Krishna Mukunda Murari Serial Today April 15th: కృష్ణ ముకుంద మురారి సీరియల్: శారీరకంగా ఒక్కటైపోయిన కృష్ణ, మురారి.. అన్యాయం చేశావంటూ, కుమిలి కుమిలి ఏడ్చిన ముకుంద!
Krishna Mukunda Murari Serial Today Episode మురారి, కృష్ణలు ఒక్కటైపోవడం చూసి ముకుంద మురారి దగ్గర కూర్చొని ఏడ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Krishna Mukunda Murari Today Episode కృష్ణ పాల గ్లాస్‌తో మురారి దగ్గరకు వెళ్తుంది. మురారి తన భార్యను దగ్గరకు తీసుకుంటాడు. అదంతా ముకుంద చాటుగా చూస్తుంటుంది. అయ్యో అనుకొని కన్నీరు పెట్టుకుంటుంది. మురారి పాలు సగం తాగి కృష్ణకు ఇవ్వడం చూసి గట్టిగా ఏడుస్తుంది. తన కళ్ల ముందే ఇద్దరూ ఒకటవ్వడం చూసి కుమిలిపోతుంది.
ఉదయం ముకుంద మురారి గదికి వస్తుంది. కృష్ణ ఆ సమయంలో అక్కడ ఉండదు. మురారి పడుకొని ఉంటే పక్కనే కూర్చొని ఏడుస్తుంది. మురారిని తాకాలి అని చూసి తాకకుండా అలాగే దూరంగా ఉండిపోతుంది.
ముకుంద: ఎంత అన్యాయం చేశావు మురారి. నీ కోసం ఎంత తపించాను. ఎన్ని పాట్లు పడ్డాను. నీ కోసం చివరకు నా రూపం మార్చుకొని ఆల్‌మోస్ట్ పునర్జన్మ ఎత్తాను. కానీ చివరికి నువ్వు ఆ కృష్ణకు సొంతం అయిపోయావు. నీకు ఇది న్యాయమా.. అంతా జరిగిపోయింది అని వదిలేస్తాననుకున్నావేమో నిన్ను అస్సలు వదులుకోను. (మరోవైపు కృష్ణ సిగ్గు పడుతూ.. కాఫీ తీసుకొని మురారి దగ్గరకు వస్తుంటుంది.) అసలు ప్లాన్ ఇప్పుడే మొదలు పెట్టాను మురారి. కృష్ణ నీకు దూరం కాకుండా నువ్వు నాకు దగ్గర కాకుండా ఎవరూ ఆపలేరు మురారి. ముకుంద అక్కడ నుంచి లేవబోతే ఏదో పడి సౌండ్ అవుతుంది.
మురారి: నిద్రలోనే కృష్ణరా కృష్ణ.. పిలిస్తే రాకుండా వెళ్లిపోతావ్ ఏంటి.. రా.. మురారి మాటలకు ముకుంద ఇంకా ఏడుస్తుంది. ఇంతలో కృష్ణ తన గదిలోకి వస్తుంది. కృష్ణ చూడకుండా ముకుంద దాక్కొంటుంది. కృష్ణ చూడకుండా బయటకు వెళ్లిపోతుంది..
కృష్ణ: ఏసీపీ సార్..
మురారి: కృష్ణ ఇక్కడే ఉన్నావా.. పిలిచినా పలకకుండా వెళ్లిపోయావు అనుకున్నా.
కృష్ణ: పిలిస్తే పలకకపోవడమా నేను ఇప్పుడే వచ్చాను సార్.
మురారి: ఇప్పుడే రావడం ఏంటి.. ఇందాకనుంచి ఇక్కడే ఉన్నావు కదా. అదిగో ఆ గ్లాస్ ఏదో కింద పడేస్తేనే మెలకువ వచ్చింది.
కృష్ణ: మీ చేయి తగిలుంటుంది. లేదంటే ఆ పిల్లో తగిలి పడుంటుంది.
మురారి: నువ్వు ఇక్కడే ఉన్నావు అని నాకు తెలుసు.
కృష్ణ: లేను అంటే ఇక్కడే ఉన్నాను అంటారేంటి. రాత్రంతా నిద్ర పోకుండా పొద్దున్నే కలలు కంటున్నారా.
మురారి: కల కాదు కృష్ణ. ఎవరో వచ్చినట్లే అనిపించింది.
