Karthika Deepam 2 Serial March 30th Episode: ‘కార్తీకదీపం 2’ సీరియల్ ప్రోమో: జ్యోత్స్నకు ప్రపోజ్ చేసిన కార్తీక్ - భర్త ఆలోచనల్లో దీప!
Karthika Deepam Idi Nava Vasantham Serial Promo Today Episode కార్తీక్ జ్యోత్స్నకు రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేయడంతో ఇవాళ్టి ప్రోమో ఆసక్తికరంగా మారింది.
![Karthika Deepam 2 Serial March 30th Episode: ‘కార్తీకదీపం 2’ సీరియల్ ప్రోమో: జ్యోత్స్నకు ప్రపోజ్ చేసిన కార్తీక్ - భర్త ఆలోచనల్లో దీప! karthika deepam idi nava vasantham serial today promo march 30th episode written update in telugu Karthika Deepam 2 Serial March 30th Episode: ‘కార్తీకదీపం 2’ సీరియల్ ప్రోమో: జ్యోత్స్నకు ప్రపోజ్ చేసిన కార్తీక్ - భర్త ఆలోచనల్లో దీప!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/30/810e8f3af8c2bbaf6eb61407cbf611bd1711773306891882_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode: కార్తీక దీపం ఇది నవవసంతం సీరియల్ అరంభంలోనే అదిరిపోయే ట్విస్ట్‌లతో క్యూరియాసిటీ పెంచేస్తోంది. కార్తీక్.. దీపని చూసినప్పటి నుంచి స్థిమితంగా ఉండేలేకపోతాడు. తాను తప్పు చేశానని, దీప జీవితంలో క్షమించదు అని ఫీలవుతున్నాడు. తాజాగా రిలీజైన ప్రోమో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
"నీ అంతు చూస్తా ఈరోజు అని మల్లేశ్ దీప మీదకు వెళ్తాడు. ఇంతలో దీప ఓ లేడీని తీసుకొస్తుంది. ఆవిడను చూసి మల్లేశ్ షాక్ అవుతుంది. ఆవిడ దీపతో ఏ తోడు లోని ఆడది తలుపు తెరిచిన ఇళ్లు లాంటిది దీప అని అంటుంది. ఆ ఇంట్లోకి దారిన పోయిన ప్రతీ కుక్క దూరాలి అనుకుంటుంది అని మల్లేశ్‌ని చూసి అంటుంది. మంచోడు అయినా చెడ్డొడు అయినా భర్త పక్కన ఉండాలి అని, నరసింహ ఎక్కడున్నా ఇంటికి తీసుకురమ్మని దీపకు చెప్తుంది. మరోవైపు కార్తీక్ ఓ ఫంక్షన్‌లో జ్యోత్స్నకు బొకేతో ఎంట్రీ ఇస్తాడు. రింగ్ పట్టుకొని జ్యోత్స్నకు ఇస్తూ.. నన్ను పెళ్లి చేసుకుంటావా అని ప్రపోజ్ చేస్తాడు" దీంతో ప్రోమో పూర్తవుతుంది.
నిన్నటి ఎపిసోడ్‌లో ఏం జరిగింది అంటే..
దీప, సౌర్య ఇంటికి వస్తారు. సౌర్య తన సైకిల్‌లను నానమ్మ అనసూయకు చూపిస్తుంది. అనసూయ తిట్టి సైకిల్‌ను తన్నేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో సౌర్య నానమ్మ సైకిల్ నా ఫ్రెండ్ తంతే ఊరుకోను అని అంటుంది. అంతటితో ఆగకుండా కొత్త సైకిల్ కదా అని అమ్మేయకు అని నానమ్మకు చెప్తుంది. దీంతో మళ్లీ అనసూయ మనవరాలిని తిడుతుంది. సౌర్య తన ఫ్రెండ్‌కి కొత్త సైకిల్ చూపిస్తాను అని వెళ్లిపోతుంది. ఇక అనసూయ దీపను తిడుతుంది. పేరుకే సౌర్య తన కొడుకు కూతురు అని అన్నీ అమ్మ పోలికలు అమ్మ బుద్ధులే అని అంటుంది. దానికి దీప అదృష్టవంతురాలు అత్తయ్య. అని అంటే అనసూయ కోపంతో మన బతుకులకు లేనిదే అది. ఏ మూలనైనా కాస్త ఉంది అనుకుంటే అది పోయిన మా తమ్ముడితోనే పోయిందని అంటుంది. తర్వాత అనసూయ పక్కింటి వెళ్తుంది.
