Lakshmi Nivasam Serial Today: 'లక్ష్మి నివాసం' సీరియల్: తులసికి సిద్ధు చేరువవుతాడా? - జాను, జై పెళ్లికి రెడీ అవుతున్న వేళ విశ్వ పరిస్థితేంటి?
Lakshmi Nivasam Today Episode: జానుతో పెళ్లికి జైకు లైన్ క్లియర్ అవుతుంది. దీంతో విశ్వ వేదనకు గురవుతాడు. ఇదే సమయంలో తులసికి తన ప్రేమ విషయం చెప్పాలని సిద్ధు ఆమె వెంటపడతాడు. ఇక ఈ రోజు ఎపిసోడ్‌లో..

Lakshmi Nivasam Serial Today April 17th Episode: జానుతో పెళ్లికి ట్రాక్ వేస్తుంటాడు జై. శ్రీనివాస్ ఫ్యామిలీని మరోసారి కలిసి జాను ఎవరినీ లవ్ చేయడం లేదని కన్ఫర్మ్ చేసుకుంటాడు. దీంతో విశ్వ ఆవేదనకు గురవుతాడు. ఇదే సమయంలో తులసి మరో ఉద్యోగం కోసం వేట కొనసాగిస్తుంది. తులసిని చూసిన సిద్ధు ఆమె వెంటపడుతూ పరిచయం పెంచుకోవాలని అనుకుంటాడు. ఇది గమనించిన తులసి మళ్లీ తనకు ఉద్యోగం రానీయకుండా చెడగొడతాడేమోనని ఆందోళనకు గురవుతుంటుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్‌లో..
తులసిని ఫాలో అవుతున్న సిద్ధు
తులసి కోసం బస్సు ఎక్కిన సిద్ధు ఆమెను ఫాలో అవుతుంటాడు. ఇంతలో సిద్ధు పక్కనే ఉన్న వ్యక్తి తనను అగౌరవంగా మాట్లాడావంటూ అతనితో గొడవపెట్టుకుంటాడు. దీంతో సిద్ధు తనదైన స్టైల్లో అతనికి వార్నింగ్ ఇస్తాడు. ఇది చూసిన తులసి అతన్ని తప్పుగా అనుకుంటుంది. ఇంతలో తులసి దిగిన బస్టాప్‌లోనే సిద్ధు, అతని బ్యాచ్ దిగుతారు. నడుచుకుంటూ వెళ్తున్న తులసిని పాట పాడుకుంటూ ఫాలో అవుతుంటారు. తులసి చెప్పు తెగిపోగా ఇబ్బంది పడుతూ నడుస్తుంటుంది.
విశ్వ ఇంట్లో టెన్షన్
మరోవైపు, త్రివేణి విశ్వ కోసం ఎదురుచూస్తూ ఇంట్లో కంగారుగా తిరుగుతుంది. నువ్వు ప్రేమించిన అమ్మాయి తల్లిదండ్రులు ఎక్కడని విజయేంద్ర.. విశ్వని అడుగుతాడు. వాళ్లు రారని.. తన దగ్గరికి వెళ్లలేదని విజయేంద్ర, త్రివేణితో చెప్తాడు. తన దృష్టంతా పరీక్షల మీదే పెడతానని.. అంతా వదిలేయాలని వారితో అంటాడు విశ్వ. మా గురించి ఏమైనా చెప్పావా? అంటూ త్రివేణి మీద కోప్పడతాడు విజయేంద్ర.
సిద్ధుకి తులసి వార్నింగ్
తులసి ఓ ఆఫీసులోకి వెళ్లగా.. బయట సిద్ధు, అతని స్నేహితులు ఎదురుచూస్తుంటారు. తన చెప్పు తెగిపోవడంతో ఆమెకు ఎలాగైనా చెప్పులు ఇవ్వాలంటూ సిద్ధు దగ్గర్లో ఓ మూడు షాపులు కొని నానా పాట్లు పడతాడు. వాళ్ల మనుషులే అందులో అమ్ముతున్నట్లు నటిస్తుంటారు. సిద్ధు డైరెక్షన్లో వాళ్లు తులసికి చెప్పులు ఇస్తారు.
అయినా, తులసి డబ్బుల్లేవంటూ చెప్పులు తీసుకోదు. ఫ్రీ చెప్పులంటూ సిద్ధు అనుచరులు ఓవరాక్టింగ్ చేయడంతో గమనించిన తులసి.. వాళ్లకు బుద్ధి చెప్పాలంటూ అక్కడి వారిని పిలిచి ఫ్రీగా చెప్పులు తీసుకునేలా చేస్తుంది. నన్ను మోసం చేయాలని చూస్తే ఊరుకోనంటూ సిద్ధుకి వార్నింగ్ ఇస్తుంది తులసి. దీంతో బాధగా ఫీల్ అవుతాడు సిద్ధు.
విశ్వకు గతం చెప్పిన త్రివేణి
విశ్వ జానును తలుచుకుని బాధ పడుతుంటే అతని అమ్మ త్రివేణి అక్కడకు వస్తుంది. నీకు 'లక్ష్మి' అనే మేనత్త ఉందని.. ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్లిపోయిందని విశ్వకు చెబుతుంది. దీంతో షాక్‌కు గురవుతాడు. వాళ్లు సిటీలోనే ఉన్నారని.. వాళ్ల గురించి తెలుసుకోవాలని ప్రయత్నించొద్దని.. విశ్వ వద్ద మాట తీసుకుంటుంది త్రివేణి.
మరి విశ్వ తన అత్త లక్ష్మి ఫ్యామిలీని కనుక్కుంటాడా?, సిద్ధు తులసికి దగ్గరవుతాడా?, జానుతో జై పెళ్లి అవుతుందా?, చిన్నారి ఖుషి భార్గవ్, అతని అమ్మ భాగ్యం బారి నుంచి తప్పించుకుంటుందా? ఇవి తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.






















