అన్వేషించండి

Meghasandesam Serial Today January 4th: ‘మేఘసందేశం’ సీరియల్‌:   గగన్‌ను సమర్థించిన నక్షత్ర – నక్షత్రను చంపేస్తానన్న శరత్‌ చంద్ర

Meghasandesam Today Episode:  బట్టలు మార్చుకుంటుంటే తనను ఎవరో ఫోటోలు తీశారని నక్షత్ర అపూర్వకు చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode:    నక్షత్ర రూంలోకి వెళ్లి డ్రెస్‌ మార్చుకుంటుంటే.. బయట విండో నుంచి గగన్‌ ఫోన్‌ నుంచి వీడియో తీస్తుంది గాయత్రి. వీడియో తీస్తున్న గాయత్రిని భూమి చూస్తుంది. మరోవైపు గగన్‌, భూమి కోసం వెతుక్కుంటూ వెళ్లి శరత్‌చంద్రను తగులుతాడు. దీంతో శరత్ చంద్ర తిడుతుంటాడు. పైన ఫోటో లు తీస్తున్న గాయత్రిని ఆపబోయి కింద నుంచి గగన్‌, శరత్ చంద్రల గొడవ విని కిందకు వెళ్తుంది. ఇంతలో మినిస్టర్‌ వచ్చి హలో శరత్ చంద్ర మీరు ఇంతలోనే ఫ్రెండ్స్‌ అయిపోయారా..? నన్ను భోజనానికి పిలిచి మీరు ఇక్కడ ఉంటే ఎలా రండి భోజనానికి వెళ్దాం అంటూ శరత్‌చంద్రను తీసుకుని వెళ్లిపోతాడు. పైన ఫోటోలు తీస్తున్న గాయత్రి, తనను నక్షత్ర చూసేలా చేస్తుంది. ఆ సౌండ్‌ విని నక్షత్ర కెమెరా వైపు చూస్తుంది. భయంతో ఏడుస్తూ అపూర్వ దగ్గరకు వెళ్తుంది. భూమి భోజనం తీసుకుని గగన్‌ బయటకు తీసుకెళ్లి వాటర్‌ తీసుకురావడానికి పక్కకు వెళ్తుంది. ఇంతలో గాయత్రి వచ్చి ఫోన్‌ మారిపోయిందని ఇచ్చి వెళ్లిపోతుంది. ఇంతలో భూమి వస్తుంది.

భూమి: ఇంకా చూస్తున్నారేంటి..? తినండి.

గగన్‌: అదేంటి తినిపించవా..?

భూమి: నేనా..?

గగన్‌: నువ్వే

భూమి: తినిపించాలా..?

గగన్‌: అవును తినిపించాలి.

భూమి: అదేం కుదరదు మీరే తినాలి.

గగన్‌: తినిపించవా.. సరే అయితే నేను వెళతాను.

భూమి: అదేంటి ఆకలి అన్నారుగా   

గగన్‌: ఏయ్‌ వెళతాను అంటే పూర్తిగా వెళతానని కాదు నక్షత్ర దగ్గరకు వెళతాను.

భూమి: ఎందుకు..?

గగన్‌: తనైతే నాకు కొసరి కొసరి తినిపిస్తుంది.

భూమి: అది తినిపిస్తే.. మీరు తింటారా..?అది తినిపిస్తుంటే.. మీరు తింటుంటే.. ఎవరైనా చూస్తే..

గగన్‌: గొడవలు అవుతాయని నీ రెగ్యులర్‌ డైలాగ్‌ అంతేగా కానీ..

భూమి: ఇందుకు తినొచ్చు అని నేను కన్వీన్స్‌ అయితే మిమ్మల్ని వెళ్లమని నేనే పంపిస్తాను

గగన్‌: నక్షత్ర నన్న ప్రేమిస్తుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. తను నాకు తినిపించినప్పుడు నువ్వు కూడా నాకు తినిపించాలి కదా కన్వీన్స్‌ అయ్యావా…? ఇంత సైలెంట్‌ గా ఉన్నావంటే అయ్యావన్నట్లే.. సరేలే ఇక నక్షత్ర దగ్గరకే వెళ్తాను.

అంటూ గగన్‌ వెళ్లబోతుంటే.. ఆగండి నేను తినిపిస్తే మీరు సంతోషంగా ఉంటారంటే తినిపిస్తాను అంటుంది భూమి. సరేనని గగన్‌ కూర్చోగానే భూమి భోజనం తినిపిస్తుంది. మరోవైపు అపూర్వ కోపంగా శరత్‌ చంద్ర దగ్గరకు వస్తుంది.

అపూర్వ: ఘోరం జరిగిపోయింది బావ..

శరత్‌: ఏంటి ఏం జరిగింది..

అపూర్వ: మన నక్షత్ర ఫోటోలు తీశారు బావ..

శరత్‌: ఎవరు ఎవరికి ఇంత ధైర్యం..

సుజాత: ఏదో మామూలు ఫోటోలు తీసినట్టు అడుగుతారేంటి అల్లుడుగారు. బట్టలు మార్చుకుంటుండగా ఫోటోలు తీశారు.

శరత్‌: ఎలా తీశాడు.

