అన్వేషించండి

Meghasandesam Serial Today January 8th: ‘మేఘసందేశం’ సీరియల్‌:   గగన్‌ను నిలదీసిన నక్షత్ర -  ఇందు కోసం వంట చేసిన వంశీ

Meghasandesam Today Episode:  ఇందు కోసం ఇంట్లో పనులన్నీ వంశీ చేయడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఫన్నీగా జరిగింది.      

Meghasandesam Serial Today Episode:  నక్షత్ర కోపంగా తిట్టగానే సరే నీకు కాబోయే మొగుడితో కాదు నాకు కాబోయే మొగుడితో మాట్లాడుతున్నాను అని చెప్పి భూమి  వెళ్లిపోతుంది. వెంటనే నక్షత్ర, గగన్‌కు ఫోన్‌ చేస్తుంది. ఏంటి అది నీతో అంతలా మాట్లాడుతుంది అని అడుగుతుంది. నేను నాకు కాబోయే పెళ్లాంతో మాట్లాడాను అంటాడు గగన్‌. దీంతో అదేమో కాబోయే మొగుడితో మాట్లాడాను అంటుంది. తనేమో కాబోయే పెళ్లాంతో మాట్లాడాను అంటున్నాడు అంటూ ఆలోచనలో పడిపోతుంది. మరోవైపు హాల్‌లో పడుకున్న ఇందు చూసిన సౌందర్య, రమేష్‌ షాక్ అవుతారు. కటిక నేల మీద పడుకోమని చెప్పాను.. కానీ మహరాణిలా చాప దిండు వేసుకుని పడుకుందేంటి అనుకుంటారు. సౌందర్య నీళ్లు తీసుకొచ్చి ఇందు మీద పోస్తుంది. ఉలిక్కి పడి లేస్తుంది ఇందు.

ఇందు: ఏంటి అత్తయ్యా ఇలా లేపారేంటి..?

సౌందర్య: ఇలాగే లేపుతాము ఇక్కడ. అసలు మేము లేవక ముందే నువ్వు లేచి ఇంటి పనులన్నీ చేయాలి కదా..?

ఇందు: మరీ ఇంత మార్పా అత్తయ్యా..

రమేష్‌: కట్నం వస్తది అన్నంత వరకే మాతో మంచి మర్యాద. మోసం జరిగాక నీకు నరకమేనని రాత్రే చెప్పాము కదా..? అది సరే కానీ నేను నిన్ను కటిక నేల మీద పడుకోమని చెప్పా.. నీకు ఈ చాప దిండు దుప్పటి ఎలా వచ్చాయి.

ఇందు: ఆయనే ఇచ్చారా..?

రమేష్‌: వేసిన తాళం వేసినట్టే ఉంది. వాడెలా ఇచ్చాడు.

ఇందు: అది…

సౌందర్య: ఆగు వాడే చెప్పాలి ఎలా ఇచ్చాడో.. వెళ్లి లేపండి..

అని చెప్పగానే రమేష్‌ వెళ్లి వంశీని లేపుకొస్తాడు. ఎందుకు దిండు, చాప ఎందుకిచ్చావు అని అడుగుతారు. నేను ఇవ్వలేదని కిచెన్‌లో ఉన్నాయి తెచ్చుకో అన్నాను అంటాడు. సరే అని ఇద్దరూ కలిసి ఇందు బోలెడు పనులు చెప్తారు. అన్ని పనులా అంటూ ఇందు షాక్ అవుతుంది. మరోవైపు అపూర్వకు కాపీ తీసుకెళ్తుంది భూమి.

అపూర్వ: ఏంటో నువ్వు నాకు కాఫీ తీసుకొచ్చావు. కొంపదీసి అందులో ఏమైనా విషం కలిపావా..?

భూమి: దానికి ఇంకా టైం ఉంది మమ్మీ.. నీలాగా నమ్మించి గొంతు కోయను. ఇది విషం అని చెప్పి చంపేస్తా… అయినా నీ మీద ప్రేమతో తీసుకురాలేదు. చల్లారక ముందే తాగు

అపూర్వ బయటకు వెళ్లి శరత్‌ చంద్ర దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. భూమి కాఫీ ఇచ్చిందా అని శరత్‌ అడగ్గానే.. ఇచ్చింది బావ మీరు ఇమ్మన్నారట కదా అంటూ శోభా చంద్ర ఫోటో దగ్గరకు వెళ్లి మొక్కుతుంది. ఇంతలో టీవీలో కార్తీక మాసం గురించి వస్తుంటే.. అది చూస్తుంది అపూర్వ.

