అన్వేషించండి

Krishna Mukunda Murari August 9th: 'కృష్ణ ముకుంద మురారీ' సీరియల్: అదిరిపోయిన సీన్, కృష్ణ మెడలో తాళి కట్టిన మురారీ- చూస్తూ ఉండిపోయిన ముకుంద

కృష్ణ, మురారీకి భవానీ దేవి మరోసారి పెళ్లి చేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

కృష్ణ భవానీని చిన్న కోడలిగా అంగీకరిస్తుంది. ఇంటి కోడలి హోదాలో దక్కాల్సిన ఏడు వారాల నగలు తనకి అందిస్తుంది. ఈ ఇంట్లో అందరినీ నువ్వు ప్రేమతో వాళ్ళని గెలుచుకున్నావాని భవానీ మెచ్చుకుంటుంది. ఏసీపీ సర్ మనసులో తను లేనని, తన మనసులో భార్య స్థానం లేదని కృష్ణ చాలా బాధపడుతుంది. ఏడు వారాల నగలు తనే స్వయంగా కృష్ణకి వేసి అందంగా అలంకరిస్తుంది. మురారీ కృష్ణ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి చెప్పేయమని అంటుందని బాధపడతాడు. నందు వచ్చి మురారీతో మాట్లాడుతుంది.

నందు: ప్రతీ ఆడది తాళికి విలువ ఇస్తుంది. అది బంధం అనుకుంటుంది. నీకోసం నేను కృష్ణని ఏమీ అనలేకపోతున్నా లేదంటే అమ్మతో మాట్లాడి మీ ఇద్దరినీ ఒక్కటి చేసేదాన్ని. కానీ నువ్వు ఒట్టు తీసుకుని నా నోరు మూయించావ్

Also Read: కావ్య వీడియో వైరల్, మండిపడ్డ అపర్ణ- కళావతి కాంట్రాక్ట్ పోయేలా చేసిన రాజ్

అలేఖ్య వచ్చి మురారీ వాళ్ళని కిందకి రమ్మని పిలుస్తుంది. ఇద్దరికీ పెళ్లి చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. తాళిబొట్టుకి మనస్పూర్తిగా పూసలు గుచ్చమని పూజారి చెప్తాడు. ముత్తైదువులు తాళికి పూసలు గుచ్చుతారు. ఒకప్పుడు తప్పని సరి పరిస్థితిలో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఒకరి మీద ఉన్న ప్రేమ మరొకరికి చెప్పుకోకుండా మనస్పర్థలతో మళ్ళీ చేసుకుంటున్నారు. నిండు మనసుతో ఆశీర్వదిస్తే వాళ్ళు కలిసిపోతారా ఏంటని ముకుంద మనసులో అనుకుంటుంది. వామ్మో ఒకవేళ ముత్తైదువుల ఆశీర్వాదం ఫలించి వాళ్ళు కలిసిపోతారేమోనని భయంతో తాళికి పూసలు గుచ్చుతుంది. అది చూసి రేవతి టెన్షన్ పడుతుంది. గమనించిన భవానీ ఇంట్లో ఏదో జరుగుతుందని అనుమానపడుతుంది. ఇక పెళ్లికొడుకు, పెళ్లి కూతురుని తీసుకొస్తుంటే రేవతి డల్ గా ఉండటం గమనించి భవానీ ఏమైందని అడుగుతుంది.

భవానీ: మీరు ఏదో దాస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు ఏదో కోల్పోయినట్టు ఉన్నారు

రేవతి: అలాంటిది ఏమీ లేదక్క

భవానీ: లేదు ఏదో జరుగుతుంది. నువ్వు, మురారీ డల్ గా ఉన్నారు. ఇక కృష్ణ మొహంలో నవ్వు చూసి ఎన్నో రోజులు అయ్యింది. మీ అందరి ముందు నాలాగా కట్టుబొట్టు చేసి రెడీ అయి నవ్వించిన తింగరితనం ఏది? వాళ్ళ మధ్య మనస్పర్థలు పోవాలనే కదా ఈ మాంగల్యధారణ చేయిస్తుంది

రేవతి: అవునక్క వాళ్ళ మధ్య మనస్పర్థలు ఉన్నాయి. దీనితో అవి పోవాలని అనుకుంటున్నా

Also Read: యష్ ని ఇంటరాగేట్ చేసిన దుర్గ - భర్తతో గడిపిన క్షణాలు తలుచుకుని ఎమోషనలైన వేద

కృష్ణ తన జీవితంలో ఉన్నా లేకపోయినా తనే నాభార్య అని మురారీ అనుకుంటాడు. ఇదే పసుపు కుంకుమలుగా భావించి ఏసీపీ సర్ కట్టే తాళిని జీవితాంతం ఉంచుకుంటాను. ఆయనే నా భర్త అని కృష్ణ మనసులో అనుకుంటుంది. ఇద్దరూ పీటల మీద కూర్చుని పూజ చేస్తారు. ఈ పెళ్లితో కృష్ణలో మార్పు వచ్చి మురారీ ప్రేమని అర్థం చేసుకుంటే బాగుంటుందని నందు సంతోషపడుతుంది. మురారీ కృష్ణ మెడలో మూడు ముళ్ళు వేస్తాడు. ఆ సీన్ మాత్రం సూపర్ గా ఉంటుంది. ముకుంద మాత్రం లోలోపల కన్నీళ్ళు పెట్టుకుంటుంది. అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. కృష్ణ తాళి పట్టుకుని చూసుకుంటూ ఎమోషనల్ అవుతుంది. ఇక ఇద్దరు దంపతులు పూల దండలు మార్చుకుంటారు.

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 19th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
Godavari Serial Today August 19th: 'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!
'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 19th:ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి
నువ్వులేక నేను లేను: ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి
Podarillu Serial Today August 19th:ఊరుచూడటానికి వెళ్లిన మహా,చక్రిని ఏడిపించిన ఆకతాయిలు...మేనల్లుడిని కాపాడిన దుర్గాప్రసాద్‌
పొదరిల్లు: ఊరుచూడటానికి వెళ్లిన మహా,చక్రిని ఏడిపించిన ఆకతాయిలు...మేనల్లుడిని కాపాడిన దుర్గాప్రసాద్‌

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget