Karthika Deepam 2 Serial Today May 17th: కార్తీకదీపం 2 సీరియల్: శౌర్యకు తన ఊరిలో సైకిల్ ఇచ్చింది కార్తీక్ అని తెలుసుకున్న పారిజాతం.. కార్తీక్ తండ్రికి ఎఫైర్!
Karthika Deepam 2 Serial Today Episode : జ్యోత్స్నను బయటకు తీసుకెళ్లిన కార్తీక్.. చిన్న స్కూల్ దగ్గర శౌర్యని చూసి ప్రశ్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode : జ్యోత్స్న పరధ్యానంలో ఉంటే కార్తీక్ వచ్చి ఏమైందని అడుగుతాడు. జ్యోత్స్న కార్తీక్‌తో తన భయాన్ని నిజం కాకుండా ఎవరూ ఆపలేరు కదా అని అంటుంది. కార్తీక్ జ్యోత్స్నతో ఏం మాట్లాడుతున్నావ్ అని అడుగుతాడు.
జ్యోత్స్న: మనసులో.. నేను ఇలా అన్నీ మనసులో పెట్టుకొని బాధ పడటం కాదు బావనే డైరెక్ట్‌గా అడుగుతాను.
సుమిత్ర: మనసులో.. దీన్ని ఈ ఆలోచన నుంచి కార్తీక్ మాత్రమే బయటకు తీసుకురాగలడు.
కార్తీక్: జ్యోత్స్న నేను నీతోనే మాట్లాడేది.
జ్యోత్స్న: బావ మనం బయటకు వెళ్దామా.
సుమిత్ర: వెళ్దామా అని రిక్వెస్ట్‌గా అడుగుతావేంటే మరదలివి కాబోయే భార్యవి వెళ్దాం పద అని డిమాండ్ చేయాలి.
కార్తీక్: మనసులో.. మీరంతా ఇలా ఎంకరేజ్ చేయడం వల్లే పరిస్థితి ఇంత వరకు తీసుకొచ్చారు. ఇష్టం లేదు అన్నా మాటను కూడా ధైర్యంగా బయటకు చెప్పలేకపోతున్నా.
సుమిత్ర: రేయ్ కార్తీక్ నా కూతుర్ని అలా సరదాగా బయటకు తీసుకెళ్లురా.. జ్యోత్స్న నీకు రాత్రే చెప్పాను కదా అన్ని వదిలేయ్.
జ్యోత్స్న: అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ మామ్. బావ పట్టుకోకపోయి ఉంటే ఆ గ్లాస్ కింద పడి చాలా ముక్కలు అయిండేది. కొన్ని సార్లు మనసు కూడా అంతే అదుపు లేని ఆలోచనలతో జారిపోతూ ఉంటుంది. అప్పుడు దాన్ని పట్టుకోవడానికి రెండు చేతులు కావాలి. అవి నీవి అయితే బాగున్ను అని కోరుకుంటున్నాను మామ్.
సుమిత్రి: మాకు నీ మీద ఉన్నది కేవలం ప్రేమ మాత్రమే కాదు. భయం కూడా. నీకు అందమైన జీవితం ఇవ్వాలి అనుకుంటున్నాం. నీ అంతట నువ్వు నీ అందమైన జీవితం ఎక్కడ పాడు చేసుకుంటావా అని భయం. సరే బయట నీ కోసం కార్తీక్ ఎదురు చూస్తున్నాడు వెళ్లు. నువ్వు ఎప్పుడూ ఇలా సంతోషంగా ఉండాలి జ్యోత్స్న నీ ఆనందానికి ఎవరూ అడ్డు రాకూడదు.
