Krishna Mukunda Murari Serial Today February 22nd: కృష్ణ ముకుంద మురారి సీరియల్: ముకుంద మీద ఫోకస్ పెట్టిన కృష్ణ.. పెద్ద ప్లానే వేసిందిగా!
Krishna Mukunda Murari Serial Today Episode ముకుంద కావాలనే శోభనం నుంచి తప్పించుకోవడానికి కాలు నొప్పి ప్లాన్ వేసిందని కృష్ణకు తెలియడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Krishna Mukunda Murari Today Episode: కృష్ణ వాళ్లు ఇంటికి బయల్దేరుతారు. కారులో ముకుంద చివరకు కూర్చొంటే ఆదర్శ్ దగ్గర కూర్చొ అని కృష్ణ అంటుంది. దానికి ముకుంద నాకు ఇక్కడే బాగుంది అంటుంది. ఇక ఆదర్శ్‌తో భార్యని ఎలా చూసుకోవాలో తెలుసా అని అంటుంది. దానికి ఆదర్శ్ నాకు భార్యని ఎలా చూసుకోవాలో తెలుసు కానీ నాకు ముకుంద ఎలా ఉండాలి అనుకుంటుందో అలా ఉంచడం ఇష్టం అని అంటాడు.
మురారి: కరెక్ట్‌గా చెప్పావు బ్రో లేదంటే పెళ్లాన్ని చూసుకోవడం చేతకాదు అని ఏదేదో మాట్లాడుతారు.
కృష్ణ: మీరు ఎంత బాగా చూసుకుంటారో నాకు తెలీదా ఏసీపీ సార్. ఒకరి కంఫర్ట్ కంటే జాగ్రత్త ఇంకా ముఖ్యం. అయినా భర్త భుజం కంటే భార్యకు కంఫర్ట్ ఇంకా ఏం ఉంటుంది. ఆదర్స్ దగ్గరకు తీసుకోండి.
ముకుంద: ఒకదాని నుంచి తప్పించుకోవాలి అని చూస్తే ఇంకో దానిలో ఇరుక్కోవల్సి వస్తుంది అన్ని తప్పించుకోవడం అంటే కుదరదు కదా ఈ నాటకం ఇలా కంటిన్యూ చేయాలి అంటే తప్పదు.
కృష్ణ: అరే వెళ్లండి. ముకుంద దగ్గరకు జరిగి ఆదర్శ్ భుజం మీద తలవాల్చుతుంది ముకుంద.. ఇప్పుడు నుంచి ప్రతీ క్షణం నిన్ను గమనిస్తూనే ఉంటాను. నీ మనసు ఏంటో నీ ఆలోచనలు ఏంటో నేను తెలుసుకోవాలి. ఏసీపీ సార్ పదండి.
మధు: రాత్రంతా నిద్ర కూడా పోయినట్లు లేవు పెద్దమ్మ. ముకుంద గురించి ఆలోచిస్తూ కూర్చొన్నావా.
రేవతి: మనసులోకి అనుమానం రానంత వరకేరా. వచ్చాక అది ప్రశాంతంగా ఉండనివ్వదు. పిల్లల జీవితాలు నాన్న. కృష్ణ ఏమైపోతుంది. మురారి ఏమైపోతాడు. అసలు ఆదర్శ్ పరిస్థితి ఏంటి.
మధు: ఎవరూ ఏం కారు పెద్దమ్మ. అందరూ కలిసి ముకుంద గురించి ఆలోచిస్తున్నారు కనుకే ఈ బాధ అంతా నిజంగా ముకుంద మారలేదు అనుకో అసలు ఈ బాధ అంతా ఎందుకు. ముకుందకు ఆదర్శ్‌కి ఇష్టం లేదు మురారినే కావాలి అంటే ఇచ్చేస్తామా. కుదరదు కదా ముకుంద మనసు మార్చుకొని ఆదర్శ్‌తో కలిసి ఉండటం తప్ప వేరే దారి లేదు పెద్దమ్మ. కాదు అని తన మనసులో ఏదైనా ఉంటే అప్పుడు తప్పు చేసిన వాళ్లు మాత్రమే శిక్ష అనుభవించాలి.
రేవతి: ఏమోరా ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే పిచ్చి ఎక్కి పోతుంది. మన అనుమానాలు ఏవీ నిజం కాకూడదు అని ప్రార్థించడం తప్ప ఏం చేయలేం.
కృష్ణ: ఆదర్శ్‌తో బాగానే ఉంది కదా. ఇష్టం లేకపోతే అతని భుజం మీద అంత ప్రశాంతంగా ఎలా నిద్రపోతుంది. మరి అలాంటప్పుడు శోభనం ఆపడానికి కారణం ఏంటి. ఏం అర్థం కావడం లేదే.. ఇంతలో సడెన్‌గా ముకుంద లేస్తుంది. దీంతో కృష్ణ ఒక్కోసారి ఆదర్శ్‌తో మంచిగా ఉంటుంది. ఇంకో సారి ఇష్టం లేనట్లు ఉంటుంది అసలు ముకుంద నటిస్తోందా..
ముకుంద: ఇప్పుడు శోభనం నుంచి తప్పించుకున్నాను. ఇంటికి వెళ్లాక మళ్లీ ముహూర్తం పెడితే అప్పుడు ఎలా తప్పించుకోవాలి. అసలు అంత వరకు ఎందుకు తెచ్చుకోవాలి. ఆదర్శ్‌కి నిజం చెప్పేయాలి.
కృష్ణ: ముకుంద మారకుంటే ఆదర్శ్ తిరిగి రావడంలో అర్థం ఏముంది. అందుకేనా పెద్దత్తయ్య నాకు బాధ్యతలు అప్పగించింది. నా బాధ్యతల్ని సక్రమంగా చేస్తాను అత్తయ్య. ఎలా అయినా ముకుంద ఆదర్శ్ లను ఒకటి చేస్తాను.
మురారి: ఎప్పుడూ ఏదో ఒకటి చెప్పేదానివి అంత సైలెంట్ అయిపోయావు ఏంటి అంతలా ఏం ఆలోచిస్తున్నావ్.
ఆదర్శ్: ఇక్కడ ముకుంద పరిస్థితి కూడా అంతే అంత సీరియస్‌గా మీరిద్దరూ ఏం ఆలోచిస్తున్నారు.
కృష్ణ: ముకుంద ఏం ఆలోచిస్తుందో తెలీదు కానీ.. నేను మాత్రం ముకుంద కోసమే ఆలోచిస్తున్నాను.
ముకుంద: మళ్లీ ఏం ఇరికించాలి అని ఆలోచిస్తుందో.
మురారి: కాలు నొప్పి కోసమే కదా తగ్గిపోతుందిలే..
కృష్ణ: అసలు కాలు నొప్పే లేదు ఏసీపీ సార్.
మురారి: ఏంటి..
కృష్ణ: నొప్పి లేదు అంటే లేదు అని కాదు. దాని కోసం భయపడాల్సిన అవసరం లేదు అంటున్నా. రేపటి కల్లా తగ్గిపోతుంది.
ఆదర్శ్: మరి ఇక దేనికోసం ఆలోచిస్తున్నావ్ ముకుంద.
కృష్ణ: శోభనం.. మన శోభనాలు జరగాలి అని ముకుంద ఎంతో ప్లాన్ చేసి డెకరేషన్ చేయించి అంతా అనుకున్న టైంకే ఇలా జరిగినందుకు ముకుంద ఎంత ఫీలవుతుందో కదా ముకుంద.. నువ్వు అసలు వర్రీ అవ్వొద్దు.. శోభనానిని మంచి ముహూర్తం చూసుకుందాంలే..
ముకుంద: నేను ఎక్కడ చేశానే నా మొహం అది నువ్వే చేసి నా మీద పెట్టావు. లేదా నా మీద అనుమానం వచ్చి ఇవన్నీ చేశావా అయినా అవన్నీ తెలుసుకునే టైం ఇప్పుడు లేదు. ఆదర్శ్‌కి ఎలా ఒకలా నిజం చెప్తే చాలు చెప్పేస్తా.
రెండు జంటలూ ఇంటికి చేరుకుంటారు. ముకుంద కుంటుతూ వస్తుంది. దీంతో కృష్ణ తగలని దెబ్బకు ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుందో అనుకుంటుంది. ఇక రేవతి ముకుందకు ఏమైందా అని కంగారు పడుతుంది. కృష్ణ జరిగినదంతా చెప్తుంది.
మధు: ఇది అయితే నేను అస్సలు ఊహించలేదు. అంటే నలుగురు ఎంజాయ్ చేద్దాం అని వెళ్లి కృష్ణ ముకుందకు సేవలు చేస్తే బ్రోలు ఇద్దరూ పడుకున్నారు అన్నమాట. కనీసం వచ్చినప్పుడు అయినా ముకుంద ఆదర్శ్ పక్కన ఉందా లేదంటే కృష్ణతోనే ఉందా..
మురారి: ముకుందకు దెబ్బ తగిలింది అని మేం ఆలోచిస్తుంటే ఎవరు ఎవరి పక్కన ఉన్నారు అని అంటావ్ ఏంట్రా.
కృష్ణ: మధుకి డౌట్ రావడంలో తప్పు లేదులే. నా దగ్గర దొరికిపోయినట్లే మధు దగ్గర దొరికిపోయి ఉంటుంది. అదేం లేదు ఏసీపీ సార్ రాత్రంతా ముకుందని నేనే చూసుకున్నా కదా కనీసం కారులో వచ్చినప్పుడైనా ఆదర్శ్ చూసుకున్నాడా అని అన్నాడు అంతే.
తన గదిలో ముకుంద యాక్టింగ్‌ని తలచుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఏసీపీ సార్ ఇంకా ముకుంద మనసులో ఉంటే ఆదర్శ్‌తో అంత క్లోజ్‌గా ఉండదు కదా అని అనుకుంటుంది. కానీ తగలని దెబ్బు ఇలా ఎందుకు నటిస్తుంది. తన శోభనం తప్పించడానికి మా శోభనం తప్పించడాని ఎందుకు ఇలా చేసింది అనుకుంటుంది. పెద్దత్తయ్యకి కూడా ఇదే విషయంలో అనుమానం ఉందా అందుకే అప్పుడు శోభనానికి ముహూర్తాలు పెట్టొద్దు అని అనుకుందా అంటుంది. మురారి వచ్చి మన టైం బాలేదు అని ఎప్పుడు శోభనానికి అనుకున్నా ఇలా అవుతుంది అని బాధపడతాడు. దీంతో కృష్ణ ముహూర్తాలు పెట్టిద్దాం అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.