అన్వేషించండి

Lakshimi Raave Maa Intiki Serial Today May12th: మ్యాడీ గెటప్‌లో అదరగొట్టిన సూర్యనారాయణ, ఇందిరగా జీవించేసిన శ్రీలక్ష్మీ

Lakshimi Raave Maa Intiki Serial Today Episode May12th:మ్యాడీ గెటప్‌లో అదరగొట్టిన సూర్యనారాయణ, ఇందిరగా జీవించేసిన శ్రీలక్ష్మీ

Lakshimi Raave Maa Intiki Serial Today Episode: గెస్ట్‌హౌస్‌లో ఆటపాటలతో సూర్యనారాయణ కుటుంబం ఆనందంగా గడుపుతుంటుంది. చేతిరుమాలు ఆటలో రెండు జట్లకు సమాన పాయింట్లురావడంతో చివరి రౌండుకు మ్యాడీ, శ్రీలక్ష్మీ వస్తారు. ఒకరినొకరు కవ్వించుకుంటూ గెలవడానికి ప్రయత్నిస్తుంటారు. అప్పుడే చాకచక్యంగా  మ్యాడీ కర్చీప్‌ తీసుకుని పరుగెడతాడు.  దీంతో సూర్యనారాయణ టీం గెలిచినట్లు ప్రకటిస్తారు. తాను కావాలనే ఓడిపోయానని....భర్త గెలిపే భార్య గెలుపంటూ శ్రీలక్ష్మీ చెప్పిన మాటలు విని అందరూ ఆశ్చర్యపోతారు.

సింధూ వద్దకు వచ్చి మీ ఆయన కూడా వచ్చి ఉంటే చాలా సరదాగా ఉండేదని సూర్యనారాయణ అంటాడు. గోపీని పిలవకపోయావా అని అడుగుతాడు.అన్నయ్యకు ఊరిలో చాలా పనులు ఉండి ఉంటాయని....లేకపోతే ఖచ్చితంగా వచ్చి ఉండేవాడని లక్ష్మీ అంటుంది. అయినా రెండు రోజుల్లో పనులన్నీ చూసుకుని వస్తానని అన్నాడు కదా అని అంటుంది. ఇంతలో ఇందిర కల్పించుకుని ప్రియంవద భర్త కూడా ఉండి ఉంటే ఈ ఇల్లు ఇంకా కళకళలాడుతూ ఉండేదని అంటుంది. దీంతో ప్రియంవద గతుక్కుమంటుంది.

వాతావరణం కాస్త వేడెక్కినట్లు గ్రహించిన సూర్యనారాయణ మరో ఆట ఉందని...అది ఇప్పుడు మీరు ఆడిన రెండు ఆటల  కన్నా చాలా మజా వస్తుందని చెబుతాడు. అందరూ కూర్చుని ఏం ఆట అని అడగ్గా.....ఐష్‌ వచ్చి మీరు ఇప్పటి వరకు ఊహించని చూసి ఎరగని ఆట అంటూ....ఉపన్యాసం ఇస్తుంది.

అంతలో సూర్యనారాయణ గెటప్‌లో మ్యాడీ రావడం చూసి వాళ్ల అమ్మానాన్న, బాబాయి, పిన్ని ఆశ్చర్యపోతారు. అచ్చం నాన్నలా ఉన్నాడని పొంగిపోతారు. సూర్యానారాయణ గెటప్‌లో వచ్చిన మ్యాడీ ఇందిరా అంటూ కేకవేయగానే....ఇందిర గెటప్‌లో ఉన్న లక్ష్మీ మంచినీళ్ల గ్లాస్ తీసుకుని వస్తుంది. లక్ష్మీని చూసి అందరూ చప్పట్లతో స్వాగతం పలుకుతారు. ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటారు.అంతా బాగుంది కానీ...ఆ లక్ష్మీ జీవితమే అలా అయినందుకు బాధగా ఉందని అంటుంది.ఇప్పుడు లక్ష్మీకి ఏమైంది ఇందిరా అని అడుగుతాడు. పీటలమీద పెళ్లి ఆగిపోవడం బాధే కదండీ అని అంటుంది. నాకు కూడా బాధ ఉందని...అందుకే నేను ఓ నిర్ణయం తీసుకున్నానని అంటాడు. మ్యాడీ, లక్ష్మీ పెళ్లినాటి కథను మళ్లీ రీక్రియేట్ చేస్తారు.

