అన్వేషించండి

Lakshimi Raave Maa Intiki Serial Today May 26th: భర్త మ్యాడీపై లక్ష్మీ చేయిచేసుకోవడానికి కారణమేంటి..? విక్రమ్ చెంపపగులగొట్టిన శ్రీలక్ష్మీ

Lakshimi Raave Maa Intiki Serial Today Episode May 26th: విక్రమ్‌ చూపించిన వీడియో చూసి భార్యని అనుమానించి మ్యాడీ చెంప లక్ష్మీ పగులగొట్టడంతో ఈరోజు ఏపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Lakshimi Raave Maa Intiki  Serial Today Episode: జీ తెలుగు ఛానెల్‌లో అత్యంత ప్రజాధరణతో దూసుకుపోతున్న లక్ష్మీరావే మా ఇంటికి సీరియల్‌లో ఇవాల్టి ఏపీసోడ్‌ మంచి ట్విస్ట్‌లతో సాగుతుంది. విక్రమ్‌ చూపించిన వీడియో చూసి మ్యాడీ లక్ష్మీపై నోరుజారడంతో శ్రీలక్ష్మీ చెంపపగులగొడుతుంది. ఆతర్వాత విక్రమ్‌ వద్దకు వెళ్లి గట్టిగా చెంపపై కొట్టడంతో ఈరోజు ఏపిసోడ్‌ రసవత్తరంగా సాగుతుంది..

  మ్యాడీకి వీడియో చూపించిన విక్రమ్

                  శ్రీలక్ష్మీ తాను ప్రేమించుకుంటున్నామని...ఆ అమ్మాయివైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే సహించేదిలేదని విక్రమ్ అందరికీ వార్నింగ్ ఇవ్వడం చూసి మ్యాడీ విక్రమ్‌ను  బెదిరిస్తాడు.మేమిద్దరం ప్రేమించుకుంటే మధ్యలో నీకు ఎందుకురా అని విక్రమ్‌ మ్యాడీతో అంటాడు. అసలు తను నిన్ను ప్రేమిస్తుందని ఎవరు చెప్పారురా అని అంటాడు. ఎవరో చెబితే నేను ఎందుకు వింటానని స్వయంగా తనే నాతో చెప్పిందని అంటాడు.అందుకు ఆధారాలు ఉన్నాయా అని అడగ్గా....నా దగ్గర ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతానని చెప్పి త్రిష పంపిన వీడియో అందరికీ చూపిస్తాడు. అది తీసుకుని మ్యాడీ చూడగా...అందులో శ్రీలక్ష్మీ తాను ఎంతగా ప్రేమిస్తుందో చెబుతూ చివరిలో ఐలయూ అని అంటుంది. ఆ వీడియో చూసిన మ్యాడీ కోపంతో రగిలిపోతాడు.ఇది చాలా ఇంతకన్నా ఆధారాలు కావాలా అని అంటాడు. ఈ వీడియో మీ తాతయ్యకు చూపిస్తే చాలని ఈ లక్ష్మీని ఇంట్లో నుంచి వెళ్లగొట్టడం ఖాయమని అంటాడు. వెంటనే లక్ష్మీని చేయిపట్టుకుని మ్యాడీ స్టడీ రూమ్‌లోకి లాక్కెళ్తాడు.
భర్తపైనే చేయిచేసుకున్న శ్రీలక్ష్మీ
  నువ్వు పల్లెటూరు నుంచి వచ్చినదానివే అనుకున్నాను కానీ....ఇలా పక్కదారి పట్టేదానివి అనుకోలేదని అంటాడు. లక్ష్మీ చెప్పేది వినిపించుకోకుడా ఆమె గురించి తప్పుగా మాట్లాడుతున్న మ్యాడీ చెంపపగులగొడుతుంది లక్ష్మీ. ఇంకోమాట నా గురించి అంటే ఊరుకునేది లేదని అంటుంది.నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు బాగా తెలుసునని...నా మనసులో మీకు తప్ప మరొకరికి స్థానంలేదని అంటుంది. నేను చచ్చిపోతే మీ భార్యగానే చచ్చిపోవాలని అనుకుంటున్నానని చెబుతుంది. మీరు ఎంత అవమానించినా...కనీసం నన్ను మనిషిగా చూడకున్నా నేను మీపై ఎంతో ప్రేమను పెంచుకున్నానని...మీ ప్రేమకోసం పరితపిస్తున్నానని అంటుంది.అలాంటిది నేను ఇంకొకరిని నా మనసులోకి రానిస్తానని ఎలా అనుకున్నావని అంటుంది. ఇంకొకరికి దగ్గర అవుతానని ఎలా ఊహించావని నిలదీస్తుంది. మరి వీడియోలో ఉన్నది నిజం కాదా..అది ఏఐ జనరేటెడ్‌ వీడియోనా అని మ్యాడీ అడుగుతుతాడు.ఆ వీడియో నిజమేనని...అందులో నేను మాట్లాడన మాటలు కూడా నిజమేనని అంటుంది. మీకు ఆరోజు గుర్తులేదా అని అడుగుతుంది. మనం అడవిలో క్యాంపుకు వెళ్లినప్పుడు నేను మీతో ఓ విషయం చెప్పాలని పక్కకు తీసుకెళ్లాను కదా...మీ కళ్లల్లోకి చూసి మాట్లాడే ధైర్యం లేక నేను అటు తిరిగి మీపై ఉన్న ప్రేమను చెబుతుండగా...మీరే అక్కడి నుంచి వెళ్లిపోయారని చెబుతుంది. నేను అటు తిరిగి ఉండటం వల్ల వెనక ఉన్నది ఎవరో నేను చూసుకోలేదని అంటుంది.అక్కడికి ఆ  విక్రమ్ ఎప్పుడు వచ్చాడో నేను గమనించలేదని...మీకు చెప్పిన మాటలు తనకోసమని పొరపడినట్లు ఉన్నాడని చెప్పి మ్యాడీని గట్టిగా కౌగిలించుకుంటుంది.దీంతో మ్యాడీకి లక్ష్మీ చెప్పేది నిజమేనని అర్థమవుతుంది. కానీ కోపంగానే బయటకు వెళ్లిపోతాడు.
విక్రమ్ చెంపపగులగొట్టిన శ్రీలక్ష్మీ
                   గదిలో లక్ష్మీ  ఒంటరిగా ఏడుస్తుండగా విక్రమ్‌, త్రిష అక్కడికి వచ్చి ఆమెను మరింత ఏడిపిస్తారు. ఇదంతా త్రిషపనని లక్ష్మీకి అర్థమవుతుంది. విక్రమ్‌కు నిజం చెప్పేందుకు ప్రయత్నిస్తుంది.కానీ అతను ఆమె చెప్పేది వినదు. నాకు లవ్‌లెటర్‌ రాయడం.గదిలోకి  తీసుకెళ్లి మాట్లాడటం, ట్రెక్కింగ్‌లో ఐలయూ చెప్పడం ఇవన్నీ నిజం కాదా అని నిలదీస్తాడు.లవ్‌లెట‌ర్‌ గురించి ప్రస్తావన వచ్చేసరికి త్రిష కంగారుపడిపోయి టాఫిక్ డైవర్ట్ చేస్తుంది. నేను ఇవన్నీచేయలేదని....నువ్వు కాలేజీ టాపర్‌ అని తెలిసే డౌట్లు అడిగానని అంటుంది. కానీ నేను అలా తీసుకోలేదని అంటాడు. నాకు కావాల్సింది నేను దక్కించుకుంటానని చెబుతాడు. మ్యాడీని వదిలేసి రమ్మని...తనను లవ్‌ చేయమని అడగడంతో లక్ష్మీ విక్రమ్ చెంపపగులుగొడుతుంది.  పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే మర్యాదగా ఉండదని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. దీంతో త్రిష విక్రమ్‌ను మరింత రెచ్చగొడుతుంది. ఆ తర్వాత భోజనాల వద్ద కావాలనే లక్ష్మీ డ్రెస్‌పై కూరవేస్తుంది త్రిష...ఆమె వాష్‌రూమ్‌కు వెళ్తుండగా అప్పటికే అక్కడ బోర్డులు మార్పిస్తుంది. తీవ్రంగా అవమానపడి లక్ష్మీ కాలేజీ నుంచి వెళ్లిపోవాలని త్రిష ఎత్తులు వేస్తుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 25th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: నష్ట జాతకుడిని ఇంట్లోకి రానివ్వొద్దు..! విహారి నిర్ణయం ఏంటి?
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: నష్ట జాతకుడిని ఇంట్లోకి రానివ్వొద్దు..! విహారి నిర్ణయం ఏంటి?
Godavari Serial Today July 25th: 'గోదావరి' సీరియల్: మా నాన్నని నువ్వే చంపేశావ్.. సింహాద్రిని నిలదీసిన జాను.. ఆధారం కాల్చేసిన భువన!
'గోదావరి' సీరియల్: మా నాన్నని నువ్వే చంపేశావ్.. సింహాద్రిని నిలదీసిన జాను.. ఆధారం కాల్చేసిన భువన!
Nindu Manasulu Serial Today July 25th: నిండు మనసులు: కేఫ్‌లో ప్రేరణతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే కొడుకు! చెంప పగలగొట్టిన ప్రేరణ! సిద్ధూకి తెలుస్తుందా!
నిండు మనసులు: కేఫ్‌లో ప్రేరణతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే కొడుకు! చెంప పగలగొట్టిన ప్రేరణ! సిద్ధూకి తెలుస్తుందా!
Karthika Deepam 2 Serial Today July 25th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న మాలినిని కలిసిందని ఇంట్లో తెలిసిపోయిందా! పారు, జ్యోత్స్నని సూరజ్ నిలదీయడానికి కారణమేంటి?
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న మాలినిని కలిసిందని ఇంట్లో తెలిసిపోయిందా! పారు, జ్యోత్స్నని సూరజ్ నిలదీయడానికి కారణమేంటి?
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ZIM 2nd T20 Result Update: శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్, య‌శ్, ప్రిన్స్
శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్ శర్మకు 3 వికెట్లు
Dharmendra Pradhan Resignation Reasons: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
Pawan Kalyan Seed Balls: డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
Dharmendra Pradhan Resignation News: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
Chennai Love Story : హీరోయిన్స్ మేనేజర్స్‌పై SKN సెటైరికల్ కామెంట్స్ - అసలు రీజన్ ఏంటంటే?
హీరోయిన్స్ మేనేజర్స్‌పై SKN సెటైరికల్ కామెంట్స్ - అసలు రీజన్ ఏంటంటే?
Income Tax Notice: చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
Guntur Latest News: న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
Embed widget