అన్వేషించండి

Lakshimi Raave Maa Intiki Serial Today April1st: సోదమ్మ చెప్పినట్లు ప్రియంవదకు పొంచి ఉన్న ప్రమాదం ఏంటి..? జైలు నుంచి ఎవరు విడుదలయ్యారు..?

Lakshimi Raave Maa Intiki Serial Today Episode April1st:సోదమ్మ చెప్పినట్లు ప్రియంవదకు పొంచి ఉన్న ప్రమాదం ఏంటి..? జైలు నుంచి ఎవరు విడుదలయ్యారు..?

Lakshimi Raave Maa Intiki  Serial Today Episode:  సీతమ్మవారి మెడలో కట్టడానికి తాళిలేకపోవడంతో శ్రీలక్ష్మీ వెళ్లి పసుపుకొమ్ము తీసుకుని వస్తుంది. అది చూసిన ప్రియంవద ఇలాంటి తాళి అమ్మవారి మెడలో కడతారా అని హేళన చేస్తుంది. సీతమ్మ కూడా అరణ్యవాసానికి వెళ్లినప్పుడు ఈ పసుపుతాడే వేసుకుందని శ్రీలక్ష్మీ చెబుతుంది. 
 
దీంతో సూర్యనారాయణ కూతురిని మందలించి సీతారాముల కల్యాణం జరిపించాలని పంతులుగారిని కోరతాడు.ఆయన శ్రీలక్ష్మీ చేతిలో ఉన్న పసుపుతాడు తీసుకుని సీతారాముల కల్యాణం జరిపిస్తాడు. సరైనా సమయానికి తాళి తీసుకొచ్చి కల్యాణం జరిగేలా చూసిన శ్రీలక్ష్మీని సూర్యనారాయణ మెచ్చుకుంటాడు. పోయిన అమ్మవారి మంగళసూత్రాన్ని తానే తయారు చేయిస్తానని సూర్యనారాయణ చెప్పగా...అప్పుడే ఆంజనేయుని వేషధారణలో ఉన్న బాలుడు వచ్చి ఆ  అవసరంలేదని అంటాడు. 
 
సీతమ్మకు ఎప్పుడూ  ఏ అవసరం వచ్చిన ఈ హనుమంతుడు చూసుకుంటాడని అంటాడు. ఇదిగో ఆ బంగారు తాళిబొట్టు అంటూ తీసుకొచ్చి ఇస్తాడు. ఆ చెట్టుపైన అమ్మవారి తాళి వ్రేలాడుతూ కనిపించేసరికి తీసుకొచ్చానని చెబుతాడు. అంతకు ముందు ప్రియంవద దొంగలించి విసిరేసిన తాళిబొట్టునే  బాలుడు తీసుకొచ్చి ఇస్తాడు. 
 
గుడిలో సీతారాముల కల్యాణం అయిపోవడంతో అందరూ ఇంటికి బయలుదేరుతుండగా... గుడి బయట సోది చెప్పే ఆమె ప్రియంవద చేతిని పట్టుకుంటుంది. దీంతో బిత్తరపోయిన ప్రియంవద ఆమె చేతిలో నుంచి తన చేయిని విదిలించుకుంటుంది. నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావమ్మా అని సోదమ్మ చెప్పగా...ఇలాంటి సోదిమాటలు నాకు చెప్పొద్దని అంటుంది. నువ్వు 20 ఏళ్ల క్రితం వద్దనుకున్నది మళ్లీ నిన్ను చేరబోతోందని అంటుంది. గండం నీ చుట్టూ తిరుగుతోందని హెచ్చరిస్తుంది. నీకు చెడ్డరోజులు రానున్నాయని హెచ్చరిస్తుంది. 
 
ఆ మాటలు విన్న  ప్రియంవద వెన్నులో వణుకుపుట్టినా ఇలాంటివి నేను నమ్మనని అంటుంది. నీ మనసులో మాట నేను గ్రహించగలనని....నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండమని చెబుతుంది. ఆ మాటలు విన్న సూర్యనారాయణ ఏం జరిగిందని అడగ్గా....ఇలాంటి వాళ్లు ఇవే మాటలు చెబుతారులే మనం వెళ్లిపోదామని చెప్పి ప్రియంవద తీసుకుని వెళ్లిపోతుంది.
 
ఇంటికి వెళ్లిన తర్వాత మ్యాడీరూమ్‌లోకి దూరిన శ్రీలక్ష్మీ అతన్ని ఆటపట్టిస్తుంది. తనను దీవించమని కోరగా...అతను నిరాకరిస్తాడు. పట్టుబట్టి సీతారాముల కల్యాణ తలంబ్రాలను శ్రీలక్ష్మీ భర్తతో అక్షింతలుగా వేయించుకుని వెళ్లిపోతుంది. సోదమ్మ చెప్పిన మాటలనే తలచుకుని ప్రియంవద భయపడుతుండగా... అప్పుడే ఆమెకు జైలరు నుంచి ఫోన్‌కాల్ వస్తుంది. 
 
ఈయన ఏంటి ఈ సమయంలో ఫోన్ చేస్తున్నాడని అనుకుని ఫోన్ ఎత్తుతుంది. అతన్ని విడుదల చేయాలని కోర్టు ఆదేశించిందని చెబుతాడు. వాడిని జీవితాంతం జైలులో ఉంచడానికే కదా మీకు అన్ని డబ్బులు ఇచ్చిందని ప్రియంవద మండిపడుతుంది. చేయని తప్పుకు 14 ఏళ్లు జైల్లో ఉంచామని.... జైలులో గొడవలు పెట్టుకుంటున్నాడని మరో 6 ఏళ్లు ఇక్కడే ఉండేలా చేశామని ఇంకా కొనసాగిస్తే నా ఉద్యోగానికే ప్రమాదమని చెబుతాడు. 
 
అయితే ఎప్పుడు బయటకు వస్తున్నాడని చెప్పగా....రేపే విడుదలవుతున్నాడని చెప్పడంతో ప్రియంవద గుండెల్లో దడపుడుతుంది.  20 ఏళ్లక్రితం వదిలించుకున్న బిడ్డ బతికే ఉందని...ఆమెను తీసుకెళ్లినవాడు కూడా ఇక్కడే ఉన్నాడని ఈవిషయాలన్నీ తెలిసిన నర్సు కూడా  నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తోందని ప్రియంవద అనుకుంటుంది. వీళ్ల అందిరి అడ్డు ఎలా తొలగించుకోవాలని నేను జుట్టుపీక్కుంటుంటే...ఇప్పుడు ఈ కొత్త ప్రాబ్లం వచ్చిపడిందని అనుకుంటుంది. వాడు గానీ బయటకు వచ్చాడంటే ఖచ్చితంగా నన్ను వదిలిపెట్టడని...నా అస్తిత్వం నిలుపుకోవాలంటే వాడిని ఏదో ఒకటి చేయాలని అనుకుంటుంది.

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today August 11th: నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
Illu Illalu Pillalu Serial Today August 11th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌తో పాటు అత్తింటిని బాధ పెడుతున్న ప్రేమ! రూ. 10ని అడ్డు పెట్టుకొని రామరాజుని అవమానించిన భద్రావతి?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌తో పాటు అత్తింటిని బాధ పెడుతున్న ప్రేమ! రూ. 10ని అడ్డు పెట్టుకొని రామరాజుని అవమానించిన భద్రావతి?
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 11th: విక్కీపై ప్రేమను అందరి ముందు చెప్పిన రాధ...చిట్టీని విక్కీపైకి ఉసిగొల్పి పంపిన దమయంతి
నువ్వులేక నేను లేను: విక్కీపై ప్రేమను అందరి ముందు చెప్పిన రాధ...చిట్టీని విక్కీపైకి ఉసిగొల్పి పంపిన దమయంతి
Karthika Deepam 2 Serial Today August 11th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న కన్నీళ్ల వెనక అసలు నిజం ఇదే! అర్ధరాత్రి అమెరికాకు పయనం!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న కన్నీళ్ల వెనక అసలు నిజం ఇదే! అర్ధరాత్రి అమెరికాకు పయనం!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
Embed widget