.. పదండి తీసుకెళ్తాను.

అంటూ శారద, మీరాను కానిస్టేబుల్ కేపీ ఉన్న సెల్‌ దగ్గరకు తీసుకెళ్తాడు.

కానిస్టేబుల్‌: అదిగో ఇలా వెళ్లండి అమ్మ ఆక్కడే ఉన్నారు చూడండి..

అని చెప్పగానే మీరా, శారద లోపలికి వెళ్తారు. గాయాలతో ఉన్న కేపీని చూసి ఏడుస్తుంటారు. అప్పటికే బాగా నీరసంగా ఉన్న కేపీ ఇద్దరినీ చూసి బాధపడుతుంటాడు.

మీరా: అయ్యో ఏవండి.. ఎంటండి మీరు ఇలా అయిపోయారు.. అసలు ఎందుకు మిమ్మల్ని ఇంతలా కొట్టారు.

శారద: అసలు మీరే తప్పు చేయడం ఏంటండి.. అయినా ఎవరో కావాలని మిమ్మల్ని ఇరికించారు.

మీరా: ఏవండి పలకండి.. ఇంతలా కొట్టారేంటండి.. పలకండి..

అంటూ ఇద్దరూ పిలిచినా కేపీ పలకడు. దీంతో మీరా, శారద బోరున ఏడుస్తుంటారు. ఇంతలో కానిస్టేబుల్‌ వచ్చి మేడం మీ టైం అయిపోయింది మీరు బయటకు రండి అని పిలుస్తాడు. దీంతో శారద, మీరా ఏడుస్తూనే అక్కడి నుంచి బయటకు వస్తారు.

మీరా: ఈ పరిస్థితుల్లో ఆయన్ని రక్షించాలంటే ఒక్క గగన్‌ వల్లే అవుతుంది. ఇప్పుడు గగన్‌ బెయిల్‌ ఇస్తే ఆయన బయటకు వస్తారు. లేదంటే పోలీసులు ఆయన్ని చంపేసేలా ఉన్నారు

శారద: కానీ గగన్‌ ఒప్పుకుంటాడో లేదో

అంటూ శారద అనుమానంగా అంటుంది.

మీరా: మీరు ప్రయత్నించి చూడండి..

ఇంతలో చెర్రి వస్తాడు.

చెర్రి: అవును పెద్దమ్మ మనం వెళ్లి అన్నయ్యను అడుగుదాం.. ఎలాగైనా అన్నయ్యను ఒప్పించి నాన్నకు బెయిల్‌ వచ్చేలా చేద్దాం

అనగానే శారద సరే పదా అంటుంది. చెర్రి, శారద, భూమి ముగ్గురు కలిసి గగన్‌ దగ్గరకు వెళ్తారు. ముగ్గురిని చూసిన గగన్‌ ఆశ్చర్యపోతాడు.

గగన్‌: ఏంటి సంగతి ముగ్గురూ ఒకేసారి వచ్చారు.

శారద: నాన్న గగన్‌ నీకో విషయం చెప్తాను. కోప్పడవుగా..?

గగన్‌: ఏంటో చెప్పమ్మా… నీ మీద నేనేందుకు కోప్పడతాను చెప్పు..

శారద: ఇప్పుడు మనమే ఆయన్ని బెయిల్‌ మీద బయటకు తీసుకురావాలి నాన్న..

అంటూ శారద చెప్పగానే.. గగన్‌ కోపంగా చూస్తుంటాడు. దీంతో శారద నువ్వు కాదనకు గగన్‌. ఇప్పుడున్న ఈ పరిస్తితుల్లో ఆయనకు మనం తప్ప ఎవరున్నారు చెప్పు అంటూ ఎమోషనల్ అవుతుంది శారద. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 8th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
Godavari Serial Today August 8th: 'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
Nindu Manasulu Serial Today August 8th: నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 8th:చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం
నువ్వులేక నేను లేను: చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Embed widget