![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Meghasandesam Serial Today November 12th: ‘మేఘసందేశం’ సీరియల్ : నరేన్‌ను పట్టుకున్న గగన్, చెర్రి – తప్పించుకుని వంశీ వాళ్ల ఇంట్లో దూరిన నరేన్
Meghasandesam Today Episode: వంశీ వాళ్ల ఇంట్లో దూరిన నరేన్‌ను పట్టుకుని గగన్ చితక్కొట్టడంతో నిజం చెప్తానంటాడు దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
![Meghasandesam Serial Today November 12th: ‘మేఘసందేశం’ సీరియల్ : నరేన్‌ను పట్టుకున్న గగన్, చెర్రి – తప్పించుకుని వంశీ వాళ్ల ఇంట్లో దూరిన నరేన్ Meghasandesam serial today episode November 12th written update Meghasandesam Serial Today November 12th: ‘మేఘసందేశం’ సీరియల్ : నరేన్‌ను పట్టుకున్న గగన్, చెర్రి – తప్పించుకుని వంశీ వాళ్ల ఇంట్లో దూరిన నరేన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/12/f9fcde48e66c6eb7d8be2ece6265b38b1731385738672879_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Meghasandesam Today Episode: కృష్ణ ప్రసాద్ ఏడుస్తూ వంశీ కాళ్లు పట్టుకుని బతిమాలుతాడు. ఇందును పెళ్లి చేసుకోమని కోరతాడు. ఇంతో మీరా కూడా మీరు ఏం అడిగినా చేస్తాం. కానీ ఈ పెళ్లి మాత్రం జరగాలని కోరుతుంది. దీంతో ఏం కావాలన్నా ఇస్తారా..?పోయింది అంతా తిరిగి వచ్చేలా ఉంది కదా..? అను వంశీ వాళ్ల నాన్న మనసులో అనుకుని సౌందర్యను అడిగి తాను ఓకే అనగానే మీరు అంతలా అడుగుతున్నారు కాబట్టి మాది ఒక కండీషన్ అని చెప్పగానే మీరా చెప్పండి అన్నయ్యగారు మీకేం కావాలన్నా ఇస్తాం అంటుంది. దీంతో మీకు ఉన్న గార్మెంట్ ఫ్యాక్టరీ మా వంశీ పేరు మీద రాయండి చాలు అంటాడు. మీరా అన్నయ్యను ఒప్పిస్తామని చెప్పగానే ప్రసాద్ అవసరం లేదని మనం ఇందు మంచిది అని ఒప్పించడానికి వచ్చామని కాపురాలు నిలబడాలి అంటే నమ్మకం ఉండాలని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు. మరోవైపు గగన్, చెర్రి, భూమి ముగ్గురు కలిసి నరేన్ ను కలవడానికి వెళ్తారు. ఇంతలో నరేన్ వస్తాడు.
నరేన్: బేబీ నేను వచ్చేశా.. నువ్వు కంగారు పడి కాలు జారకు.
ఇంతలో సుజాత నరేన్‌కు ఫోన్ చేస్తుంది.
నరేన్: ఇదిగో పిన్ని నీ అప్పు నా పెళ్లి అయిపోగానే అణా పైసలతో సహా తీర్చేస్తా.. పెళ్లి కూడా ఎప్పుడు అని అడగకు జస్ట్ గంట గంటన్నరలో నా లవర్ చెప్పే దాన్ని బట్టి.
సుజాత: ఓరేయ్ ముందు నేను చెప్పేదాన్ని వినరా..?
నరేన్: అబ్బా నువ్వు విసిగించేస్తున్నావు పిన్ని. సరే చెప్పు.
అపూర్వ: ఇలా ఇవ్వు నేను మాట్లాడతాను. నరేన్ నేను చెప్పేది జాగ్రత్తగా విని
నరేన్: చెప్పండి మేడం.
అపూర్వ: నిన్ను ఒక అమ్మాయి ప్రేమిస్తున్నానని వీడియో వైరల్ చేసింది కదా..? దాన్ని నమ్మకు. ఇందు అన్నయ్య అయిన గగన్ వేసిన ట్రాప్ అది. దొరికావే మనందరం దొరికిపోతాము.
నరేన్: హలో మేడం మీ మాట నాకు వినిపించడం లేదు. నా మాట వినిపిస్తుందా..? సిగ్నల్ లేనట్టుంది. తర్వాత ఫోన్ చేస్తాను.
అపూర్వ: అయ్యో నేను చెప్పిది ఏదీ వాడికి వినిపించిదో లేదో..
నరేన్: డార్లింగూ.. ఐ యామ్ కమింగూ.. నేను వచ్చేశా.. ఇక భయం లేదు. మనం పెళ్లి చేసుకుందాం. ఒకవేళ మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ బలంగా ఉందనుకో.. మనకు థ్రెట్ ఉందనుకో మనం లేచిపోదాం.
గగన్: మరి నువ్వు ప్రాణంగా ప్రేమించిన ఇందు ఏమైపోవాలిరా..?
అంటూ గగన్ రావడంతో నరేన్ ఇది మోసం అంటూ భయపడతాడు. దీంతో చెర్రి కూడా వస్తాడు. దీంతో ఇద్దరూ కలిసి నరేన్ ను కొట్టడంతో నేను నిజం చెప్తాను. దగ్గరకు రండి అని గగన్, చెర్రి దగ్గరకు రావడంతో వాళ్లను తోసేసి పారిపోతాడు. వెనకే గగన్, చెర్రి పరుగెత్తుకెళ్తారు. అలా పరుగెత్తుకుంటూ వంశీ వాళ్ల ఇంట్లోకి వెళ్లి, అపూర్వకు ఫోన్ చేసి మీరు చెప్పినట్టు నాటకం ఆడాను. ఇందు పెళ్లి చెడగొట్టాను. అని చెప్పడం వంశీ, వాళ్ల అమ్మానాన్న వింటారు. వాళ్లను చూసిన నరేన్ షాక్ అవుతాడు. బయటకు పారిపోతుంటే.. గగన్, చెర్రి వస్తారు. అందరూ కలిసి వాణ్ని పిచ్చకొట్టుడు కొడతారు. నీతో ఇది చేయించింది ఎవరు అంటూ తంతారు. ఎవరో చెప్తాను అని నరేన్ అనడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)