అన్వేషించండి

Madhuranagarilo August 9th: 'మధురానగరిలో' సీరియల్: రాధ చేసిన పనికి కోపడ్డ శ్యామ్, సంయుక్త చేతిపై మెహందీ డిజైన్ చూసి షాకైన మధుర?

రాధ శ్యామ్.. ప్రేమ విషయాన్ని బయటపడకుండా అడ్డుగా ఉండటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Madhuranagarilo August 9th: శ్యామ్ లెటర్ తీసుకొని తన తల్లి గదికి వెళ్ళగా ఆ లెటర్ లో ఏముందో రాధ కూడా శ్యామ్ ను ఫాలో అవుతుంది. ఇక గదిలో తన తల్లి లేకపోయేసరికి శ్యామ్ ఆ లెటర్ అక్కడ పెట్టి.. ఈ లెటర్ చదివి తన తల్లి అర్థం చేసుకుంటుంది అని అక్కడి నుంచి వెళ్తాడు. వెంటనే రాధ ఆ లెటర్ చూసి చదవటంతో అందులో తను సంయుక్తను ఇష్టంతో పెళ్లి చేసుకోవడం లేదని తను రాధ ని ప్రేమిస్తున్నాను అని ఉండటంతో అది చూసి రాధ షాక్ అవుతుంది.

ఆ లెటర్ ఎగురుకుంటూ ధనుంజయ కాళ్ళ దగ్గర పడుతుంది. ఇక ధనుంజయ దగ్గరికి వెళ్లి మెల్లగా ఆ లెటర్ తీసుకోవాలని చూస్తుండగా ఆ లెటర్ మళ్ళీ ఎగిరి వాసంతి వాళ్ళ దగ్గర పడుతుంది. ఇక అక్కడికి వెళ్లి తీసుకోవాలని చూస్తుండగా మళ్లీ ఎగిరి నేరుగా మధుర కాళ్ల దగ్గర పడుతుంది. మధుర లెటర్ తీస్తుండగా ఎక్కడ నిజం తెలుస్తుందో అని రాధ వెంటనే ఆ లెటర్ తీసుకుంటుంది.

అందులో ఏముంది అని మధుర అడగటంతో.. సరుకుల లీస్ట్ అని అబద్ధం చెప్పి ఆ లెటర్ ను డస్ట్ బిన్ లో పడేస్తుంది. ఆ తర్వాత అందరూ మెహందీ ఫంక్షన్ కి వెళ్లడానికి రెడీ అవుతూ ఉండగా.. మధుర చాలా సంతోషంగా కనిపిస్తుంది. ఇక శ్యామ్ తన తల్లిని చూసి ఇంత సంతోషంగా ఉంది ఏంటి.. లెటర్ చదివిందా లేదా అని అనుమానం పడతాడు.

తన తల్లి దగ్గరికి వెళ్లి లెటర్ గురించి మాట్లాడుతూ ఉండటంతో.. ఏం లెటర్ అని మధుర అడుగుతుంది. వెంటనే రాధ లెటర్ అంటే లేఖ కదా లేఖ అంటే శుభలేఖలు అని ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే పెళ్లి కార్డ్స్ పంచమని అక్కడ పెట్టాను అని అంటున్నాడు.. దాని గురించి అడుగుతున్నాడు అని వెంటనే శ్యామ్ కు రాధపై కోపం వస్తుంది.

అదే సమయంలో పండు వచ్చి ట్యాబ్ లో ఛార్జింగ్ లేదని అనటంతో వెంటనే శ్యామ్ నిన్న నువ్వే కదా ఛార్జింగ్ పెట్టావు అది ఎక్కడ ఉందో పండు కి వెతికి ఇవ్వు అని రాధ ని పైకి పంపిస్తాడు. ఇప్పుడే పని ఉందని చెప్పి శ్యామ్ కూడా రాధ దగ్గరికి వెళ్తాడు. ఆ లెటర్ ఎక్కడ వేశావు అని కోపంగా అడుగుతాడు. ఆ సంయుక్తను   పెళ్లి చేసుకుంటే నాకు ఊపిరి ఆడదు అని.. నువ్వు ప్రేమించకున్నా సరే.. పెళ్లి ఆపాలనుకున్న నా ప్రయత్నానికి అడ్డుగా రాకూడదు అని.. మెహేంది ఫంక్షన్ అయిపోయేలోపు నిజం చెప్పేస్తాను అని తనపై కోపంగా అరిచి అక్కడ నుండి వెళ్తాడు.

ఇక రాధ చాలా బాధపడుతుంది. ఆ తర్వాత శ్యామ్ తన అమ్మ నాన్నలతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని అంటుండగా రాధ వచ్చి షాక్ అవుతుంది. ఇక విషయం చెప్పకుండా కాస్త ఊరిస్తూ ఉండటంతో మధుర ఇక నువ్వు చెప్పవులే అంటూ అక్కడి నుండి బయలుదేరుతుంది. ఇక నేను కూడా వస్తాను అని శ్యామ్ వాళ్లతో బయలుదేరుతాడు.

ఇక సంయుక్త వాళ్ళ ఇంటికి చేరుకోగా వారిని లోపలికి ఆహ్వానిస్తారు అపర్ణ వాళ్లు. ఇక అందరు ఇంట్లో కి రాగానే సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. కోడలి కోసం మధుర నగలు కూడా తీసుకొని వస్తుంది. తరువాయి భాగంలో సంయుక్త చెయ్యి మీద శ్యామ్ ఐ లవ్ యూ రాధ అని కోన్ తో రాయగా ఆ డిజైన్ చూడటానికి మధుర చెయ్యి చూపించమని అడుగుతుంది. ఇక శ్యామ్ బలవంతంగా చేయి చూపించడంతో వాళ్లంతా షాక్ అయినట్లు కనిపిస్తారు.

also read it : Prema Entha Madhuram August 8th: 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: ఆర్య చేతుల మీదుగా పిల్లల అన్నప్రసన్న వేడుక, బయటపడ్డ మదన్ అసలు రూపం?

Join Us on Telegram:  https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Embed widget