అన్వేషించండి

Karthika Deepam Today March 29th: ‘కార్తీకదీపం 2’ సీరియల్: దీప వేసిన శిక్షకు నరకం అనుభవిస్తున్నానని ఫీలైన కార్తీక్, ఆ యాక్సిడెంట్ వెనుక స్టోరీ ఏంటో!

Karthika Deepam 2 Serial: తనతో అసభ్యంగా ప్రవర్తించిన మల్లేశ్ చెంప దీప పగలగొట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode: దీప, సౌర్య ఇంటికి వస్తారు. సౌర్య తన సైకిల్‌లను నానమ్మ అనసూయకు చూపిస్తుంది. అనసూయ తిడుగుతుంది. తర్వాత సైకిల్‌ను తన్నేందుకు అనసూయ ప్రయత్నించగా సౌర్య నానమ్మ సైకిల్‌ నా ఫ్రెండ్ తంతే ఊరుకోను అని అంటుంది. కొత్తది కదా అని అమ్మేయకు అని చెప్తుంది. ఇక సౌర్య తన ఫ్రెండ్‌కు సైకిల్‌ చూపించడానికి వెళ్తుంది.

అనసూయ: అది పేరుకే నా కొడుకు కూతురు అన్నీ అమ్మ పోలికలు.. అమ్మ బుద్ధులే..
దీప: అదృష్టవంతురాలు అత్తయ్య.
అనసూయ: మన బతుకులకు లేనిదే అది. ఏ మూలనైనా కాస్త ఉంది అనుకుంటే అదిపోయిన మా తమ్ముడితోనే పోయింది.
దీప: రండి మల్లేశ్ సారు.. 
మల్లేశ్: నేను వచ్చుడే కానీ నాకు వచ్చేది అయితే ఏం లేదు. బండి సౌండ్ అయితే తొంగి చూసేది మీ అత్త ఇంట్లో లేదా.. జరంత దూపవుతుంది నీళ్లు తెస్తావా అని అడుగుతాడు.

దీప నీళ్లు తేవడానికి వెళ్లగానే మల్లేశం వెనకాలే వెళ్లాడు. దీప భయపడుతుంది. నీరు తాగిన మల్లేశ్.. కొత్తగా చెప్పేది ఏం లేదు పాతదే అని.. నీ భర్త నా దగ్గర మనీ తీసుకొని 6 ఏళ్లు అయిందని ఇవ్వడం లేదని అంటాడు. 
దీప: ఒక్కోక్క బాకీ తీరుస్తున్నాను మీది తీరుస్తాను సార్..
మల్లేశ్:  నిన్ను చూస్తుంటే మస్త్ జాలి వేస్తుంది దీప కానీ ఈ వడ్డ మల్లేశ్ బతికేదే వడ్డీతో పోనీ ఓ పని చేద్దాం దీప. నీ పెనిమిటి అవసరం నీకు ఉంది నాకు ఉంది. ఆడు రాడు. నువ్వా నా బాకీ తీర్చలేవు కాబట్టి. నువ్వు నన్ను నీ పెనిమిటి అనుకున్నావే అనుకో. నీ బాకీ తీరుతుంది. నా అవసరం తీరుతుంది. ఏమంటావ్..
దీప: చెంప పగలగొట్టి.. అడగ్గానే మంచి నీళ్లు ఇచ్చాను అని మొగుడి స్థానం కూడా ఇస్తానా చంపేస్తా ఇలాంటి తప్పుడు కూతలు కూస్తే.. అనసూయ వచ్చి ఏమైంది అని అడిగితే దీప జరిగింది చెప్తుంది. 
అనసూయ: నిన్ను కొట్టడం కాదురా ఇక్కడే చంపేయాలి. డబ్బు ఇచ్చి వసూలు చేయడం రాని వాడివి ఎందుకు ఇచ్చావురా.. ఇంటికి వచ్చి ఒంటరిగా ఉన్న నా కోడలితో తప్పుగా ప్రవర్తిస్తావా చెప్పుతో కొడతా నా కొడకా.. నీ బాకీ ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో..

మరోవైపు కార్తీక్ దీపను వెతుక్కుంటూ అక్కడికి వస్తాడు. కార్తీక్‌కు మల్లేశ్ ఎదురవుతాడు. కార్తీక్ దీప ఇళ్లు ఎక్కడ అని మల్లేశ్‌ని అడుగుతాడు. దీంతో మల్లేశ్ తనని దీప కొట్టినందుకే కార్తీక్ వచ్చాడు అని కార్తీక్‌ను ఇష్టమొచ్చినట్లు తిడతాడు. దీప తనని కొట్టిందని దీపని అది ఇది అని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతాడు. దీంతో కార్తీక్ లాగి ఒక్కటిస్తాడు మల్లేశ్‌కు. అంతేకాకుండా ఇంకో సారి దీప జోలికి వస్తే చంపేస్తా అని అంటాడు. కోపంతో మల్లేశ్ నేను అంటే ఏంటో చూపిస్తా అని కార్తీక్‌ను అంటాడు. ఈ టైంలో దీపతో మాట్లాడటం కరెక్ట్ కాదు అనుకొని కార్తీక్ వెళ్లిపోతాడు. 