సుజాత, నక్షత్ర: ఫోన్‌ తో..

శరత్‌: నక్షత్ర చూసింది కాబట్టి తెలుసు మీకెలా తెలుసు..?

అపూర్వ: చెప్పు.. పిన్ని

సుజాత: అంటే ఈ రోజుల్లో కెమెరా ఎవరు వాడుతున్నారు అల్లుడు గారు. అందరూ ఫోన్‌ లే వాడుతున్నారు కదా అందుకే ..

అపూర్వ: ఫోటో దేనితో తీశారని కాదు ఇక్కడ సమస్య ఫోటోలు ఎవరు తీశారనేది. రేపు మన అమ్మాయి ఫోటోలు సోషల్ మీడియాలో పెడితే మన పరువు ఏం కావాలి.

శరత్‌: కృష్ణప్రసాద్‌ ఎవ్వరూ బటయకు వెళ్లడానికి వీల్లేదు.

కృష్ణప్రసాద్‌: చెర్రి డోర్లన్నీ క్లోజ్‌ చేయ్‌.. ఎవ్వరూ బయటకు వెళ్లడానికి వీల్లేదు.

శరత్‌: అందరూ ఫోన్లు ఇక్కడ పెట్టండి. ఫోటోలు ఉన్న వాళ్లు మాత్రమే ఇక్కడ ఉంటారు. మిగతా వాళ్లు వాళ్ల ఇండ్లకు వెళ్తారు.

సుజాత: అందరూ ఇక్కడే ఉన్నారు కానీ ముఖ్యమైన వాడే ఇక్కడ లేడు.

అపూర్వ: ఏం మాట్లాడుతున్నావు పిన్ని ముఖ్యమైన వాళ్లు ఎవరు?

సుజాత: ఇంకెవడు ఆ గగన్‌..

మంత్రి: ఏం మాట్లాడుతున్నావు అమ్మా నాతో వచ్చిన గెస్ట్‌ ను నువ్వు అనుమానిస్తున్నావా..?

శరత్‌: క్షమించండి మినిస్టర్‌ గారు వాడికి మాకు శత్రుత్వం ఉంది. మీ మీద గౌరవం తో వాడి అడుగు లోపల పడింది. లేదంటే వాడి తల ముక్కలయ్యేది.

మినిస్టర్‌: ఆ మాట ముందే తెలిస్తే బయటే ఉంచేవాడిని కదా..?

నక్షత్ర: డాడీ అతను అలాంటి పనులు చేస్తాడంటే నేను నమ్మను.. హీ ఈజ్‌ జెంటిల్మెన్‌.

అనగానే  శరత్‌ చంద్ర నక్షత్రను కొట్టబోతాడు. మినిస్టర్‌ ఆపుతాడు. ఇంతలో బయటకు వెళ్లిన సుజాత, భూమి గగన్‌కు అన్నం తినిపించడం చూస్తుంది. నిన్ను లోపల పిలుస్తున్నారు రా అని గగన్‌ను తీసుకుని లోపలికి వెళ్తుంది సుజాత. లోపలికి వచ్చిన భూమి ఏమైందని చెర్రిని అడుగుతుంది. విషయం చెప్తాడు చెర్రి. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today July 29th: ఇల్లు ఇల్లాలు పిల్లలు:
ఇల్లు ఇల్లాలు పిల్లలు: "ఐ హేట్ యూ ధీరజ్..!" ఇంటిని వదిలి వెళ్లిపోయిన ప్రేమ..! వేదవతిపై చేయి ఎత్తిన రామరాజు!
Nindu Noorella Saavasam Serial Today July 29th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కారు బ్రేకులు తీసేసిన చంభా – ప్రమాదంలో పిల్లలు, రాథోడ్‌  
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కారు బ్రేకులు తీసేసిన చంభా – ప్రమాదంలో పిల్లలు, రాథోడ్‌  
Brahmamudi Serial Today July 29th: ‘బ్రహ్మముడి’ సీరియల్: చలపతికి నందు గురించి నిజం చెప్పిన వెంకీ – శశితో కలిసి ఇంటికి వచ్చిన ఐశ్వర్య
‘బ్రహ్మముడి’ సీరియల్: చలపతికి నందు గురించి నిజం చెప్పిన వెంకీ – శశితో కలిసి ఇంటికి వచ్చిన ఐశ్వర్య
Gundeninda Gudigantalu July28th Episode:శోభన ప్రవర్తనతో కోపంతో రగిలిపోయిన రవి...అన్నం తినకుండా పడుకున్న శృతి
గుండెనిండా గుడిగంటలు: శోభన ప్రవర్తనతో కోపంతో రగిలిపోయిన రవి...అన్నం తినకుండా పడుకున్న శృతి

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
కొత్త టయోటా హైలక్స్‌ వచ్చేసింది.. 360 డిగ్రీ కెమెరా, 204hp డీజిల్‌ ఇంజిన్‌తో అదిరిపోయే పికప్‌
2026 టయోటా హైలక్స్‌ లాంచ్‌.. కొత్త లుక్‌, కొత్త ఫీచర్లతో మీ ఆదాయానికి మరింత ఊపు
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
Embed widget