కార్తీక్, జ్యోత్స్నలు కారులో వెళ్తుండగా ఎదురుగా శౌర్య ఓ ఐస్‌క్రీమ్ బండి దగ్గర కనిపిస్తుంది. ఇక శౌర్య అక్కడ స్కూల్ దగ్గరకు పరుగెడుతుంటే కార్తీక్ చూసి ఇక్కడున్నావ్ ఏంటని అడుగుతాడు. ఇదే తన స్కూల్ అని శౌర్య చెప్తుంది. ఇక కార్తీక్ శౌర్యని కారులోకి తీసుకొస్తాడు. శౌర్యని చిన్న స్కూల్‌లో జాయిన్ అవ్వడానికి కారణం అడుగుతాడు.
శౌర్య: ఆ స్కూల్‌లో జాయిన్ చేసుకోవాలి అంటే అమ్మానాన్న ఇద్దరూ బాగా చదువుకోవాలంట. ఇద్దరూ చదువుకోలేదు కదా అందుకే ఇక్కడ జాయిన్ అయ్యా.
జ్యోత్స్న: మనసులో.. బావ ఏం తెలీనట్లు అడుగుతాడేంటి. గ్రానీ చెప్పింది నిజమే అయితే బావకు అన్నీ తెలియాలి కదా.
శౌర్య: కార్తీక్ నాకు ఆ స్కూలే నచ్చింది. కానీ నేను ఇక్కడే బాగా చదువుకొని కలెక్టర్ అవ్వాలంట అమ్మ చెప్పింది.
జ్యోత్స్న: బావకు నా కంటే అందరూ ఎక్కువ అయిపోయారు. ఇక టైం అయిపోయిందని శౌర్య వెళ్లిపోతుంది.
కార్తీక్: దీపకు కొంచెమైనా ఆలోచన ఉందా. ఇంటి దగ్గర మరీ మరీ చెప్పాను. శౌర్య చాలా తెలివైన పిల్ల ఏదైనా మంచి స్కూల్‌లో చేర్పించాలి అని చెప్పాను. నా కూతురిని నేను చదివించుకుంటా నా కూతురి గురించి నాకు తెలీదా అంది. దీనికి స్కూలే నచ్చలేదు ఇంకేం చదువుకుంటుంది. పైగా కలెక్టర్ అవ్వాలంట.
జ్యోత్స్న: మనసులో.. గ్రానీ అన్నట్లు బావ చూపిస్తుంది జాలి కాదు బాధ్యతే. నేను ఎందుకు బయటకు తీసుకొచ్చానో గుర్తు లేకుండా ఇవన్నీ మాట్లాడుతున్నాడు అంటే నాకేం విలువ ఉన్నట్లు.
కార్తీక్: దీపతో ఒకసారి మాట్లాడాలి. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నట్లు.
జ్యోత్స్న: ఇంటికి..
కార్తీక్: ఇంటికా. ఎక్కడికో వెళ్దాం అన్నావ్.
జ్యోత్స్న: ఇంటికి పోనీ బావ.
మరోవైపు కాంచన తన వదిన సుమిత్రకు కాల్ చేసి తన భర్త దేవుడని పొగిడేస్తుంది. ఇక శ్రీధర్ కిచెన్‌లో పాలు వేడి చేస్తూ కావేరి అనే తన ప్రియురాలితో మాట్లాడుతాడు. వేడి పాలు అతడి కాలి మీద పడిపోవడంతో సెల్ కింద పడి పగిలిపోతుంది. ఇక కాంచన అక్కడికి వస్తుంది. కాంచనకు కావేరి గురించి తెలిసిపోతుందేమో అని కంగారు పడతాడు. ఇంతలో కావేరి మళ్లీ కాల్ చేస్తుంది. తర్వాత మాట్లాడుతా అని శ్రీధర్ ఫోన్ పెట్టేస్తాడు.
ఇంతలో కార్తీక్ వస్తాడు. మంచి ముహూర్తాలు ఉన్నాయి నిశ్చితార్థం చేసేద్దామని నీ మాట కోసం వెయిటింగ్ అని కాంచన అంటుంది. దానికి కార్తీక్ మనసులో తనకు జ్యోత్స్నతో పెళ్లి ఇష్టం లేదని అనుకుంటాడు. అయితే అందర్ని కూర్చొపెట్టి ఒకే సారి ఈ విషయం చెప్పాలని అనుకుంటాడు.
