అన్వేషించండి

Lakshmi Nivasam Serial Today: 'లక్ష్మీ నివాసం' సీరియల్: మృత్యు కోరల్లో శ్రీకాంత్ - షాక్‌లో తులసి కుటుంబం.. తులసి జీవితం ఎలాంటి మలుపు తిరగబోతోంది!

Lakshmi Nivasam Today Episode: పెళ్లి వేదిక వద్దకు వస్తోన్న శ్రీ ప్రమాదం జరగ్గా సుపర్ణిక ఆస్పత్రిలో చేరుస్తుంది. ఈ విషయాన్ని తులసి కుటుంబానికి ఫోన్ చేసి చెప్తుంది సుపర్ణిక. ఇక ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

Lakshmi Nivasam Serial Today Episode Review: ఓ వైపు పెళ్లి వేదిక వద్ద తులసి గౌరీ పూజ చేస్తుండగా.. వేదిక వద్దకు వస్తున్న వరుడు శ్రీ, వసుంధర, ఖుషీ కారుకు భార్గవ ప్లాన్ ప్రకారం ప్రమాదం జరుగుతుంది. ఈ ఘటనలో వారికి తీవ్ర గాయాలవుతాయి. సుపర్ణిక, భార్గవ్ అంబులెన్సులో ఆస్పత్రికి తరలిస్తారు. మరోవైపు వీరి కారుని గుద్దేసిన సిద్ధు ఆందోళనతో ఉండగా.. బసవ అతన్ని వారించి నామినేషన్ వేసేందుకు తీసుకెళ్తాడు. ఈ రోజు ఎపిసోడ్ విషయానికొస్తే..

ఆస్పత్రిలో శ్రీ, వసుంధర, ఖుషీ..

శ్రీ, వసుంధర, ఖుషీ ఆస్పత్రిలో చేర్పించి సుపర్ణిక ఆందోళనలో ఉంటుంది. భార్గవ్ సుపర్ణిక పక్కనే ఉండి ఓదారాస్తాడు. తులసి పేరెంట్స్‌కు ఫోన్ చేసి చెప్పాలని భార్గవ్ చెప్తాడు. దీంతో సుపర్ణిక శ్రీనివాస్‌కు ఫోన్ చేస్తుంది. ఇంతలో పెళ్లి హడావుడిలో సౌండ్ వినిపించడం లేదని జానును పక్కకు వెళ్లి ఫోన్ మాట్లాడాలని శ్రీనివాస్ ఆమెకు ఫోన్ ఇస్తాడు.  

షాక్‌లో జాను..

ఇంకా పెళ్లి వేదిక వద్దకు ఎందుకు రాలేదని సుపర్ణికను జాను అడుగుతుంది. రాలేని పరిస్థితి అని.. శ్రీకాంత్ అన్నయ్యకు ప్రమాదం జరిగిందని చెప్తుంది. దీంతో జాను అక్కడే షాక్‌తో కన్నీళ్లు పెట్టుకుని కూర్చుండిపోతుంది. గౌరీ పూజ పూర్తైందని.. వరుడి రావడమే ఆలస్యమని పూజారి చెప్పడంతో.. అంతా శ్రీ కోసం ఎదురు చూస్తుంటారు. విషయం తెలియక అందరూ సంతోషంతో ఫోటోలు దిగుతారు. ఫోటోల కోసం అంతా వచ్చారని జాను ఎక్కడని బామ్మ అడగ్గా.. దూరంగా ఉన్న జాను కన్నీళ్లతో అక్కడకు వస్తుంది. తులసి ఆమెను పక్కన కూర్చోబెట్టుకుని మరీ ఫోటోలు దిగుతుంది. 

ఆస్పత్రికి తులసి కుటుంబం

శ్రీకి యాక్సిడెంట్ అయిన విషయాన్ని జాను, విశ్వకు చెబుతుండగా.. ఆమె అక్క విని.. లక్ష్మి, శ్రీనివాస్, తులసిలకు చెప్తుంది. దీంతో అంతా షాక్‌కు గురై ఆస్పత్రికి బయల్దేరుతారు. తులసి, జాను, శ్రీనివాస్, లక్ష్మి అంతా కంగారుగా ఆస్పత్రికి వెళ్తారు.

మరోవైపు, ఈలోపు బయట కార్ యాక్సిడెంట్ అయిన వారి గురించి తెలుసుకోవాలని సిద్ధు తన అనుచరులకు చెప్తాడు. ఆ తర్వాత సిద్ధును కార్పొరేషన్ ఎన్నికలో నామినేషన్ వేసేందుకు బసవ ఆఫీస్‌కు తీసుకెళ్తాడు. పేపర్స్‌పై సంతకం అనంతరం సిద్ధు బయటకొచ్చి శ్రీ వాళ్ల గురించి తెలుసుకుని ఆస్పత్రికి బయల్దేరుతాడు. 