మరోవైపు దీప మల్లేశ్ మాటలు తలచుకొని ఆలోచిస్తుంది. సౌర్య పడుకొని ఉంటే గది తలుపులు వేసేస్తుంది. అత్తయ్య అనసూయ దగ్గరకు వెళ్లి తన భర్త గురించి అడుగుతుంది. తన భర్త గురించి తాను తండ్రి గురించి సౌర్య బాధ పడుతున్నారు కానీ మీరు బాధ పడటం లేదు అని అడుగుతుంది.

దీప: మా ఆయన ఎక్కడున్నాడో మీకు తెలుసు అత్తయ్య. నాతో చెప్పడానికి మీకు ఏంటి ఇబ్బంది.
అనసూయ: నీ మొగుడు పెళ్లాన్నే కాదు తల్లిని కూడా వదిలేశాడు. కట్టుకొని కాపురం చేసి కూతుర్ని కూడా కన్నాడు నీతో చెప్పకపోతే నాతో ఏం చెప్తాడు. అయినా మొగుడిని కొంగుకు కట్టులేకపోయిన ఆడదానివి నువ్వు.  నేను సూరమ్మ ఇంటికి వెళ్తాను పొద్దున్న వస్తా..
దీప: దండం పెడతా అత్త మీ కొడుకు గురించి ఏమైనా తెలిస్తే చెప్పు అత్త. ఇక దీప తన తండ్రి ఫొటో దగ్గర నిల్చొని ఏడుస్తుంది. సౌర్యని పట్టుకొని బాధ పడుతుంది. 

మరోవైపు కార్తీక్ దీప గురించి ఆలోచిస్తాడు. మల్లేశ్ దీప గురించి ఎందుకు అలా మాట్లాడాడా అని ఆలోచిస్తున్నాడు. తాను చేసిన తప్పునకు నరకంలో ఉన్నట్లు ఉందని భరించలేకపోతున్నాను అని కార్తీక్ కుమిలిపోతాడు. ఇక నైట్ కార్ డ్రైవింగ్ చేస్తాడు. ఇంతలో గతంలో ఏదో యాక్సిడెంట్ జరిగినట్లు ఊహించుకొని కంగారుగా కారు ఆపుతాడు. ఇక డ్రైవర్‌కి కారు ఇచ్చి తనని ఇంటికి తీసుకెళ్లమని చెప్తాడు. దీప తన ముఖం చూడటానికే ఇష్టపడటం లేదు అని తనని ఎలా అర్థం చేసుకుంటుంది అని బాధపడతాడు. ఆలోనలతో పడుకుండిపోతాడు. ఇక మల్లేశ్ దీప ఇంటికి ఫుల్లుగా తాగేసి వస్తాడు. దీప దగ్గరకు వచ్చి అంత పెద్ద కారులో వచ్చిన వాడు నీ కోసం నాకు ఎందుకు కొట్టాడు అని అనరాని మాటలు దీపను అంటాడు. అంతేకాకుండా ఈరోజు నీకు నా మగతనం చూపిస్తాను అంటాడు. ఇంతలో దీప ఓ లేడీని చూపిస్తుంది. మల్లేశ్ షాక్ అవుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: మంచు మనోజ్ కామెంట్స్: ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Andhra News: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
Suzuki Access 125: భారత మార్కెట్లో సుజుకి కొత్త మైలురాయి - 60 లక్షల మార్కు దాటిన యాక్సెస్!
భారత మార్కెట్లో సుజుకి కొత్త మైలురాయి - 60 లక్షల మార్కు దాటిన యాక్సెస్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులుమాజీ ప్రధానికేనా.. నా తండ్రికి ఇవ్వరా? కాంగ్రెస్ తీరుపై ప్రణబ్ కుమార్తె ఆగ్రహంNasa Parker Solar Probe Signal | సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన సేఫ్ గా ఉన్న పార్కర్ ప్రోబ్ | ABP DesamPushpa 2 Bollywood Collections | బాలీవుడ్ ను షేక్ చేయటం ఆపని బన్నీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Andhra News: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
Suzuki Access 125: భారత మార్కెట్లో సుజుకి కొత్త మైలురాయి - 60 లక్షల మార్కు దాటిన యాక్సెస్!
భారత మార్కెట్లో సుజుకి కొత్త మైలురాయి - 60 లక్షల మార్కు దాటిన యాక్సెస్!
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Embed widget