అపూర్వ: బావా మనం వన భోజనాలకు వెళ్దామా..?  

శరత్‌: నిన్నే కదా నక్షత్ర బర్తుడేలో అందరం అలిసి పోయాం. ఇప్పుడు అవసరమా..?

అపూర్వ: అవసరమే బావా.. కార్తీక మాసం చివరి వారం ఇది ఆ పుణ్యం కూడా ఎందుకు వదులుకుందాం. నిన్న పార్టీకి ఆ గగన్‌ గాడు రావడంతో అందరం డిస్టర్బ్‌ అయ్యాం.. ఆ డిస్టబెన్స్‌ నుంచి మనం వన భోజనాలకు వెళితే రిప్రెష్‌ అవుతాం.

శరత్‌: బాగుంది అపూర్వ. అందరినీ పిలువు అనౌన్స్‌ చేద్దాం.

సుజాత: అమ్మాయి అందరినీ నేను పిలుస్తాను.

మీరా : ఏమైంది వదిన.. అందరినీ పిలుస్తున్నావు.

అపూర్వ: మనం అందరం వన భోజనాలకు వెళ్దాం.

మీరా: అందరం వెళితే ఇల్లు ఎవరు చూసుకుంటారు..?

సుజాత: మన భూమి ఉంది కదా..? భూమి చూసుకుంటుంది.

చెర్రి: నాకు ఇంటర్యూ ఉందని కాల్‌ వచ్చింది. నేను రాలేను.

అపూర్వ: చెర్రి ఒక్క నిమిషం.. పిన్ని  నిన్ను రాత్రి చంపకుండా వదిలేశాను. చూడు దాన్ని దూరంగా తీసుకెళ్లి చంపేయాలి అన్నావు కదా..?

సుజాత: అవును వనభోజనాల్లో ఆడవాళ్లు అందరూ ఉండాలి. భూమి కూడా రావాలి.

అపూర్వ: కృష్ణప్రసాద్‌ అందరూ వన భోజనాలకు ఎక్కడికి వెళ్తుంటారు.

ప్రసాద్‌: అందరూ వికారాబాద్‌ వెళ్తుంటారు బావగారు.

అపూర్వ: అయితే మనం అక్కడికే వెళ్దాం.. ఏర్పాట్లు చూడు.

అని చెప్పగానే ప్రసాద్‌ సరే అంటాడు. మరోవైపు ఇందును కూర్చోబెట్టి ఇంటి పనులన్నీ వంశీ చేస్తుంటాడు. ఇందు ఆశ్చర్యంగా చూస్తుంది. పనులన్నీ చేసిన వంశీ ప్రేమగా ఇందుకు కాఫీ ఇస్తాడు. ఇంతలో సౌందర్య రాగానే.. వంశీకి ఇందు కాఫీ ఇస్తున్నట్లు నాటకం ఆడతారు. రమేష్‌ బయటి వస్తూ.. కాఫీ అనగానే.. నేను తెస్తాను నాన్నా అంటూ వెళ్లబోయి ఇందును తిడతాడు. ఇందు వెళ్లి కాఫీ ఇస్తుంది. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Money heist: రెండు కంటెయినర్ల నిండా నోట్ల కట్టలు - అడవిలో లూఠీ చేసిన ముఠా - ఇది సినిమా కథ కాదు నిజం !
రెండు కంటెయినర్ల నిండా నోట్ల కట్టలు - అడవిలో లూఠీ చేసిన ముఠా - ఇది సినిమా కథ కాదు నిజం !
Kamareddy Latest News:కామారెడ్డి జిల్లాలో మరో దారుణం- ప్రిన్సిపల్ ఇంటికి వెళ్లి వస్తూ ఆటో నుంచి పడిన విద్యార్థినులు- ఒక పాప మృతి
కామారెడ్డి జిల్లాలో మరో దారుణం- ప్రిన్సిపల్ ఇంటికి వెళ్లి వస్తూ ఆటో నుంచి పడిన విద్యార్థినులు- ఒక పాప మృతి
Republic Day 2026: ఢిల్లీలో రెపరెపలాడిన భారతీయ కీర్తి పతాక! ఆయుధ సామర్థ్యాన్ని చాటి చెప్పిన కవాతు!
ఢిల్లీలో రెపరెపలాడిన భారతీయ కీర్తి పతాక! ఆయుధ సామర్థ్యాన్ని చాటి చెప్పిన కవాతు!
Infosys: ఉద్యోగుల కరెంట్ బిల్లులు అడుగుతున్న ఇన్‌ఫోసిస్ - పని చేస్తున్నారో లేదో తెలుసుకోవడానికా?
ఉద్యోగుల కరెంట్ బిల్లులు అడుగుతున్న ఇన్‌ఫోసిస్ - పని చేస్తున్నారో లేదో తెలుసుకోవడానికా?

