అన్వేషించండి

Meghasandesam Serial Today November 24th: ‘మేఘసందేశం’ సీరియల్‌: గగన్‌తో భూమి గొడవ – నక్షత్రను ట్రాప్‌ చేసిన చెర్రి  

Meghasandesam serial today episode November 24th: తన విషయంలో ముందు లాగా ఉండటం లేదని భూమి, గగన్‌తో గొడవ పడుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది

Meghasandesam Serial Today Episode: కుర్చీలో కనిపించకుండా కూర్చున్న చెర్రి గొంతు మార్చి శరత్‌ చంద్రలా నక్షత్రను పిలుస్తాడు. నక్షత్ర ఏంటి డాడీ అని అడుగుతుంది. ఒకసారి మేడ మీదకు రామ్మ నీతో మాట్లాడాలి అంటాడు. వస్తున్నాను డాడీ అంటూ నక్షత్ర మేడ మీదకు వెళ్తుంది.

నక్షత్ర: చెప్పండి డాడీ..

చెర్రి: ఏమ్మా ఇప్పుడు నీ నడుము నొప్పి ఎలా ఉంది..?

నక్షత్ర: పోయింది డాడీ అంతా సెట్‌ అయిపోయింది.

చెర్రి: ఓ చెర్రి నిన్ను బాగా చూసుకున్నాడు అన్నమాట. అందుకే ఇంత తొందరగా రికవరీ అయ్యావు..

నక్షత్ర: వాడి ముఖం వాడేం చేశాడు డాడీ నాకు.

చెర్రి: (నీ మెంటల్‌ దానా నాతో నూనె రాయించుకున్నావు కదే అప్పుడే మర్చిపోయావా..?  చెప్తాను నీ పని) పెళ్లికి ముందు అరేయ్‌ ఒరేయ్‌ అన్నా పర్వాలేదు.. కానీ పెళ్లి అయ్యాక కూడా వాణ్ని వాడు వీడు అంటావేంటమ్మా..?

నక్షత్ర: అదే డాడీ ఆయన ముఖం నా హెల్త్‌ సెట్ అవ్వడంలో ఆయన పాత్ర ఏమీ లేదని చెప్తున్నాను డాడీ. ఫిజియోథెరపిస్టు చెప్పినట్టు చేసి నేను నా నడుం నొప్పి తగ్గించుకున్నాను డాడీ.. ఆయన వేస్ట్‌ ఫెలో నాకు ఎటువంటి హెల్ప్‌ చేయడు.,.,

చెర్రి: ఒక్క ఆయన అన్న పదం మార్చావే తప్పా నీ మాటల్లో వాడి మీద కొంచెం కూడా గౌరవం లేదు. ఇలాగే ఉంటే మీ మధ్య ఇంకా దూరం పెరిగిపోతూ ఉంటుంది. నా మాట విని మీరు హనీమూన్‌ కు వెళ్లండి..

నక్షత్ర: హనీమూనా..? వాడితోనా..?

చెర్రి: మళ్లీ వాడు వీడు అంటున్నావేంటి…?

నక్షత్ర: అదే డాడీ ఆయనతోనా అంటున్నాను..

చెర్రి: హనీమూన్‌కు తాళి కట్టిన వాడితోనే వెళ్తారు. పక్కింటి వాడితో కాదు..

నక్షత్ర: ఏదో నోరు జారి అన్నాను డాడీ. హనీమూన్‌ కే కదా వెళ్తాను.. మీరు మమ్మీకి కూడా హనీమూన్‌ గురించి ఒక మాట  చెప్పండి  

చెర్రి: చెప్పాను అమ్మా ఓప్పేసుకుంది కూడా..

నక్షత్ర: ఒప్పుకుందా..?

చెర్రి: ఏదో మీ అమ్మ తప్పు చేసిందా అన్నంత ఆశ్చర్యంగా అడుగుతావేంటమ్మా..? మిమ్మల్ని హనీమూన్‌కు పంపించడానికి మీ అమ్మ ఆనందంగా ఒప్పుకుంది వెళ్లు వెళ్లి బట్టలు సర్దుకో

అని చెర్రి చెప్పగానే నక్షత్ర ఇరిటేటింగ్‌ గా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత చెర్రి అదే విషయం భూమికి చెప్తాడు. దీంతో భూమి ఆశ్చర్యపోతుంది.

భూమి: ఏంటి నిజమా..? నీతో హనిమూన్‌కు రావడానికి నక్షత్ర ఒప్పుకుందా..?

చెర్రి: శరత్‌ చంద్ర మామయ్యే చెప్పాక ఒప్పుకోక తప్పుతుందా..?