కృష్ణ: మన గదిలోకి ఎవరు వస్తారు. ముకుంద చూస్తూ ఉంటుంది. (ఇక మురారి కృష్ణని మళ్లీ దగ్గర తీసుకోవడం చూసి అసహ్యంగా ముఖం పెట్టుకొని వెళ్లిపోతుంది. ముకుంద తన తండ్రి దగ్గరకు వెళ్తుంది.)
శ్రీనివాస్: ముకుంద రామ్మా.. ఇదే మన కొత్త ఇళ్లు..
ముకుంద: నేను ఇప్పుడు నీ ఇళ్లు చూడటానికి రాలేదు. ఒక్క పని కూడా నువ్వు సరిగా చేయవు కదా. ఇళ్లు అమ్మే డబ్బులు నా అకౌంట్‌లో ఎందుకు వేశావ్. ఇప్పుడు నేను మీరాని నువ్వు వేసింది ముకుంద అకౌంట్‌లో ఇప్పుడు నేను వెళ్లి ఈ ముఖంతో డ్రా చేస్తే బ్యాంక్ వాళ్లు ఊరుకుంటారా.. అయినా నాతో చెప్పకుండా నువ్వు ఎందుకు వేశావ్.
శ్రీనివాస్: నువ్వు ఎక్కడ అడగనిచ్చావ్. నేను కాల్ చేస్తే తర్వాత చేస్తా అని పెట్టేశావ్.
ముకుంద: మరి నేను చేసే వరకు ఆగాలి కదా. నాకు చెప్పకుండా నిన్ను ఎవరు వేయమని చెప్పారు.
శ్రీనివాస్: లక్ష రెండు లక్షలు కాదమ్మ. 5 కోట్లు అంత డబ్బు నేను ఎలా దాచేది. అయినా ఇప్పుడు ఎందుకు అంత టెన్షన్. ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నాను అని డాక్టర్ సర్టిఫికేట్ తీసుకో.. దాన్ని బ్యాంక్‌కు ఇవ్వు. కొత్త ఫొటోలు తీసుకొని అకౌంట్ ఆపరేట్ చేయమంటారు.
ముకుంద: నువ్వు నా మీద పగ పట్టావు కదా నాన్న. లేకపోతే మరేంటి నేను ముకుంద అని బ్యాంక్‌లో చెప్పిన మరుక్షణం అందరికీ తెలిసిపోతుంది. నా గురించి అందరికీ తెలిసి పోయి నేను అనుకున్నది జరగకూడదు అన్నదే నీ ప్లాన్. నీకు దేవే కరెక్ట్. నేను అసలే తిక్కలో ఉన్నాను నాన్న. ఇంకా తిక్క తెప్పించకు. నేను ఎంత మురారి, కృష్ణలను విడదీయాలి అనుకున్నా రాత్రి వాళ్లు ఒక్కటయ్యారు. నా జీవితంలో నేను ఊహించనిది రాత్రి జరిగిపోయింది. నాకు పిచ్చెక్కుతుంది నాన్న. కానీ ఆ బాధ చెప్పుకోవడానికి నాకు నువ్వు తప్పా ఇంకా ఎవరు లేరు నాన్న. కానీ తండ్రితో చెప్పుకునే మాటలు కావు ఇవి. అంతా నాఖర్మ. నా తల రాత ఇలా తగలాడింది.
శ్రీనివాస్: ఎందుకు అమ్మా ఈ పంతం.
ముకుంద: పంతం అనొద్దు నాన్న ప్రేమ.
శ్రీనివాస్: ఆ ప్రేమనే నువ్వు పంతంగా మర్చేసుకున్నావ్. నీ కన్నా కృష్ణ అందగత్తె కాదు. నీ కంటే ముందు మురారిని ప్రేమించలేదు. అయినా మురారి కృష్ణని వదులుకోలేదు అంటే ఏంటి అర్థం.
ముకుంద: మంచి తనం నాన్న. తన మంచి తనంతో మురారితో పాటు అందర్ని కట్టి పడేసింది. నాలో లేనిది తనలో ఉన్నది అదే నాన్న.
శ్రీనివాస్: అప్పుడు నీ ప్రవర్తన మార్చుకోవాలి కానీ రూపం మార్చుకోవడం వల్ల ఏం ప్రయోజనం అమ్మ.
ముకుంద: మంచితనంతో సాధించే రోజులు గడిచిపోయాయి నాన్న. నేను గెలవాలి అంటే గమ్యం చేరుకోవాలి అంటే కృష్ణ అడ్డు తొలగించాలి. తప్పొ ఒప్పో ముకుందగా చనిపోయిన నేను మరొకరికి బలి ఇవ్వడానికి వెనుకాడను. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.