ఇంతలో వడ్డీ వసూలు చేయడానిక మల్లేశ్ వస్తాడు. మల్లేశ్ దీపను అనసూయ గురించి అడుగుతాడు. తాను నిత్యం రావడమే కానీ వడ్డీ మాత్రం ఇవ్వడం లేదని నాకు వచ్చేది అయితే ఏం లేదని అంటాడు. అనసూయ ఇంట్లో లేదని తెలుసుకున్న మల్లేశ్ దీప మీద కన్నేసి కావాలనే నీరు తీసుకొని రమ్మని పిలుస్తాడు. దీప సరే అని లోపలికి వెళ్లగానే వెనకే వెళ్లాడు. దీప కంగారు పడుతుంది. ఎందుకు సార్ ఇక్కడికి వచ్చారు అని దీప అడిగితే దానికి మల్లేశ్ నీ భర్త నా దగ్గర మనీ తీసుకొని 6 ఏళ్లు అయింది వాడు పారిపోయాడు. వడ్డీ ఇస్తాను అని నువ్వు ఇవ్వడం లేదని అంటాడు. దానికి దీప ఒక్కో బాకీ తీరుస్తున్నాను మీది తీరుస్తాను సార్ అంటుంది.
దీంతో మల్లేశ్ నిన్ను చూస్తుంటే మస్త్ జాలి వేస్తుంది దీప కానీ ఈ వడ్డీ మల్లేశ్ బతికేదే వడ్డీతో పోనీ ఓ పని చేద్దాం దీప. నీ పెనిమిటి అవసరం నీకు ఉంది నాకు ఉంది. ఆడు రాడు. నువ్వా నా బాకీ తీర్చలేవు కాబట్టి. నువ్వు నన్ను నీ పెనిమిటి అనుకున్నావే అనుకో. నీ బాకీ తీరుతుంది. నా అవసరం తీరుతుంది. ఏమంటావ్..అని తప్పుగా మాట్లాడుతాడు. దానికి దీపం కోపంతో మల్లేశ్ చెంప పగలగొట్టి.. అడగ్గానే మంచి నీళ్లు ఇచ్చాను అని మొగుడి స్థానం కూడా ఇస్తాను అనుకున్నావా చంపేస్తా ఇలాంటి తప్పుడు కూతలు కూస్తే అని తిడుతుంది. ఇంతలో అనసూయ వచ్చి ఏమైంది అని అడిగితే దీప జరిగింది చెప్తుంది.
దానికి అనసూయ కూడా నిన్ను కొట్టడం కాదురా ఇక్కడే చంపేయాలి. డబ్బు ఇచ్చి వసూలు చేయడం రాని వాడివి ఎందుకు ఇచ్చావురా.. ఇంటికి వచ్చి ఒంటరిగా ఉన్న నా కోడలితో తప్పుగా ప్రవర్తిస్తావా చెప్పుతో కొడతా నా కొడకా.. నీ బాకీ ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో అని మల్లేశ్‌ని పంపేస్తుంది. మరోవైపు కార్తీక్ దీపను వెతుక్కుంటూ అక్కడికి వస్తాడు. కార్తీక్‌కు మల్లేశ్ ఎదురవుతాడు. కార్తీక్ మల్లేశ్‌కు దీప ఇళ్లు ఎక్కడ అని అడుగుతాడు. దీంతో మల్లేశ్ తనని దీప కొట్టినందుకే కార్తీక్ వచ్చాడు అనుకొని కార్తీక్‌ను ఇష్టమొచ్చినట్లు తిడతాడు. దీప తనని కొట్టిందనే కోపంతో దీపని అది ఇది అని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతాడు. దీప జీవితం నాశనం చేస్తాను అంటాడు. దీంతో కార్తీక్ మల్లేశ్‌ను కొడతాడు. దీంతో మల్లేశ్ కార్తీక్ మీద కూడా పగ పడతాడు. ఈ గొడవ తర్వాత దీపతో మాట్లాడటం సరికాదు అని కార్తీక్ వెనక్కి వెళ్లిపోతాడు. ఇంటికి వెళ్లి దీప గురించి ఆలోచిస్తాడు. ఇంతలో ఓ యాక్సిడెంట్ చూపిస్తారు. దీంతో ఎపిసోడ్ పూర్తవుతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)