భూమి: ఓ మా నాన్నే మిమ్మల్ని హనీమూన్‌కు వెళ్లమని చెప్పారా..? కంగ్రాట్యులేషన్స్ చెర్రి.

చెర్రి: కంగారు పడకు భూమి మామయ్య ఏం చెప్పలేదు.. మామయ్యలా వేషం వేసుకుని గొంతు మార్చి నేనే చెప్పా.. నక్షత్ర నమ్మేసింది.

అంటూ చెర్రి చెప్పగానే.. భూమి ఆశ్చర్యపోతుంది. ఇన్ని తెలివి తేటలు నీకు ఎప్పుడొచ్చాయి చెర్రి.. నీకున్న తెలివితేటల్లో సగమైనా మీ అన్నయ్యకు ఉంటే చాలా బాగుండేది అంటూ ఆల్‌ ది బెస్ట్‌ చెప్తుంది భూమి. తర్వాత గగన్‌ తల స్థానం చేస్తుంటే.. వెనక నుంచి భూమి వెళ్లి తలంటూ పోస్తుంది. గగన్‌ భూమిని చూడకుండా భూమిని తిడుతుంటాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. గొడవలో ఒకరి మీద ఒకరు పడతారు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 26th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కొడుకు ఉన్నాడని ముందే తెలుసా అంటూ సహస్రని నిలదీసిన యమున! సిరి బెంగ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కొడుకు ఉన్నాడని ముందే తెలుసా అంటూ సహస్రని నిలదీసిన యమున! సిరి బెంగ!
Nindu Manasulu Serial Today November 26th: నిండు మనసులు: అత్తారింటికి బయల్దేరిన ప్రేరణ! సంతోషంలో 2 ఫ్యామిలీలు! ఎమ్మెల్యేతో చేతులు కలిపిన విజయ్!
నిండు మనసులు: అత్తారింటికి బయల్దేరిన ప్రేరణ! సంతోషంలో 2 ఫ్యామిలీలు! ఎమ్మెల్యేతో చేతులు కలిపిన విజయ్!
Godavari Serial Today November 26th: 'గోదావరి' సీరియల్: సంజయ్ దగ్గరే జాబ్ కొట్టేసిన జాను! గౌతమిని కాపాడిందెవరు?
'గోదావరి' సీరియల్: సంజయ్ దగ్గరే జాబ్ కొట్టేసిన జాను! గౌతమిని కాపాడిందెవరు?
Gundeninda Gudigantalu Nov 26: కుంగుబాటులో ఆస్పత్రిలో చేరిన సుమతి..పలకరించకడానికి వచ్చిన అరుణ్‌తో గొడవపడిన బాలు
గుండెనిండా గుడిగంటలు:కుంగుబాటులో ఆస్పత్రిలో చేరిన సుమతి..పలకరించకడానికి వచ్చిన అరుణ్‌తో గొడవపడిన బాలు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Capital Works: అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు పర్యటన.. రాజధాని పనుల పురోగతిపై సమీక్ష!
అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు పర్యటన.. రాజధాని పనుల పురోగతిపై సమీక్ష!
Garividi Lakshmi OTT : ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
Baby Movie Story Issue: బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!
బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!
Panchayat Elections Phase 1 Results LIVE: పంచాయతీ ఓట్ల లెక్కింపు షురూ! ఎక్కడ ఎవరు గెలుస్తున్నారంటే?
పంచాయతీ ఓట్ల లెక్కింపు షురూ! ఎక్కడ ఎవరు గెలుస్తున్నారంటే?
Thiruparankundram Deepam Row: తిరుప్పరకుండ్రం దీపం వివాదంలో సీఎం విజయ్ తప్పిదం.. రెంటికీ చెడ్డ రేవడిలా మారారా?
తిరుప్పరకుండ్రం దీపం వివాదంలో సీఎం విజయ్ తప్పిదం.. రెంటికీ చెడ్డ రేవడిలా మారారా?
Kallakurichi Collector Row: కళ్లకురిచి వివాదంలో సీఎం విజయ్‌కు ధర్మసంకటం! ఇటు అధికారిణి.. అటు సొంత ఎమ్మెల్యే?
కళ్లకురిచి వివాదంలో సీఎం విజయ్‌కు ధర్మసంకటం! ఇటు అధికారిణి.. అటు సొంత ఎమ్మెల్యే?
TG Church Grant Application: తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ కానుక.. చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సాయం.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ కానుక.. చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సాయం.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
Megastar Chiranjeevi on drugs:
"లక్ష్యాన్ని వ్యసనంగా మార్చుకోండి.. వ్యసనాన్ని జీవితంగా మార్చుకోకండి".. డ్రగ్స్ వద్దని యువతకు చిరంజీవి పిలుపు
Embed widget