Krishna Mukunda Murari Serial Today April 26th: కృష్ణ ముకుంద మురారి సీరియల్: సంగీత చెప్పిన మాటతో గుండె పట్టుకున్నమధు.. హాస్పిటల్‌కి వెళ్లిన కృష్ణ, ముకుందని వదలని ఆదర్శ్!
Krishna Mukunda Murari Serial Today Episode మురారి డల్‌గా ఉండటానికి ఏదో కారణం ఉందని పరిమళకు అడిగి నిజం తెలుకోవాలి అని కృష్ణ హాస్పిటల్‌కి వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Krishna Mukunda Murari Today Episode ఆదర్శ్ తనకు ప్రపోజ్ చేస్తాడని ముకుందకు అర్థమవడంతో ఆదర్శ్‌తో మాట్లాడటానికి బయపడుతుంది. ఉదయం జాగింగ్‌కు ముకుందను తీసుకెళ్లి తన మనసులో మాట చెప్పాలిన ఆదర్శ్ అనుకుంటాడు. అందుకు ముకుందను పిలవడానికి తన గది దగ్గరకు వెళ్తాడు. ముకుంద ఆదర్శ్‌ని చూసి తలుపు వేసేస్తుంది. ఆదర్శ్ డోర్ కొడతాడు.
ముకుంద: జిడ్డులా తగులుకున్నావ్ ఏంట్రా బాబు. ఇప్పుడు బయటకు వెళ్తే కచ్చితంగా ప్రపోజ్ చేస్తాడు. అవును అంటే ఒక సమస్య కాదు అంటే ఒక సమస్య. ఎలా తప్పించుకోవాలి అనుకుంటూ డోర్ తీస్తుంది.
ఆదర్శ్: డోర్ తీయకపోతే ఇంకా నిద్ర లేవలేదు అనుకున్నా. ఇంకా శారీలో ఉన్నావ్ ఏంటి. ట్రాక్ సూట్ వేసుకొని రా నేను వెయిట్ చేస్తా జాగింగ్‌కు వెళ్దాం.
ముకుంద అలాగే అని కాలు బెనికినట్లు నటిస్తుంది. అదర్శ్ ముకుందకు నిజంగానే కాలు బెనికిందేమో అని తెగ టెన్షన్ పడిపోతాడు. బామ్ రాస్తున్న అని కాలు పట్టుకోబోతే ముకుంద కాలు వెనక్కి తీసుకుంటుంది. కాలు పట్టుకోవడం ఇంట్లో ఎవరైనా చూస్తే బాగోదు అని ఆదర్శ్‌తో చెప్తుంది. ఇక తాను కొంచెం రెస్ట్ తీసుకుంటాను అని అంటుంది. ఆదర్శ్ హెల్ప్ చేస్తాను అంటే ముకుంద వద్దు అనేస్తుంది. ఇక ఆదర్శ్‌కి తానేం చెప్పాలి అనుకుంటున్నాడో చెప్పమని అంటే ఆదర్శ్ తర్వాత చెప్తా అంటాడు. ఈసారికి కూడా తప్పించుకున్నాను అని ముకుంద అనుకుంటుంది.
కృష్ణ: తనలో తాను.. ఈయన కచ్చితంగా ఏదో విషయంలో బాధ పడుతున్నారు. ఎందుకో నాతో చెప్పుకోలేకపోతున్నారు. పరిమళ మేడంకి తెలిసే ఉంటుంది. ఆవిడనే అడిగి తెలుసుకుంటాను.
మురారి: ఎంత సేపు అయింది లేచి.. నన్ను కూడా లేపాల్సింది కదా..
కృష్ణ: మీకు బాలేదు అని లేపలేదు. అదే మనిషి బాగానే ఉంటే సరిపోదు మనసు కూడా బాగానే ఉండాలి కదా.
మురారి: కారణం చెప్పాను కదా.. ఎక్కడికో బయల్దేరినట్లు ఉన్నావ్.
కృష్ణ: (పరిమళ మేడంను కలిస్తాను అని ఈయనకు చెప్పకూడదు.) గుడికి వెళ్తున్నా.
ముకుంద: నేను కూడా రావొచ్చా.
కృష్ణ: ఎవరికీ తెలీకుండా వెళ్దాం అంటే ఈవిడ బయల్దేరింది ఏంటి. సారీ మీరా నేను ఒక్కదాన్నే వెళ్లాలి ఎందుకంటే దేవుడితో కొంచెం పర్సనల్‌గా మాట్లాడాలి.
ముకుంద: పర్శనల్ అంటే మురారి గారికి కూడా తెలీకూడదా..
కృష్ణ: అంటే.. అది..
ముకుంద: అంటే మురారికి తెలీని పర్శనల్స్ కూడా నీకు ఉన్నాయా.. నేను ఇంకా మిమల్ని ఆదర్శ్ దంపతులు అనుకున్నా..
మురారి: అదేం లేదు మీరా. తను సరదాగా అంటుంది. కోరికలు మనసులో కోరుకుంటాం కాబట్టి ఎవరు పక్కన ఉంటే ఏంటి. సరే కృష్ణ ఒక పని చేయ్ ఎలాగూ నీ హెల్త్ బాలేదు కదా మీరాని కూడా తీసుకెళ్లు.
కృష్ణ: ఎందుకు మీరా నా వెనుకపడుతుంది. తను వస్తే నేను హాస్పిటల్‌కి వెళ్లేది ఎప్పుడు. ఏమైంది ఏసీపీ సార్‌కి ఎప్పుడు నేను ఒంటరిగా వెళ్తాను అంటే నాతో పాటు వస్తా అనే వారు ఇప్పుడేంటి నన్ను దూరం పెడుతున్నారు. మీరాని ఎందుకు తీసుకెళ్తున్నారు. అన్నింటికి సమాధానం పరిమళ మేడం దగ్గరే దొరుకుతుంది. ఎవరికీ తెలీకుండా హాస్పిటల్‌కి వెళ్లాలి.
మరోవైపు ముకుంద తాను కూడా గుడికి వస్తాను అంటే కృష్ణ ఎందుకు వద్దు అందని ఆలోచిస్తూ ఉంటుంది. మురారి దగ్గర కూడా ఏదో విషయం దాస్తుందని అనుకుంటుంది. కృష్ణకు తన గర్భసంచి పోయిన విషయం తెలిసిపోయిందా అని అనుకుంటుంది. కృష్ణని ఫాలో అవ్వాలి అనుకుంటుంది.
ఆదర్శ్: తనలో తాను.. అమ్మ ముకుంద స్థానం ఏంటో చెప్తాను అన్నది అంటే అది కోడలి స్థానమే అయింటుంది. రేవతి పిన్నికి ముకుందను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పమన్నా కదా అదే విషయం అమ్మ ముకుందతో మాట్లాడబోతుంది. ముకుంద ఒప్పుకుంటుందో లేదో. ఒకోసారి ముకుంద బాగానే ఉంటుంది. ఒక్కోసారి తప్పించుకుంటున్నట్లు అనిపిస్తుంది. ఇంతలో ముకుంద రావడంతో పిలుస్తాడు.
ముకుంద: అబ్బా మళ్లీ దొరికిపోయాను. ఏం సోది చెప్తాడో..
ఆదర్శ్: ముకుంద అమ్మ ఈ ఇంట్లో నీ స్థానం గురించి చెప్తాను అనడంతో నాకు ఎంత సంతోషం అనిపించిందో తెలుసా. ఇంతకీ అమ్మ ఏం చెప్తుందని నువ్వు అనుకుంటున్నావ్.
ముకుంద: మనసులో.. వీడు ఏం ఆశించి ఇలా అడుగుతున్నాడో నాకు తెలుసు. ఏమో ఆదర్శ్ గారు మేడం ఏం చేప్తారో నాకు ఎలా తెలుస్తుంది. కానీ ఒక్క విషయం మాత్రం కచ్చితంగా చెప్తాను. మేడం చెప్పేది నాకు నచ్చకపోతే మాత్రం నిర్మొహమాటంగా తిరస్కరిస్తాను.
ఆదర్శ్: అదేంటి అంత మాట అనేశావ్.
ముకుంద: నేనే కాదు నా స్థానంలో ఏ అమ్మాయి ఉన్నా అదే చేస్తుంది. నేను ఏం చెప్తున్నానో గురుడుకి బాగా అర్థమైనట్లుంది.
ఆదర్శ్: ముకుంద అలా ముఖం మీద ఇష్టం లేదు అని చెప్పకు. మా అమ్మ హర్ట్ అవ్వగలదు. ఒక్కోసారి మనకు నచ్చనివి కూడా మంచి చేయొచ్చు. కాబట్టి అమ్మ ఏం చెప్పినా దానికి ఎస్ అని చెప్పు. ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకోవాలి అనుకోకు. అర్థమైంది అనుకుంటా.
ముకుంద: మనసులో.. ఇదేంటి నేను అద్భుతమైన ఎజెండా వేసుకుంటే ఆదర్శ్ అడ్డుపడుతున్నాడు. అత్తయ్య నిజంగా ఆదర్శ్‌ని పెళ్లి చేసుకోమని చెప్తే ఆమెకు అడ్డుపడితే ఇంట్లో నుంచి కూడా వెళ్లిపోమని చెప్పొచ్చు. ఈ సమస్య ఎలా ఎదుర్కొవాలి.
మరోవైపు కృష్ణ హాస్పిటల్‌కి వస్తుంది. మరోవైపు కృష్ణ లాంటి పరిస్థితే కృష్ణకు ఎదురువుతుంది. పిల్లలు పుట్టడం లేదని ఓ వ్యక్తి తన భార్యకు విడాకులు ఇస్తాను అంటాడు. దీంతో ఆయనకు కృష్ణ తిడుతుంది. తర్వాత పిల్లలు పుట్టకపోతే భర్తలు ఇలా ఉంటారా అనుకుంటుంది. తన భర్తే మంచోడని అనుకుంటుంది.
మరోవైపు సంగీత మధు దగ్గరకు వచ్చి తనకు ఓ సాయం చేయమని అడుగుతుంది. మధు సంగీతని లైన్‌లో పెట్టడానికి తెగ ట్రై చేస్తాడు. ఇక ఏ సాయం చేయాలని అడిగితే సంగీత తనకు ఆదర్శ్‌కి పెళ్లి చేయమని అంటుంది. దీంతో మధు గుండె పట్టుకుంటాడు. ఇక సంగీత తనకు ఆదర్శ్ అంటే ఇష్టం లేదు కానీ ఆస్తి కోసమే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను అని చెప్తుంది. ఇక మధు అమ్మ చెప్పింది అని ఆస్తి కోసం పెళ్లి చేసుకోవద్దని చెప్తే ఇంతలో రజిని వచ్చి మధు చెంప పగలగొడుతుంది. మధుతో సవాలు చేస్తుంది. మధు పెళ్లి జరగకుండా చేస్తాను అని అంటాడు.
ఇక కృష్ణకు వేరే డాక్టర్ పరిమళ యూఎస్ వెళ్లిపోయిందని చెప్తాడు. దీంతో కృష్ణ కంగారు పడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.