లక్ష్మీ అని పిలవగానే....లక్ష్మీ గెటప్‌లో లంగా ఓణీ వేసుకుని ఇందిర రావడం చూసి అందరూ పగలబడి నవ్వుకుంటారు. ఆ గెటప్‌ సూపర్‌గా ఉందని కొడుకులు, కోడళ్లు అంటారు. నీకు  జరిగిన అన్యాయం గురించి విన్నానమ్మా...నీకు తగిన  న్యాయం చేస్తానని అంటాడు. అసలు తాగుబోతు వెధవతో పెళ్లి చెడిపోవాలనే నేను కోరుకున్నానని...ఆ శివయ్య అంత పనిచేశాడని అంటాడు. ఇంతలో మధుసూదన్‌ను పిలవగానే....ఎవరూ ఊహించని విధంగా మ్యాడీ గెటప్‌లో ఫ్యాంట్‌, షర్ట్‌ వేసుకుని అచ్చం కుర్రాడిలా తయారై వచ్చిన సూర్యనారాయణను చూసి అందరూ షాక్ తింటారు.

రావడంతోనే మ్యాడీలో నటించడం చూసి మరింత ఆశ్చర్యపోతారు. నువ్వు ఈ  అమ్మాయిని పెళ్లిచేసుకోవాలని సూర్యనారాయణ ఆదేశించగా...ఈ పల్లెటూరు అమ్మాయిని తప్ప ఎవరినైనా పెళ్లి చేసుకుంటానని మ్యాడీ అంటాడు. అప్పుడు అక్కడ జరిగే మాటలు, తాతయ్య తన పెళ్లికోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో తెలిసి  మ్యాడీ బాధపడిపోతాడు. నా జీవితం బాగుండాలని తాతయ్య  ఇంత  ఆలోచిస్తే నేనే ఆయన్ను తప్పుగా అర్థం చేసుకున్నానని బాధపడతాడు. ఇంతలో ఇంట్లో నుంచి ప్రియంవద భర్త తప్పించుకుని బయటకు వస్తాడు.అతన్ని చూసిన ప్రియంవద భయపడిపోతుంది.

మరిన్ని తెలుగు సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 5th: 'గోదావరి' సీరియల్: కల్యాణ్ ప్లాన్‌కి గౌతమి బలి..? సింహాద్రి వార్నింగ్ నిజమైందా! షాకింగ్ ట్విస్ట్!
'గోదావరి' సీరియల్: కల్యాణ్ ప్లాన్‌కి గౌతమి బలి..? సింహాద్రి వార్నింగ్ నిజమైందా! షాకింగ్ ట్విస్ట్!
Nindu Manasulu Serial Today August 5th: నిండు మనసులు: ప్రాణాపాయంలో సిద్ధూ! పక్కాప్లాన్‌తో పొడిచేసిన ఎమ్మెల్యే కొడుకు!
నిండు మనసులు: ప్రాణాపాయంలో సిద్ధూ! పక్కాప్లాన్‌తో పొడిచేసిన ఎమ్మెల్యే కొడుకు!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 5th:వర్షం అంటే ఇష్టమన్న రాధను చూసి...అసలు వర్షం అంటేనే ఇష్టం లేదన్న చిట్టిని చూసి విక్కీకి ఏం అనుమానం వచ్చింది..?
నువ్వులేక నేను లేను: వర్షం అంటే ఇష్టమన్న రాధను చూసి...అసలు వర్షం అంటేనే ఇష్టం లేదన్న చిట్టిని చూసి విక్కీకి ఏం అనుమానం వచ్చింది..?
Podarillu Serial Today August 5th:మాధవ్‌ పెళ్లిచూపులు ఏమయ్యాయి...? మాధవ్ ఇల్లు,తమ్ముళ్లను వదిలివెళ్లడానికి కారణమేంటి..?
పొదరిల్లు: మాధవ్‌ పెళ్లిచూపులు ఏమయ్యాయి...? మాధవ్ ఇల్లు,తమ్ముళ్లను వదిలివెళ్లడానికి కారణమేంటి..?
Advertisement

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఇంటర్ ప్రైవేట్‌ కాలేజీలు!
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఇంటర్ ప్రైవేట్‌ కాలేజీలు!
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Prashant Kishor Wins: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
Embed widget