Prema Entha Madhuram July 31th: 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: వర్ధన్ ఇంట్లో ఎమోషనల్ డ్రామా ప్లే చేసిన మాన్సీ.. అను ప్లాన్ చేసిన బిజినెస్ కి సపోర్ట్ ఇచ్చిన ఆర్య?
మాన్సీ ఆర్య ఇంటికి వచ్చి అందరితో ఎమోషనల్ గా డ్రామా ప్లే చేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Prema Entha Madhuram July 31th: బయటికి వచ్చిన మాన్సీని లాయరు ఎక్కడికి వెళ్తావు అని అడగటంతో వర్ధన్ ఇంటికి అని.. అదే తన ఇంటికి అని పగతో అనడంతో.. మళ్లీ ఏదైనా తప్పు చేస్తున్నారేమో గమనించండి అని లాయర్ అంటాడు. ఎటువంటిది జరగదు అని ఏం చేయాలో తనకు తెలుసు అని అక్కడి నుంచి బయలుదేరుతుంది.
మరోవైపు ఆర్య అంజలి, నీరజ్ ల ప్రైవసీ కోసం వారిని ప్యారిస్ కి వెళ్ళడానికి టికెట్లు బుక్ చేస్తాడు. అప్పుడే జిండే వచ్చి టికెట్లు బుక్ అయ్యాయని అంటాడు. ఇక నీరజ్ వాళ్ళు రావడంతో బిజినెస్ గురించి వారిని పారిస్ కి వెళ్ళమని అంటాడు ఆర్య. కానీ నీరజ్ వెంటనే ఆర్య తమను బిజినెస్ గురించి పంపివ్వటం లేదని ప్రైవసీ గురించి పంపిస్తున్నాడని అర్థం చేసుకొని మీరు ఎందుకు పంపిస్తున్నారు నాకు తెలుసు అని వెళ్ళను అని అంటాడు.
ఇక అంజలి కూడా మేము వెళ్ళము అని అంటుంది. అప్పుడే ఆర్య చేతికి ఉన్న గాయాన్ని చూసి ఏం జరిగింది అనటంతో పర్వాలేదు చిన్న దెబ్బ అని అంటాడు. కానీ అంజలి మాత్రం చాలా పెద్దగా జరిగిందని టెన్షన్ పడుతూ కనిపిస్తుంది. ఇక ఆర్య వాటి గురించి ఏం ఆలోచించకుండా మీరు వెళ్ళండి అనటంతో.. నీరజ్ నిన్ను ఇలా వదిలి మేము వెళ్ళము అని అనగా అంజలి కూడా అందరం సంతోషంగా ఉన్నప్పుడే వెళ్తాము అని అంటుంది.
దాంతో శారదమ్మ నీరజ్ మాటలను అర్థం చేసుకొని సరే ఫ్రెష్ అప్ అయ్యి భోజనం చేయడానికి రండి అని వెంటనే మాన్సీ అని పిలుస్తుంది. అందరూ మాన్సీ వైపు చూసి షాక్ అవుతారు. వెంటనే నీరజ్ మాన్సీ దగ్గరికి ఆవేశంగా వెళ్లి మళ్లీ ఎందుకు వచ్చావు అంటూ అరుస్తాడు. దాంతో తను ఎమోషనల్ గా డ్రామా ప్లే చేస్తుంది. తనకు జైల్లో ఉన్నంతకాలం జ్ఞానోదయం అయింది అని.. డబ్బులు ముఖ్యం కాదు ఫ్యామిలీ ముఖ్యమని తెలుసుకున్నాను ఇంట్లోకి రానివ్వండి అని బ్రతిమాలుతుంది.
కానీ నీరజ్ మాత్రం అస్సలు ఒప్పుకోడు. వెంటనే ఆర్య సరే అని ఐదు నిమిషాలు మాత్రమే సమయమని అనటంతో మాన్సీ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్లి వారికి క్షమాపణలు చెబుతూ ఎమోషనల్ గా డ్రామా క్రియేట్ చేస్తూ ఉంటుంది. తనను ఇంట్లో ఉండనివ్వమని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ ఆర్య అసలు ఒప్పుకోడు. సమయం అయిపోయిందని అక్కడినుంచి వెళ్ళిపోతాడు. అంజలి దంపతులు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
వెంటనే మాన్సీ బయటకు వచ్చి అందరూ ఒకే మాట మీద ఉన్నారు అని.. ఇప్పుడు వెళ్ళగొడుతున్నారు కానీ త్వరలో మళ్ళీ వస్తాను అని అక్కడి నుంచి వెళ్తుంది. మరోవైపు ప్రీతికి తమ ప్లాన్ చేసిన అమ్మ చేతి వంట ఆప్ గురించి చాలామంది ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడానికి ఫోన్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళందరూ తమ కంపెనీ తరపు నుండి ఇన్వెస్ట్ చేయమని అనడంతో అను దానికి ఒప్పుకోదు. వెంటనే నీరజ్ కూడా ఫోన్ చేసి ఆర్యకు మీరు చేసిన ప్లాన్ నచ్చింది అని.. తమ కంపెనీ నుండి ఇన్వెస్ట్ చేస్తాము అని అనటంతో అను ఆలోచనలో పడుతుంది.
also read it : Janaki Kalaganaledhu July 29th: అత్త మాటలకు జానకి ఎమోషనల్.. మల్లికను గోరంగా అవమానించిన నీలావతి?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial