అన్వేషించండి

Lakshimi Raave Maa Intiki Serial Today January 28th: శ్రీలక్ష్మీతో తనకు ఎలాంటి సంంబంధం లేదన్న మ్యాడీ...మీ గౌరవం కాపాడేందుకే తాళి కట్టానంటూ తాతతో గొడవ

Lakshimi Raave Maa Intiki Serial Today Episode January 28th: శ్రీలక్ష్మీతో తనకు ఎలాంటి సంంబంధం లేదన్న మ్యాడీ...మీ గౌరవం కాపాడేందుకే తాళి కట్టానంటూ తాతతో గొడవ

Lakshimi Raave Maa Intiki  Serial Today Episode: హారతి పళ్లెం మ్యాడీ  నేలకేసి కొట్టడంతో సూర్యనారాయణకు తీవ్రమైన కోపం వస్తుంది. మనవడిని గట్టింగా మందలిస్తాడు.నీకు పెళ్లి అన్నా, సంప్రదాయాలన్నా,  పెద్దలన్నా ఏమాత్రం గౌరవం లేదని మండిపడతాడు. నీకోసం అన్నీ వదులుకుని వచ్చిన అమ్మాయికి హారతి ఇస్తుంటే నేలపాలు చేస్తావా అని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. దీంతో తొలిసారి మ్యాడీ గట్టిగా వాళ్ల తాతయ్యకు ఎదురుతిరుగుతాడు. నాకు పెద్దలంటే గౌరవం ఉంది కాబట్టే మీరు చెప్పిన వెంటనే మారు మాట్లాడకుండా వెళ్లి పెళ్లిపీటలపై కూర్చున్నానని అంటాడు. నాకు పెద్దలంటే గౌరవం ఉంది కాబట్టే  నలుగురిలో మీ గౌరవం నిలబెట్టడానికి నాకు ఇష్టంలేకపోయినా ఈ అమ్మాయి మెడలో తాళికట్టానని అంటాడు. నాకు సంప్రదాయాలంపై గౌరవం ఉంది కాబట్టే....పెళ్లిపందిరిలో నోరు ఎత్తకుండా మీరు చెప్పిందల్లా చేశానని అంటాడు.అంతేగానీ నాకు ఈపెళ్లి  ఇష్టం లేదని....ఈ అమ్మాయిని చేసుకోవడం అంతకన్నా ఇష్టం లేదని అంటాడు. అసలు మాకు జరిగింది పెళ్లే కాదని నేను అనుకుంటుంటే మళ్లీ మంగళహారతులు ఏంటని మండిపడతాడు. నాకు అసలు పెళ్లే జరగలేదని...ఈ  శ్రీలక్ష్మీతో నాకు ఎలాంటి సంబంధం లేదని అంటాడు.
                       బారెడు పొద్దు ఎక్కినా కూడా నిద్రలేవని కోడలు వద్దకు వెళ్లి గోపీ తల్లి సింధూను నిద్రలేపుతుంది.ఇప్పటి వరకు పడుకుంటే ఎలా అని మండిపడుతుంది.ఈ ఊరిలో ఏ ఆడపిల్ల కూడా ఇంత పొద్దెక్కే వరకు పడుకోదని అంటుంది. కోడికూయగానే నిద్రలేచి పేడకళ్లాపి చల్లి ముగ్గులు వేయాలని చెబుతుంది. అలాగే పాలు పితికి మాకు టీ పెట్టి ఇవ్వాలని అంటుంది. ఆమె మాటలకు సింధూకు కోపం వస్తుంది.నాకు ఏ పనులు రావని...ఇవన్నీ చేయడానికి మా ఇంట్లో పనివాళ్లు ఉన్నారని...కావాలంటే మీరు కూడా పనివాళ్లను పెట్టుకోమని సలహా ఇస్తుంది. ఇకపై మీరు నన్ను డిస్టర్బ్‌ చేయకుండా మీ పనులు మీరు చేసుకుంటే బాగుంటుందని వాళ్లపై మండిపడుతుంది. పనులు రావంటే ఎలా నేర్చుకోవాలని గోపీ తల్లి అంటుంది. మీ ఇంట్లో నువ్వు ఎలా పెరిగినా.....అత్తారింటిలో మాత్రం అన్ని పనులు చేయాలని అంటుంది. అందుకే ఇలాంటి గొప్పింటి సంబంధం వద్దని చెప్పినా వినుకుండా మావాడు నిన్ను చేసుకున్నాడని మండిపడుతుంది.అప్పుడే అక్కడికి వచ్చిన గోపికి విషయం చెబుతుంది.దీంతో గోపీ వాళ్ల అమ్మనే తిడతాడు. తనకు ఇక్కడి వాతావరణం అలవాటు కావడానికి టైం పడుతుందని...అప్పటి వరకు తనని వదిలేయాలని చెప్పడంతో ఆమె వెళ్లిపోతుంది.సింధూ కూడా లోపలికి వెళ్లిపోతుంది.
                            మ్యాడీ మాటలకు మరింత ఆగ్రహం చెందిన సూర్యనారాయణ పెళ్లంటే...దాని విలువ అంటే ఏంటో అర్థమయ్యేలా వివరిస్తాడు. వేదమంత్రాలు  సాక్షిగా మీ ఇద్దరికి పెళ్లి జరిగిందని....ఆ అమ్మాయే నీ భార్య అని చెబుతాడు. ఇందులో ఎలాంటి భేషజాలు లేవని మండిపడతాడు. నీకు జరిగింది పెళ్లేకాదని నువ్వు అంటే ఒప్పుకునేది లేదని మండిపడతాడు. మ్యాడీ ఏదో చెప్పబోతుండగా...హారతిని నేలకోసికొట్టిప్పుడే నీకు మాట్లాడే అర్హత పోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అక్కడ గోపీ సింధూ దగ్గరకు వచ్చి మా అమ్మ మాటలు ఏం పట్టించుకోవద్దని...నీ ఇష్టం వచ్చినట్లు ఉండమని చెబుతాడు. కొద్దిరోజులకు వాళ్లే అర్థం చేసుకుంటారని అంటాడు. దీంతో సింధూకు కోపం వస్తుంది. అసలు నాకు మీ అమ్మ,మీ చెల్లి,ఈ ఊరే కాదని...నువ్వు అంటే కూడా  ఇష్టం లేదని  చెబుతుంది. బలవంతంగా నాకు ఈ పెళ్లి చేశారని అంటుంది. ఈ పెళ్లి తప్పించుకునేందుకు  ఎన్నో ప్లాన్స్‌ వేశానని అయినా సరే నాకు నిన్ను ఇచ్చి కట్టబెట్టారని అనడంతో గోపి షాక్‌కు గురవుతాడు. నిన్న శ్రీలక్ష్మీ పెళ్లిలో కూడా నేను పారిపోవడానికే ట్రై చేశానని కానీ కుదరలేదంటుంది.ఇవాళ కాకపోతే రేపు అయినా నేను ఈ ఇంట్లో నుంచి పారిపోతానని చెప్పేస్తుంది. ఆస్ట్రేలియా వెళ్లి గొప్పగా బతకాలన్నదే తన డ్రీమ్‌ అని....దాని కోసం మా కుటుంబాన్ని సైతం వదులుకోవడానికి సిద్ధమయ్యానని చెప్పడంతో గోపీ మరింత ఆందోళనకు గురవుతాడు.