వీడియోలు

India vs New Zealand 3rd T20 Highlights | టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా
Ind vs NZ 3rd T20 Highlights | టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా
Abhishek Sharma Records Ind vs NZ T20 | అభిషేక్ శర్మ సూపర్ ఇన్నింగ్స్
Sanju Samson Ind vs NZ T20 | వరుసగా విఫలమవుతున్న సంజు
Jasprit Bumrah in Ind vs NZ T20 | కివీస్ ను కుప్పకూల్చిన భారత బౌలర్లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Money heist: రెండు కంటెయినర్ల నిండా నోట్ల కట్టలు - అడవిలో లూఠీ చేసిన ముఠా - ఇది సినిమా కథ కాదు నిజం !
రెండు కంటెయినర్ల నిండా నోట్ల కట్టలు - అడవిలో లూఠీ చేసిన ముఠా - ఇది సినిమా కథ కాదు నిజం !
Kamareddy Latest News:కామారెడ్డి జిల్లాలో మరో దారుణం- ప్రిన్సిపల్ ఇంటికి వెళ్లి వస్తూ ఆటో నుంచి పడిన విద్యార్థినులు- ఒక పాప మృతి
కామారెడ్డి జిల్లాలో మరో దారుణం- ప్రిన్సిపల్ ఇంటికి వెళ్లి వస్తూ ఆటో నుంచి పడిన విద్యార్థినులు- ఒక పాప మృతి
Republic Day 2026: ఢిల్లీలో రెపరెపలాడిన భారతీయ కీర్తి పతాక! ఆయుధ సామర్థ్యాన్ని చాటి చెప్పిన కవాతు!
ఢిల్లీలో రెపరెపలాడిన భారతీయ కీర్తి పతాక! ఆయుధ సామర్థ్యాన్ని చాటి చెప్పిన కవాతు!
Infosys: ఉద్యోగుల కరెంట్ బిల్లులు అడుగుతున్న ఇన్‌ఫోసిస్ - పని చేస్తున్నారో లేదో తెలుసుకోవడానికా?
ఉద్యోగుల కరెంట్ బిల్లులు అడుగుతున్న ఇన్‌ఫోసిస్ - పని చేస్తున్నారో లేదో తెలుసుకోవడానికా?
Chiranjeevi : రిజల్ట్ ఏదైనా తప్పు నాపైనే వేసుకుంటా - కొరటాల శివకు చిరు కౌంటరిచ్చారా?
రిజల్ట్ ఏదైనా తప్పు నాపైనే వేసుకుంటా - కొరటాల శివకు చిరు కౌంటరిచ్చారా?
David Reddy : 'డేవిడ్ రెడ్డి' డేంజరస్ లుక్ - మంచు మనోజ్‌ను ఇలా ఎప్పుడైనా చూశారా?
'డేవిడ్ రెడ్డి' డేంజరస్ లుక్ - మంచు మనోజ్‌ను ఇలా ఎప్పుడైనా చూశారా?
Sirivennela Seetharama Sastry : అనకాపల్లిలో 'సిరివెన్నెల' కాంస్య విగ్రహం - ప్రతీ ఏటా అవార్డులు
అనకాపల్లిలో 'సిరివెన్నెల' కాంస్య విగ్రహం - ప్రతీ ఏటా అవార్డులు
Ravi Teja Irumudi : మాస్ మహారాజ థ్రిల్లర్ ఎంటర్టైనర్ 'ఇరుముడి' - అయ్యప్ప మాలలో రవితేజ
మాస్ మహారాజ థ్రిల్లర్ ఎంటర్టైనర్ 'ఇరుముడి' - అయ్యప్ప మాలలో రవితేజ
Embed widget