Lakshmi Nivasam Serial Today: కీర్తి ఇంటికి లక్ష్మీ, శ్రీనివాస్ - జాను తన చెల్లెలి కూతురే అని విజయేంద్రకు తెలిసిందా..?, ఆసక్తికరంగా 'లక్ష్మీ నివాసం' ఎపిసోడ్
Lakshmi Nivasam Today Episode: ఓ వైపు తులసి ఇంట్లో పెళ్లి పనుల హడావుడి.. మరోవైపు లక్ష్మి, శ్రీనివాస్‌లు తన కోడలు కీర్తి ఇంటికి పెళ్లి కార్డు ఇచ్చేందుకు వెళ్తారు. ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

Lakshmi Nivasam Serial Today Episode: ఓ వైపు తులసి ఇంట్లో పెళ్లి పనుల హడావుడి జరుగుతుంది. తులసికి శ్రీ రూ.50 లక్షల విలువైన డైమెండ్ నెక్లెస్ గిఫ్ట్‌గా ఇస్తాడు. ఇది చూసిన ఆమె వదినలు ఆశ్చర్యపోతారు. ఇదే సందర్భంలో పెళ్లి కార్డ్స్ ఎవరెవరికి పంచాలో శ్రీనివాస్ పేర్లు చెబుతుంటే జాను రాస్తుంటుంది. లక్ష్మి కుటుంబాన్ని ఈసారైనా పిలవాలని కోడళ్లు అనడంతో ఆమె వేదనకు గురవుతుంది. ఇదే సందర్భంలో జాను టాపిక్ మార్చేసి తులసి చీరల సెలక్షన్స్ కోసం శ్రీకి వీడియో కాల్ చేయగా.. శ్రీ, ఖుషి ఇద్దరూ కూడా ఒకే చీరను సెలక్ట్ చేస్తారు. ఆ తర్వాత శ్రీనివాస్ ఇంట్లో అనాథగా పెరిగిన వ్యక్తి లక్ష్మికి తన దగ్గరున్న డబ్బులతో ఓ చీర గిఫ్ట్‌గా ఇస్తాడు. దీంతో అంతా ఆనందపడతారు. ఇక ఈ రోజు ఎపిసోడ్ విషయానికొస్తే..
జానూకు 'విశ్వ' లవ్ లెటర్..
మరోవైపు క్లాస్ రూంలో 'విశ్వ' ఏదో తీక్షణంగా రాస్తూ ఉంటాడు. ఏంటని ఫ్రెండ్ అడిగితే జానుకు లవ్ లెటర్ అని చెప్తాడు. అదే సమయంలో అక్కడికి జానూ రాగా.. విశ్వ ఆ లెటర్‌ను చించి విసిరేస్తాడు. అయితే, జానూ మడతలు పడి విసిరేసిన ఆ లెటర్‌ను చూసి ఎవరు రాశారో చెప్పాలంటూ విశ్వ, అతని ఫ్రెండ్స్‌ను నిలదీస్తుంది. దీంతో విశ్వ తన ఫ్రెండ్ దాన్ని రాశాడని చెప్తాడు. అయితే, 'కీపిట్ అప్ బ్రదర్'.. అంటూ జానూ అతన్ని అప్రిషియేట్ చేస్తుంది. కానీ నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవంటూ జానూ చెప్తుంది. చదువు మీది ధ్యాస పెట్టాలని జానూ సలహాలిస్తుంది.
ఆ తర్వాత విశ్వ, అతని ఫ్రెండ్స్‌ను జానూ తన అక్క తులసి పెళ్లికి పిలుస్తుంది. భోజనాలకే కాకుండా పెళ్లిలో సర్వీస్ కూడా చేయాలని జానూ వాళ్ల ఫ్రెండ్స్‌ను రిక్వెస్ట్ చేస్తుంది.
కీర్తి ఇంటికి లక్ష్మీ, శ్రీనివాస్..