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని చూసిన లక్ష్మీకి తెలిసిన నిజం! కేడీ, సంధ్యలకు షాక్‌ ఇచ్చిన సిరి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని చూసిన లక్ష్మీకి తెలిసిన నిజం! కేడీ, సంధ్యలకు షాక్‌ ఇచ్చిన సిరి!
Gundeninda Gudigantalu August 17th:ప్రభావతిని ఆడుకున్న మీనా,బాలు...పార్లరమ్మకు శృతి చేసిన మేలు ఏంటి..?
గుండెనిండా గుడిగంటలు: ప్రభావతిని ఆడుకున్న మీనా,బాలు..! పార్లరమ్మకు శృతి చేసిన మేలు ఏంటి..?
Podarillu Serial Today August 17th:మాధవ్‌ కోసం అమ్మవారికి మొక్కు చెల్లించిన మహాలక్ష్మీ...కేశవ్‌ లేడని తెలిసి శైలూకు బలవంతంగా పెళ్లి
పొదరిల్లు సీరియల్: మాధవ్‌ కోసం అమ్మవారికి మొక్కు చెల్లించిన మహాలక్ష్మీ..! కేశవ్‌ లేడని తెలిసి శైలూకు బలవంతంగా పెళ్లి
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 17th: నువ్వులేక నేను లేను: వ్రతం సమయానికి ఇంటికి చేరుకున్న రాధ..! సుందరి, దమయంతికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌!
నువ్వులేక నేను లేను: వ్రతం సమయానికి ఇంటికి చేరుకున్న రాధ..! సుందరి, దమయంతికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
Kidney Health : కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Embed widget