ఖుషీకి బ్లడ్ ఇచ్చిన సిద్ధు

ఆస్పత్రికి సిద్ధు వెళ్లి ఎంక్వైరీ చేయగా.. పేరు తెలియకపోవడంతో నర్స్ వివరాలు చెప్పలేకపోతుంది. అయితే, ఎమర్జెన్సీ వార్డులో చెక్ చేయాలని నర్స్ చెబుతుంది. దీంతో సిద్ధు అక్కడకు వెళ్తాడు. ఇదే టైంలో ఖుషీకి బ్లడ్ ఎక్కువగా పోయిందని.. 'A-' బ్లడ్ కావాలని డాక్టర్ చెప్పగా స్టాక్ లేదని నర్స్ చెప్పడంతో ఎలాగైనా బ్లడ్ కోసం ప్రయత్నించమని చెప్పగా నర్స్ బయటకు వెళ్లి 'ఏ నెగిటివ్' బ్లడ్ కావాలని చెప్తుంది. ఇది విన్న సిద్ధు తనది అదే బ్లడ్ గ్రూప్ అని.. తాను బ్లడ్ ఇస్తానని అంటాడు. దీంతో నర్స్ అతని నుంచి బ్లడ్ తీసుకుంటుంది. 

మృత్యుకోరల్లో శ్రీకాంత్..

ఇదే సమయంలో తులసి, లక్ష్మి శ్రీనివాస్ కంగారుగా ఆస్పత్రికి వచ్చి శ్రీ కండీషన్ గురించి అడుగుతారు. ట్రీట్మెంట్‌కు రెస్పాండ్ అవుతున్నారని.. అయితే, పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్ చెబుతాడు. దీంతో తులసి కుటుంబం కన్నీళ్లు పెట్టుకుంటుంది. సుపర్ణిక సైతం కన్నీళ్లు పెడుతుండగా.. భార్గవ్ ఓదారుస్తాడు. ఏ దరిద్రం పట్టిందో ఇలా జరిగిందటూ తులసిని ఉద్దేశించి సుపర్ణిక అంటుంది. దీంతో తులసి మరింత వేదనకు గురవుతుంది. అసలు, శ్రీ మృత్యుకోరల నుంచి బయటపడతాడా.?, ఖుషి, వసుంధర పరిస్థితేంటి..?, తులసి జీవితం ఎలాంటి మలుపు తిరగబోతోంది..? అనే విషయాలు తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే.

Also Read: ‘బ్రహ్మముడి’ సీరియల్ : దుగ్గిరాల ఇంటికి వచ్చిన పిచ్చాసుపత్రి వ్యాన్‌ – నెల రోజుల్లో రాజ్‌ను తీసుకొస్తానన్న కావ్య

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 14th: 'గోదావరి' సీరియల్: ఇద్దరమ్మాయిలతో.. సూర్య! నడిరోడ్డు మీద రచ్చరచ్చ! మురళీ నందుల వేడి నీటి రొమాన్స్!
'గోదావరి' సీరియల్: ఇద్దరమ్మాయిలతో.. సూర్య! నడిరోడ్డు మీద రచ్చరచ్చ! మురళీ నందుల వేడి నీటి రొమాన్స్!
Nindu Manasulu Serial Today August 14th: నిండు మనసులు: రంజిత్‌నే లవ్ చేస్తున్నా అని చెప్పేసిన ఐషూ! ఆ సీన్ చూసి ప్రేరణ, సిద్ధూ షాక్!
నిండు మనసులు: రంజిత్‌నే లవ్ చేస్తున్నా అని చెప్పేసిన ఐషూ! ఆ సీన్ చూసి ప్రేరణ, సిద్ధూ షాక్!
Podarillu Serial Today August 14th: నారాయణ కుటుంబం గుడికి రాకుండా తాయారు ఏం చేసింది..? మహాలక్ష్మీ ఎలా దీటుగా జవాబిచ్చింది.
పొదరిల్లు: నారాయణ కుటుంబం గుడికి రాకుండా తాయారు ఏం చేసింది..? మహాలక్ష్మీ ఎలా దీటుగా జవాబిచ్చింది.
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 14th:సుందరి గురించి నిజం తెలుసుకున్న రాధ...విక్కీకి దగ్గరయ్యేందుకు దొంగచిట్టి ప్లాన్‌ ఏంటి..?
నువ్వులేక నేను లేను:సుందరి గురించి నిజం తెలుసుకున్న రాధ...విక్కీకి దగ్గరయ్యేందుకు దొంగచిట్టి ప్లాన్‌ ఏంటి..?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
Embed widget