Lakshmi Nivasam Serial Today: 'లక్ష్మీ నివాసం' సీరియల్: సిద్ధు ఇంటికి శ్రీనివాస్ ఫ్యామిలీ.. తులసి, సిద్ధు కలుస్తారా? - జైతో జాను పెళ్లి కుదురుతుందా?
Lakshmi Nivasam Today Episode: తులసిని వెతుక్కుంటూ వెళ్లిన సిద్ధు లక్ష్మి ఇంటికి చేరుతాడు. మరోవైపు జానుతో కలల లోకంలో తేలియాడుతుంటాడు జై. ఇక ఈ రోజు ఎపిసోడ్ విషయానికొస్తే..

Lakshmi Nivasam Serial Today April 12th Episode: తులసిని వెతుక్కుంటూ వెళ్లిన సిద్ధు అనుకోకుండా శ్రీనివాస్ ఇంటికి చేరుకోగా అతన్న చూసి లక్ష్మి పలకరిస్తుంది. ఇంట్లోనే తులసి ఉండగా.. ఇద్దరూ ఎదురుపడే సమయంలోనే ఒకరికొకరికి ఫోన్లు వచ్చి వారు చూడడం మిస్ అవుతుంది. మరోవైపు జై.. జానుతో పెళ్లికి సంబంధించి కలల ప్రపంచంలో మునిగి తేలుతాడు. జానును ఎలాగైనా దక్కించుకోవాలని ఊహల్లో ఉంటాడు. ఇక ఈ రోజు ఎపిసోడ్‌లో..
తులసికి ఖుషి ఫోన్
చిన్నారి ఖుషి ఎలా ఉందోననే ఆలోచనలో ఉంటుంది తులసి. పాప కోసం బాధ పడుతుంది. ఇదే సమయంలో సుపర్ణిక గదిలోకి రహస్యంగా వెళ్లిన ఖుషి ఆమె పోన్ తీసుకుని తులసికి ఫోన్ చేస్తుంది. సుపర్ణిక నెంబర్ చూసి తొలుత ఆశ్చర్యపోయిన తులసి.. లిఫ్ట్ చేయగానే ఖుషీ గొంతు విని ఆశ్చర్యపోతుంది.
ఏడుస్తూ.. ఎలా ఉన్నావని ఖుషీని అడగ్గా.. తనను చాలా తిడుతున్నారని.. ఆకలంటే కనీసం పట్టించుకోవడం లేదని తులసికి చెప్తుంది ఖుషి. దీంతో తీవ్ర వేదనకు గురవుతుంది తులసి. తాను వస్తానని.. ఇంటికి తీసుకొచ్చేస్తానని ఖుషితో అంటుంది తులసి. ఏది ఏమైనా ఖుషీని తీసుకొచ్చేస్తానంటూ మనసులో అనుకుని సుపర్ణిక ఇంటికి బయలుదేరుతుంది తులసి.
ఖుషికి సుపర్ణిక వార్నింగ్
తులసికి ఖుషి ఫోన్ చేయడం భార్గవ్, సుపర్ణిక, భాగ్యం చూస్తారు. ఖుషీని బాగా తిట్టిన సుపర్ణిక.. తులసి నీకు అమ్మ కాదని మర్చిపోవాలని వార్నింగ్ ఇస్తుంది. ఇది చూసిన భాగ్యం ఖుషీని కోప్పడుతూ అక్కడి నుంచి ఈడ్చుకుంటూ వెళ్లిపోతుంది.
ఖుషీ ఇంటికి తులసి
ఇదే సమయంలో ఖుషీ ఇంటికి బయలుదేరిన తులసిని చూసి లక్ష్మీ ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతుంది. ఖుషీని ఇబ్బంది పెడుతున్నారని.. కనీసం తిండి కూడా పెట్టడం లేదని చెప్పగా వారు వేదనకు గురవుతారు. అయితే, ఖుషి ఇంటికి వెళ్లొద్దని తులసిని వారిస్తారు లక్ష్మి, శ్రీనివాస్. మళ్లీ పోలీసులు కేసులు పెడతారని.. పాప కోసం వేరే ఆలోచన చేద్దామని ఆమెతో అంటాడు శ్రీనివాస్. అయితే, శ్రీకాంత్ తనకు కొనిచ్చిన డైమండ్ నెక్లెస్ వారికి తిరిగి ఇచ్చేస్తానని.. అప్పుడైనా ఖుషీని చూడొచ్చని తులసి అనుకుంటుంది.
సిద్ధుకు పెళ్లి సంబంధాలు
మరోవైపు, సిద్ధుకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. తనకు నచ్చిన పిల్లను పెళ్లి చేసుకోవచ్చని బసవ.. సిద్ధుతో అంటాడు. దీంతో తులసిని గుర్తు చేసుకుంటాడు సిద్ధు. అయితే, పంతులు గారు చూపించిన సంబంధాల్లో ఏది నచ్చిందో చెప్పమని నీలిమ అంటుంది. ఇదే టైంలో పంతులు సంబంధాలు చూపిస్తుండగా.. నాకు నచ్చిన సంబంధం చేసుకుంటానని.. అయితే, ఇప్పట్లో పెళ్లి వద్దని వారిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు సిద్ధు. అబ్బాయి మనసులో ఎవరున్నారో తెలుసుకున్నాకే సంబంధాలు చూడాలని వారితో అంటాడు పంతులు.
బసవ ఇంటికి లక్ష్మి, శ్రీనివాస్
తమను జైలు నుంచి బసవే బయటకు తీసుకొచ్చారని భావిస్తున్న లక్ష్మి, శ్రీనివాస్.. అతనికి థ్యాంక్స్ చెప్పేందుకు తులసితో కలిసి వారి ఇంటికి వెళ్తారు. అదే సమయంలో సిద్ధు ఇంటి డాబాపై కార్యకర్తలతో మాట్లాడుతుంటాడు. వారిని చూసిన త్రివేణి, బసవ ఆశ్చర్యపోతూ సాదరంగా ఆహ్వానిస్తారు. వారికి తన పెద్ద కొడుకు మహేష్, నీలిమను పరిచయం చేస్తాడు బసవ.
కన్ఫ్యూజన్‌లోనే లక్ష్మి, శ్రీనివాస్
తమను జైలు నుంచి బయటకు తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పేందుకు వచ్చామని తులసి బసవతో అంటుంది. ఇది విన్న బసవ తానేం విడిపించలేదని వారితో అంటాడు. ఇది విన్న లక్ష్మీ, శ్రీనివాస్ ఆశ్చర్యపోతారు. అయితే, సిద్ధు ఏమైనా విడిపించాడేమో? అని త్రివేణి అంటుండగా అలానే కనుక్కుంటానంటూ బసవ పైకి వెళ్తాడు. అయితే, తాను విడిపించిన వారి వివరాలు బసవకు చెప్తాడు సిద్ధు. ఇది విన్న బసవ రిలీఫ్ ఫీల్ అవుతాడు. తమ అబ్బాయి కూడా మిమ్మల్ని విడిపించలేదంటూ లక్ష్మీ, శ్రీనివాస్‌లకు చెప్తాడు. దీంతో తమను విడిపించింది ఎవరో అనే కన్ఫ్యూజన్‌లోనే ఉండిపోతారు వాళ్లు. అసలు, వారిని విడిపించింది ఎవరు?, తన ఇంటికి వచ్చిన తులసిని సిద్ధు చూస్తాడా? జాను పెళ్లి విషయం ఏమైంది? తెలియాలంటే రేపటి ఎపిసోడ్స్ వరకూ ఆగాల్సిందే.





