బసవ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరూ సిద్ధు బాబుకి చెప్తే ఏ పనైనా అయిపోతుందంటూ అంతా అతని దగ్గరికే వెళ్తారు. ఇది నీలిమకు నచ్చదు. దీంతో సిద్ధు అన్న తాను పార్టీ ఆఫీస్‌లో పనులు చూసుకుంటానని తన తండ్రి బసవకు చెప్తాడు. అయితే, అక్కడ కార్యకర్తల పనులు చూసుకోవాలంటూ బసవ తల్లి ఎగతాళి చేస్తుంది. తన భర్తను చులకనగా చూడడంపై నీలిమ కోపం తెచ్చుకుంటుంది. మరిదిపై సెటైర్లు వేస్తుంది. దీంతో అత్త కోప్పడగా నీలిమ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ఇదే టైంలో సిద్ధుకు ఫోన్ రాగా మాట్లాడుతూ పక్కకు వెళ్తాడు. అతని చుట్టూ జనం ఉంటారు. ఇదే టైంలో తులసి పెళ్లికి పిలిచేందుకు కీర్తి అత్త మామలైన లక్ష్మి, శ్రీనివాస్.. బసవ ఇంటికి వెళ్తారు. వాళ్లు డబ్బుల కోసం వచ్చారనుకుని బసవ తల్లి వారికి డబ్బులివ్వాలని కోడలు విశాలాక్షికి చెబుతుంది. అయితే.. తాము కీర్తి అత్తమామలం అని చెప్పగానే.. బసవ, అతని తల్లి కోపంతో రగిలిపోతారు. బసవ తల్లి కార్డ్ తీసుకుని లక్ష్మి, శ్రీనివాస్‌ను అవమానిస్తారు. హరీష్ తన మనవరాలు కీర్తి బుట్టలో వేసుకుని.. పెళ్లి చేసుకున్నాడని బసవతో పాటు అతని తల్లి నానా మాటలు అంటారు.
సిద్ధు మిస్ అయిపోయాడుగా..
ఈ లోపు ఫోన్ మాట్లాడుకుని సిద్ధు అక్కడకు వచ్చి ఎవరి మీద అరుస్తున్నారు అని అడుగుతాడు. కీర్తి అత్తమామలు వచ్చి.. పెళ్లి కార్డు ఇచ్చారని ఎటకారంగా చెప్తుంది బసవ తల్లి. వాళ్లను ఎందుకు రానిచ్చారంటూ సిద్ధు కార్డు కూడా చూడకుండా విసిరేస్తాడు.
నువ్వు పిన్ని అవుతావా అని తులిసిని అడిగిన ఖుషీ
మరోవైపు, తులసి ఆఫీస్ పనుల్లో బిజీగా ఉంటే ఖుషీ అక్కడకు వస్తుంది. ఖుషీ డల్‌గా ఉండడం చూసి ఏమైంది.? అని అడిగితే. 'మీ డాడీ పెళ్లి చేసుకునే ఆవిడ నీకు పిన్ని అవుతుంది కానీ అమ్మ కాదు కదా.?' అని తన ఫ్రెండ్స్ అన్నారంటూ చెప్తుంది. దీంతో తులసి బాధ పడుతూ ఖుషిని హత్తుకుంటుంది. రేపు స్కూల్‌కు వెళ్లగానే మా అమ్మ దేవుడి దగ్గరకు వెళ్లి ఈ అమ్మను పంపించిందని చెప్పమంటూ ఖుషీతో తులసి చెప్తుంది. ఇది వెనుకనే ఉండి శ్రీ గమనిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. తులసి మాటలు విని తనకు ధైర్యంగా ఉందని శ్రీ తులసితో అంటాడు. ఇప్పుడు తనకు వాళ్ల అమ్మ ఉందని చెప్తాడు.
విజయేంద్ర ఇంటికి జాను..
ఇదే టైంలో విజయేంద్ర తన తండ్రి ఆరోగ్యం గురించి డాక్టర్‌ను అడుగుతాడు. తన చెల్లెలు లక్ష్మి చేసిన పని వల్లే తన తండ్రికి ఇలాంటి గతి పట్టిందని విజయేంద్ర డాక్టర్‌తో చెప్తాడు. ఇదే సమయంలో లక్ష్మి కూతురు జానును తీసుకుని విశ్వ వారి ఇంటికి వెళ్తాడు. మరి జాను వారికి పెళ్లి కార్డు ఇచ్చిందా..?, జాను తన మేనకోడలే అని విజయేంద్రకు తెలుస్తుందా.? అనేది తెలియాలంటే..? రేపటి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.






