పారిజాతం: అడగాలి అని వెళ్లిన దానివి పిల్ల అడ్డు వచ్చిందని ఆగిపోవడం దేనికి. ఉన్నా నాలుగు మాటలు మీ బావ ముఖం మీదే అడగాల్సింది.
జ్యోత్స్న: బావ దృష్టిలో నాకు ఇంపార్టెన్స్ లేదని ఇంత క్లియర్‌గా అర్థమైతే ఇంకేం అడగాలి. బావలో మార్పు చాలా స్పష్టంగా కనపడుతుంది. నువ్వు అన్న మాటలు ఎక్కడ నిజం అయిపోతాయో అని భయంగా ఉంది గ్రానీ.
పారిజాతం: మనసులో.. నాకు కావాల్సింది నీలో ఈ భయమేనే. నిన్ను అడ్డు పెట్టుకొని దీపని ఇంట్లో నుంచి గెంటేసి కార్తీక్‌తో నీ పెళ్లి చేయడం ఇదే నా కళ్లముందు ఉన్న లక్ష్యం. నేను దీపని కొన్ని అడగాలి. అంతకంటే ముందు దాని కూతురితో మాట్లాడాలి.
జ్యోత్స్న: నువ్వేం చేస్తావో నాకు తెలీదు గ్రానీ బావ లేకపోతే మాత్రం నేను చనిపోతాను ముందే చెప్తున్నా.
పారిజాతం: నోర్ముయ్‌వే ఈ ఇంటికి శివనారాయణ ఆస్తికి ఏకైక వారసురాలివి. నీకు కార్తీక్‌కు పెళ్లి అయితే ఎవరో వచ్చి నీ నెత్తి మీద కిరీటం పెట్టడం కాదు. ఈ వందల కోట్ల ఆస్తికి నువ్వే మహారాణివి అవుతాయి.
జ్యోత్స్న: నేను బావ గురించి మాట్లాడితే నువ్వు ఆస్తి గురించి మాట్లాడుతావేంటి.
పారిజాతం: ఆస్తి గురించి కాకపోతే నేను ఇదంతా ఎందుకు చేసినట్లు.
జ్యోత్స్న: నా కోసం నువ్వేం చేశావు గ్రానీ. అడిగేది నిన్నే గ్రానీ. అడిగేది నిన్నే.
పారిజాతం: అనవసరంగా నోరు జారాను. ఇప్పుడు ఏదో ఒకటి కవర్ చేయాలి. ఏం చెప్పనే. నువ్వు పుట్టినప్పుడు మీ నాన్న నా చేతుల్లో నిన్ను పెట్టాడు. అంటే ఏంటి అర్థం నీ బాధ్యత నాదే కదా. అప్పటి నుంచి నిన్ను మహారాణిగా చూడాలి అనుకున్నా.
జ్యోత్స్న: అయితే నీ ఆశలను నువ్వే నిజం చేయి గ్రానీ.
పారిజాతం: చేస్తాను మనవరాలా. నేను చేయాలి అనుకున్నవన్నీ చేస్తాను. నువ్వు చూస్తూ ఉండు.
జ్యోత్స్న: ఇంత తక్కువ టైంలో బావ ఎందుకు దీపకు ఇంత దగ్గర ఎలా అయ్యాడు. దీని వెనక ఇంకేదైనా కారణం ఉందా.
పారిజాతం దీప, శౌర్యల దగ్గరకు వెళ్తుంది. శౌర్యని పారిజాతం తమ ఊరి విషయాలు అడుగుతుంది. శౌర్య జాతరలో జరిగిన సైకిల్ పోటీల గురించి చెప్తుంది. ఇక ఆ సైకిల్ కార్తీక్ ఇచ్చాడని శౌర్య చెప్తుంది. పారిజాతం షాక్ అయిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.