Janaki Kalaganaledu May 25th: రామను అవమానించిన మల్లిక - జానకి చేసిన పనికి సంతోషంలో మునిగిన కుటుంబ సభ్యులు
ఎవరైతే రామ స్వీట్ షాప్ అప్పు కింద తీసుకున్నారో తిరిగి రామకు షాప్ ఇవ్వటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
![Janaki Kalaganaledu May 25th: రామను అవమానించిన మల్లిక - జానకి చేసిన పనికి సంతోషంలో మునిగిన కుటుంబ సభ్యులు Mallika insults rama in todays janakalaganaledhu serial may 25th written update Janaki Kalaganaledu May 25th: రామను అవమానించిన మల్లిక - జానకి చేసిన పనికి సంతోషంలో మునిగిన కుటుంబ సభ్యులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/25/4d16a7c7bdab2803c33862accfd919811684989699164768_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Janaki Kalaganaledu May 25th: జ్ఞానంబ జానకి విషయంలో బాధపడుతూ ఉండగా జానకి ధైర్యం చెప్పడంతో వెంటనే జ్ఞానాంబ ఆ అమ్మవారే నీ చేత ధైర్యం చెప్పినట్లు అనిపిస్తుందని సంతోషపడుతుంది. ఇక జానకి డ్యూటీకి వెళ్తానని అత్త ఆశీర్వాదాలు తీసుకొని బయలుదేరుతుంది. జానకి డ్యూటికి వెళ్తున్న సమయంలో మనోహర్ జానకిని చూసి కారు ఆపి గతంలో కోర్టులో జరిగిన విషయం గురించి సీరియస్ గా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు.
నీపై పగ తీర్చుకుంటానని బెదిరిస్తూ ఉంటాడు. కానీ జానకి మాత్రం ఏ మాత్రం భయపడకుండా సమాధానం ఇస్తుంది. నాతో మీరు జాగ్రత్తగా ఉండాలన్నట్లు మాట్లాడుతుంది. ఇద్దరికీ ఇద్దరూ తగ్గకుండా గట్టి సవాల్ తో మాట్లాడుతారు. ఆ తర్వాత మనోహర్ నీ అంతు చూస్తానని అక్కడి నుంచి వెళ్తాడు. అయితే అదే సమయంలో గతంలో అప్పు కిందట రామ స్వీట్ షాప్ తీసుకున్న పెద్దాయన బ్యాంకు నుండి డబ్బులు తీసుకుని బయటికి వస్తాడు.
ఇక ఆ డబ్బులు దొంగ ఎత్తుకుపోవటంతో ఆయన గట్టిగా అరవడంతో అందరూ ఆ దొంగలను పట్టుకోడానికి పరుగులు తీస్తారు. అదే సమయంలో అక్కడి నుంచి జానకితో పాటు మరో కానిస్టేబుల్ రాగా వెంటనే జానకి అక్కడ జరుగుతున్న సంఘటనను చూసి ఆ దొంగను పట్టుకుంటుంది. వెంటనే ఆ దొంగని కానిస్టేబుల్ తో స్టేషన్ కి పంపించి ఆ డబ్బుని ఆ పెద్దాయనకు ఇస్తుంది.
ఇక ఆ పెద్దాయన తన కూతురు డబ్బు కోసం దాచుకున్న డబ్బులు అని జానకితో మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఆయన జానకిని గుర్తుపట్టగా జానకి కూడా మిమ్మల్ని ఎలా మర్చిపోతానని అంటుంది. అప్పు కింద షాపు ఇచ్చాము కదా అని అంటుంది. ఇక దాంతో అతను నేను ఇంత చేసిన కూడా నాకు ఎలా సహాయం చేశావు అంటూ అది నా డ్యూటీ అని అంటుంది జానకి.
జానకి ఆయనకు తామ షాపు గురించి చెప్పుకుంటూ బాధపడుతుంది. ఇక ఆయన ఒక నిర్ణయానికి వచ్చాను అని షాపు తిరిగి ఇస్తాను అని చెబుతాడు. దాంతో జానకి సంతోషపడుతుంది. మరోవైపు రామ స్వీట్లు చేయటానికి ఇంటికి సామాన్లు తీసుకొని వస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మల్లిక ఇప్పుడు స్వీట్ చేసి ఊరంతా తిరిగి అమ్ముతారా అంటూ అవమానపరిచే విధంగా మాట్లాడుతుంది.
తన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ రామను బాధపెడుతుంది. కానీ రామ ఓపికగా మాట్లాడుతూ కనిపిస్తాడు. ఇక మల్లిక అలాగే వెటకారం చేస్తూ ఉండగా గోవిందరాజులు ఫైర్ అవుతాడు. అప్పుడే జ్ఞానంబ వాడి తలరాత బాలేక మాటలు పడుతున్నాడు అని.. దేవుడు ఏదో ఒక రూపంలో రామకు సహాయం చేస్తాడు అని అనటంతో.. అప్పుడే ఆ పెద్దాయన వారి దగ్గరికి వస్తాడు.
ఇక అప్పు కోసం వచ్చాడేమో అని రామ భయపడతాడు. దాంతో ఆయన చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి వచ్చాను అని షాపు తాళాలు ఇచ్చి తనకు జానకి చేసిన సహాయం గురించి చెప్పి అక్కడ నుంచి వెళ్తాడు. ఆ తర్వాత జానకిని గోవిందరాజు పొగిడుతాడు. దాంతో మల్లిక బాగా కుళ్ళుకుంటుంది. ఇక రామ షాప్ దగ్గరికి వెళ్తానని బయలుదేరుతాడు.
ఆ తర్వాత మలయాళం మూకుడులో పల్లీలు వేయించుకొని బయటికి వచ్చి తింటుండగా మల్లిక వెళ్లి ఆ మూకుడు పట్టుకుంటుంది. దెబ్బకు చేతులు కాలడంతో గట్టిగా అరుస్తుంది. అందరి ముందు కాసేపు రచ్చ రచ్చ చేస్తుంది. ఇక మరోవైపు జానకిని రామ కలిసి శుభవార్త అని అనటంతో జానకి ప్రెగ్నెంట్ విషయం బయటపడిందేమో అని అనుకుంటుంది. ఇక రామ కొట్టు చేతికి అందిన విషయం చెప్పటంతో ఆ విషయం కాదు అని అనుకుంటుంది. తరువాయి భాగంలో జానకి ఒక బొమ్మ పట్టుకొని రాగా వెంటనే మల్లిక ఆ బొమ్మ జానకి నాకోసమే తెచ్చింది అని తీసుకోవడంతో.. వెంటనే రామ అది.. అని ఏదో చెప్పబోతుంటే జానకి ఆపుతుంది.
Also Read: NTR AdaviRamudu: సీనియర్ ఎన్టీఆర్ ‘అడవిరాముడు’ రి-రిలీజ్ - ఆ విషయంలో ఫీలవుతున్న ఫ్యాన్స్?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)